సాక్షి, బెంగళూరు: ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యం మూడుముళ్లకు బందీ అవుతోంది. దేశంలో కర్ణాటకలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2020లో 185 బాల్య వివాహాలు రాష్ట్రంలో నమోదయ్యాయి. 2019లో 111 వివాహాలతో తో పోల్చితే ఇది 66 శాతం అధికం. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా సమాచారం ప్రకారం ఇందులో కర్ణాటక బాల్య వివాహాల్లో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో అస్సాం –138 వివాహాలు, పశ్చిమ బెంగాల్– 98, తమిళనాడు –77 ఉన్నాయి.
2 వేల పెళ్లిళ్ల అడ్డగింత
కర్ణాటక రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం 2020, ఫిబ్రవరి–నవంబర్‌ల మధ్య కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో 2,074 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. బళ్లారి జిల్లాలో ఎక్కు వగా 218 వివాహాలను నిలువరించారు. ఆ తర్వాత మైసూరు 177, బెళగావి 131, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గల్లో చెరో 107, ఇక బెంగళూరులో 20కి పైగా పెళ్లిళ్లను నిలిపారు. రాష్ట్రంలో 108 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment