గళం విప్పనున్న ఫ్రీదా పింటో | Freida Pinto to speak against child marriages | Sakshi
Sakshi News home page

గళం విప్పనున్న ఫ్రీదా పింటో

Published Mon, Jul 21 2014 4:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

గళం విప్పనున్న ఫ్రీదా పింటో

గళం విప్పనున్న ఫ్రీదా పింటో

 
స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోయిన్ ఫ్రీదా పింటో బాల్య వివాహాలపై గళం విప్పబోతోంది. బ్రిటన్ లో జరగబోయే ప్రపంచస్థాయి బాలికల సదస్సులో బాల్య వివాహాలపైన, మహిళలకు బలవంతపు సున్తీ చేయించడం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా మంగళవారం ప్రసంగించబోతోంది. 
 
స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ప్రతినిధుల సదస్సు ముగింపులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. భారతదేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, మహిళలకు సున్తీ చేయించడం కొనసాగటం పట్ల ఫ్రీదా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికైనా అందరూ గళం విప్పాలని ఆమె అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement