Freida Pinto
-
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి!
Freida Pinto Shares Emotional Post: మోడల్, నటి ఫ్రిడా పింటో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఫ్రిడా కొడుకు ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా కుమారుడికి 'రుమీ రే' అని పేరు కూడా పెట్టేసింది. కొడుకుతో కలిసి భర్తకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'హ్యాపీ బర్త్‌డే డాడా కోరీ! నువ్వు నా భర్తవి మాత్రమే కాదు, ఫ్రెండ్‌వి, జీవిత భాగస్వామివి కూడా! నిన్ను సూపర్ డాడ్గా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనిద్దరం కలిసి సాగిస్తున్న ఈ జీవిత ప్రయాణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నా. రుమీ రే.. నువ్వు చాలా అదృష్టవంతుడివి నాన్నా!' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి రుమీ రే తన తండ్రి ఛాతీపై పడుకున్న ఫొటోను జత చేసింది. కానీ బేబీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. కాగా 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఫ్రిదా ఎక్కువగా హాలీవుడ్లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) -
అవును..నిజమే.. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నా: నటి
సాక్షి, ముంబై: 'స్లమ్‌డాగ్ మిలియనీర్'తో క్రేజ్ సంపాదించుకున్న నటి మోడల్ ఫ్రిదా పింటో తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్తను ఫ్యాన్స్‌కు చెప్పింది. త్వరలోనే తల్లికాబోతున్న వార్తను సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి కబురు అందించింది. ఏడాది కితం తాము పెళ్లి చేసుకున్నామంటూ వెల్లడించింది. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) అవును.. నిజం.. నా కలల అద్భుతాన్ని వివాహమాడాను. దీన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదు.. ఇద్దరమూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం.. ఇపుడు మీ అందరి కోసం ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను అంటూ భర్త కోరీ ట్రాన్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. 2017 నుంచి డేటింగ్లో ఉన్న ప్రియుడు కోరీ ట్రాన్‌ను గత సంవత్సరం లాక్డౌన్ కాలంలో కాలిఫోర్నియాలోని హోండా సెంటర్లో వివాహం చేసుకుందిట. (Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే) సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఫ్రిదా త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే పంచుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ వెల్లడించింది. స్వీట్ బేబీ షవర్ అంటూ గత వారం ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన సిస్టర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.ఇటీవల బేబీ బంప్‌తో ఫోటోషూట్‌కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫ్రిదా 1984 అక్టోబర్ 18న మహారాష్ట్రలో పుట్టింది. కానీ మోడల్‌గా రాణిస్తూ, ఎక్కువగా హాలీవుడ్లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. పలు అవార్డులూ సొంతం చేసుకుంది. మ్యూజిక్ అల్బమ్స్ లో కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) -
త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్!
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ భామ ఫ్రిదా పింటో త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ కోరీ ట్రాన్‌ను వివాహం చేసుకోనున్నారు. కోరీ పుట్టినరోజు సందర్భంగా తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఫ్రిదా ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసిన ఫ్రిదా... ‘ నా జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను సృష్టించింది నువ్వే. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. కాదు కాదు నేనే నా ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండేలా చేశాను. హ్యాపీ బర్త్‌డే స్వీట్ ఫియాన్సీ’ అని క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో ఫ్రిదా-కోరీలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటీమణులు లీసా రే, నర్గిస్ ఫక్రీ, అనైతా ఫ్రాఫ్ హార్ట్ ఎమోజీలతో ఫ్రిదాకు అభినందనలు తెలిపారు. కాగా డానీ బోయెల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్‌డాగ్ సినిమాతో ఫ్రిదా తన కెరీర్‌ను ఆరంభించారు. ఈ మూవీలో తనకు జోడీగా నటించిన దేవ్ పటేల్‌తో కొన్నాళ్లపాటు ఆమె డేటింగ్ చేశారు. ప్రస్తుతం కోరీతో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఫ్రిదా.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా మహిళా సాధికారికత, పిల్లల సంరక్షణ తదితర సామాజిక అంశాల్లో భాగస్వామ్యవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. View this post on Instagram It all makes sense now. Life makes sense, the world makes sense, the past tears and trials make sense, what wise old lovers said about love makes sense, where I am makes sense and where I want to go completely makes sense. . You my love are just the most beautiful creation to have ever walked into my life. And you are here to stay. Well, I am making you stay. Ha! 😂 All my love with all my heart♥️. . Oh and Happiest Birthday sweet Fiancé ! . 📷 : @samanthamarq A post shared by Freida Pinto (@freidapinto) on Nov 21, 2019 at 8:07am PST -
భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం
కొరుక్కుపేట: భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అని ప్రముఖ నటి, సామాజికవేత్త ఫ్రిదాపింటో పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొంటూ.. రోసాటోమ్ స్టేట్ అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ నేతృత్వంలో వాతావరణ మార్పు సమస్యలపై మూడు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించినట్టు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ దేశాల సహజ అవాసాలలో వృక్షజాలం, జంతు జాలంపై దృష్టి సారించి డాక్యుమెంటరీ, పశ్చిమ కనుమలు, తమిళనాడులోని వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, సుందర్బాన్ డెల్టా రిమోట్ స్థానాల్లో డ్యాక్యూమెంటరీ చిత్రీకరించినట్టు వివరించారు. ప్రపంచ దేశాలన్నీ భూతాపంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అయితే దానిపై తగిన దృష్టి సారించకపోవడంతో మానవాళికి పెను ప్రమాదంతోపాటు ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. అరుదైన వన్యప్రాణులను కాపాడుకోవాలన్నా, మనవ మనుగడ సాగాలన్న భూతాపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా ప్రతిఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో రొసాటామ్ స్టేట్ అటామిక్ కార్పొరేషన్ కృషి హర్షణీయమన్నారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలతోపాటు మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె ప్రకటనలో వెల్లడించారు. -
‘బాలీవుడ్లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’
ముంబయి: తనకు బాలీవుడ్ లో పనిచేయాడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ భారత సంతతికి చెందిన అమెరికా నటి ఫ్రిదా పింటో చెప్పింది. స్లమ్ డాగ్మిలియనీర్ చిత్రంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆమె హిందీ చిత్రాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తాను మార్వారి చిత్రం ‘త్రిష్నా’లో సగభాగం నటించానని, ఆ భాష కూడా తనకు రాకపోయినా ఆ పని చేశానని తెలిపింది. సినిమాలో ఎవరు నటిస్తున్నారనే దానికంటే ఆ సినిమా కథ ఎలా ఉందనేదే తనకు ముఖ్యం అని ఫ్రిదా చెప్పింది. వచ్చే ఏడాది తాను గొప్ప చిత్రంలో కనిపిస్తానని, అది కూడా స్లమ్ డాగ్మిలియనీర్ నిర్మాతల్లో ఒకరైన తాబ్రెజ్ నూరాని దర్శకత్వం వహించారని, ఆయన కూడా భారతీయుడే అని ఫ్రిదా తెలిపింది. -
చేసి చూపిస్తా!
భారతీయ అందాల తారలు ఐశ్వర్యారాయ్, సోనమ్‌కపూర్, మల్లికా శెరావత్లు ఇప్పటికే కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిసిన విషయం తెలిసిందే. సోమవారం ఫ్రిదా పింటో కూడా సందడి చేశారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిపోయి, ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలతో బిజీ అయిపోయారు ఫ్రిదా. తాజాగా ఆమె నిర్మాతగా కూడా మారనున్న సంగతి తెలిసిందే. ‘వియ్ డూ ఇట్ టుగెదర్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, మహిళల కోసం సినిమాలు తీయనున్నారు. జెస్సికా , జూలియట్ బినోచి, క్వీన్ లతీఫా, క్యాథరిన్ హార్డ్ వికే వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో కలిసి ఈ సంస్థను ప్రారంభించిన ఫ్రిదా దీని ప్రచారం కోసమే కాన్స్ చలనచిత్రోత్సవాలకు వెళ్లారు. ‘‘మహిళా సాధికారతను ప్రతిబింబించే బుల్లితెర రియాలిటీ షోలే కాకుండా సినిమాలు కూడా తీస్తాం. హాలీవుడ్, బాలీవుడ్‌లలో పురుషులు, మహిళల పారితోషికాల్లో వ్యత్యాసం ఉంది. దీనిలో మార్పు రావాల్సి ఉంది. అయినా మేం మాటలు చెప్పేవాళ్లం కాదు... చేతల్లో చూపించే వాళ్లం. అందుకే మా సంస్థకు ట్యాగ్‌లైన్ ‘డూయర్ నాట్ ఎ టాకర్’ అని పెట్టాం. మహిళల కోసం మహిళ లు తీసే ఈ సినిమాలను అందరూ ఎంజాయ్ చేయొచ్చు’’ అని ఫ్రిదా చెప్పారు. -
లవ్ సోనియా: లాస్ ఏంజిల్స్ చీకటి కోణం
అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్.. షిప్పులో నుంచి అప్పుడే దించిన కంటెయినర్ నిండా అమ్మాయిలు. చైనా నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఆ యువతుల బృందంలో ఓ ఇండియన్ కూడా ఉంది. దూరంగా నిల్చున్న తబ్రేజ్ నూరానీ.. ఆ అమ్మాయిలను ఎక్కడికి తీసుకెళ్తారా అని ఆరాతీశాడు. రకరకాలుగా వేధించి కిడ్నాపర్లు ఆ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతారని తెలుసుకున్నాడు. పరిశీలించేకొద్దీ నూరానీకి ఇలాంటి ఉదంతాలా ఎన్నో కనిపించాయి. పోలీసులతో కలిసి వెళ్లి వ్యభిచార గృహాలపై దాడులను దగ్గర్నుంచి చూశాడు నూరానీ. నిజానికి అతను జర్నలిస్ట్ కాదు. సినిమా పర్సనాలిటీ. లాస్ ఏంజిల్స్ లోనే అతనికి డేవిడ్ వోమార్క్ తో పరిచయం అయింది. అప్పటికి డేవిడ్ 'లైఫ్ ఆఫ్ పై' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నూరానీ చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేద్దామని మాటిచ్చాడు. మూడేళ్ల ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వచ్చింది. సినిమా పేరు లవ్ సోనియా. లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన భాతీయ యువతి నిజజీవిత గాథ ఆధారంగా తబ్రేజ్ నూరానీ తీస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్ చేస్తోంది. ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ వాజపేయి ఇతర నటీనటులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. టెడ్ కప్లాన్, అల్కేశ్ విజాలు సంయుక్తంగా కథను అందించారు. రాజస్థాన్ లోని అద్భుతమైన లొకేషన్లలో 'లవ్ సోనియా'ను షూట్ చేస్తున్నాం అంటూ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇండియాతోపాటు హాంకాంగ్, లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుపుకోబోయే ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. 'ది హల్క్', 'లైఫ్ ఆఫ్ పై', 'జీఐ జో రైస్ ఆఫ్ కోబ్రా' వంటి హిట్ చిత్రాల నిర్మాత కావటంతో డేవిడ్ రూపొందిస్తున్న 'లవ్ సోనియా' పట్ల హాలీవుడ్ లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. నిర్మాత డేవిడ్ వోమార్క్, దర్శకుడు తబ్రేజ్ నూరానీతో నటుడు అనుపమ్ ఖేర్. -
ఆ నలుగురితో కలిసి...!
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ఫ్రీదా పింటో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ నటిగా మాత్రమే కొనసాగిన ఈ బ్యూటీ నిర్మాతగా మారడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ తారలు జూలియట్ బినోచె, క్వీన్ లతీఫా, కేథరినా హార్డ్‌విక్, ఝాంగ్ జియీలతో కలిసి ఏర్పడిన ‘వియ్ డూ ఇట్ టు గేదర్’ అనే స్వచ్ఛంద సంస్థలో ఫ్రీదా కూడా ఓ భాగమయ్యారు. వీరందరితో కలిసి డాక్యుమెంటరీలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారామె. మహిళా సాధికారతను ప్రతిబింబించే డాక్యుమెంటరీలను, లఘు చిత్రాలను తీయనున్నారు. ‘‘ఇప్పటికి నా దగ్గర మూడు కథలున్నాయి. వాటిల్లో మహిళలే ప్రధాన పాత్రదారులు. రెండు సినిమాలను త్వరలో సెట్స్‌కు తీసుకువెళ్లనున్నా’’ అని ఫ్రీదా పింటో చెప్పారు. -
ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసింది!
నిన్న మొన్నటి వరకూ ప్రియాంకా చోప్రా, ఫ్రీదా పింటో చాలా స్నేహంగా ఉండేవాళ్లు. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించుకోవడం, ఆత్మీయంగా హగ్ చేసుకోవడం, తియ్యగా కబుర్లు చెప్పుకోవడం... ఇలా చాలా బాగుండేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఎదురుపడితే మొహాలు తిప్పుకోవడం, ఒకవేళ చూపులు కలిస్తే, కాల్చేలా చూసుకోవడం, వీలైనంత డిస్టెన్స్ పాటించడం చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇలా ఎనిమీస్‌గా మారిపోవడానికి కారణం ఓ వేడుక. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో ప్రియాంక, ఫ్రీదా పాల్గొన్నారు. ఇందులో పాల్గొనడానికి అంగీకరించినప్పుడు ఇద్దరూ స్నేహితులే. కానీ, దీనికి సంబంధించిన ఇన్విటేషన్ వచ్చాక ప్రియాంక రగిలిపోయారు. ఆహ్వాన పత్రికలో ఫ్రీదా పింటో పేరు తర్వాత ప్రియాంక పేరు ముద్రించారు. ఆ విషయంలో ప్రియాంక చాలా ఫీలైపోయారు. ఆ కోపంతో వేడుకకు హాజరైన ఈ బ్యూటీ ఫ్రీదాతో సరిగ్గా మాట్లాడలేదట. దాంతో ఫ్రీదా ఫీలైపోయి, మాట్లాడటం మానేశారట. అసలే కోపం మీద ఉన్న ప్రియాంకను మరింత ఆగ్రహానికి గురి చేసేలా.. ఫ్రీదాని వేదికపైకి ఆహ్వానిస్తూ, ‘హోస్ట్’ అనీ, ప్రియాంకను ఆహ్వానిస్తూ, ‘కో-హోస్ట్’ అని సంబోధించడంతో వాతావరణం వేడెక్కిపోయింది. అక్కడికక్కడ ఆ వేడుక నిర్వాహకులతో ప్రియాంక వాదనకు దిగారట. కానీ, పిలుపులు అయిపోయాక తామేం చేయలేమని వాళ్లనడంతో.. ప్రియాంక మూడాఫ్ అయిపోయారు. వేడుక జరిగినంతసేపూ ఆమెలో నవ్వు అనేది కనిపించలేదట. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా? అన్నట్లుగా వ్యవహరించారని టాక్. ఏదేమైనా ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసేసింది. -
కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో 'ముద్దు'ముచ్చట్లు!
లాస్ ఏంజిల్స్: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' భామ మళ్లీ ప్రేమలో పడింది! హాలీవుడ్ కథానాయిక ఫ్రిదా పింటో పోలో ప్లేయర్ రోనీ బార్‌కార్డితో ప్రేమాయణం సాగిస్తున్నది. వీరిద్దరు కలిసి లిప్ టు లిప్ కిస్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో 2008లో హాలీవుడ్‌కు పరిచయమైన ఫ్రిదా పింటో.. ఆ సినిమాలో తన సహ నటుడు దేవ్ పటేల్‌తో ఆరేళ్లు డేటింగ్ చేసింది. వారి ప్రేమబంధం ఇటీవలే బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో రోనీ బార్‌కార్డితో సన్నిహితంగా మెలుగుతున్న పింటో.. అతన్ని పెనవేసుకొని పెదవితో పెదవి కలుపడం హాట్ న్యూస్‌గా మారింది. -
'డేటింగ్‌తో విడిపోయి మరోసారి కలిసి..'
ముంబయి: అస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్ర నటులు, ఒకప్పటి ప్రేమికులు ఫ్రిదా పింటో, దేవ్ పటేలో మరోసారి కలిశారు. చెరొదిక్కుకూ వెళ్లిపోయి దాదాపు ఏడాదికాలం పాటు జంటగా కనిపించని వీరు ఓ స్వచ్ఛంద కార్యక్రమం కోసం మాత్రం మరోసారి పక్కపక్కనే నవ్వులు పూయిస్తూ కనిపించారు. చిన్నపిల్లలకు విద్యనందించి అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా దేశంలోని పేదరికాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ప్రధమ్ అనే చారిటబుల్ సంస్థ చేస్తున్న కార్యక్రమం ప్రచారానికి వీరిద్దరు హాజరయ్యారు. స్లమ్ డాగ్ మిలీయనీర్ చిత్రం అనంతరం ప్రేమికులుగా మారిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ 2009లో డేటింగ్ ప్రారంభించారు. అలా ఆరేళ్లు గడిచిన తర్వాత 2014లో తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. -
ఈ చిన్నసినిమా విశేషాలెన్నో....
సమాజం పట్ల తమకూ బాధ్యత ఉందంటూ బాలీవుడ్ అగ్రతారలు ప్రియాంకా చోప్రా, ఫ్రిదా పింటో ముందుకొచ్చారు. 'గర్ల్ రైజింగ్ - వో పఢేగీ, వో ఉడేగీ' అనే షార్ట్ ఫిలింతో బాలికలను ప్రోత్సహించేందుకు వీరు నడుం కట్టారు. వీరి ప్రయత్నానికి బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు చేతులు కలపడం పలువురి ప్రశంసలందుకుంటోంది. ప్రియాంకా చోప్రా, ఫ్రిదాపింటో నిర్మాతలుగా కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గర్ల్ రైజింగ్ - వో పఢేగీ, వో ఉడేగీ షార్ట్ ఫిలిం రూపుదిద్దుకొంది. బాలికా విద్య ప్రచారానికి, బాలికలు చదువుకుంటే వారికి కలిగేప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఆస్కార్ అవార్డు విజేత రిచర్డ్ ఇ.రాబిన్స్ దర్శకత్వంలో రూపొందిన ఇంగ్లీషు మూవీకి హిందీ వెర్షన్ ఇది. ఈనెల 29న రక్షా బంధన్ సందర్భంగా స్టార్ చానెల్లో ప్రసారం కానుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానంతో మొదలయ్యే ఈ డాక్యుమెంటరీలో స్వయంగా ప్రియాంక, ఫ్రిదాకూడా నటించారు. వీరితోపాటు నందితాదాస్, మాధురీ దీక్షిత్, సుస్మితా సేన్, ఆలియా భట్, పరిణీతి చోప్రా, కరీనా కపూర్ కనిపించనున్నారు. బాలికా విద్య ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా ఈ షార్ట్ మూవీ రూపొందించామని నిర్మాతలు ప్రియాంక, ఫ్రిదా ఫింటో తెలిపారు. గత జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ సినిమా గురించి వివరించినపుడు ఆయన చాలా సంతోషించారని నటి ఫ్రిదా చెప్పింది. అంతేకాదు రక్షాబంధన్ సందర్భంగా లాంచ్ చేయాలని ఆయనే తమకు సలహా ఇచ్చారంది. మరోవైపు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట. తమ శాఖ పథకమైన బేటీ బచావో, బేటీ పఢావో కి తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం బాగుందని కొనియాడినట్లు తెలిపారు ఫ్రిదా. గర్ల్ రైజింగ్‌ను ప్రారంభించిన దగ్గరనుంచి ఇందులో తాను భాగమవుతున్నానని, ఈ శక్తిమంతమైన ఆలోచన భారత్‌కు విస్తరింపజేస్తే ఎంతో గౌరవం పొందుతానని, దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ప్రియాంక చెప్పారు. ఎక్కువ మంది బాలికలు విద్యావంతులైతే మొత్తం భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించ గలుగుతుందని అన్నారు. -
నిర్మాతగా...
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో కెరీర్ ఆరంభించి, వరుసగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు ముంబయ్ బ్యూటీ ఫ్రీదా పింటో. గత ఆరేడేళ్లల్లో దాదాపు పదిహేను హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఫ్రీదాకి నిర్మాతగా మారాలనే కోరిక కలిగింది. నటిగా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, నిర్మాతగా మాత్రం శక్తిమంతమైన సందేశంతో కూడిన చిత్రాలను నిర్మించాలనుకుంటున్నారామె. ఇప్పటికే రెండు చిత్రాలకు సన్నాహాలు మొదలుపెట్టారు. అవి రెండూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే కావడం విశేషం. వచ్చే ఏడాది మార్చిలో తొలి చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఫ్రీదానే నటిస్తారా లేక వేరే తారలను ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆంగ్ల భాషలో రూపొందించనున్న ఈ చిత్రాలను విదేశాల్లోనే కాదు.. భారతదేశంలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. -
న్యూసెన్స్!
సినిమాలు లేకపోయినా వార్తల్లో ఉండే నటి ఫ్రీడా పింటో. ఈ ముద్దుగుమ్మ తన 30వ బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ‘ఫుల్లు’గా లాగించేసి... ఊగుతూ తూగుతూ లాస్ఏంజెలిస్ వీధుల్లో రచ్చ చేసింది. సెలబ్రేషన్ అలా అలా జోష్ అందుకుని... ఓ స్ట్రిప్ క్లబ్ ముందు చిందులేస్తుంటే, అక్కడి పోలీసులు పట్టి లోపలేశారు. కొసమెరుపేమంటే... ఈ తారతో స్టెప్పులేసిన వారిలో లిక్కర్ బారన్ విజయ్‌మాల్యా తనయుడు సిద్ధార్థ మాల్యా కూడా ఉండటం. తరువాత దీనిపై అమ్మడిని అడిగితే... ఇద్దరి మధ్యా డ్రంకన్ డేట్ లాంటిదేమీ లేదని, మంచి స్నేహితులం మాత్రమేనని సెలవిచ్చింది. అయితే... బాయ్ ఫ్రెండ్ దేవ్ పటేల్‌తో డేటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడం మరో కొసమెరుపు! -
గళం విప్పనున్న ఫ్రీదా పింటో
స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోయిన్ ఫ్రీదా పింటో బాల్య వివాహాలపై గళం విప్పబోతోంది. బ్రిటన్ లో జరగబోయే ప్రపంచస్థాయి బాలికల సదస్సులో బాల్య వివాహాలపైన, మహిళలకు బలవంతపు సున్తీ చేయించడం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా మంగళవారం ప్రసంగించబోతోంది. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ప్రతినిధుల సదస్సు ముగింపులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. భారతదేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, మహిళలకు సున్తీ చేయించడం కొనసాగటం పట్ల ఫ్రీదా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికైనా అందరూ గళం విప్పాలని ఆమె అంటున్నారు. -
ఇక దేవ్‌తో నటించను!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవ్ పటేల్, ఫ్రీదా పింటోకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీదా కన్నా దేవ్ దాదాపు ఐదేళ్లు చిన్నవాడు. అయినా, ప్రేమలో పడటానికి వీళ్లిద్దరూ వయసును పెద్ద విషయంగా తీసుకోలేదు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే విషయం పక్కన పెడితే.. ఇక ఇద్దరూ కలిసి నటించకూడదనుకుంటున్నారట. ‘‘తొలి కలయికలో రూపొందిన సినిమాలోనే కావాల్సినంత కెమిస్ట్రీ పండించేశాం. ఆ కెమిస్ట్రీని ఇక వ్యక్తిగత జీవితానికి అంకితం చేయాలనుకుంటున్నాం. అందుకే కలిసి నటించకూడదనుకున్నాం’’ అని పేర్కొన్నారు ఫ్రీదా. లాస్ ఏంజిల్స్‌లో దేవ్‌తో ఆమె సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ నగరంలో ఓ రెస్టారెంట్ ఆరంభించాలనుకుంటున్నానని ఫ్రీదా పింటో చెప్పారు.