Freida Pinto Shares Pics of her Wedding & pregnancy - Sakshi
Sakshi News home page

Freida Pinto: అవును.. నా డ్రీమ్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!

Published Fri, Oct 22 2021 11:07 AM | Last Updated on Fri, Oct 22 2021 5:27 PM

Freida Pinto Shares Pics Of Impromptu Wedding after one year - Sakshi

సాక్షి, ముంబై: 'స్లమ్​డాగ్​ మిలియనీర్​'తో క్రేజ్​ సంపాదించుకున్న నటి మోడల్‌ ఫ్రిదా పింటో  తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్తను ఫ్యాన్స్‌కు  చెప్పింది. త్వరలోనే తల్లికాబోతున్న వార్తను సోషల్‌ మీడియాలో ఇటీవల షేర్‌ చేసిన ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి కబురు అందించింది. ఏడాది కితం తాము పెళ్లి చేసుకున్నామంటూ   వెల్లడించింది. (Prabhas: క్లాస్‌ అయినా మాస్‌ అయినా.. మోత మోగాల్సిందే!)

అవును.. నిజం.. నా కలల  అద్భుతాన్ని వివాహమాడాను. దీన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదు.. ఇద్దరమూ  జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం.. ఇపుడు  మీ అందరి కోసం  ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను అంటూ  భర్త కోరీ ట్రాన్‌తో అందమైన ఫోటోలను షేర్‌  చేసింది. 2017 నుంచి డేటింగ్‌లో ఉన్న  ప్రియుడు కోరీ ట్రాన్‌ను గత సంవత్సరం లాక్‌డౌన్‌ కాలంలో  కాలిఫోర్నియాలోని హోండా సెంటర్‌లో  వివాహం చేసుకుందిట. (Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్‌’కు హ్యాపీ బర్త్‌డే)

సోషల్ ​మీడియాలో చురుగ్గా ఉండే  ఫ్రిదా త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారానే పంచుకుని ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చింది. త్వరలోనే బుల్లి ట్రాన్‌ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ వెల్లడించింది. స్వీట్ బేబీ షవర్‌ అంటూ గత వారం ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇది తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన సిస్టర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.ఇటీవల బేబీ బంప్‌తో ఫోటోషూట్‌కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను కూడా  షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

కాగా 2008లో  'స్లమ్​డాగ్​ మిలియనీర్'​  బాలీవుడ్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫ్రిదా 1984 అక్టోబర్​ 18న మహారాష్ట్రలో  పుట్టింది. కానీ మోడల్‌గా రాణిస్తూ, ఎక్కువగా హాలీవుడ్‌లో అలరిస్తోంది.  రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ ​, గర్ల్​ రైజింగ్‌, డిజెర్ట్​ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్​ ఆఫ్​ ది జంగిల్,  లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్​ చిత్రాల్లో నటించింది. పలు అవార్డులూ సొంతం చేసుకుంది. మ్యూజిక్​ అల్బమ్స్ లో కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement