photoes
-
ఆర్టిఫిసికల్ ఇంటిలిజెన్స్ ద్వారా క్రికెటర్స్ డిస్నీ క్యారెక్టర్స్ ఎపుడైనా చూశారా?
-
రిలయన్స్ జియోతో డీజీబాక్స్ డీల్: మోర్ స్పేస్ మోర్ మెమరీస్
బెంగళూరు: రిలయన్స్ డిజిటల్ సర్వీసుల విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్, స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ సంస్థ డీజీబాక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తన కస్టమర్లకు అదనపు స్టోరేజీ సౌకర్యాన్ని అందిస్తోంది. జియో సెట్-టాప్ బాక్స్ భవిష్యత్ వినియోగదారుల క్లౌడ్ కన్సాలిడేషన్ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ డీల్ప్రకారం ప్రస్తుతం 20 జీబీ స్టోరేజీకి అదనంగా 10 జీబీ స్టోరేజ్‌ను అందుకుంటారు.ఇందుకు వినియోగదారులు జియోఫోటోస్ యాస్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనికి డీజీ బాక్స్ ఖాతాను యాడ్ చేయాలి. ఇందులో ఫోటోనుల అప్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుండి ఫోటోలు, వీడియోలను తక్షణమే భాగస్వామ్యం చేయవచ్చు. వివిధ ఫార్మాట్ల ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేయవచ్చు. అంతేకాదు జియో కస్టమర్లు ఆటో-సింక్‌ని ఎనేబుల్ చేసి వ్యక్తిగత డేటాను స్టోర్ చేసుకోవచ్చు . దీంతోపాటు జియో సెట్-టాప్ బాక్స్‌లోని ప్రతిదాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. భారతీయ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ డీజీబాక్స్తో ఒప్పందంపై జియో సీఈవో కిరణ్ థామస్ ఆనందంవ్యక్తం చేశారు. సురక్షితమైన, వేగవంతమైనస్పష్టమైన డీజీ ఆఫర్లు ప్రపంచ శ్రేణిలో ఉన్నాయని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఈ ఇంటిగ్రేషన్ అదనపు స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం చూస్తున్న జియో యూజర్లందరికీ అసమానమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఇప్పుడు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు అని కిరణ్ అన్నారు. జియోతో జతకట్టడంపై డీజీ బాక్స్ సీఈవో అర్నాబ్ మిత్రాసంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్‌గా యాక్టివ్‌గా ఉన్న కొత్త వినియోగదారులకు తమ కొత్త టెక్నాలజిని అందించడంలో తోడ్పడుతుందన్నారు. తామం దించే స్టోరేజ్ స్పేస్‌ను సంబంధించి మునపెన్నడూ లేని గేమ్ ఛేంజింగ్ సర్వీసుగా భావిస్తున్నామన్నారు. జియోఫోటోస్ జియోఫోటోస్ అనేది యూఏస్డీ డ్రైవ్‌లు, గూగుల్ ఫోటోస్, జియోక్లౌడ్, డిజిబాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ ఖాతాలలో షేర్ అయిన, లేదా ఫేస్బుక్ ఇన్‌స్టాలో నేరుగా షేర్ చేసిన అన్ని ఫోటోలు, వీడియోలతో పాటు చలనచిత్రాలను టీవీ లో వీక్షించడానికి ఒక వన్-స్టాప్ యాప్. అన్ని ఫోటోలు, వీడియోలు, చలనచిత్రాలను టీవీలో వీక్షించడానికి ఇది ఒక వన్-స్టాప్ యాప్. జియోఫోటోస్ తో, జియో వినియోగదారులు గూగుల్ ఫోటోలు, జియోక్లౌడ్ వంటి విభిన్న క్లౌడ్ స్టోరేజీలలో స్టోర్ అయిన కంటెంట్ మొత్తానికి యాక్సెస్ లభిస్తుంది. జియో సెట్-టాప్ బాక్స్‌లో ఫేస్బుక్, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నేరరుగా షేర్ చేసుకోవచ్చు. కొ ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఉండటం మరో ప్రత్యేకత. డీజీబాక్స్ 2020లో స్థాపించబడిన, డిజిబాక్స్ సురక్షితమైన, వేగవంతమైన, సహజమైన, సరసమైన ధరతో కూడిన తెలివైన భారతీయ డిజిటల్ ఫైల్ స్టోరేజీ,డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్. వ్యక్తులు, లేదా వ్యాపారాల కోసం 'మేడ్ ఇన్ ఇండియా' క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అండ డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్. ఆత్మనిర్భర్ లో భాగంగా తక్కువ వ్యవధిలోనే 10 లక్షలకు పైగా వినియోగదారులను సాధించింది. ఫైల్ స్టోరేజ్ షేరింగ్ కోసం డేటాను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయాలనుకునే వ్యక్తులు, గిగ్ వర్కర్లు, వ్యాపారులకు చాలా అనుకూల మైనది. -
అవును..నిజమే.. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నా: నటి
సాక్షి, ముంబై: 'స్లమ్‌డాగ్ మిలియనీర్'తో క్రేజ్ సంపాదించుకున్న నటి మోడల్ ఫ్రిదా పింటో తన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్తను ఫ్యాన్స్‌కు చెప్పింది. త్వరలోనే తల్లికాబోతున్న వార్తను సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి కబురు అందించింది. ఏడాది కితం తాము పెళ్లి చేసుకున్నామంటూ వెల్లడించింది. (Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) అవును.. నిజం.. నా కలల అద్భుతాన్ని వివాహమాడాను. దీన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదు.. ఇద్దరమూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం.. ఇపుడు మీ అందరి కోసం ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను అంటూ భర్త కోరీ ట్రాన్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. 2017 నుంచి డేటింగ్లో ఉన్న ప్రియుడు కోరీ ట్రాన్‌ను గత సంవత్సరం లాక్డౌన్ కాలంలో కాలిఫోర్నియాలోని హోండా సెంటర్లో వివాహం చేసుకుందిట. (Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్’కు హ్యాపీ బర్త్‌డే) సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఫ్రిదా త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే పంచుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ వెల్లడించింది. స్వీట్ బేబీ షవర్ అంటూ గత వారం ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన సిస్టర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.ఇటీవల బేబీ బంప్‌తో ఫోటోషూట్‌కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫ్రిదా 1984 అక్టోబర్ 18న మహారాష్ట్రలో పుట్టింది. కానీ మోడల్‌గా రాణిస్తూ, ఎక్కువగా హాలీవుడ్లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. పలు అవార్డులూ సొంతం చేసుకుంది. మ్యూజిక్ అల్బమ్స్ లో కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) -
ఫేస్బుక్లో కొత్త యాప్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొత్త యాప్‌ను విడుదల చేసింది. హాబీ (Hobbi) పేరుతో వచ్చిన ఈ యాప్ పిన్రెస్ట్కు కాపీ లాంటిదే. అంటే హాబీ యాప్‌లో కూడా యూజర్లు మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనకు ఇష్టమైన గార్డెనింగ్, వంట, ఆర్ట్స్, డెకరేషన్ ఇలాంటి హాబీలను ఓ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. తమ కలెక్షన్లు, ప్రాజెక్టులను ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ తోడ్పడుతుందని ఫేస్బుక్ ప్రకటించింది. ఈ కలెక్షన్లు, ప్రాజెక్టులను వాటిని వీడియోగా క్రియేట్ చేసుకుని మరికొందరు యూజర్లతో షేర్ చేసుకోవచ్చు. కాగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దీన్ని విడుదల చేసింది ఫేస్బుక్. అలాగే ప్రస్తుతానికి ఇది కేవలం ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌లో కానీ, గూగుల్ ప్లే స్టోర్‌లో గానీ అందుబాటులో లేదు. త్వరలోనే అన్ని దేశాల వారికి అందుబాటులోకి రానుందని..ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫేస్బుక్ కంపెనీలో భాగమైన న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ (ఎన్ పీఈ) టీమ్ ఆధ్వర్యంలో ఈ హాబీ యాప్ రూపొందింది. అయితే ఈ యాప్‌ను పెద్దగా ప్రచారం లేకుండా విడుదల చేయడం విశేషం. -
ఫేస్బుక్లో ఫోటోలు.. తల్లిదండ్రులపై కూతురు కేసు
వియన్నా: ఫోటోలు తీయడమే ఆలస్యం సోషల్ మీడియాలో ఉంచడం ఇటీవలి కాలంలో ఓ అలవాటుగా మారింది. కొందరైతే కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసమే పనిగట్టుకొని కొన్ని పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల(చివరికి సొంత పిల్లలు) ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచేవారు కూడా ఇకనుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది ఈ ఉదంతం. తన అనుమతి లేకుండా.. కనీసం తన మనోభావాలను పట్టించుకోకుండా తన చిన్ననాటి ఫోటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారని ఆస్ట్రియాలో ఓ 18 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై కేసుపెట్టింది. తనకు సంబంధించిన సుమారు 500 ఫోటోలను 2009 నుంచి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు వాటిని తొలగించడానికి వారు నిరాకరించారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. ఆ ఫోటోలు 700 మంది ఫ్రెండ్స్‌కు షేరయ్యాయని.. అందులో అభ్యంతరకరమైన, తన మనోభావాలను దెబ్బతీసే ఫోటోలు సైతం ఉన్నాయని ఆ యువతి వెల్లడించింది. 'కనీసం నేను టాయ్లెట్లో ఉన్నానా లేక నగ్నంగా బెడ్‌పై ఉన్నానా అనే విచక్షణ లేకుండా నా బాల్యానికి సంబంధించిన ఫోటోలను పబ్లిక్‌లో ఉంచారు' అని సదరు యువతి వాపోయింది. తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడం హక్కు అనే భావనలొ తన తండ్రి ఉన్నారని ఆమె వెల్లడించింది. ఈ కేసు నవంబర్‌లో విచారణకు రానుంది. సోషల్ మీడియాలో ఇతరుల వ్యక్తిగత ఫోటోలు, సమాచారాన్ని ఉంచడం పట్ల ఆస్ట్రియాలో కఠినమైన చట్టాలే ఉన్నాయి. అయితే ఈ కేసులో తల్లిదండ్రుల నుంచి యువతికి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉందని యువతి తరఫు లాయర్ వెల్లడించారు. ఫ్రాన్స్‌లో అయితే ఇతరుల ఫోటోలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచురిస్తే.. 45 వేల యూరోల వరకు జరిమానా పాటు ఏడాది జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. తమ పిల్లల ఫోటోలను వందలకొద్ది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.