రిలయన్స్‌ జియోతో డీజీబాక్స్‌ డీల్‌: మోర్‌ స్పేస్‌ మోర్‌ మెమరీస్‌ | Jio DigiBoxxDeal: for More JioPhotos on the Jio SetTop Box | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియోతో డీజీబాక్స్‌ డీల్‌: మోర్‌ స్పేస్‌ మోర్‌ మెమరీస్‌

Published Wed, Jun 29 2022 2:18 PM | Last Updated on Wed, Jun 29 2022 6:52 PM

Jio DigiBoxxDeal: for More JioPhotos on the Jio SetTop Box - Sakshi

బెంగళూరు: రిలయన్స్ డిజిటల్ సర్వీసుల విభాగం రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్, స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ సంస్థ డీజీబాక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తన కస్టమర్లకు అదనపు స్టోరేజీ సౌకర్యాన్ని అందిస్తోంది. జియో సెట్-టాప్ బాక్స్ భవిష్యత్ వినియోగదారుల క్లౌడ్ కన్సాలిడేషన్ అవసరాలను మరింతగా తీర్చే  లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని  ప్రకటించాయి.

ఈ డీల్‌ప్రకారం  ప్రస్తుతం  20 జీబీ  స్టోరేజీకి అదనంగా 10 జీబీ స్టోరేజ్‌ను అందుకుంటారు.ఇందుకు వినియోగదారులు జియోఫోటోస్ యాస్‌ను  డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. దీనికి డీజీ బాక్స్ ఖాతాను  యాడ్‌ చేయాలి.  ఇందులో ఫోటోనుల అప్‌లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుండి ఫోటోలు, వీడియోలను తక్షణమే భాగస్వామ్యం చేయవచ్చు. వివిధ ఫార్మాట్‌ల ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేయవచ్చు.  అంతేకాదు జియో కస్టమర్‌లు ఆటో-సింక్‌ని ఎనేబుల్ చేసి  వ్యక్తిగత డేటాను స్టోర్ చేసుకోవచ్చు . దీంతోపాటు జియో సెట్-టాప్ బాక్స్‌లోని ప్రతిదాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా   హ్యాపీగా ఎంజాయ్‌ చేయవచ్చు.

భారతీయ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ డీజీబాక్స్‌తో ఒప్పందంపై జియో సీఈవో కిరణ్‌ థామస్‌  ఆనందంవ్యక్తం చేశారు. సురక్షితమైన, వేగవంతమైనస్పష్టమైన  డీజీ ఆఫర్లు ప్రపంచ శ్రేణిలో ఉన్నాయని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఈ ఇంటిగ్రేషన్ అదనపు స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం చూస్తున్న జియో యూజర్లందరికీ అసమానమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఇప్పుడు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు అని కిరణ్ అన్నారు.

జియోతో జతకట్టడంపై డీజీ బాక్స్‌  సీఈవో అర్నాబ్ మిత్రాసంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్‌గా యాక్టివ్‌గా ఉన్న కొత్త వినియోగదారులకు   తమ కొత్త టెక్నాలజిని  అందించడంలో  తోడ్పడుతుందన్నారు. తామం దించే స్టోరేజ్ స్పేస్‌ను  సంబంధించి మునపెన్నడూ లేని  గేమ్ ఛేంజింగ్ సర్వీసుగా భావిస్తున్నామన్నారు. 

జియోఫోటోస్
జియోఫోటోస్ అనేది యూఏస్‌డీ డ్రైవ్‌లు, గూగుల్ ఫోటోస్, జియోక్లౌడ్, డిజిబాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ ఖాతాలలో షేర్‌ అయిన, లేదా ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాలో నేరుగా షేర్  చేసిన  అన్ని ఫోటోలు, వీడియోలతో పాటు చలనచిత్రాలను టీవీ లో వీక్షించడానికి ఒక వన్-స్టాప్ యాప్. అన్ని ఫోటోలు, వీడియోలు, చలనచిత్రాలను టీవీలో వీక్షించడానికి ఇది ఒక వన్-స్టాప్ యాప్. జియోఫోటోస్ తో, జియో వినియోగదారులు గూగుల్ ఫోటోలు, జియోక్లౌడ్ వంటి విభిన్న క్లౌడ్ స్టోరేజీలలో స్టోర్ అయిన కంటెంట్ మొత్తానికి యాక్సెస్ లభిస్తుంది. జియో సెట్-టాప్ బాక్స్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నేరరుగా  షేర్‌ చేసుకోవచ్చు. కొ ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఉండటం మరో ప్రత్యేకత.

డీజీబాక్స్ 
2020లో స్థాపించబడిన, డిజిబాక్స్ సురక్షితమైన, వేగవంతమైన, సహజమైన, సరసమైన ధరతో కూడిన తెలివైన భారతీయ డిజిటల్ ఫైల్ స్టోరేజీ,డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్. వ్యక్తులు, లేదా వ్యాపారాల కోసం 'మేడ్ ఇన్ ఇండియా' క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అండ​ డిజిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్. ఆత్మనిర్భర్ లో భాగంగా తక్కువ వ్యవధిలోనే 10 లక్షలకు పైగా వినియోగదారులను సాధించింది. ఫైల్ స్టోరేజ్  షేరింగ్ కోసం డేటాను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయాలనుకునే వ్యక్తులు, గిగ్ వర్కర్లు, వ్యాపారులకు చాలా అనుకూల మైనది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement