set-top box
-
రిలయన్స్ జియోతో డీజీబాక్స్ డీల్: మోర్ స్పేస్ మోర్ మెమరీస్
బెంగళూరు: రిలయన్స్ డిజిటల్ సర్వీసుల విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్, స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ సంస్థ డీజీబాక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తన కస్టమర్లకు అదనపు స్టోరేజీ సౌకర్యాన్ని అందిస్తోంది. జియో సెట్-టాప్ బాక్స్ భవిష్యత్ వినియోగదారుల క్లౌడ్ కన్సాలిడేషన్ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ డీల్ప్రకారం ప్రస్తుతం 20 జీబీ స్టోరేజీకి అదనంగా 10 జీబీ స్టోరేజ్‌ను అందుకుంటారు.ఇందుకు వినియోగదారులు జియోఫోటోస్ యాస్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనికి డీజీ బాక్స్ ఖాతాను యాడ్ చేయాలి. ఇందులో ఫోటోనుల అప్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుండి ఫోటోలు, వీడియోలను తక్షణమే భాగస్వామ్యం చేయవచ్చు. వివిధ ఫార్మాట్ల ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేయవచ్చు. అంతేకాదు జియో కస్టమర్లు ఆటో-సింక్‌ని ఎనేబుల్ చేసి వ్యక్తిగత డేటాను స్టోర్ చేసుకోవచ్చు . దీంతోపాటు జియో సెట్-టాప్ బాక్స్‌లోని ప్రతిదాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. భారతీయ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ డీజీబాక్స్తో ఒప్పందంపై జియో సీఈవో కిరణ్ థామస్ ఆనందంవ్యక్తం చేశారు. సురక్షితమైన, వేగవంతమైనస్పష్టమైన డీజీ ఆఫర్లు ప్రపంచ శ్రేణిలో ఉన్నాయని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఈ ఇంటిగ్రేషన్ అదనపు స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం చూస్తున్న జియో యూజర్లందరికీ అసమానమైన యూజర్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఇప్పుడు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు అని కిరణ్ అన్నారు. జియోతో జతకట్టడంపై డీజీ బాక్స్ సీఈవో అర్నాబ్ మిత్రాసంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్‌గా యాక్టివ్‌గా ఉన్న కొత్త వినియోగదారులకు తమ కొత్త టెక్నాలజిని అందించడంలో తోడ్పడుతుందన్నారు. తామం దించే స్టోరేజ్ స్పేస్‌ను సంబంధించి మునపెన్నడూ లేని గేమ్ ఛేంజింగ్ సర్వీసుగా భావిస్తున్నామన్నారు. జియోఫోటోస్ జియోఫోటోస్ అనేది యూఏస్డీ డ్రైవ్‌లు, గూగుల్ ఫోటోస్, జియోక్లౌడ్, డిజిబాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ ఖాతాలలో షేర్ అయిన, లేదా ఫేస్బుక్ ఇన్‌స్టాలో నేరుగా షేర్ చేసిన అన్ని ఫోటోలు, వీడియోలతో పాటు చలనచిత్రాలను టీవీ లో వీక్షించడానికి ఒక వన్-స్టాప్ యాప్. అన్ని ఫోటోలు, వీడియోలు, చలనచిత్రాలను టీవీలో వీక్షించడానికి ఇది ఒక వన్-స్టాప్ యాప్. జియోఫోటోస్ తో, జియో వినియోగదారులు గూగుల్ ఫోటోలు, జియోక్లౌడ్ వంటి విభిన్న క్లౌడ్ స్టోరేజీలలో స్టోర్ అయిన కంటెంట్ మొత్తానికి యాక్సెస్ లభిస్తుంది. జియో సెట్-టాప్ బాక్స్‌లో ఫేస్బుక్, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నేరరుగా షేర్ చేసుకోవచ్చు. కొ ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఉండటం మరో ప్రత్యేకత. డీజీబాక్స్ 2020లో స్థాపించబడిన, డిజిబాక్స్ సురక్షితమైన, వేగవంతమైన, సహజమైన, సరసమైన ధరతో కూడిన తెలివైన భారతీయ డిజిటల్ ఫైల్ స్టోరేజీ,డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్. వ్యక్తులు, లేదా వ్యాపారాల కోసం 'మేడ్ ఇన్ ఇండియా' క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అండ డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్. ఆత్మనిర్భర్ లో భాగంగా తక్కువ వ్యవధిలోనే 10 లక్షలకు పైగా వినియోగదారులను సాధించింది. ఫైల్ స్టోరేజ్ షేరింగ్ కోసం డేటాను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయాలనుకునే వ్యక్తులు, గిగ్ వర్కర్లు, వ్యాపారులకు చాలా అనుకూల మైనది. -
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో
టెలికాం మార్కెట్లో దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయబోతుందట. డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి రిలయన్స్ జియో అరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటాప్ బాక్స్ ఇమేజ్ లు ప్రస్తుతం ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఈ సెటాప్ బాక్స్ ల మాదిరిగానే దీర్ఘచతురస్రాకారంలో ఇవి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ లో యూఎస్బీ పోర్టు కూడా ఉంది. బ్లూ రంగులో ఉన్న ఈ బాక్స్ లపై రిలయన్స్ జియో బ్రాండు ముద్రించి ఉంది.యూఎస్బీ తో పాటు స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ లు దీనిలో ఉన్నట్టు తెలుస్తోంది.. 360 పైగా చానళ్లను జియో టీవీ ఆఫర్ చేయనుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. వాటిలో 50 హెచ్డీ ఛానల్స్ ఉండబోతున్నాయట. వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకునే విధంగా యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానలో వస్తాయో తెలుస్తుందట. డేటా సర్వీసుల మాదిరిగానే డీటీహెచ్ విభాగంలోనూ జియో సంచలనాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఈ ఆన్ లైన్ ఇమేజ్ ల బట్టి వెల్లడవుతుందని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. ప్రత్యర్థి డీటీహెచ్ సర్వీసుల కంటే చాలా తక్కువ రేటుకు ఛానళ్లను అందుబాటులోకి తేనుందని చెబుతున్నారు. తొలుత ముంబాయిలో ప్రారంభించిన అనంతరం ఈ సేవలను దేశవ్యాప్తంగా కంపెనీ విస్తరించనుందని టాక్. -
సెట్ టాప్ బాక్స్ అక్కరలేదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఎయిర్టెల్ మరో ముందడుగు వేసింది. అంతర్గతంగా స్మార్ట్ కార్డ్ కలిగిన ఇంటెగ్రేటెడ్ డిజిటల్ టీవీలను (ఐడీటీవీ) శామ్సంగ్తో కలిసి భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీల కు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుం డానే డిజిటల్ ప్రసారాలను వీక్షించొచ్చు. ఐడీటీవీల ప్రత్యేకత ఏమంటే సిగ్నల్ నష్టాలను తగ్గిస్తాయి. ఒకే రిమోట్‌తో టీవీ ఆపరేట్ చేయొచ్చు. యాంటెన్నా నుంచి టీవీ వరకు తక్కువ వైర్లుంటాయి. విద్యుత్ 10% ఆదా అవుతుంది. ఇక పిక్చర్, శబ్దం నాణ్యతా బాగుంటుంది. శామ్సంగ్ స్మార్ట్ యాప్స్‌తోపాటు ఇన్ బిల్ట్ వైఫై కూడా ఉంది.శామ్సంగ్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ డెరైక్ట్ టీవీల ధర రూ.44,900 నుండి ప్రారంభం. శామ్సంగ్ ప్లాజా, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఔట్‌లెట్లలోనూ ఇవి లభిస్తాయి. పరిచయ ఆఫర్లో రూ.2,851 విలువగల ఎయిర్టెల్ మెగా హెచ్డీ డీటీహెచ్ ప్యాక్ 4 నెలలు ఉచితం. వీక్షణలో కొత్త అధ్యాయం..: టీవీ వీక్షణలో ఐడీటీవీలు నూతన ఒరవడి సృష్టిస్తాయని భారతి ఎయిర్టెల్ డీటీహెచ్, మీడియా సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెక్నాలజీ, సౌకర్యం వీటి ప్రత్యేకతన్నారు. వీటి అభివృద్ధికి భారీగా వ్యయం చేశామన్నారు.యూఎస్, ఈయూ వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ ప్రాచుర్యంలో ఉందన్నారు. ఐడీటీవీ కస్టమర్ల కోసం ప్రత్యేక బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. కాగా, హెచ్డీఎంఐ కేబుల్‌తో ఇతర కంపెనీల సెట్ టాప్ బాక్స్‌ను సైతం ఈ టీవీలకు అనుసంధానించుకోవచ్చు. -
ఎయిర్‌సెల్ కస్టమర్లకు ఫేస్బుక్ ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు టెలికం రంగ కంపెనీ ఎయిర్‌సెల్ తాజాగా ఉచిత ఫేస్బుక్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 60 రోజుల కాల పరిమితితో నెలకు 50 ఎంబీ చొప్పున, పాత కస్టమర్లకు 30 రోజుల కాలపరిమితితో 50 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. 50 ఎంబీ పూర్తి అయితే 10 కేబీ డేటా వాడకానికి 2 పైసలు చార్జీ చేస్తారు. స్టార్121స్టార్999హ్యాష్ డయల్ చేసి కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఫేస్బుక్ కోసం ప్రత్యేక టారిఫ్ ప్యాక్‌లను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. రూ.14 ప్యాక్‌తో 100 ఎంబీ 2జీ/3జీ డేటాను 28 రోజులపాటు వినియోగించుకోవచ్చు. 5 రోజుల వ్యాలిడిటీగల రూ.5 ప్యాక్‌తో 25 ఎంబీ డేటా ఉచితం. అలాగే రూ.5 రీచార్జ్ చేస్తే రూ.10, 20, 30 రీచార్జ్‌పై పూర్తి టాక్‌టైం అందిస్తున్నట్టు ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ తివానా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. -
సెట్ టాప్ బాక్స్ అమర్చుకున్నారా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీ ఇంట్లో సెట్ టాప్ బాక్సు ఉందా? లేకుంటే ఈ రోజే సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీ) అమర్చుకోండి. ఎందుకంటే డిజిటైజేషన్లో భాగంగా సెప్టెంబరు 19 నుంచి హైదరాబాద్ నగరంలో అనలాగ్ సిగ్నల్స్ కనుమరుగవుతున్నాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతాయి. డిజిటల్ సిగ్నల్స్ అందుకోవాలంటే కేబుల్ టీవీ ప్రేక్షకులు తప్పనిసరిగా ఎస్టీబీ అమర్చుకోవాల్సిందే. నగరంలో డిజిటైజేషన్ ఈ ఏడాది మార్చి 31కే పూర్తి కావాలి. కేబుల్‌ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల18 వరకు గడువు ఇస్తూ గత నెల తీర్పు వెలువరించింది. 70 శాతం పూర్తి... రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకే దీనిని పరిమితం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్టీబీలు అమర్చుకున్నారు. కేబుల్ టీవీ కనెక్షన్లలో 60 శాతం మంది ఎస్టీబీలను కొనుగోలు చేశారని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’ కి తెలిపారు. హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే.. నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.