న్యూసెన్స్! | Freida Pinto denies dating Siddharth Mallya! | Sakshi
Sakshi News home page

న్యూసెన్స్!

Published Wed, Dec 3 2014 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

న్యూసెన్స్!

న్యూసెన్స్!

సినిమాలు లేకపోయినా వార్తల్లో ఉండే నటి ఫ్రీడా పింటో. ఈ ముద్దుగుమ్మ తన 30వ బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ‘ఫుల్లు’గా లాగించేసి... ఊగుతూ తూగుతూ లాస్‌ఏంజెలిస్ వీధుల్లో రచ్చ చేసింది. సెలబ్రేషన్ అలా అలా జోష్ అందుకుని... ఓ స్ట్రిప్ క్లబ్ ముందు చిందులేస్తుంటే, అక్కడి పోలీసులు పట్టి లోపలేశారు. కొసమెరుపేమంటే... ఈ తారతో స్టెప్పులేసిన వారిలో లిక్కర్ బారన్ విజయ్‌మాల్యా తనయుడు సిద్ధార్థ మాల్యా కూడా ఉండటం. తరువాత దీనిపై అమ్మడిని అడిగితే... ఇద్దరి మధ్యా డ్రంకన్ డేట్ లాంటిదేమీ లేదని, మంచి స్నేహితులం మాత్రమేనని సెలవిచ్చింది. అయితే... బాయ్ ఫ్రెండ్ దేవ్ పటేల్‌తో డేటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడం మరో కొసమెరుపు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement