vijaymalya
-
రోడ్డున పడ్డ విజయ్ మాల్యా
-
మాల్యా అప్పీల్‌పై విచారణకు హైకోర్టు ఓకే
లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఊరట లభించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే నిర్ణయం తీసుకుంటూ గతంలో బ్రిటన్ హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై మాల్యా చేసుకున్న అప్పీల్‌ను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మాల్యా అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై జస్టిస్ జార్జ్ లెగ్గాట్ట్, జస్టిస్ ఆండ్రూ పాపుల్‌వెల్‌ల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తాము అప్పీల్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మాల్యా తరఫున న్యాయవాది క్లారీ మోంట్‌గోమెరీ వాదనలు వినిపించగా, భారత హై కమిషన్ కార్యాలయ అధికారులు, మాల్యా భాగస్వామి పింకీ లల్వానీ, కొడుకు సిద్ధార్థ్‌లు కూడా కోర్టుకు వచ్చారు. మాల్యా అప్పీల్ పిటిషన్‌ను కోర్టు తదుపరి రోజుల్లో విచారించనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం అప్పు తీసుకుని, బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను బ్రిటన్ పోలీసులు 2017 ఏప్రిల్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన అక్కడే బెయిల్‌పై ఉంటున్నారు. అప్పటి నుంచి మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే మాల్యా రుణాలను ఎగ్గొట్టారనడానికి ఆధారాలు ఉన్నాయని గతేడాది డిసెంబర్లోనే లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తేల్చింది. దీంతో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. -
దోపిడీ బ్యాంక్ ఆఫ్ ఇండియా
-
మాల్యా 6,630 కోట్ల ఆస్తులు ఈడీ జప్తు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని విదేశాలకు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ఆస్తుల జప్తునకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) రెండో జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఫామ్‌హౌస్, ఫ్లాట్స్, ఎఫ్డీలుసహా రూ.6,630 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అక్రమ ధనార్జనా కేసులో ఈడీ ఈ చర్య తీసుకుంది. దీనితో ఈ కేసుకు సంబంధించి ఈడీ జప్తు విలువ రూ.8,041 కోట్లకు చేరింది. వాస్తవానికి తాజా ఉత్తర్వు జప్తు ఆస్తుల విలువ రూ.4,235 కోట్లని అయితే ఆయా ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.6,630 కోట్లని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆస్తులు ఇవీ: జప్తు చేసిన ఆస్తుల్లో మాడ్వా ఫామ్ హౌస్ (రూ.25 కోట్లు), బెంగళూరు కింగ్ ఫిషర్ టవర్లోని మల్టీఫ్లాట్స్ (రూ.565 కోట్లు), ప్రైవేటు బ్యాంకుల్లో రూ.10 కోట్ల స్థిర డిపాజిట్లు ఉన్నాయి. వీటితోపాటు యూఎస్ఎల్, యునెటైడ్ బ్రువరీస్ లిమిటెడ్, మెక్‌డోవెల్ హోల్డింగ్ కంపెనీ షేర్లు కూడా జప్తు ఉత్తర్వుల్లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.3,635 కోట్లు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌తో నేరపూరితంగా కుమ్మకై, బ్యాంకుల నుంచి సమీకరించిన నిధులను అక్రమ మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అక్రమ ధనార్జనకు మాల్యా పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. సీబీఐ ఇప్పటికే విచారణ జరుపుతున్న 17 బ్యాంకులకు మాల్యా రుణ ఎగవేత కేసుకు కూడా ఇటీవల ఈడీ విచారణా పరిధి విస్తరించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత జరిగిన తాజా జప్తు ప్రక్రియ ఇది. -
డీఆర్టీ ఉత్తర్వుపై డియాజియో అభ్యంతరం
బెంగళూరు: రుణ ఎగవేత వివాదాన్ని ఎస్బీఐతో పరిష్కరించుకునే దాకా లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెల్లించాల్సిన 75 మిలియన్ డాలర్లను విడుదల చేయవద్దని తనకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాలపై బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం- డియాజియో మంగళవారం తన అభ్యంతరాలను దాఖలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకుగాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడిం ది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్టీని ఆశ్రయించింది ఎస్బీఐ. దీనికి సానుకూల రూలింగ్‌ను డీఆర్టీ గతనెల్లో జారీ చేసింది. దీనిపై తాజాగా డియాజియో, దాని అనుబంధ రెండు కంపెనీలు తమ తరఫు అభ్యంతరాలను దాఖలు చేశాయి. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా పడింది. -
నైతిక ప్రమాణాలు పాటించాలి..!
మొండిబకాయిలపై పరిశ్రమకు ఆర్థికమంత్రి హితవు ♦ వృద్ధికి రేట్ల కోత అవసరమని సూచన న్యూఢిల్లీ: మొండిబకాయిల విషయంలో పరిశ్రమ నైతిక ప్రమాణాలు పాటించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పిలుపునిచ్చారు. తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి పరిశ్రమ సైతం శ్రమిస్తోందని, అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు విశ్వసనీయత కొరవడేట్లు చేస్తున్నాయని అన్నారు. ఇటీవలి విజయ్‌మాల్యా ఉదంతం నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలుకు ప్రాధాన్యతను సంతరించుకుంది. జైట్లీ శనివారం ఇక్కడ 2016 సీఐఐ వార్షిక సదస్సును ప్రారంభించారు. ఇందులో మాట్లాడుతూ, ప్రతికూల వ్యాపార వాతావరణమే మొండిబకాయిల సమస్య పెరగడానికి ప్రధాన కారణమన్నారు. వ్యాపార పరిస్థితి మెరుగుపడితే.. మొండిబకాయిల సమస్య కూడా తగ్గిపోతుందన్నారు. అయితే ఈ సమస్య విషయంలో కార్పొరేట్లు కూడా సానుకూల రీతిలో, నైతిక ప్రవర్తనను పాటించాలని సూచించారు. స్టీల్, జౌళి, రహదారులు, మౌలిక రంగాల్లో మొండిబకాయిల సమస్య పరిష్కారం విషయంలో కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని వివరించా రు.నిలిచిపోయిన ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాని కార్యాలయమే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అధిక వడ్డీరేట్లతో వృద్ధికి విఘాతం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో... దేశంలో అధిక వడ్డీరేట్లు వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు (ద్రవ్యలోటు) సంబంధించి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే దేశంలో ద్రవ్యోల్బణం కూడా కట్టడిలో ఉన్నట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం 2016-17కు సంబంధించి ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. రేటు తగ్గితే.. వడ్డీరేట్ల ఆదాయంపై జీవించే వృద్ధుల పరిస్థితి ఏమిటన్న వాదనపై ఆయన మాట్లాడుతూ, ఈ సమస్యను పెన్షన్ ఫండ్స్ పరిష్కరిస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఇవి మంచి రిటర్న్స్ అందిస్తాయని అన్నారు. త్వరలో ఆస్ట్రేలియాతో ఎఫ్‌టీఏ: నిర్మలా సీతారామన్ కాగా కార్యక్రమం సందర్భంగా వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, త్వరలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ మేరకు చర్చలు సానుకూల రీతిలో సాగుతున్నట్లు వెల్లడించారు. -
విజయ్‌మాల్యాకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యాకు మరో కేసులో సోమవారం సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం ఆయన వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు సైతం చేసింది. వివరాల్లోకి వెళితే... విదేశీ మారక ద్రవ్య (ఫెరా) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక కేసులో ట్రైల్ కోర్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారని మొట్టికాయలు వేసింది. అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంటూ... ఇందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది. -
న్యూసెన్స్!
సినిమాలు లేకపోయినా వార్తల్లో ఉండే నటి ఫ్రీడా పింటో. ఈ ముద్దుగుమ్మ తన 30వ బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ‘ఫుల్లు’గా లాగించేసి... ఊగుతూ తూగుతూ లాస్ఏంజెలిస్ వీధుల్లో రచ్చ చేసింది. సెలబ్రేషన్ అలా అలా జోష్ అందుకుని... ఓ స్ట్రిప్ క్లబ్ ముందు చిందులేస్తుంటే, అక్కడి పోలీసులు పట్టి లోపలేశారు. కొసమెరుపేమంటే... ఈ తారతో స్టెప్పులేసిన వారిలో లిక్కర్ బారన్ విజయ్‌మాల్యా తనయుడు సిద్ధార్థ మాల్యా కూడా ఉండటం. తరువాత దీనిపై అమ్మడిని అడిగితే... ఇద్దరి మధ్యా డ్రంకన్ డేట్ లాంటిదేమీ లేదని, మంచి స్నేహితులం మాత్రమేనని సెలవిచ్చింది. అయితే... బాయ్ ఫ్రెండ్ దేవ్ పటేల్‌తో డేటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడం మరో కొసమెరుపు! -
కొత్త అందాలతో కింగ్ ఫిషర్ క్యాలెండర్