
Freida Pinto Shares Emotional Post: మోడల్, నటి ఫ్రిడా పింటో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఫ్రిడా కొడుకు ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా కుమారుడికి 'రుమీ రే' అని పేరు కూడా పెట్టేసింది. కొడుకుతో కలిసి భర్తకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ భావోద్వేగానికి లోనైంది.
'హ్యాపీ బర్త్‌డే డాడా కోరీ! నువ్వు నా భర్తవి మాత్రమే కాదు, ఫ్రెండ్‌వి, జీవిత భాగస్వామివి కూడా! నిన్ను సూపర్ డాడ్‌గా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనిద్దరం కలిసి సాగిస్తున్న ఈ జీవిత ప్రయాణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నా. రుమీ రే.. నువ్వు చాలా అదృష్టవంతుడివి నాన్నా!' అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి రుమీ రే తన తండ్రి ఛాతీపై పడుకున్న ఫొటోను జత చేసింది. కానీ బేబీ ముఖాన్ని మాత్రం చూపించలేదు.
కాగా 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఫ్రిదా ఎక్కువగా హాలీవుడ్‌లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment