slumdog millionaire
-
మురికి వాడ నుంచి ఏకంగా రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా!
ఆమె ఎలాంటి డిగ్రీలు చేయలేదు. మురికి వాడల్లో పెరిగింది. అడుగడుగున అవమానాలు, కష్టాలు కడగళ్లే. అన్నింటిని ఓర్చుకుని మెరుగుపడుతుందనుకునే లోపే ఓ పెనువిషాదం అగాధంలో పడేసింది. ఒకరకంగా అదే ఆమెలో కసి పెంచి చిన్న చితక ఉద్యోగాలు కాదు వ్యాపారవేత్తగా కోట్లు గడించాలనుకునే ఆలోచనకు తెరతీసింది. అదే ఆమెను నేడు 900 కోట్ల సామ్రజ్యానికి అధిపతి చేసింది. పైగా రియల్ స్మమ్డాగ్ మిలియనీర్‌గా ప్రశంసలుందుకునేలా చేసింది కూడా. ఆమె పేరు కల్పనా సరోజ్. మహారాష్ట్రలోని విదర్భలో దళిత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కానిస్టేబుల్ కావడంతో పోలీస్ క్వార్టర్స్‌లోనే ఆమె కుటుంబ నివశించేది. అయితే దళిత కుటుంబం కావడంతో సమాజంలో దారుణమైన వివక్షణు ఎదుర్కొంది. ఆమెకు మగ్గురు సోదరీమణలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్నతనంలో పాఠశాలల్లో జరిగే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేకుండా నిషేధించారు టీచర్లు. కనీసం తోటి విద్యార్థులతో కూర్చోకూడదు, తినకూడదు. అందుకు పాఠశాల టీచర్లు, తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేవారు కాదు. అయినప్పటికీ తనను చదువుకోడానికి అంగీకరించడమే గొప్ప బహుమతిగా భావించింది కల్పనా సరోజ్. ప్రతిభావంతురాలైనప్పటికీ దళితురాలు కావడంతో చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. భర్తతో కలిసి ముంబైకు చేరుకుంది. అక్కడ అత్తారింట్లో మొత్తం పదిమంది వ్యక్తులు ఉండే కుటుంబంలో ఆమె గొడ్డు చాకిరీ చేయాల్సి వచ్చేది. దీంతో ఆమెకు పోషకాహరం లోపం తలెత్తి నీరసించిపోయింది. ఆమె స్థితిని చూసి చలించిపోయినన తండ్రి అక్కడ నుంచి ఆమెను తీసుకొచ్చేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటారా! అని ఈసడించడం మొదలుపెట్టారు. ఈ అవమానాలను తట్టుకోలేక ఏకంగా రెండు బాటిళ్ల ఎలుకల మందు తాగేసింది కల్పనా సరోజ్. ఆమె అత్త దీన్ని గమనించడంతో కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. దేవుడిచ్చిన ఈ రెండో అవకాశాన్ని ఆత్మనూన్యతతో వృధా చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. మళ్లీ ముంబైకి తిరిగొచ్చి తన మేనమామతో కలిసి ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడే అసిస్టెంట్ టైలర్‌గా పనిచేస్తూ ఆ వృత్తిలో మంచిగా రాణించింది. దీంతో ఒక గదిలో గడిపే ఆమె కుటుంబం కాస్త ఫ్లాట్‌లోకి వెళ్లింది. పరిస్థితి మెరుగుపడుతుందని అనుకునేలోపు చెల్లి అనారోగ్యం ఆమె కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆమె వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతోనే మరణించిందన్న విషయం ఆమెలో గట్టి కసిని పెంచింది. ఏదో చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టకూడదు తాను వ్యాపారవేత్తగా ఎదగాల్సిందేనని గట్టిగా డిసైడ్ అయ్యిపోయింది కల్పనా సరోజ్. ఊహించని ములుపు.. అప్పుడే ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలుసుకుంది. వెంటనే లోన్‌కి అప్లై చేసి చిన్న ఫర్నీచర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. అత్యాధునిక ఫర్నిచర్లను చాలా చౌక రేటుకే విక్రయిస్తు లాభాలు గడిస్తుంది. ఓ పక్క టైలరింగ్ కూడా కొనసాగించింది. అలా రోజుకి దాదాపు పదహారు గంటలు పనిచేసేది. సరిగ్గా ఆ టైంలో రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకుంది. రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి భూమికి సంబంధించిన లిటిగేషన్‌ను పరిష్కరించింది. ఇదే ఆమెకు అప్పులో ఊబిలో చిక్కుకున్న మెటల్ ఇంజనీరింగ్ కంపెనీ కమానీ ట్యూబ్స్ కార్మికులు బాధ్యతను స్వీకరించే అవకాశం తెచ్చిపెట్టింది. ఇది ఆమె తన తొలి ఆరర్డర్గా భావించి పదిమంది సభ్యులతో కూడిన బృందంతో ఆ కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించింది. ఆ తర్వాత ఆ కంపెనీకే చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా ఇవాళ సుమారు 900 కోట్ల సామ్రాజ్యాని అధిపతి అయ్యింది కల్పనా సరోజ్. పైగా డిగ్రీలు, ఎంబీయేలు నన్ను ఈ స్థితికి తీసుకురాలేదని, కేవలం పట్టుదల, ఆత్మవిశ్వాసమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని సగర్వంగా చెబుతోంది కల్పనా సరోజ్. ఆమె స్థైర్యానికి, తెగువకు హ్యాట్సాఫ్ అనాల్సిందే కదూ!. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
'స్లమ్‌డాగ్ మిలియనీర్' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్
జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా యూరోపియన్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్(EURO 2023) విజేతగా నిలిచింది. అయితే ఆమె బ్లాక్బాస్టర్ సినిమా.. ఆస్కార్ విజేత స్లమ్‌డాగ్ మిలియనీర్ మ్యూజిక్‌తో దాదాపు నాలుగు నిమిషాల 30 సెకన్ల పాటు స్కేటింగ్ చేయడం విశేషం. మధ్యలో బాలీవుడ్ సినిమా గలియోంకీ రాస్లీలా రామ్లీలాలోని సూపర్‌హిట్ సాంగ్ డోల్ బాజే పాట కూడా వినిపించడం విశేషం. భారతీయ సంప్రదాయమైన చీరకట్టుతో అనస్తాసియా గుబనోవా స్కేటింగ్ చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక అనస్తాసియా గుబనోవా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే శనివారం జరిగిన యూరో స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో 199.1 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక బెల్జియంకు చెందిన లియోనా హెండ్రిక్స్ 193.2 పాయింట్లో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కిమ్మి 192.5 పాయింట్లతో కాంస్యం సాధించింది. ⛸️Avrupa Artistik Patinaj Şampiyonası'nda kadınlarda altın madalya aşağıdaki enerjik ve harika serbest program performansıyla Anastasiia Gubanova'ya gitti. Kısa programı da zirvede tamamlayan Gubanova kariyerinin ilk Avrupa Şampiyonluğu'nu yaşadı. #EuroFigure pic.twitter.com/LlJCtc2SWu — Murat Taşkolu (@murattaskolu) January 28, 2023 చదవండి: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు కొట్టించుకుంది -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి!
Freida Pinto Shares Emotional Post: మోడల్, నటి ఫ్రిడా పింటో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఫ్రిడా కొడుకు ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా కుమారుడికి 'రుమీ రే' అని పేరు కూడా పెట్టేసింది. కొడుకుతో కలిసి భర్తకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'హ్యాపీ బర్త్‌డే డాడా కోరీ! నువ్వు నా భర్తవి మాత్రమే కాదు, ఫ్రెండ్‌వి, జీవిత భాగస్వామివి కూడా! నిన్ను సూపర్ డాడ్గా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనిద్దరం కలిసి సాగిస్తున్న ఈ జీవిత ప్రయాణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నా. రుమీ రే.. నువ్వు చాలా అదృష్టవంతుడివి నాన్నా!' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి రుమీ రే తన తండ్రి ఛాతీపై పడుకున్న ఫొటోను జత చేసింది. కానీ బేబీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. కాగా 2008లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఫ్రిదా ఎక్కువగా హాలీవుడ్లో అలరిస్తోంది. రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్, లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) -
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్!
'స్లమ్‌డాగ్ మిలియనీర్'తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా కోరీ ట్రాన్, ఫ్రిదా పింటో 2017 నుంచి డేటింగ్ చేసుకుంటున్నారు. వీరి ప్రేమను పెళ్లి పీటలెక్కించాలనుకున్న ఈ లవ్ బర్డ్స్ 2019లో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ పెళ్లి డేట్ మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె గర్భవతినన్న విషయాన్ని చెప్పడంతో సెలబ్రిటీలు, అభిమానులు ఫ్రిదాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్రిదా కెరీర్ విషయానికి వస్తే ఆమె 'స్లమ్‌డాగ్ మిలియనీర్', 'ఇమ్మోర్టల్స్', 'రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 'బ్రిటన్స్ వరల్డ్ వార్ 2' తోపాటు 'స్పై ప్రిన్సెస్: ద లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. 'స్పై ప్రినెన్స్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Freida Pinto (@freidapinto) చదవండి: ఈ పాపులర్ హీరోను గుర్తు పట్టారా?.. ఎందుకిలా అయ్యాడంటే.. అవెంజర్స్ ఎలిజబెత్‌కు పెళ్లైందా? -
పాపులర్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు
ముంబై: పాపులర్ నటుడు మధుర్ మిట్టల్ మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ప్రియురాలి మీద లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు దాడి చేసి గాయపర్చినందుకుగానూ అతడిపై ఈ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 13న మిట్టల్ అతడి మాజీ ప్రియురాలి ఇంట్లోకి చొరబడి దుర్భాషలాడాడు. ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు దాడికి దిగాడు. బాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పూటుగా తాగి, ఆ మైకంలో బాధితురాలి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఆ సమయంలో అతడు బాధితురాలిని 15 సార్లు గొంతు పిసికి, ఆమె జుట్టు పట్టుకుని లాగి, కుడికన్ను మీద పిడిగుద్దులు కురిపిస్తూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందే వీళ్లిద్దరూ విడిపోయారని తెలిపారు. ఫిబ్రవరి 15న కూడా మరోసారి ఆమె ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని, కానీ తానే స్వయంగా మిట్టల్‌ను అడ్డుకున్నట్లు తెలిపారు. కాగా మధుర్ మిట్టల్ 'షకలక బూమ్ బూమ్' అనే టీవీ షోలో బాలనటుడిగా కనిపించాడు. ఆ తర్వాత 'స్లమ్‌డాగ్ మిలియనీర్'లో అద్భుత నటన కనబర్చాడు. వీటితో పాటు మిలియన్ డాలర్ ఆర్మ్, మాత్ర్ సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం అతడు వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం జైపూర్‌లో ఉన్నాడు. చదవండి: టాలీవుడ్, బాలీవుడ్ల మధ్య క్లాష్ తప్పదా.. కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్!
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ భామ ఫ్రిదా పింటో త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ కోరీ ట్రాన్‌ను వివాహం చేసుకోనున్నారు. కోరీ పుట్టినరోజు సందర్భంగా తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఫ్రిదా ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసిన ఫ్రిదా... ‘ నా జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను సృష్టించింది నువ్వే. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. కాదు కాదు నేనే నా ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండేలా చేశాను. హ్యాపీ బర్త్‌డే స్వీట్ ఫియాన్సీ’ అని క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో ఫ్రిదా-కోరీలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటీమణులు లీసా రే, నర్గిస్ ఫక్రీ, అనైతా ఫ్రాఫ్ హార్ట్ ఎమోజీలతో ఫ్రిదాకు అభినందనలు తెలిపారు. కాగా డానీ బోయెల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్‌డాగ్ సినిమాతో ఫ్రిదా తన కెరీర్‌ను ఆరంభించారు. ఈ మూవీలో తనకు జోడీగా నటించిన దేవ్ పటేల్‌తో కొన్నాళ్లపాటు ఆమె డేటింగ్ చేశారు. ప్రస్తుతం కోరీతో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఫ్రిదా.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా మహిళా సాధికారికత, పిల్లల సంరక్షణ తదితర సామాజిక అంశాల్లో భాగస్వామ్యవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. View this post on Instagram It all makes sense now. Life makes sense, the world makes sense, the past tears and trials make sense, what wise old lovers said about love makes sense, where I am makes sense and where I want to go completely makes sense. . You my love are just the most beautiful creation to have ever walked into my life. And you are here to stay. Well, I am making you stay. Ha! 😂 All my love with all my heart♥️. . Oh and Happiest Birthday sweet Fiancé ! . 📷 : @samanthamarq A post shared by Freida Pinto (@freidapinto) on Nov 21, 2019 at 8:07am PST -
దర్శక–నిర్మాత రసూల్!
సౌత్ అండ్ నార్త్ సినిమాలే కాకుండా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేశారు సౌండ్ ఇంజినీర్ రసూల్. 2009లో వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికిగాను సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రసూల్ దర్శకుడిగా మారనున్నారని సమాచారం. ‘రంగ్ దే బసంతి, ఢిల్లీ 6’ చిత్రాలకు కథ అందించిన కమల్పాండే ఈ సినిమాకు కథ రాస్తున్నారట. ఓ హాలీవుడ్ స్టూడియోతో కలిసి రసూల్ ఈ సినిమాను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
మళ్లీ ఆస్కార్ రేస్‌లో ఎ.ఆర్. రెహమాన్
-
మళ్లీ ఆస్కార్ రేస్‌లో...
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2009)కి జంట ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అప్పటి నుంచి ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండేళ్లకు ‘127 హవర్స్’ చిత్రానికిగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్’ విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్నారాయన. అయితే ఆస్కార్ వరించలేదు. తాజాగా మళ్లీ ఆయన ఆస్కార్ బరిలో నిలిచారు. బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జీవితం ఆధారంగా రూపొందిన ‘పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ చిత్రానికి గాను రెహమాన్ ఆస్కార్ రేస్‌లో ఉన్నారు. ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో రెహమాన్ పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది. జనవరి 24న నామినేషన్ దక్కించుకున్నవారి వివరాలను ప్రకటిస్తారు. మరి.. ఈ నామినేషన్ ఎంట్రీ పోటీలో రెహమాన్‌కి స్థానం దక్కుతుందా? నామినేషన్ గెల్చుకుంటే ఆస్కార్ దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి. -
ఆ అమ్మాయే ఈ అమ్మాయి
స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో లతిక అనే అమ్మాయి ఉంటుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయి హీరోయిన్ ఫ్రిదా పింటో. చిన్నప్పుడు రుబీనా అలి. టీనేజ్‌లో తన్వీ గణేశ్. సినిమాలో తన్వీ స్లమ్ ఏరియాలో ఉంటుంది. స్లమ్ గర్ల్‌లా ఉంటుంది. యాక్షన్ అద్భుతంగా ఉందని, వయసును మించిన అభినయాన్ని ప్రదర్శించిందని ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ ‘స్లమ్ గర్ల్’ తన్వీ రియల్ లైఫ్ ఫొటో ఇది. తన్వీకి ఇప్పుడు 21 ఏళ్లు. యు.ఎస్.లో ఉంటోంది. సినిమాల్లో ట్రై చేస్తోంది. తను ఆర్టిస్ట్ కూడా. మంచి మంచి పెయింటింగ్స్ వేస్తోంది. ఇండియన్ డెరైక్టర్ ఎవరైనా సినిమా తీస్తే మళ్లీ మనం లతికను మనసుదోచే పాత్రలో చూడొచ్చు. -
‘బాలీవుడ్లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’
ముంబయి: తనకు బాలీవుడ్ లో పనిచేయాడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ భారత సంతతికి చెందిన అమెరికా నటి ఫ్రిదా పింటో చెప్పింది. స్లమ్ డాగ్మిలియనీర్ చిత్రంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆమె హిందీ చిత్రాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తాను మార్వారి చిత్రం ‘త్రిష్నా’లో సగభాగం నటించానని, ఆ భాష కూడా తనకు రాకపోయినా ఆ పని చేశానని తెలిపింది. సినిమాలో ఎవరు నటిస్తున్నారనే దానికంటే ఆ సినిమా కథ ఎలా ఉందనేదే తనకు ముఖ్యం అని ఫ్రిదా చెప్పింది. వచ్చే ఏడాది తాను గొప్ప చిత్రంలో కనిపిస్తానని, అది కూడా స్లమ్ డాగ్మిలియనీర్ నిర్మాతల్లో ఒకరైన తాబ్రెజ్ నూరాని దర్శకత్వం వహించారని, ఆయన కూడా భారతీయుడే అని ఫ్రిదా తెలిపింది. -
ఆ నలుగురితో కలిసి...!
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయిన ఫ్రీదా పింటో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ నటిగా మాత్రమే కొనసాగిన ఈ బ్యూటీ నిర్మాతగా మారడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ తారలు జూలియట్ బినోచె, క్వీన్ లతీఫా, కేథరినా హార్డ్‌విక్, ఝాంగ్ జియీలతో కలిసి ఏర్పడిన ‘వియ్ డూ ఇట్ టు గేదర్’ అనే స్వచ్ఛంద సంస్థలో ఫ్రీదా కూడా ఓ భాగమయ్యారు. వీరందరితో కలిసి డాక్యుమెంటరీలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారామె. మహిళా సాధికారతను ప్రతిబింబించే డాక్యుమెంటరీలను, లఘు చిత్రాలను తీయనున్నారు. ‘‘ఇప్పటికి నా దగ్గర మూడు కథలున్నాయి. వాటిల్లో మహిళలే ప్రధాన పాత్రదారులు. రెండు సినిమాలను త్వరలో సెట్స్‌కు తీసుకువెళ్లనున్నా’’ అని ఫ్రీదా పింటో చెప్పారు. -
కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో 'ముద్దు'ముచ్చట్లు!
లాస్ ఏంజిల్స్: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' భామ మళ్లీ ప్రేమలో పడింది! హాలీవుడ్ కథానాయిక ఫ్రిదా పింటో పోలో ప్లేయర్ రోనీ బార్‌కార్డితో ప్రేమాయణం సాగిస్తున్నది. వీరిద్దరు కలిసి లిప్ టు లిప్ కిస్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో 2008లో హాలీవుడ్‌కు పరిచయమైన ఫ్రిదా పింటో.. ఆ సినిమాలో తన సహ నటుడు దేవ్ పటేల్‌తో ఆరేళ్లు డేటింగ్ చేసింది. వారి ప్రేమబంధం ఇటీవలే బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో రోనీ బార్‌కార్డితో సన్నిహితంగా మెలుగుతున్న పింటో.. అతన్ని పెనవేసుకొని పెదవితో పెదవి కలుపడం హాట్ న్యూస్‌గా మారింది. -
'డేటింగ్‌తో విడిపోయి మరోసారి కలిసి..'
ముంబయి: అస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్ర నటులు, ఒకప్పటి ప్రేమికులు ఫ్రిదా పింటో, దేవ్ పటేలో మరోసారి కలిశారు. చెరొదిక్కుకూ వెళ్లిపోయి దాదాపు ఏడాదికాలం పాటు జంటగా కనిపించని వీరు ఓ స్వచ్ఛంద కార్యక్రమం కోసం మాత్రం మరోసారి పక్కపక్కనే నవ్వులు పూయిస్తూ కనిపించారు. చిన్నపిల్లలకు విద్యనందించి అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా దేశంలోని పేదరికాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ప్రధమ్ అనే చారిటబుల్ సంస్థ చేస్తున్న కార్యక్రమం ప్రచారానికి వీరిద్దరు హాజరయ్యారు. స్లమ్ డాగ్ మిలీయనీర్ చిత్రం అనంతరం ప్రేమికులుగా మారిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ 2009లో డేటింగ్ ప్రారంభించారు. అలా ఆరేళ్లు గడిచిన తర్వాత 2014లో తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. -
జంగిల్ బుక్‌లో...
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో హాలీవుడ్లో పాగా వేసిన భారతీయ అందాల నటి ఫ్రీదా పింటో. ఇప్పటికే పలు క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించిన ఫ్రీదాను మరో అవకాశం వరించింది. వార్నర్ బ్రదర్స్ నిర్మించనున్న ‘జంగిల్ బుక్’ చిత్రం కోసం ఆమెను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యానిమేటెడ్ రూపంలో చిన్నారులను అలరించిన ఈ చిత్రం వెండితెరపైకి రానుంది. హాలీవుడ్ నటుడు ఆండీ సెర్కిస్ తొలిసారిగా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా 2016 అక్టోబర్ 6న విడుదల కానుంది. -
ఇప్పటికీ స్నేహితుడే..!
గాఢాతి గాఢంగా ప్రేమించుకుని కూడా చివరకు ఏదో ఒక కారణంతో విడిపోయేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. ఇక సెలబ్రిటీలకైతే ఇవన్నీ సర్వసాధారణం. వాళ్లకు ప్రేమలో పడటం ఎంత తేలికో...విడిపోవడం కూడా అంతే. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫ్రిదా పింటో, దేవ్ పటేల్ ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల నుంచి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ తమ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ-‘‘జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి దూరంగా పారిపోవడం పరిష్కారం కాదు. కానీ ఇప్పటికీ దేవ్ నాకు మంచి స్నేహితుడే. తను చాలా మంచి వ్యక్తి, నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అతనొకరు’’ అని చెప్పారు. -
మళ్లీ ఆస్కార్ బరిలో!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో జంట ఆస్కార్ అవార్డులు సాధించిన ఎ.ఆర్. రహమాన్ మళ్లీ ఆస్కార్ అవార్డ్ పోటీలో నిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న 87వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఒరిజినల్ స్కోర్’ విభాగంలో రహమాన్‌కి స్థానం లభించింది. హాలీవుడ్ చిత్రాలు ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘ది హండ్రెడ్-ఫుట్ జర్నీ’లతో పాటు భారతీయ సినిమా ‘కోచడయాన్’కు అందించిన మ్యూజిక్‌కి గాను రహమాన్ ఆస్కార్ నామినేషన్ బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సెన్సైస్ అధికారికంగా ప్రకటించింది. తుది పరిశీలనకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 15న ప్రకటిస్తారు. మరి.. రహమాన్‌కు నామినేషన్ దక్కుతుందా? ఒకవేళ అక్కడ పాస్ అయితే ఆస్కార్ అందుకుంటారా? అనేది తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సిందే. -
నిర్మాతగా...
‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో కెరీర్ ఆరంభించి, వరుసగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు ముంబయ్ బ్యూటీ ఫ్రీదా పింటో. గత ఆరేడేళ్లల్లో దాదాపు పదిహేను హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఫ్రీదాకి నిర్మాతగా మారాలనే కోరిక కలిగింది. నటిగా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, నిర్మాతగా మాత్రం శక్తిమంతమైన సందేశంతో కూడిన చిత్రాలను నిర్మించాలనుకుంటున్నారామె. ఇప్పటికే రెండు చిత్రాలకు సన్నాహాలు మొదలుపెట్టారు. అవి రెండూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలే కావడం విశేషం. వచ్చే ఏడాది మార్చిలో తొలి చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఫ్రీదానే నటిస్తారా లేక వేరే తారలను ఎంపిక చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆంగ్ల భాషలో రూపొందించనున్న ఈ చిత్రాలను విదేశాల్లోనే కాదు.. భారతదేశంలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఎగతాళి చేస్తారనే ఆ సినిమా చేయలేదు
బాలీవుడ్లో గోవిందాకి ఉన్న నిక్‌నేమ్ ఏంటో తెలుసా? ‘లేట్ కమర్’. ఎప్పుడైనా గోవిందా షూటింగ్‌కి తొందరగా వస్తే.. అందరూ ఆశ్చర్యపోయేవాళ్లట. దాన్నిబట్టి దర్శక, నిర్మాతలకు ఆయన ఏ స్థాయిలో చుక్కలు చూపించేవారో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే గోవిందాకు సినిమాలు తగ్గిన దాఖలాలున్నాయి. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన ‘కిల్ దిల్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గోవిందా మాట్లాడుతూ -‘‘ఒకప్పుడు నేను ఆలస్యంగా షూటింగ్స్‌కి హాజరైన మాట వాస్తవమే. అయితే, అది పొగరుతో చేసింది కాదు. అప్పట్లో ఏ దర్శక, నిర్మాత అడిగినా కాదనలేక, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేవాణ్ణి. ఎక్కువ సినిమాలు ఒప్పుకోవడంతో ఒత్తిడి ఎక్కువై, షూటింగ్‌కి సకాలంలో హాజరు కాలేకపోయేవాణ్ణి’’ అన్నారు. ఇప్పటివరకూ గోవిందా వదులుకున్న చిత్రాల్లో ‘తాళ్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కూడా ఉన్నాయి. ‘స్లమ్ డాగ్..’ని తిరస్కరించడానికి గల కారణం చెబుతూ -‘‘ఆ టైటిల్ నాకు నచ్చలేదు. టైటిల్ మార్చమని దర్శకుణ్ణి అడిగాను కూడా. అప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. అందుకని ‘స్లమ్ డాగ్ వచ్చాడు’ అని ఎగతాళి చేస్తారనిపించింది. అందుకే, ఆ సినిమా వదులుకున్నా’’ అని చెప్పారు. -
ఇక దేవ్‌తో నటించను!
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవ్ పటేల్, ఫ్రీదా పింటోకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీదా కన్నా దేవ్ దాదాపు ఐదేళ్లు చిన్నవాడు. అయినా, ప్రేమలో పడటానికి వీళ్లిద్దరూ వయసును పెద్ద విషయంగా తీసుకోలేదు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అనే విషయం పక్కన పెడితే.. ఇక ఇద్దరూ కలిసి నటించకూడదనుకుంటున్నారట. ‘‘తొలి కలయికలో రూపొందిన సినిమాలోనే కావాల్సినంత కెమిస్ట్రీ పండించేశాం. ఆ కెమిస్ట్రీని ఇక వ్యక్తిగత జీవితానికి అంకితం చేయాలనుకుంటున్నాం. అందుకే కలిసి నటించకూడదనుకున్నాం’’ అని పేర్కొన్నారు ఫ్రీదా. లాస్ ఏంజిల్స్‌లో దేవ్‌తో ఆమె సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ నగరంలో ఓ రెస్టారెంట్ ఆరంభించాలనుకుంటున్నానని ఫ్రీదా పింటో చెప్పారు. -
ఏ.ఆర్. రెహ్మాన్ ఇంటిపై దాడి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ అమెరికాలోని ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఆంగ్ల చిత్రం స్లమ్‌డాగ్ మిలియనర్ చిత్రానికి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఈ సంగీత మాంత్రికుడికి ఆ తరువాత వరుసగా హాలీవుడ్ చిత్రాల అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో ఏ.ఆర్.రెహ్మాన్, అమెరికాలో సొంతంగా నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికాలోని లాస్ ఏం జిల్స్లో అందమైన భవనం కట్టించుకున్నారు. అమెరికా వెళ్లినప్పుడల్లా ఆయన అక్కడే బస చేస్తారు. ఇప్పుడా ఇంటిపైన దుండగులు దాడికి పాల్పడి స్వల్పంగా ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఏ.ఆర్. రెహ్మాన్‌కు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎ.ఆర్. రెహ్మానే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సల్మాన్‌కి రహమాన్ లాయర్ నోటీస్..!
భారతీయ సంగీత సంచలనం ఎ.ఆర్. రహమాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసిన పాట ‘జయహో...’. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ఈ పాటకుగాను రహమాన్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరి.. ఆస్కార్ తెచ్చిపెట్టిందనే కారణంగానో ఏమో ‘జయహో’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మించాలని రహమాన్‌కి ఉందట. ఈ టైటిల్‌కి సంబంధించిన సర్వహక్కులు ఆయన దగ్గరే ఉన్నాయని సమాచారం. అందుకే సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘జయహో’ అని టైటిల్ పెట్టడం రహమాన్ని ఆగ్రహానికి గురి చేసి ఉంటుంది. ఈ టైటిల్ పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ సల్మాన్‌కి లాయర్ నోటీసు పంపించారట రహమాన్. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ముందు ‘మెంటల్’ అనే టైటిల్‌ని పెట్టారు. కానీ, ఇది సామాజిక స్పృహ ఉన్న నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి, ‘జయహో’ అయితే బాగుంటుందని ఆ టైటిల్‌ని ఖరారు చేశారు. ఇప్పుడీ టైటిల్‌కి రహమాన్ నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ మార్చక తప్పదని చెప్పొచ్చు. మరి.. ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి.