ఆ నలుగురితో కలిసి...! | Freida Pinto proud of Indian representation in Hollywood | Sakshi
Sakshi News home page

ఆ నలుగురితో కలిసి...!

Published Sun, Mar 13 2016 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

ఆ నలుగురితో కలిసి...!

ఆ నలుగురితో కలిసి...!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్  స్టార్ అయిపోయిన ఫ్రీదా పింటో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ నటిగా మాత్రమే కొనసాగిన ఈ బ్యూటీ నిర్మాతగా మారడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ తారలు జూలియట్ బినోచె, క్వీన్ లతీఫా, కేథరినా హార్డ్‌విక్, ఝాంగ్ జియీలతో కలిసి ఏర్పడిన ‘వియ్ డూ ఇట్ టు గేదర్’ అనే  స్వచ్ఛంద సంస్థలో ఫ్రీదా కూడా ఓ భాగమయ్యారు. వీరందరితో కలిసి డాక్యుమెంటరీలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారామె. మహిళా సాధికారతను ప్రతిబింబించే డాక్యుమెంటరీలను, లఘు చిత్రాలను తీయనున్నారు. ‘‘ఇప్పటికి నా దగ్గర మూడు కథలున్నాయి. వాటిల్లో మహిళలే ప్రధాన పాత్రదారులు. రెండు సినిమాలను త్వరలో సెట్స్‌కు తీసుకువెళ్లనున్నా’’ అని ఫ్రీదా పింటో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement