‘బాలీవుడ్‌లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’ | Don't have problem working in Hindi films: Freida Pinto | Sakshi
Sakshi News home page

‘బాలీవుడ్‌లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’

Published Mon, Nov 21 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

‘బాలీవుడ్‌లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’

‘బాలీవుడ్‌లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’

ముంబయి: తనకు బాలీవుడ్‌ లో పనిచేయాడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ భారత సంతతికి చెందిన అమెరికా నటి ఫ్రిదా పింటో చెప్పింది. స్లమ్‌ డాగ్‌మిలియనీర్‌ చిత్రంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆమె హిందీ చిత్రాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తాను మార్వారి చిత్రం ‘త్రిష్నా’లో సగభాగం నటించానని, ఆ భాష కూడా తనకు రాకపోయినా ఆ పని చేశానని తెలిపింది.

సినిమాలో ఎవరు నటిస్తున్నారనే దానికంటే ఆ సినిమా కథ ఎలా ఉందనేదే తనకు ముఖ్యం అని ఫ్రిదా చెప్పింది. వచ్చే ఏడాది తాను గొప్ప చిత్రంలో కనిపిస్తానని, అది కూడా స్లమ్‌ డాగ్‌మిలియనీర్‌ నిర్మాతల్లో ఒకరైన తాబ్రెజ్‌ నూరాని దర్శకత్వం వహించారని, ఆయన కూడా భారతీయుడే అని ఫ్రిదా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement