సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓటీటీ వీక్షకుల్లో అత్యధికులు హిందీ కంటెంట్‌నే వీక్షిస్తున్నట్టు తేలింది. ఆ తరువాత స్థానం ఇంగ్లీష్ కంటెంట్‌కు దక్కింది. దాదాపు 52 శాతం మంది హిందీ, 28 శాతం మంది ఇంగ్లీష్ కంటెంట్‌లకు ప్రాధాన్యతనిస్తే, 14 శాతం మంది మాత్రమే తెలుగు కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. సుప్రసిద్ధ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ (ఆర్‌ఎంటీ)‘అండర్‌స్టాండింగ్ పెయిడ్ ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ హైదరాబాద్’ అధ్యయన ఫలితాలను సోమవారం విడుదల చేసింది.
దీని ప్రకారం..36 సంవత్సరాలు దాటిన వ్యక్తులలో 55 శాతం మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ చూడాలనుకుంటుంటే 26 ఏళ్ల లోపు వ్యక్తులు ఒంటరిగా వీక్షించాలనుకుంటున్నారు. అదే విధంగా ఓటీటీ వేదికల్లో..అగ్రగామిగా 70 శాతం వినియోగదార్లను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ప్రతి రోజూ 3 గంటలకు పైగా సమయాన్ని ఓటీటీ వీక్షణలోనే సిటీజనులు గడుపుతున్నారు.
మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాలలో 10 శాతం అదనపు వ్యూయర్‌షిప్ ఉంటోంది. ఈ అధ్యయనం కోసం ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌పై చెప్పుకోదగ్గ మొత్తాన్ని ఖర్చు చేస్తున్న నెలకు రూ...60 వేలు ఆ పైన ఆర్జిస్తున్నవారిని ఎంచుకున్నామని ఆర్‌ఎంటీ సీఈఓ శ్రీకాంత్ రాజశేఖరుని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment