వినూత్న సినిమాలకు పట్టం కడుతున్న ప్రేక్షకులు
షార్ట్ స్టోరీ, ఐఎమ్‌డీబీ, రేటింగ్‌తో మంచి సినిమాల ఎంపిక
థియేటర్స్‌లో ఆడకున్నా ఇక్కడ మాత్రం హిట్..
ఒక్క సినిమా కోసం కూడా సబ్‌స్క్రిప్షన్స్
సాక్షి, సిటీబ్యూరో: చేతిలో రిమోట్ పట్టుకుంటే చాలు కళ్ల ముందు చిత్రాల వెల్లువ, సిరీస్‌ల సముద్రం.. షోల ఫ్లో.. మరి ఎంచుకోవడం ఎలా? ఎవరిని అడగాలి ఏవి చూడాలి? మన సబ్‌స్క్రిప్షన్కి ఎలా న్యాయం చేయాలి? ఇవి నగరవాసులకు రోజువారీ సందేహాలుగా మారాయి. సమాధానాల కోసం విభిన్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఓటీటీ వీక్షణలో తమదైన శైలిని ఏర్పరచుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న సినిమాల్లో కొన్ని మాత్రమే ఆసక్తికరమైన వాటిని ఎంచుకుని, చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఓటీటీ వేదికలంటే.. ఇంటి పట్టునే ఉండి కొత్త కొత్త సినిమాలను ఆస్వాదించడంతో పాటుగానే ఇప్పటి జీవన శైలిలో ఇదో నిత్యకృత్యంగా మారింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, ఆహా, సోనీ లివ్, హాట్ స్టార్, జీ స్టూడియోస్ ఇలా లెక్కకు మించి ఆదరణ పొందుతున్న ఓటీటీ వేదికల్లో సినిమా చూసే ముందు, ఆ సినిమా విశేషాలను సంక్షిప్తంగా తెలియజేసే షార్ట్ స్టోరీ (సినాప్సిస్) ఉంటుంది. సాధారణంగా ప్రేక్షకులు ఈ సమాచారంతోనే సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయానికి వస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నారు. లేదా ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో విడుదల చేస్తున్నారు. ఈ కారణంతో ఏ భాష వారైనా సరే.. అన్ని భాషల్లోని ఉత్తమ సినిమాలను చూడగలుగుతున్నారు. ఇందులో ఈ షార్ట్‌స్టోరీ డి్రస్కిప్షన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఎంటర్‌టైన్మెంట్ షోలకు కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగు ఓటీటీ ఛానల్ ‘ఆహా’ వేదికగా ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడెల్ వంటి షోలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు.
ఐఎండీబీ రేటింగ్..
విడుదలైన మూవీ ఎలా ఉందని తెలిపే సినిమాల రివ్యూలాగే ఓటీటీ సినిమాలకు కూడా ఐఎండీబీ (ఇంటర్‌నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్ ఉంది. ఇది సినిమాలు, టెలివిజన్ సిరీస్, ట్రెండింగ్ కంటెంట్ తదితరాలకు ఆన్‌లైన్ రేటింగ్‌ను అందిస్తుంది. ఈ రేటింగ్‌లో భాగంగా పదికి 9 శాతం కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 5 శాతం కన్నా తక్కువ రేటింగ్ ఉంటే మాత్రం ఆ వైపు వెళ్లట్లేదు. 7, 8 శాతం రేటింగ్ ఉంటే చూడాల్సిన సినిమాగానే ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ట్రెండింగ్‌గా మారిన కొన్ని సినిమాలను చూడటం కోసమే ఆ ఓటీటీ ఛానల్ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకుంటున్న వారూ ఉన్నారు. ఒక్కో సినిమాకు వంద మిలియన్‌ల సీయింగ్ మినిట్స్ రావడం విశేషం.
సోషల్ మీడియా ప్రమోషన్..
ఓటీటీ సినిమాలకు సంబంధించి సోషల్ మీడియా ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటీటీ సబ్‌స్రై్కబర్లకు అదే వేదిక ద్వారానే ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రమోషన్ జరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికల్లోనూ మీమ్స్, రీల్స్, ఆసక్తికర క్రియేటివ్స్‌తో ప్రచారం చేస్తున్నారు. బాగా క్లిక్ అయిన డైలాగ్, సాంగ్ తదితరాలతో ఈ ప్రచారం ఊపందుకుంటోంది. ఈ మధ్య కాలంలో గామీ, కమిటీ కుర్రాళ్లు, నిందా, ధూమం, శాకాహారి, గరుడన్, మ్యూజిక్ షాప్ మూర్తి, గోట్ లైఫ్, అహం రీబూట్, ఖాదర్ ఐజాక్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
ఓటీటీలో హిట్.. థియేటర్లో ఫట్..
ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్‌లో ప్రేక్షకాదరణ పొందలేక డిజాస్టర్లుగా నిలిచిపోతాయి. ఇది సినిమా రంగంలో సర్వసాధారణం. అయితే థియేటర్‌లో అంతంత మాత్రమే ఆడిన సినిమాలు ఓటీటీల్లో మాత్రం సూపర్ డూపర్ హిట్లుగా ఆదరణ పొందుతున్నాయి. అదేవిధంగా థియేటర్‌లో హిట్ టాక్ పొంది, అదే అంచనాలతో భారీ ధరకు కొనుగోలు చేసి ఓటీటీ వేదికల్లో విడుదల చేయగా.. ఆ అంచనాలకు చేరకపోగా, కనీసం ప్రేక్షకాదరణ పొందని సినిమాలు సైతం ఎన్నో ఉన్నాయి. థియేటర్ కల్చర్‌లో స్టార్ హీరోలు, మంచి క్యాస్టింగ్ ఉన్న సినిమాలనే ఎక్కువ ఇష్టపడే వారు జనాలు. కానీ ప్రస్తుతం ఆసక్తికర కథ, కథనం, మేకింగ్ ఉంటే చాలు. అది ఎవరి సినిమా ఐనా, చిన్న సినిమా ఐనా సరే.. విపరీతంగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment