సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక యుగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా.. అది పుట్టించిన సెలబ్రిటీల హవా రానున్న రోజుల్లో మరింత పుంజుకోనుంది. నగరంలో సైతం పెద్ద సంఖ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోషల్ బీట్, ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్ తాజాగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ గురించిన విశేషాలు వెల్లడించింది.
నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా బ్రాండ్‌లు, 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్స్– ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఇన్‌ఫ్లుయెన్సర్ ఇండస్ట్రీ రూ.5,500 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా పరిశ్రమలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ 11 శాతంగా లెక్కించింది. ఈ నివేదికను బ్రాండ్‌లకు వారి మార్కెటింగ్ అవసరంతో పాటు ఈ పరిశ్రమ ఏటా 25% పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
ఒకప్పుడు ఉచితంగానే..
దాదాపు ఆరేళ్ల క్రితం తొలిసారి నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారినప్పుడు కొన్ని బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం సంప్రదించాయి. అయితే అప్పుడు మాకు నామమాత్రంగా ఖర్చులకు తప్ప పారితోíÙకం రూపంలో ఏమీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం మంచి అమౌంట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నగరంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో రూ.లక్ష నుంచి రూ.కోటి దాకా డిమాండ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. నాకు వస్తున్న బ్రాండ్స్‌ను బట్టి తొలుత ఫుడ్ ట్రావెలర్‌గా మాత్రమే ఉన్న నేను ఇప్పుడు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో సహా అనేక బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. – అమీర్, ఇన్‌ఫ్లుయెన్సర్
ఇవి చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
Comments
Please login to add a commentAdd a comment