ameer
-
ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక యుగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా.. అది పుట్టించిన సెలబ్రిటీల హవా రానున్న రోజుల్లో మరింత పుంజుకోనుంది. నగరంలో సైతం పెద్ద సంఖ్యలో ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సోషల్ బీట్, ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ తాజాగా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ గురించిన విశేషాలు వెల్లడించింది.నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా బ్రాండ్లు, 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్స్– ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ ఇండస్ట్రీ రూ.5,500 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా పరిశ్రమలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ 11 శాతంగా లెక్కించింది. ఈ నివేదికను బ్రాండ్లకు వారి మార్కెటింగ్ అవసరంతో పాటు ఈ పరిశ్రమ ఏటా 25% పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.ఒకప్పుడు ఉచితంగానే..దాదాపు ఆరేళ్ల క్రితం తొలిసారి నేను ఇన్ఫ్లుయెన్సర్గా మారినప్పుడు కొన్ని బ్రాండ్స్ మార్కెటింగ్ కోసం సంప్రదించాయి. అయితే అప్పుడు మాకు నామమాత్రంగా ఖర్చులకు తప్ప పారితోíÙకం రూపంలో ఏమీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం మంచి అమౌంట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నగరంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో రూ.లక్ష నుంచి రూ.కోటి దాకా డిమాండ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. నాకు వస్తున్న బ్రాండ్స్‌ను బట్టి తొలుత ఫుడ్ ట్రావెలర్‌గా మాత్రమే ఉన్న నేను ఇప్పుడు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో సహా అనేక బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. – అమీర్, ఇన్ఫ్లుయెన్సర్ఇవి చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి.. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా అభినందించడంతోపాటు వారికి గుర్తింపు పత్రం, మండలి నియమావళిని అందజేశారు. అనంతరం మండలి చైర్మన్, మంత్రులతో కలసి కోదండరాం, అమీర్ అలీఖాన్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. -
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
దర్శకుడు అమీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉయిర్ తమిళుక్కు. చాందిని శ్రీధర్ హీరోయిన్గా నటించారు. అనంద్రాజ్, ఇమాన్ అన్నాచ్చి, రాజ్‌కపూర్, మారిముత్తు, సుబ్రమణిశివ, మహానది శంకర్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, శరవణ శక్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.ఎవరూ ముందుకు రావట్లేఈ మూవీ విడుదల హక్కులను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం చైన్నెలో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత ఆదంబావ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దర్శకుడు అమీర్ హీరోగా నటించడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.ఆయన అలా.. ఈయన ఇలాతనను దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనేనన్నారు. అమీర్ తనకు 40 ఏళ్ల మిత్రుడని చెప్పారు. తామిద్దం మదురైకు చెందిన వారిమేనని చెప్పారు. అమీర్ మదురైలో భాషాలా ఉండేవారని, సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాణిక్యంగా మారారని, ఇప్పుడు దావూద్ ఇబ్రహీంగా మార్చుతున్నారన్నారు. అమీర్ తమిళంపై ప్రేమతో చాలా కోల్పోయారని, ఆయన సమకాలీకుడు సీమాన్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా రాణిస్తున్నారన్నారు.ఆ అవసరం నాకు లేదుదర్శకుడు, ఈ చిత్ర కథానాయకుడు అమీర్ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ఇరైవన్ మిగ పెరియవన్ చిత్ర నిర్మాత నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటుంటే తనను అందుకు బాధ్యుడిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం నాకు లేదన్నారు. అయినా ఈ కేసు విచారణలో ఉందని, తాను ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్‌పై మండిపడ్డ నటి! -
రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా
కోలీవుడ్ నటి ఆండ్రియా ఈ బోల్డ్ అండ్ బ్యూటీ మొదట్లో గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత కథానాయకిగా తెరపైకి వచ్చారు. ఆమె పాడిన పాటలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె గాయని మాత్రమే కాదు.. డబ్బింగ్లో కూడా మెప్పించారు. పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ఆండ్రియా.. కందా నాల్ ముదల్ చిత్రం ద్వారా 2005 తెరపై కనిపించింది. హీరోయిన్గా కొనసాగుతూనే పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. కార్తీ యుగానికి ఒక్కడు చిత్రంలో ఆండ్రియా ఒక పాట పాడటమే కాదు అందులో చాలా హాట్‌గా కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. విశ్వరూపం, తడాఖా, ఉత్తమ విలన్, వడ చెన్నై, మాస్టర్ వంటి చిత్రాల్లో మెప్పించింది. నటిగా తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ.. ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకగా రాణిస్తుంది. ధనుష్ కథానాయకుడిగా నటించిన వడ చైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్‌కు భార్యగా ఆండ్రియా ఛాలెంజ్ ఉన్న పాత్రలో నటించింది. తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూసే ఆమె అందుకోసం తనను తాను మార్చుకునే పాత్రలో అందరినీ మెప్పించింది. దీని గురించి ఆండ్రియా ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ వడచైన్నె చిత్రంలో ఒక రొమాన్స్ సన్నివేశంలో నటించడానికి తానేం సిగ్గు పడలేదని తెలిపింది. షూటింగ్లో భాగంగా కెమెరాల ముందు చేస్తున్న రొమాన్స్‌కు కూడా దర్శకుడు అమీర్ చాలా సిగ్గు పడ్డారని ఆమె పేర్కొంది. ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా మిష్కిన్ దర్శకత్వంలో ఆండ్రియా ప్రధాన పాత్ర పోషించిన పిశాచి– 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది. -
సినీ దర్శకుడిపై దాడికి యత్నం..
సాక్షి, పెరంబూరు: సినీ దర్శకుడు అమీర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంఘటన కలకలానికి దారి తీసింది. దర్శకుడు అమీర్ ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా, నటుడు రజనీకాంత్ ఆ పార్టీకి అనుకూలగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవైలోని ఒక కల్యాణ మండపంలో శుక్రవారం రాజకీయ చర్చావేదిక జరిగింది. అందులో దర్శకుడు అమీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్, కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుడు తనియరసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ వ్యాఖ్యలకు బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెబుతూ కలకలం సృష్టించారు. దీంతో నిర్వాహకులు అమీర్‌ను క్షేమంగా ఆయన బస చేసిన హోటల్‌కు పంపించేశారు. శుక్రవారం రాత్రి కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకులు కారులో కరుమత్తంపట్టి ఊరికి వెళుతుండగా ముదలిప్పాలయం సమీపంలో కొందరు బీజేపీ కార్యకర్తలు ఒక కారులో దర్శకుడు అమీర్ ఉన్నట్లు భావించి దాన్ని అడ్డగించి రాళ్లు, గడ్డపారలతో దాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ అనూహ్య పరిణామానికి కారులో పయనిస్తున్న కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకులు భయ భ్రాంతులై కిందికి దిగారు. వారిలో దర్శకుడు అమీర్ లేకపోవడంతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వ్యవహారంపై కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కరుమత్తంపట్టి డీఎస్పీ జయచంద్రన్ విచారణ జరుపుతున్నారు. -
జడ్జి ఎదుటే ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కోర్టులో జడ్జి ముందు విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగర శివారు రాజేంద్రనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...బహదూర్ పురా కిషన్ బాగ్‌కు చెందిన షేక్ అమీర్ దొంగతనం , దోపిడీ కేసులలో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అయినా తీరు మారకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీగా ఉన్న షేక్ అమీర్ ఉప్పరిపల్లిలోని 8వ మెట్రో పాలిటన్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అయితే విచారిస్తున్న సమయంలో జడ్జి ముందు అమీర్ వెంట తెచ్చుకున్న బ్లేడుతో ముఖం , ఛాతిపై తీవ్రంగా గాయపరుచుకున్నాడు. రక్తస్రావం కావడంతో అమీర్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించి తిరిగి కోర్టులో హాజరు పరిచారు. మెరుగైన వైద్యం కల్పించాలని జడ్జి ఆదేశించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అమీర్‌పై రెండు దొంగతనం, నాలుగు దోపిడీ కేసులతో పాటు పీడీ యాక్టు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న అమీర్ పై మరలా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అమీర్, రియాజ్‌లకు స్వర్ణాలు
-
అమీర్, రియాజ్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 9 స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. అండర్–18 విభాగంలో మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ జైన్, మొహమ్మద్ రియాజ్.. అండర్–17 కేటగిరీలో మదీహా సుల్తానా, మోసిన్, సయ్యద్ అఫ్రోజ్, షేక్ మజీద్, షేక్ అమీర్, పాషా పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు. -
ఆయనకు ఆ హీరోయిన్లే కావాలట!
మార్కెట్‌ను చేజార్చుకున్న నటీనటులు, దర్శకులు మళ్లీ పుంజుకోవాలంటే వారికి ఒక బలమైన ఆధారం అవసరం అవుతుంది. అది హీరోయిన్ కావచ్చు మరెవరైనా కావచ్చు. ఆ మధ్య నటుడు జీవా వరుస అపజయాలతో సతమతం అయ్యారు. ఎలాగైనా కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న దృఢ నిర్ణయంతో చేసిన చిత్రం తిరునాళ్. ఈ చిత్రంలో తనకు జంటగా నయనతారను కోరి మరీ ఎంపిక చేసుకున్నారు. అందుకు కారణం ఆమె క్రేజ్‌ను వాడుకోవాలన్న ప్రయత్నమేనన్న ప్రచారం జరిగింది. ఏదైతేనేం జీవా తిరునాళ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. తదుపరి కవలై వేండామ్ చిత్రంలో కూడా స్టార్ నాయకి కాజల్‌అగర్వాల్‌ను ఎంచుకున్నారు. జీవా మిత్రుడైన ఆర్యకు కూడా అలాంటి టాప్ హీరోయిన్ అవసరం అయ్యారిప్పుడు. ఈయనకు ఇటీవల సరైన హిట్స్ లేవన్నది గమనార్హం. ప్రస్తుతం కడంబన్ అనే చిత్రంలో నటిస్తున్న ఆర్య తదుపరి అమీర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే దర్శకుడిగా అమీర్ మార్కెట్ డౌన్లో ఉంది. ఆదిభగవాన్ చిత్రం తరువాత ఆయన మరో చిత్రం చేయలేదు. కథానాయకుడిగా మొదలెట్టిన పేరంబు కొండ పెరియవర్గళే చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టి ఆర్య హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఆర్యకు జంటగా నయనతార, అనుష్క, తమన్నాలలో ఒకరిని ఎంపిక చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. అయితే వారు అనుకుంటున్న హీరోయిన్లు అందరూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో హీరోయిన్ల హీరోగా ప్రచారం పొందిన ఆర్యతో నటించడానికి ఈ ముద్దుగుమ్మల్లో ఎవరు ముందుకొస్తారన్నది ఆసక్తిగా మారింది. -
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ
-
'అసహనం ఎక్కడుంది..?' : వర్మ
ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాల మీదే స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లకు పని చెప్పాడు. ఎక్కువగా సినీ తారాలను మాత్రమే టార్గెట్ చేసే వర్మ, ఈ సారి మాత్రం అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న రచయితలు, మేధావులు, సామాజిక వేత్తలను తన ట్వీట్లతో ప్రశ్నించాడు. దేశంలో అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావటం లేదంటూ తనదైన స్టైల్లో స్పందించాడు. 'హిందూ దేశంగా పేరున్న భారత్‌లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. మరి అసహనం ఎక్కడుందో నాకు అర్ధం కావటం లేదు..? ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్ స్టార్లు అయ్యారంటేనే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని ప్రూవ్ అవుతోంది. సెలబ్రిటీలుగా పరిగణించబడుతున్న, ఎవరైతే అసహనం గురించి మాట్లాడుతున్నారో.. వారు విమర్శిస్తున్న దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్నారు. కొన్ని ఘటనల మూలంగా అసహనం ఉన్నట్టుగా ప్రకటించకూడదు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. If Aamir,Sharuk and Salman the three biggest stars of the Hindu country "India" are Muslims, I don't understand where intolerance is ? — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 In a predominantly Hindu country,if 3 Muslims can become the biggest iconic super stars that itself proves the majority aren't intolerant — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 Some celebs complaining about Intolerance should be the last ones to complain becos they became celebs in a so called intolerant country — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 Isolated incidents cant be taken as sign of intolerance and the super stardom of 3 Muslims is proof enough of the vast majority's tolerance — Ram Gopal Varma (@RGVzoomin) November 24, 2015 -
ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులు
-
ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులు
చిలకలగూడ (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని వారాసిగూడ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్(4), అమీర్(2), తమ ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం కావడంతో వారి కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో చిన్నారుల తల్లి రేష్మాబేగం ఆదివారం సాయంత్రం చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
గంటలో1450 గుంజీలు తీసిన అమీర్
హైదరాబాద్ : కొడుకుపై తండ్రికున్న వాత్సల్యం ఇది. కొడుకు కోసం తండ్రి గంటలో 1450 గుంజీలు తీశాడు. కుమారుడి చికిత్స కోసం తండ్రి పడరాని పాట్లు పడ్డాడు. కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోంది..... చికిత్స చేయడానికి తగినంత ఆర్థిక స్థోమత లేదు. దాంతో ఏం చేయాలా అని ఆ పేద తండ్రి ఆలోచించాడు. తన కుటుంబ దయనీయ స్థితిని చాటి చెప్పేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. గుంజీలు తీసి రికార్డు నెలకొల్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడు.సికింద్రబాద్ ఆర్పీ రోడ్డులో గుజరాతీ ఉన్నత పాఠశాలలో.. అమీర్ గంటలో 1450 గుంజీలు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే మల్కాజ్గిరి వాణీ నగర్లో ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తున్న అమీర్ .. ఏడేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల పెద్ద కుమారుడు అమన్ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. కాళ్ళు చచ్చు బడిపోయాయని, చికిత్స చేయించేందుకు స్థోమత లేకపోవడంతో ఈ రికార్డుకు ప్రయత్నించినట్లు అమీర్ తెలిపారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు దీన్ని పంపనున్నట్లు వెల్లడించాడు. దీని వల్ల డబ్బులు వస్తే తన కుమారుడి వైద్య ఖర్చుల కోసం ఉపయోగపడతాయని ఆ తండ్రి ఆశగా చెప్పాడు. -
రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలని...
చెన్నై: సూపర్ స్టార్ ముఖ్యమంత్రి పదవి చేపడితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి అని సినీ దర్శకుడు అమీర్ విజ్క్షప్తి చేశారు. చెన్నైలో ఆదివారం జరిగిన 'లింగ' ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలి. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయాల్లోకి వస్తారని కోరుకుంటున్నాం అని అమీర్ అన్నారు. 'లింగ' టైటిల్ తో ధనుష్ తో ఓ సినిమాను రూపొందించాలని అమీర్ అనుకున్నారు. కాని రజనీ సినిమా కోసం లింగ టైటిల్ ను అమీర్ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని లింగ దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పిలుపునిచ్చారు.