
అమీర్, రియాజ్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 9 స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. అండర్–18 విభాగంలో మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ జైన్, మొహమ్మద్ రియాజ్.. అండర్–17 కేటగిరీలో మదీహా సుల్తానా, మోసిన్, సయ్యద్ అఫ్రోజ్, షేక్ మజీద్, షేక్ అమీర్, పాషా పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు.