
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్‌తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్‌సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది.
కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు.
అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు.
చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట‍్రోల్స్‌పై మండిపడ్డ నటి!
Comments
Please login to add a commentAdd a comment