Drugs Case
-
'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే
సౌత్ ఇండియా ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కే.పీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. దీంతో చిత్ర పరిశ్రమలో కూడా తీవ్రమైన అలజడి నెలకొంది. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కే.పీ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడని, అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. మూడున్నరేళ్ల పాటు సినీమా రంగంలో ఉన్నాడు. ఇందులో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఆయన ఎంచుకున్నారు. గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. హైదరాబాద్ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశారు.అయితే, పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా గతంలో పోలీసులు తెలిపారు. బీటెక్ చదివిన చౌదరి గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నాయి. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. -
హేమ డ్రగ్స్ కేసుపై కర్ణాటక హైకోర్టు స్టే
-
విశాఖ డ్రగ్స్ కేసుపై పచ్చ మంద కిక్కురు మనదేం?
నిజం నిలకడ మీద కానీ తెలియదంటారు. రాజకీయ నాయకులు కొంతమందికి ఈ విషయం బాగా తెలిసినట్టు ఉంది. ఈ ధైర్యంతోనే వాళ్లు వదంతులు, అసత్యాలు, అర్ధ సత్యాలు ప్రచారం చేసి సఫలం అవుతుంటారు. ఎక్కువసార్లు జరిగేది ఇదే. అబద్ధాలు వ్యాప్తి చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సరితూగ గలిగే వాళ్లు ఇంకొకరు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతోనే పోటీపడుతున్నారు. ఏ ఘటనలోనైనా తమవారి తప్పుందని తెలిస్తే దాన్ని వెంటనే ప్రత్యర్దిపైకి నెట్టేయడం వీరి శైలి. అనుకూల మీడియా ఒకటి వీరికి అండగా నిలుస్తోది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండనే చందమీ పచ్చ మీడియా. వందల అబద్దాలు వ్యాప్తి చేయడంలో వీరిదో రికార్డు. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు అబద్దాల విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కూడా ఆయన అసత్యాల ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా తీర్చిదిద్దినట్లున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం 2024 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఓడరేవులో ఒక నౌకలో మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీ బ్రెజిల్ నుంచి వీటిని దిగుమతి చేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది కూడా. ఈ వార్త వచ్చిందో లేదో.. టీడీపీ వెంటనే రంగంలో దిగిపోయింది ఆ డ్రగ్స్ వైసీపీ వారివేనని ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై టీడీపీ చేసిన ట్వీట్లు చూస్తే... ఇంత నీచంగా కూడా ప్రచారం చేయవచ్చా? అనిపించకతప్పదు. వైసీపీ పేరును వక్రీకరిస్తూ ‘యువజన కొకైన్ పార్టీ’ రాసింది. అక్కడితో ఆగలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన సమీప బంధువులు వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జీ సజ్జల భార్గవ రెడ్డిల ఫోటోలు పెట్టి మరీ దుష్ప్రచారం చేసింది. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి’’ అని, ‘‘నాడు తాలిబన్ టు తాడేపల్లి. 2021 విజయవాడలో రూ.21 వేల కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ తాడేపల్లి.. 2024విశాఖలో రూ.1.60 లక్ష కోట్ల కొకెన్’’ అంటూ ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవమని టీడీపీకి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లకు కూడా తెలుసు. రాజకీయం కోసం ఏమైనా చేయాలన్నది వారి థియరీ. ఎన్ని అబద్దాలైనా ఆడవచ్చన్నది వారి అభిమతం. అదే ప్రకారం వారితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని ఎల్లో మీడియాగా మార్చేసి, ఎలాంటి నీతి,విలువలు లేకుండా తెలుగుదేశం పక్షాన పని చేయించారు. పచ్చి అబద్దాలైనా, ఏమో నిజం ఉందేమో! అన్నట్లుగా వీరు కథలు ఇచ్చేస్తుంటారు. ఇవి చాలవన్నట్లుగా సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తుంటారు.ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా వీరి ట్రెండ్ ఇదే. విశాఖ డ్రగ్స్ పై చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా పోటీ పడి అబద్దపు ప్రసంగాలు చేశారు. పవన్ కళ్యాణ్ దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి విశాఖకు హెరాయిన్ వచ్చిందని ఉపన్యాసం చేస్తే, బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిందని చెప్పేశారు. తీరా సీబీఐ విచారణలో తేలింది ఏమిటంటే సంబంధిత కంటైనర్‌లో డ్రగ్స్ లేవని!! దీనిపై టీడీపీ ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ కిక్కురుమంటే ఒట్టు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సీబీఐ కూడా ఎన్నికలకు ముందు మౌనం పాటించి, ఎన్నికలైన ఆరు నెలలకు తాపీగా విశాఖ పోర్టులోకి వచ్చింది డ్రగ్స్ కాదని తెలిపింది. ఈ విషయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలిచి ఒక ప్లాన్ ప్రకారం ఇలాంటి కుట్రలు చేసి ఉండవచ్చన్న డౌట్ చాలా మందిలో ఉంది. అదే క్రమంలో సీబీఐ కూడా పని చేసిందేమో అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చాక అయినా, ఇంత నీచమైన ఆరోపణలు చేశాం కదా..వాటిని ఉపసంహరించుకుంటున్నాం..అని కూటమి నేతలు ఎక్కడా చెప్పరు.అప్పట్లో ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంస్థ టీడీపీకి సంబంధించిన వారిదని వార్తలు వచ్చాయి. దాన్ని తోసిపుచ్చడానికి ఆ కంపెనీ యజమాని సోదరుడు వైసీపీ వాడంటూ మరో వాదనను టీడీపీ మీడియా వారు తెరపైకి తెచ్చారు. అంతేకాదు. సీబీఐ కోరిక మేరకు వారికి సహకరించడానికి అక్కడకు రాష్ట్ర పోలీసు అధికారులు వెళ్లారు. వెంటనే ఎల్లో మీడియా డ్రగ్స్ కేసును మేనేజ్ చేయడానికే వెళ్లారని కల్పిత కథనాలు వండేశారు. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో అబద్దపు ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిపై పెడుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో టీడీపీ, జనసేనలు చేసిన దారుణమైన అసత్యాలపై ఎంత తీవ్రమైన కేసులు పెట్టి ఉండాలో! కాని అప్పట్లో అలా చేయలేదు. మరీ అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఎవరిపైన అయినా ఒకటి, అరా కేసులు పెడితే, వెంటనే మీడియాపై దాడి అంటూ విపరీతమైన ప్రచారం చేసేవారు. అదే ఇప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న దాడిని సమర్థిస్తూ, వారిని సైకోలుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఘోరమైన పోస్టులు పెట్టిందని వైసీపీ వారు ఆధార సహితంగా పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు తాము కోర్టులలో ప్రైవేటు కేసులు వేస్తున్నామని చెప్పారు. రాజకీయాలలో అసత్యాలే ప్రామాణికంగా పని చేసుకుంటూ రాజకీయ నేతలు వెళితే సమాజం కూడా అలాగే తయారవుతుంది. ప్రస్తుతం ఏపీలో సమాజం అటువైపు పయనిస్తోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
దేశంలోకి విభిన్న మార్గాల ద్వారా అక్రమంగా రవాణా చేయాలని చూసిన 7,348.68 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2023-24లో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వివరాలు వెల్లడించింది. 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. బంగారంతోపాటు వెండి, డ్రగ్స్, విలువైన లోహాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు తరచు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.2023-24 లెక్కల ప్రకారం డీఆర్ఐ తెలిపిన వివరాల కింది విధంగా ఉన్నాయి.8,223.61 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి 109 కేసులు నమోదయ్యాయి.రూ.974.78 కోట్ల విలువ చేసే 107.31 కిలోల కొకైన్రూ.365 కోట్ల విలువ చేసే 48.74 కిలోల హెరాయిన్రూ.275 కోట్ల విలువ చేసే 136 కిలోల మెథాంఫెటమైన్236 కిలోల మెఫెడ్రోన్రూ.21 కోట్ల విలువ చేసే 7,348.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది.విమాన మార్గం ద్వారా కొకైన్ అక్రమ రవాణా పెరుగుతోంది. కొకైన్కు సంబంధించి 2022-23లో 21 కేసుల నమోదవ్వగా 2023-24లో అది 47కు పెరిగింది.ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ సరఫరా అధికమవుతోంది.కస్టమ్స్ అధికారులకు సహకరిస్తూ..గతంలో కంటే బంగారం అక్రమ తరలింపు ఈసారి పెరిగిందని అధికారులు తెలిపారు. 2023-24లో డీఆర్ఐ 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అందులో భూమార్గం 55 శాతం, వాయుమార్గం 36 శాతం కట్టడి చేసినట్లు చెప్పింది. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం అదనంగా 4,869.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!స్మగ్లింగ్ కోసం సిండికేట్లు‘ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఇండియాకు వచ్చే సరిహద్దు మార్గాల్లో నిత్యం తనిఖీ నిర్వహించి బంగారం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తున్నాం. ఇటీవల కొన్ని ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక ప్రదేశాలుగా మారాయి. ఇండియాలో బంగారం స్మగ్లింగ్ కోసం సిండికేట్లను నియమించుకుంటున్నారు. విదేశీ పౌరులు, విదేశాలకు వెళ్లొస్తున్న కుటుంబాలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగమవుతున్నారు. చాలాచోట్ల విమానాశ్రయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అక్రమ రవాణాలో సహకరిస్తున్నారు’ అని డీఆర్ఐ నివేదిక తెలిపింది. -
ప్రచారం పీక్ దర్యాప్తు వీక్
సాక్షి, హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ పెద్దలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. మత్తుపదార్థాలను కట్టడి చేస్తున్నామంటూ అధికారులు భారీగా ప్రచారం చేస్తుండగా కేసుల దర్యాప్తు పేల వంగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా వరకు వీగిపోవడమే అందుకు నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన 226 కేసులకుగాను కేవలం 39 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి. అంటే ఆయా కేసుల్లో నేర నిరూపణ 17 శాతంగానే ఉంది. ఇక ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్డీపీఎస్ చట్టం కింద గత పదేళ్లలో నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ అత్యంత తక్కువగా 0.85 శాతంగా ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఆధారాల సేకరణలో లోపాలే శాపాలై.. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసుల నమోదు, మత్తుపదార్థాల స్వాధీనం, కోర్టుకు ఆధారాల సమర్పణ తదితర అంశాల్లో దర్యాప్తు అధికారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్లే ఎక్కువగా కేసులు వీగిపోతున్నాయి. చాలా వరకు ఎన్డీపీఎస్ కేసులు కనీసం విచారణ దశకు కూడా రాకుండానే సాంకేతిక కారణాలతో కోర్టులు కొట్టేస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. గంజాయి, డ్రగ్స్ సరఫరా సమాచారం అందాక దర్యాప్తు అధికారులు తన పై అధికారికి సమాచారం ఇవ్వడంతోపాటు వారి నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు తీసుకోవాలి. ఆ తర్వాత తనిఖీ చేసేందుకు వెళ్లే సమయంలో ఇద్దరు పంచ్ విట్నెస్లను వెంట తీసుకెళ్లాలి. అందులో కనీసం ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. ఆ తర్వాత ఎవరి వద్ద తనిఖీ చేయడానికి వెళ్లారో ఆ వ్యక్తికి సదరు అధికారులు ఆప్షన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం..దర్యాప్తు అధికారులను అవతలి వ్యక్తులు తనిఖీ చేయవచ్చు (అధికారులే మత్తుపదార్థాలను తెచ్చి పెట్టారన్న సందేహాలకు తావు లేకుండా). ఆపై తనిఖీలను అధికారులు ప్రారంభించాలి. నూతన చట్టాల ప్రకారం ఈ వ్యవహారాన్ని వీడియో తీయాలి. సాంకేతిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోకపోయినా.. కొన్నిసార్లు పంచ్ విట్నెస్లు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న వారితోనే పంచనామా చేయడం.. వారు సాక్ష్యం చెప్పడంలో తడబడటం వంటి కారణాలతో కేసులు నిలబడట్లేదు. సోదాల్లో దొరికిన మత్తుపదార్థాల నమూనాల సేకరణ, వాటికి సంఖ్య కేటాయింపు సైతం ఈ కేసుల్లో కీలకంకాగా అందులోనూ దర్యాప్తు అధికారులకు అవగాహన లేక కేసులు నిలబడట్లేదు.శిక్షలు పెంచేలా శిక్షణపై దృష్టి.. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటంతోపాటు ఆధారాల సేకరణపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు శిక్షణా తరగతుల నిర్వహణపై దృష్టిపెట్టారు. టీజీఏఎన్‌బీ ఆధ్వర్యంలో పోలీ స్, ఎక్సైజ్, ప్రాసిక్యూషన్, రైల్వే శాఖ అధికారులకు సైతం ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 22,654 సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు టీజీఏఎన్‌బీ అధికారులుతెలిపారు. -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
హైదరాబాద్ లో సింథటిక్ డ్రగ్స్
-
మీడియా ముసుగు.. డ్రగ్స్ మాఫియా చేసే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అని కూటమి సర్కార్‌ను వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్ దందాలో కేసులకు సంబంధించి సాక్ష్యాలను, కీలక విషయాలను వెల్లడించింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ వివరాలను వెల్లడించింది.💣 Exposed 💣మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS— YSR Congress Party (@YSRCParty) October 24, 2024 💣 Truth Bomb 💣దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. గుట్టు చప్పుడు కాకుండా 13 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్ని భ్రష్టుపట్టిస్తున్న ఎల్లో డ్రగ్స్ మాఫియా#YellowMediaDrugsMafia pic.twitter.com/Ye7WqRehBY— YSR Congress Party (@YSRCParty) October 24, 2024 గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు.. ఇలాంటి వాడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడితే.. తిరుమల పవిత్రతని కాపాడతాడా?#YellowMediaDrugsMafia pic.twitter.com/zzMtTBPZMn— YSR Congress Party (@YSRCParty) October 24, 2024అయితే, రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది.ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు.దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్‌కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
డ్రగ్స్ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది: మోదీ
ముంబై:ఇటీవల ఢిల్లీలో పట్టుబడ్డ రూ. 500 కోట్ల విలువైన డ్రగ్స్ కేసు రాజకీయ మలుపు తిరుగుతోంది. డ్రగ్స్‌వ్యవహారంలో కాంగ్రెస్ నేతగా ఆరోపిస్తున్న తుషార్ గోయల్ అరెస్ట్ కావడమే అందుకు ప్రధాన కారణంగా మారింది. దీంతో డ్రగ్స్ కేసు కాస్తా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్‌గా మారింది. తాజాగా ఈ కేసును ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు.దేశంలోని యువతను కాంగ్రెస్.. మాదక ద్రవ్యాల వాడకం వైపు నెట్టేస్తోందని మండిపడ్డారు. దీని ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగించాలని పార్టీ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోదీ ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. ఈ డ్రగ్స్ రాకెట్లో ప్రధాన నిందితుడు కాంగ్రెస్ నేత. యువతను డ్రగ్స్ వైపు నెట్టాలని, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది’ అని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు ఏకం కావాలని ఆయన కోరారు. ‘మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుందని కాంగ్రెస్ భయపడుతోంది. భారతదేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటోందో ప్రజలు అందరూ చూడగలరు* అని ఆయన పేర్కొన్నారు.చదవండి: Haryana: అభ్యర్థి చొక్కా చించిన మాజీ ఎమ్మెల్యేకాగా అక్టోబర్ 2న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని ఒక గోడౌన్లో ఢిల్లీ పోలీసులు దాడులు చేసి 560 కిలోగ్రాముల కొకైన్, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 5,620 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్‌తో సంబంధాలున్న తుషార్ గోయల్‌ను గుర్తించారు. అయితే గోయల్‌తో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఖండించగా.. అతను గతంలో 2022 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌కు ఆర్టీఐ సెల్ ఛైర్మన్‌గా పనిచేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తేలిసింది. -
ఢిల్లీలో డ్రగ్స్.. రూ. 2,000 కోట్ల కొకైన్ స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 2వేల కోట్ల విలువైన 565 కిలోల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు 565 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.2000కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భారీ కొకైన్ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే, ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఆప్ఘన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిద్దరినీ విచారించగా.. తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రగ్స్ విషయంలో మరింత అప్రతమయ్యారు. Delhi Police busted an international drug syndicate and seized more than 560 kgs of cocaine. 4 people arrested. The cocaine is worth more than Rs 2000 Crores in the international market. Narco-terror angle being investigated: Delhi Police Special Cell— ANI (@ANI) October 2, 2024ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు -
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్
డ్రగ్స్ కేసు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో రేవ్ పార్టీలో నటి హేమ దొరికింది. ఈమెని పోలీసులు అరెస్ట్ చేసి కొన్నిరోజులు జైల్లో కూడా ఉంచారు. ఈమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. గతంలో పలుమార్లు ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయమై ఎప్పటికప్పుడు కేసులు నడిచాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)కేసు ఏంటి?ఐతే, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కాళిదాసు తదితర సినిమాల్లో నటించిన అభిషేక్.. 2012 డిసెంబరులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాసులు అనే వ్యక్తితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో పోలీసులు చెక్ చేయగా 10 ప్యాకెట్ల కొకైన్ దొరికింది. దీంతో అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అప్పట్లోనే బెయిల్ వచ్చింది కానీ బయటకొచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి గోవాకు మకాం మార్చాడు. రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టారు.అంతా బాగానే ఉంది కానీ డ్రగ్స్ కేసులో కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన తెలంగాణ న్యాబ్ పోలీసులు.. గోవాలో అభిషేక్‌ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇతడి స్వస్థలం ఉత్తరప్రదేశ్. కానీ తెలుగు సినిమాల్లో నటుడిగా బాగా ఫేమస్ అయ్యాడు.(ఇదీ చదవండి: హీరో పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని) -
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
దయచేసి ఆ ఒక్క తప్పు చేయకండి!
-
మీ దగ్గరికే వస్తా టెస్టులు చేయించండి.. హేమ కొత్త వీడియో
నటి హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన వైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి సిద్ధమని మీడియాకి రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన అంతా బయటపెట్టింది.హేమ కొత్త వీడియోకొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ దొరికింది. కానీ ఆ టైంలో తాను వేరే చోట ఉన్నానని బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే హేమ అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని పోలీసులు తేల్చారు. కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమని అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఈమెపై ఈ మధ్య మరోసారి డ్రగ్స్ పాజిటివ్ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందిస్తూ హేమ కొత్త వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)హేమ ఏం చెప్పింది?'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ని తీసుకొచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి''ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అని హేమ దాదాపు 6 నిమిషాల వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితీ రావ్ హైదరీ) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
-
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత.. యువతకు సీపీ వార్నింగ్..
-
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ
కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ, పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశమైంది. దాదాపు 86 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. ఇందులో హేమ కూడా ఒకరని చెప్పిన పోలీసులు.. రెండుసార్లు నోటీసులు పంపించారు. ఎంతకీ రాకపోవడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా హేమ మరో వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)బెంగళూరు రేవ్ పార్టీ విషయమై మాట్లాడుతూ.. తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.మరి హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే.. పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే.. ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్ట్‌లకైనా రెడీ అయిన వీడియో పెట్టింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందోనని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
కోటి రూపాయల డ్రగ్స్ సీజ్..
-
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
-
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ అరెస్ట్ 11 కోట్ల డ్రగ్స్ సీజ్
-
నార్సింగి డ్రగ్స్ కేసులో వీఐపీలు!
సాక్షి, హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైజీరియా డ్రగ్ పెడ్లర్ల నుంచి మరో 30 మంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకొని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్రికా దేశాల నుంచి మాదక ద్రవ్యాలను గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను నార్సింగి, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు ఈనెల 16న పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుల నుంచి రూ.కోట్లు విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ పెడ్లర్లు అనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడేషోలాలతో పాటు బెంగళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, బోరబండకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్, కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లను అరెస్టు చేశారు. సెల్ఫోన్లలో డేటాతో.. అరెస్టు సమయంలో నిందితుల సెల్ఫోన్లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వాట్సాప్ చాట్స్, సందేశాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు. దీంతో మరో 30 మంది వీఐపీల పేర్లు బయటికి వచ్చాయి. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారస్తులుగా గుర్తించారు. దీంతో వీరందరికీ నోటీసులు ఇచ్చి, విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అమన్‌తో సహా మరో 20 మంది.. డ్రగ్ పెడ్లర్ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ వచి్చంది. దీంతో నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్‌తో పాటు ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చ»ౌలికి చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్ కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్, గచి్చబౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులు ఎబుకా సుజీ, ఫ్రాంక్లిన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. బండ్లగూడ నుంచే చెల్లింపులు.. డ్రగ్స్ కింగ్‌పిన్ ఎబుకా సుజీ నుంచి బ్లెస్సింగ్‌కు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ఈమె విమానాలు, రైళ్లు, బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను రవాణా చేస్తోంది. ఇప్పటివరకు బ్లెస్సింగ్ 20 సార్లు నగరానికి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చింది. ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ వీటిని ఏపీలో రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాల్లో వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇందుకుగాను గౌతమ్‌కు నైజీరియన్ నుంచి 9 నెలల్లో రూ.10 లక్షల కమీషన్ అందిందని, బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా నగదు చెల్లింపులు జరిగినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. -
నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు!
హైదరాబాద్, సాక్షి: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ సహా పలువురిని జులై 15వ తేదీన జాయింట్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. వాళ్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ టైంలో 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల యాజమానులు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సెలబ్రిటీల సంఖ్య 50కి చేరినట్లయ్యింది. -
బాబు.. విశాఖలో బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు సంగతేంటి?: మాజీ మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సమయంలో విశాఖపోర్టుకు అక్రమంగా బ్రెజిల్ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలతో కూడిన కంటెయినర్ కేసు ఏమైందో ప్రభుత్వం విచారణ చేపట్టాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుమారు 25 కిలోల చొప్పున వేయి బ్యాగులను కంటెయినర్లో మాదకద్రవ్యాలతో కూడి సరుకు విశాఖ పోర్టుకు రాగా... కేంద్ర దర్యాప్తుసంస్ధ సీబీఐతో పాటు ఇంటర్‌పోల్ పట్టుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు.గతంలో మేం అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని.... ఆరోపణలు కూడా చేశారని... అధికార పక్షంతో పాటు విపక్షంలో ఉన్నవారు కూడా వీటిపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారన్నారు. ఈ వ్యవహరంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్ట్స్పోర్ట్ లిమిటెడ్ సంస్ధ దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు.ఈ మొత్తం వ్యవహారంపై ఒకవైపు అధికారులు విచారణ చేపట్టడంతో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలు దీనిపై పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేసారు. రూ.25వేల కోట్లకు సంబంధించిన వ్యవహారంపై వాస్తవాలు ఏమిటి? ఇందులో ఎవరిపాత్ర ఉంది? నిందితులను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ విచారణలో ఆ ఆరోపణలు వాస్తవం కాకపోతే విశాఖపట్నం క్లీన్ ఇమేజ్ నిలబడుతుందన్నారు.దేశంలో ఎక్కువగా డ్రగ్స్ దిగుమతి అయిన చరిత్ర గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న పోర్టులకు ఉంద తప్ప.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంచి ఘటనలు జరగలేదన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడరాదన్నారు. విశాఖలో తొలిసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు... అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్ధానికనాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్లమంటు సభ్యులైతే పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి విచారణకు డిమాండ్ చేయాలని సూచించారు. ఈ విషయంలో ఏ పార్టీ మీద బురదజల్లడం లేదని... నిజంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు విశాఖపట్నంతో పాటు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మాదకద్రవ్యాల దిగుమతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.మరోవైపు ఎన్నికలు అయిన దగ్గర నుంచి భూఆక్రమణలు జరిగాయని కొందరు, మరికొందరైతే దసపల్లా భూముల గురించి దోపిడీకి గురయ్యాయంటూ వార్తలు వచ్చిన విషయాన్ని బొత్స ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో గతంలో హుద్‌హుద్ తుఫాను తర్వాత వచ్చిన భూకుంభకోణాన్ని ప్రస్తావించారు. హుథ్‌హుథ్ తుఫాను వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే భూ కుంభకోణంపై పరస్పర ఆరోపణలు చేసుకోగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిపై సిట్ ఏర్పాటు చేసి ఏడాది పాటు దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత అనేకరకాల పరిణామాలు చోటుచేసుకుని.. దర్యాప్తునకు సంబంధించిన టెర్మ్స్ ఆఫ్ కండిషన్స్ మార్పు చేసి 2004 నుంచి కూడా విశాఖపట్నం ప్రాంతంలో జరిగిన భూ ఆక్రమణలు గురించి కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించారని తెలిపారు. అంటే 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులగా మేం ఉన్న నేపధ్యంలో ఆ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారన్నారు.అయితే ఇప్పుడు విశాఖలో భూఆక్రమణలు అంశం మరలా తెరపైకివచ్చిన నేపధ్యంలో.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో నియమించిన సిట్ దర్యాప్తును మరలా కొనసాగించాలన్నారు. అలా చేస్తే ఎవరు తప్పు చేశారో తేలిపోతుందని.. అప్పుడే ఉత్తరాంధ్రా ప్రజలకు దొర ఎవరో, దొంగెవరో తెలుస్తుందని బొత్స స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం దేనిమీదైనా విచారణ చేసుకోవచ్చన్నారు. అప్పుడు ఈ సందిగ్దతకు తావులేకుండా తప్పుచేసినవాళ్లెవరో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి... విచారణకు ఆదేశించుకోవచ్చన్నారు. తప్పుచేసినవారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారని.. లేని పక్షంలో ఒకవేళ తప్పుడు అభియోగాలైతే కోర్చుల్లో తేల్చుకుంటారని స్పష్టం చేసారు. అలా కాకుండా పదే పదే మీడియా ముందుకు వచ్చి భూముల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. -
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు. -
డ్రగ్స్ కేసులో కీలక మలుపు గుర్తించిన ఏడు పబ్బులు, రకుల్ తమ్ముని పాత్ర..
-
డ్రగ్స్ కేసులో 18 మందికి రిమాండ్
మణికొండ: నైజీరియా నుంచి గోవా, ముంబై, ఢిల్లీల మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న 18 మంది సభ్యుల ముఠాను నార్సింగి, రాజేంద్రనగర్ డివిజన్ ఎస్ఓటీ, మాదకద్రవ్యాల నిరోధక శాఖల పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సోమవారం వారిని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్, విశాల్‌నగర్ కాలనీలోని జెనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువ చేసే 199.10 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, మంగళవారం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిలో ఆరుగురికి పాజిటివ్ అని వచి్చంది. అనంతరం నిందితులను రాజేంద్రనగర్‌లోని కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్స్ సరఫరా దారులు వీరే... డ్రగ్స్ కేసులో ఏ1గా అనౌహ బ్లెస్సింగ్ అనే మహిళ, ఏ2గా నిజాం కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతున్న అజీజ్ నోహీమ్ అడేషోలా, ఏ3గా బెంగుళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, ఏ4గా బోరబండకు చెందిన సానబోయిన వరుణ్‌కుమార్, ఏ5గా ఈవెంట్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారని, వీరంతా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా, సినీహీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చబౌలికి చెందిన యశ్వంత్ గాడె, జూబ్లీహిల్స్‌కు చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ ధావన్, గచి్చ»ౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారని తెలిపారు. వీరి పేర్లను ఏ6 నుంచి ఏ18 వరకు కేసులో పొందుపరిచారు. వీరి నుంచి 10 సెల్ ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఓ పాస్‌పోర్టును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. -
కోర్టు బోనులో రకుల్ తమ్ముడు..
-
సాక్షి చేతిలో డ్రగ్స్ కేసు FIR 18 మందిలో రకుల్ తమ్ముడి పేరు
-
Hyderabad Drugs case: నాడు రకుల్... నేడు అమన్!
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గతంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం ఆరోపణలపై అనేక మంది సినీ రంగానికి చెందిన వాళ్లు అరెస్టు అయ్యారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై ఈ తరహా ఆరోపణలే రాగా...తాజాగా సోమవారం ఆమె సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలడంతో అరెస్టు అయ్యాడు. ఇతడు మాదకద్రవ్యాలు ఖరీదు చేసిన పెడ్లర్స్ ముఠాలో అనేక మందిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు ప్రకటించారు. పలువురిపై గతంలోనూ కేసులు...సోమవారం చిక్కిన ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన సూత్రధారి అయిన డివైన్ ఎబుక సుజీపై వివిధ నగరాల్లో ఏడు డ్రగ్ కేసులు ఉన్నాయి. ఇతడికి ప్రధాన ఏజెంట్‌గా ఉన్న అనోహ బ్లెస్సింగ్‌పై 2019లో ధూల్‌పేట ఎకై ్సజ్ పోలీసులు ఇలాంటి కేసే నమోదు చేశారు. పెడ్లర్స్లోఒకడైన నిజాం కాలేజీ విద్యార్థి అజీజ్ నోహీమ్ అడెషోలా (నైజీరియన్) గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. అప్పట్లో ఫీజు చెల్లించడం కోసం నకిలీ డీడీ తయారు చేసి ఇచ్చి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో కింది కోర్టు శిక్ష వేయగా.. ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశాడు. అల్లం సత్య వెంకట గౌతమ్‌పై కేపీహెచ్‌బీ ఠాణాలో మహిళను వేధించిన కేసు, వరుణ్ కుమార్‌పై బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వరుణ్ కుమార్‌పై కేపీహెచ్బీలో, షరీఫ్‌పై జూబ్లీహిల్స్, మాదాపూర్‌ల్లో కేసులు ఉన్నాయి.రకుల్ వ్యవహారం ఇలా...నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారికి డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్‌తో సహా మరికొందరిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన కేసులు దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్) అప్పట్లో 10 మంది సినీ ప్రముఖులతో పాటు అనేక మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ జాబితాలో లేని రకుల్ పేరు ఆ తర్వాత చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో వెలుగులోకి వచ్చింది. 2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇందులో సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఈమె విచారణతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 25న ముంబైలో ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరయ్యారు. 2021 సెప్టెంబర్‌లో హైదరాబాద్ ఈడీ అధికారులు రకుల్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు.కొకై న్ వినియోగదారుడిగా చిక్కిన అమన్...టీజీఏఎన్‌బీ, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం చేపట్టిన ఆపరేషన్‌లో నైజీరియన్లు డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్ సూత్రధారులుగా ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ ఇద్దరూ పరారీలో ఉండగా...అనోహ బ్లెస్సింగ్, అజీజ్, గౌతమ్, వరుణ్, షరీఫ్‌లను అరెస్టు చేసి 199 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో అమన్‌ప్రీత్ సింగ్‌తో పాటు కిషన్ రాఠి, అనికాంత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీళ్లు క్రమం తప్పకుండా తమ వద్ద నుంచి కొకై న్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు నిందితులు బయటపెట్టారు. దీంతో గాలించిన సైబరాబాద్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్‌తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న కిట్ ద్వారా మూత్ర పరీక్ష చేయగా..వీళ్లు తరచు కొకై న్ వాడుతున్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన పోలీసులు వీరిని డ్రగ్స్ వినియోగదారులుగా చేర్చి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వినియోగదారుల్లోనూ సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. -
డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించి... నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్‌కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్‌గా ఉంది. ఈమె హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్‌ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాముకు రూ.500 కమీషన్ 2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్‌ను పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్‌కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు. నగరంలో 13 మంది... వీరి దందాపై టీజీఏఎన్‌బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు. వీరిలో బంజారాహిల్స్‌కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్‌ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు డ్రగ్స్ పాజిటివ్: పోలీసులు
సాక్షి, హైదరాబాద్: వీఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్షాకోట్లో దాడులు చేశామని, ఇద్దరు నైజీరియన్లు సహా డ్రగ్స్ అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్‌పోర్టులు, 10 సెల్ఫోన్లు, 2 బైక్‌లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.డ్రగ్స్‌ను నైజీరియన్ మహిళ అనోహ బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్ సరాఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్ మహిళా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌తోపాటు డ్రగ్స్ తీసుకున్న కిషన్ రాటి, అంకిత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్ ,హేమంత్, నిఖిల్ దావన్, మధు, రఘు కృష్ణంరాజు వెంకట్.. మరో అరుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంకిత్, అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, నిఖిల్ ధావన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.ఇక డ్రగ్స్ సరాఫరా చేసిన అనోహా బ్లెస్సింగ్, నిజాం కాలేజీ విద్యార్థి అబీజ్ నోహం, బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతమ్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్, సానబోయిన వరుణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్య వెంకట గౌతమ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అమన్ ప్రీత్ సింగ్‌ను పరీక్షిస్తే.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని.. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని అన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని తెలిపారు. -
24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
-
డ్రగ్స్ కేసులో సంజనకు ఊరట
యశవంతపుర: మత్తు పదార్థాలను సేవించిన కేసులో నటి సంజనా గల్రానితో పాటు వ్యాపారవేత్తలు శివప్రకాశ్, ఆదిత్య మోహన్ అగర్వాల్‌పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో నటికి పెద్ద ఊరట కలిగింది. తమపై దాఖలైన డ్రగ్స్ కేసును రద్దు చేయాలని కోరుతూ వీరు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తి హేమంత్ చందన గౌడర్ ధర్మాసనం కేసును విచారించింది. సంజనపై బెంగళూరు పోలీసులు 2020 ఏప్రిల్, సెప్టెంబర్‌లో కేసులు నమోదు చేశారు. 2015, 2018, 2019లోను వీరు డ్రగ్స్ సేవించారంటూ అక్రమంగా కేసులు నమోదు చేశారని వారి తరఫున వకీలు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి వారిపై కేసులను రద్దు చేశారు. -
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
డ్రగ్స్ ఉచ్చులో డీజే సిద్ధార్థ్
-
హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమను విచారించేందుకు బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులకు అనుమతి లభించింది. బెంగళూరు నగర శివార్లలో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షకు పంపించగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది.సీసీబీ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపగా ఎట్టకేలకు హేమ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనేకల్ న్యాయస్థానం ముందు ఆమెను పోలీసులు హాజరుపరిచారు. హేమను విచారించేందుకు మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం మాత్రం 24 గంటల పాటు ఆమెను విచారిస్తే చాలని తెలిపింది. ఆపై గురువారం సాయంత్రం ఐదుగంటలకు మళ్లీ కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు సూచించింది. -
హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’?
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్‌కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
తప్పు చేయకపోవడానికి మేమేం దేవుళ్లం కాదు.. హేమ మరో వీడియో
ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నటి హేమ ఇందులో ఉండటంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా, తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమ్మా కొట్టింది. మరోవైపు ఈమెకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)వీడియోలో ఏముందంటే?'మనమేం దేవుళ్లం కాదు. ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం చాలా ఫ్రెష్‌గా ఉంటాం. అలానే అబద్దం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్దాలు ఆడాలి. అందుకని 99.9 శాతం అబద్దాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని' హేమ చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.కేసు సంగతేంటి?మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌసులో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి దాదాపు 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్లలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా, తాను రాలేకపోతున్నానని మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2021 నుంచి ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆర్యన్ ఎలాంటి తప్పు చేయలేదని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్లో అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు. తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్ చిట్ దక్కింది. -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్‌పై మండిపడ్డ నటి! -
HYD: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. గంజాయితో మరో బ్యాచ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠాల గుట్టు రట్టు అయ్యింది. పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడ్డారు పలువురు. విద్యార్థులే లక్ష్యంగా.. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి మరీ కేటుగాళ్లు ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్‌నగర్‌లో డ్రగ్స్ పార్టీ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ(Special Operation Team) బృందం దాడులు జరిపింది. ఈ తనిఖీల్లో MDMA(methylenedioxy-methylamphetamine)తో పట్టుబడ్డారు యువకులు. మొత్తం 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయి తో పాటు OCB ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బృందం. ఈ దాడులకు సంబంధించి ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసింది. మరోవైపు.. మేడ్చెల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 33,750 విలువ గల 1.35కేజీల గంజాయి సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బుల సంపాదన ఆశతో గంజాయి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు. వీళ్లంతా నగరంలో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ..
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ చోటు చేసుకుంది. గతంలో తెయూ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా లంచం తీసుకుంటూ అవినీతి కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ యూనివర్సిటీ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోనే పదవిలో ఉన్న యూనివర్సిటీ వీసీ ఒకరు అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లడం అదే మొదటిసారి. ప్రస్తుతం తెయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ నిషేధిత డ్రగ్స్ (మాదకద్రవ్యాల) తయారీ కేసులో పోలీసుల చేతిలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ 2014లో తెయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2018లో వర్సిటీ అనుబంధంగా ఉన్న భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు. వర్సిటీ ఉద్యోగులకు లీన్ (డిప్యుటేషన్) పీరియడ్ కింద వర్సిటీ అనుమతితో ఐదేళ్లకు ఒక సంవత్సరం ఇతర సంస్థల్లోకి వెళ్లి పని చేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకే నాటి వీసీని ప్రసన్నం చేసుకుని శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ఇలా ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి వీసీలను మచ్చిక చేసుకుని లీన్ పొడిగింప జేసుకున్నారు. ఈ విషయాన్ని 2021లో గుర్తించిన వర్సిటీ పాలకమండలి సభ్యులు 53వ ఈసీ సమావేశంలో డిప్యుటేషన్‌పై ఉన్న వర్సిటీ ఉద్యోగులు వెంటనే లీన్ రద్దు చేసుకుని వర్సిటీలో తిరిగి చేరాలని 2021 లో తీర్మానం చేశారు. అయితే ఏ ఒక్కరూ పాలకమండలి ఆదేశాలను పాటించలేదు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో లీన్‌పై వెళ్లిన వారు అలాగే ఉండిపోయారు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులపై నోటీసులు ఇవ్వడంతో ఎట్టకేలకు శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చారు. తాను తిరిగి విధుల్లో చేరతానని చెప్పగా తొలుత రిజిస్ట్రార్ యాదగిరి అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ రిజిస్ట్రార్‌తో తీవ్రంగా గొడవ పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సౌత్ క్యాంపస్‌లో తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్ బయోమెట్రిక్ హాజరును పట్టించుకోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు మాత్రమే చేసి వేతనం తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారని ఇతర అధ్యాపకులు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా నిషేదిత డ్రగ్స్ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్ అరెస్ట్ అయిన విషయం మూడు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి రావడంతో శ్రీనివాస్ మార్చి నెల వేతనాన్ని నిలిపివేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్ అయిన 48 గంటల్లో విధుల్లో నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రిజిస్ట్రార్ యాదగిరిని సంప్రదించగా ఇంకా తనకు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని న్యాయసలహా మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెడికెమ్ ల్యాబ్.. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారులో మెడికెమ్ ల్యాబ్ అనే సంస్థలో శ్రీనివాస్ మేనేజింగ్ పార్ట్నర్గా కొనసాగుతున్నారు. ఈ ల్యాబ్‌లో ఖరీదైన ఫార్మా డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్‌గా మారి ఇలా నిషేదిత డ్రగ్స్‌ను తయారు చేసి ఇతరదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు పట్టుబడినప్పటికీ ఇందులో వచ్చే ఆదాయం వల్ల చాలా కంపెనీలు వీటిని ఇల్లీగల్‌గా కొనసాగిస్తుంటాయి. అయితే ఇలా హైదరాబాద్‌లో నిషేదిత డ్రగ్స్ తయారీ చేస్తూ పట్టుబడటం, అరెస్ట్ అయిన వారిలో తెయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండటం సంచలనంగా మారింది. నిషేదిత డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ముందుగా ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. శ్రీనివాస్‌ను ఏకంగా ఇంటర్‌పోల్ పోలీసుల సాయంతో హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), రాష్ట్ర ఎకై ్సజ్ పోలీస్ అధికారులు గత నెల 22న అరెస్ట్ చేశారు. వర్సిటీ అధ్యాపకులు ప్రభుత్వం అనుమతించిన ఫార్మా ఉత్పత్తులపై పరిశోధనలు చేయాల్సి ఉండగా ఇలా నిషేదిత డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ పట్టుబడటం సిగ్గు చేటని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇవి చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్.. -
రాడిసన్ డ్రగ్స్ కేసు: వీఐపీలకు షాక్.. పోలీసుల సరికొత్త ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్లో పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా క్రోమోటోగ్రఫీ పరీక్ష చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు. వివరాల ప్రకారం.. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేందుకు పోలీసులు క్రోమోటగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం పోలీసులు కూకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే, కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతిస్తే ఆరోజు రాడిసన్‌కు వెళ్లిన వారిలో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక, ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి మొత్తం 14 మంది హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా, వీరికి డ్రగ్స్ టెస్టులు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. అయితే, వీరిలో సెలబెట్రీలు పార్టీ జరిగిన రోజు నుంచి ఎక్కువ సమయం తీసుకుని డ్రగ్స్ టెస్టు కోసం విచారణకు హాజరయ్యారు. దీంతో, వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనపించలేదు. ఈ నేపథ్యంలోనే రాడిసన్‌కి వచ్చిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి శరీరాల్లో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ నిర్వహించాలని పోలీసులు ప్లాన్ చేశారు. ఇక, క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదైంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. -
ప్యాకేజింగ్‌లోనే డ్రగ్స్ కలిశాయా?
-
విశాఖ డ్రగ్స్: అంతర్జాతీయ లింకులపై సీబీఐ ఆరా.. బ్రెజిల్‌కు స్పెషల్ టీంలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. -
డ్రగ్స్ కేసులో దొరికింది టిడిపి వాళ్లే కావడంతో ఫ్రస్ట్రేషన్ లో బాబు
-
యువతను చిత్తు చేస్తున్న మత్తు
-
బాబు 'బాదరాయణ బంధాన్ని' కొల్లగొట్టిన ఆపరేషన్.. 'గరుడ'
రాజకీయాలలో ఒక ధీరి ఉంటుంది. తాము ఏ తప్పు అయినా చేయదలిస్తే, లేదా తప్పు చేస్తే, ముందుగా దానిని ఎదుటివారిపై నెట్టేయడం. ఎదుటివారేదో ఘోరం చేస్తున్నారని ప్రచారం చేసి, చల్లగా తన పనికానీచ్చుకోవడం. తాను దొంగతనం చేసి దొరికిపోతున్నామని అనుకుంటే ‘కావు, కావు’ మని.. వైరి పక్షంపై ఆరోపణలు గుప్పించడం. ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాత ఈ ధోరణితోనే ఆయన కథ నడిపించారు. దానికి ఈనాడు రామోజీరావు వంటివారు బాకా ఊదుతూ తానా అంటే తందానా అనేలా రెడీగా ఉంటారు. దాంతో ఆయన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోయింది. కానీ అన్నిసార్లు ఇది సాద్యపడదు కదా! అందులోను సోషల్ మీడియా విస్తారంగా వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని పన్నినా ఇట్టే దొరికిపోతున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా ఇలాగే తయారయ్యారు. విశాఖపట్నంలోని పోర్టుకు బ్రెజిల్ నుంచి మాదకద్రవ్యాలతో కూడిన కంటైనర్ వచ్చిన ఉదంతంలో టీడీపీకి బూమ్ రాంగ్ అయిందని చెప్పాలి. ఇలాంటి డ్రగ్స్ విషయాలలో రాజకీయాలకు అతీతంగా అంతా ప్రవర్తించాలి. కానీ పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబే ఎదుటివారి మీద బురద చల్లి రాజకీయ లబ్ది పొందాలని చూడడం ద్వారా మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ముందుగానే అసలు వాస్తవం తెలిసి ఉండాలన్న భావన కలుగుతుంది. తమ పార్టీకి చెందినవారే ఈ కేసులో దొరికిపోయేలా ఉన్నారని అర్దం అయి ఉండాలి. తమకు సంబంధించిన వారి బంధువులు పట్టుబడుతున్నారని కనిపెట్టి ఉండాలి. అందుకే విశాఖలో ఒక పక్క సీబీఐ సోదాలు జరిపి పరిశోధన చేస్తుంటే.. లోకేష్ దీనిపై ట్వీట్ చేస్తూ వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు సైతం విశాఖ డ్రగ్స్ కాపిటల్ అయిపోయిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. వైఎస్సార్సీపీ నేతలు అసలు విషయం తెలుసుకుని ఖండన ఇచ్చేలోగానే వీరు తమ భజంత్రీలైన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి గ్రూపు మీడియా సంస్థల ద్వారా వారి ట్వీట్లలో పేర్కొన్న అంశాలను ప్రచారంలో పెట్టేశారు. పైగా పత్రికలలో ఏమి రాశారు. సీబీఐ డ్రగ్స్‌ను వెలికి తీసి పరిశీలిస్తుంటే, స్థానిక పోలీసులు ఆటంకం సృష్టించే యత్నం చేశారని కూడా వీరు తేల్చేశారు. కానీ వీరు ఎక్కడా అది ఫలానా వారి కంపెనీ ఇది అని, వారి చిరునామా ఇది అని, వారికి ఫలానా వారితో సంబంధాలు ఉన్నాయని రాయకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వైఎస్సార్సీపీ పెద్దలే డ్రగ్స్ తెప్పించారన్నంత నీచంగా కూడా టీడీపీ ప్రచారానికి దిగింది. దాంతో వైఎస్సార్సీపీ మేలుకుని మొత్తం విషయం రాబట్టి ఆశ్చర్యపోవలసి వచ్చింది. 'సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కూనం కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు చెందిందని వెల్లడైంది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుటుంబానికి వీరికి సంబంధాలు ఉన్నాయని, పలువురు టీడీపీ నేతలతో వీరికి బాదరాయణ బంధం ఉందని' వైఎస్సార్సీపీ నేతలు చిట్టా విప్పారు. దాంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. డ్రగ్స్ వంటి సమస్యలను రాజకీయ కోణంలో చూడకూడదు. సమాజానికి ఇది పెనుభూతం వంటిది. సీబీఐ వారు ఇంటర్ పోల్ సాయంతో ఇంత పెద్ద డ్రగ్ రాకెట్‌ను ఆపరేషన్ గరుడ పేరుతో కనిపెట్టినందుకు వారిని అభినందించాలి. బ్రెజిల్ నుంచి వచ్చినవి డ్రగ్స్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత సీబీఐ కంపెనీని యజమానులను, ఆ కంపెనీ అధికారులను అదుపులోకి తీసుకోవచ్చు. లేదా అదుపులోకి తీసుకోకుండానే విచారణ జరపవచ్చు. మొత్తం మీద డ్రగ్స్ మూలాలు ఎక్కడ నుంచి వచ్చాయో, ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం సీబీఐ చేస్తుంది. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో టీడీపీ అధికంగా కంగారు పడుతోంది. 'ఈ కంపెనీ తమ సామాజికవర్గం వారిది కావడం, కంపెనీ యజమానులలో కొందరికి గత చరిత్ర అంత క్లీన్‌గా లేకపోవడం వల్ల ఆ బురద అంతా తమపై వచ్చి పడుతుందేమోనన్న కంగారులో చంద్రబాబు, లోకేష్‌లు తొందరపడి పిచ్చి ట్వీట్లు చేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పించారు'. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లింక్ పెట్టి ట్వీట్ చేశారు. అంతిమంగా అదేదో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు సంబంధించిందేమో అన్న చందంగా అనుమానం క్రియేట్ చేయడానికి యత్నించారు. ఇక రామోజీరావు రంగంలో దిగి డ్రగ్స్ తెప్పించారన్న అభియోగాలను ఎదుర్కుంటున్న వారిని రక్షించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుగా ఉంది. శనివారం నాటి పత్రికలో అంతా అనుమానాస్పదమే అన్న శీర్షికతో ఒక ప్రధాన కథనాన్ని వండి వార్చారు. అందులో ఎంత సేపు సీబీఐ డ్రగ్స్ గురించి దర్యాప్తు చేస్తుంటే, దానిని ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారని దుర్మార్గపు ప్రచారం చేసింది. పోలీసులు అలా చేశారంటే వైఎస్సార్సీపీ పెద్దల పాత్ర లేకుండా ఉంటుందా అని దిక్కుమాలిన రాతలు రాసింది. అసలు రాయవలసింది ఏమిటి..? ఆ కంపెనీ ఎవరిది? గతంలో కూడా ఇలా చెప్పిన సరుకు కాకుండా వేరే డ్రగ్స్ లేదా ఇతర అభ్యంతరకర పదార్దాలు ఏవైనా తీసుకువచ్చేవారా? ఆ కంపెనీ ముఖ్యుల మూలాలు ఏమిటి? వారు ఎలా ఆ స్థాయికి వచ్చి ఆక్వా కంపెనీ పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీపై ఎప్పుడైనా ఏదైనా కేసు పెట్టిందా? మొదలైన అంశాలపై వార్తలు రాయకుండా రామోజీ ఎంతసేపు సీబీఐ అధికారులను ఏపీ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారన్నదానిని ఫోకస్ చేయడానికి యత్నించింది. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్.. ఎక్కడా ఎవరూ ఆటంకం కలిగించలేదని, సీబీఐ కోరితేనే డాగ్ స్క్వాడ్ పంపించామని, ఈ ప్రక్రియలో కొంత జాప్యం అయిందని.. సీబీఐ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారని, సీబీఐ అధికారులను కూడా మీడియా సమాచారం కోరవచ్చని.. స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు మీడియా ఈ రకమైన దుర్మార్గపు ప్రచారం చేసిందంటే వారి దుష్ట ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పోనీ ఏపీ పోలీసులు కావాలని జాప్యం చేశారని అనుకుందాం. దానివల్ల వారికి వచ్చే లాభం ఏమిటి? అయినా సీబీఐ తన పని తాను చేసుకుపోయింది కదా? ఆ విషయం రాయకుండా, ఆ స్కామ్ మూలలు తవ్వకుండా ఈనాడు మీడియా అబద్దపు కథనాలు ఇస్తోందంటే వారు ఎంత నీచంగా మారారో అర్ధం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఎక్కడా ఆ కంపెనీకి సంబంధించిన 'వీరభధ్రరావు, కోటయ్య చౌదరి' తదితరుల గురించి ఒక్క ముక్క రాసినట్లు కనిపించలేదు. పైగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో వీరభద్రరావు సోదరుడు పూర్ణచంద్రరావు దిగిన ఫోటోను ప్రముఖంగా ప్రచురించింది. తీరా చూస్తే ఆయన తన సోదరుడి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, స్థానిక రాజకీయాలలో వైఎస్సార్సీపీని అభిమానిస్తానని చెప్పారు. విశేషం ఏమిటంటే అసలు ఆ కంపెనీతోకానీ, ఆ డ్రగ్స్‌తో కానీ ఏ మాత్రం సంబందం లేని పూర్ణచంద్రరావు ఫోటో వేసిన టీడీపీ మీడియా అసలు కంపెనీ నడిపే వారి పోటోలు వేయలేదు. వారి వివరాలు ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్‌సీపీవారు ఏకంగా చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించినవారే ఈ డ్రగ్స్ స్కామ్ లో ఉన్నారని ఆరోపిస్తూ సీఈఓ కి ఫిర్యాదు చేసింది. చిత్రం ఏమిటంటే.. "ప్రతి చిన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బురద చల్లుడు తప్ప ఫిర్యాదు చేయలేదు." దీనిని బట్టి టీడీపీకి సంబంధించినవారి బండారం బటపడుతుందని ఈ డ్రామా ఆడారని అనుకోవాలి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈనాడు రామోజీరావు ఈ ఘటనపై రాస్తున్న కథనాల వెనుక కులభావన, విశాఖపై ద్వేష భావన వెదచల్లడం, టీడీపీ దొరికిపోకుండా కాపాడడం, ఒకవేళ నిందితులు తనకు తెలిసినవారైతే వారిని రక్షించడం.. లక్ష్యాలతో ఈ వార్తలు ఇచ్చినట్లు అభిప్రాయం కలుగుతుంది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినప్పటి నుంచి ఆ నగరంపై ఈనాడు రామోజీరావు విషం చిమ్ముతూనే ఉన్నారు. అలాగే కమ్మ కులంలో ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెనుకేసుకు వస్తున్నారన్న దరిద్రపు ఆరోపణకు కూడా ఆయన ఆస్కారం ఇవ్వడం దురదీష్టకరం. ఈ మద్యకాలంలో హైదరాబాద్‌లో పట్టుబడినన్ని డ్రగ్స్ మరే నగరంలోను దొరకలేదు. అయినా ఈనాడు మీడియా మాత్రం ఎక్కడా వాటికి ఎక్కువ ప్రచారం ఇవ్వదు. పైగా గతంలో బీఆర్ఎస్కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వత్తాసు పలకడానికి పోటీ పడుతోంది. గుజరాత్‌లోని ముంద్ర పోర్టు ద్వారా దేశంలోకి వచ్చినన్ని డ్రగ్స్ మరెక్కడ బహిర్గతం కాలేదు. గుజరాత్లో డ్రగ్స్ సమస్యపైకానీ, పంజాబ్‌కు పాకిస్తాన్ నుంచి వచ్చే మత్తు పదార్దాల గురించికానీ ఎన్నడూ బీజేపీ తదితర పార్టీలపై వార్తలు రాయని ఈనాడు మీడియా ఏపీపై మాత్రం నీచంగా రాస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి యత్నిస్తోంది. తంలో చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో చేసిన స్కామ్‌లను సమర్థించే దుస్థితిలో రామోజీరావు ఉన్నారు. సింగపూర్‌కు చెందిన మాజీ మంత్రి ఈశ్వరన్‌ను ఏపీకి తీసుకు వచ్చి వేల కోట్ల భూములను కట్టబెట్టిన చంద్రబాబును ఎన్నడూ తప్పు పట్టలేదు. ఇప్పుడు అదే ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి మంత్రి పదవి కోల్పోయారు. అయినా ఒక్క ముక్క రాయదు. అమరావతిలోనే ఏదో ఆస్పత్రి పెడతారంటూ వంద ఎకరాల భూమి పొందిన బీడీ శెట్టి అనే వ్యాపారిని దుబాయిలో అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరికి, చంద్రబాబుకు ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటో ఒక్క అక్షరం కూడా రాయని దౌర్భాగ్య స్థితిలో ఈనాడు మీడియా ఉంది. అంతెందుకు చంద్రబాబుపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, దుబాయిలో ఆయన అక్రమంగా డబ్బు పొందారని ఆరోపణలు రావడం వంటివాటిపై పరిశోధన కథనాలు రాయకపోగా, ఆయనను సమర్దిస్తూ వార్తలు ఇస్తుంటారు. ఇదంతా ఈనాడు రామోజీ స్వార్ధ వ్యాపార ప్రయోజనాలకే అన్న సంగతి అందరికి తెలిసిపోయింది. ఇంకో సంగతి కూడా చెప్పాలి. 'ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ అరెస్టు అయ్యారు. అప్పట్లో వీరిద్దరిపైన వెంటాడుతూ వార్తలు రాసిన ఈనాడు, ప్రస్తుతం వారిద్దరూ తెలుగుదేశంలో చేరగానే తేలుకుట్టిన దొంగలాగా నోరు మూసుకుని కూర్చుంది.' అంటే దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తనకు నచ్చకపోయినా, తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నారనుకున్న వారిపై ఉన్నవి, లేనివి అభూతకల్పనలు రాసి బ్లాక్ మెయిల్ చేయడం, వారిలో ఎవరైనా లొంగిపోతే రామోజీ కామ్ అయిపోవడం జరుగుతుందని అనిపించడం లేదా! చివరికి రామోజీ కులతత్వవాదిగా మిగిలిపోయి అప్రతిష్టపాలవుతరని నేనైతే గతంలో ఎన్నడూ ఊహించలేదు. ఏం చేస్తాం.. రామోజీ లాంటి వారు ఈ వయసులో తమ ప్రతిష్ట పెంచుకోకపోగా, ఇలా దిగజారుతున్నారంటే వారికి ఏదో భయం పట్టుకున్నదన్నమాటే కదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సంధ్య ఆక్వా డ్రగ్స్ కేసు: సీబీఐ మరో కీలక నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ తాజాగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇదే సమయంలో ఏపీలో పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం. మరోవైపు.. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. -
ఆక్వా కంపెనీ యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి
-
విశాఖ డ్రగ్స్ కేసు: అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు
సాక్షి, విశాఖపట్నం: సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ-సిగరెట్స్ పట్టుబడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్టను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంతో అనుమానాలు బలపడుతున్నాయి. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా టెక్స్ బస్సు కాకినాడ: మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో యు.కొత్తపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్‌బోర్డు గుర్తించారు. బస్సు బ్రేక్ డౌన్ అయ్యిందని డ్రైవర్ చెబుతున్నాడు. -
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
విశాఖపట్నం డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు-దగ్గుబాటి కుటుంబాల పాత్ర బహిర్గతం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
విశాఖ డ్రగ్స్ కేసులో CBI దూకుడు
-
"వైజాగ్ డ్రగ్స్ మాఫియా.."అందరూ ఆయన బంధువులే
-
డ్రగ్స్ కేసులో మరో టీడీపీ నేత హస్తం
-
డ్రై ఈస్ట్ లో డ్రగ్స్..సీబీఐ విచారణలో సంచలన విషయాలు
-
విశాఖ డ్రగ్ మాఫియా..అందరూ రామోజీ బంధువులే
-
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ విచారణలో సంచలన విషయాలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు డ్రగ్స్ కేసుపై సీబీఐ దృష్టిసారించింది. ఈ క్రమంలో సంధ్యా ఆక్వాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. అలాగే, లిక్కర్ స్కాంకు పాల్పడిన సిండికేట్‌లో సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో.. మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును చేధించే పనిలో సీబీఐ దూకుడు పెంచింది. ఇక, పది మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా ఆక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కంపెనీని పరిశీలించారు. ఇదే సమయంలో కంటైనర్లలో మెటీరియల్‌కు సంబంధించి మరిన్ని శాంపిల్స్‌ను విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇది కూడా చదవండి: విశాఖ డ్రగ్స్ కేసు: చంద్రబాబు ఇంగితం లేని మాటలు -
స్నిఫర్ డాగ్స్ అడిగారు.. పంపాం
విశాఖ సిటీ: డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తు తమ పరిధిలో లేదని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ స్పష్టం చేశారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఇందులో జిల్లా అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో పొందుపరచిన సాంకేతిక పదజాలాన్ని కొందరు తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో దర్యాప్తులో జాప్యం జరిగినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ పరిధిలో పని చేస్తోందని వివరించారు. ‘బ్రెజిల్ నుంచి రవాణా నౌక ద్వారా డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు వస్తున్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖ చేరుకున్నారు. ఆ కంటైనర్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)లో జేఎం భక్షి అనే ప్రైవేట్ సంస్థ ఆదీనంలో ఉన్న ప్రాంతంలో అన్లోడ్ చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డెలివరీ అయిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐకు సమాచారం అందడంతో ఆనవాళ్లు గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్ కావాలని పోలీస్ శాఖను కోరారు. కొంతసేపటి తరువాత వాటిని వెనక్కు పంపించారు. నేను కూడా అక్కడ నుంచి వెళ్లిపోయా. ఆ తరువాత కస్టమ్స్, సీబీఐ అధికారులు కంటైనర్‌లో ఉన్న వాటిని పరీక్షించారు. ఈ తనిఖీలతో విశాఖ పోలీసులకు, అధికారులకు సంబంధం లేనందున ఎవరూ పాల్గొనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు.. కంటైనర్‌లో డ్రగ్స్ తెరిచినప్పటి నుంచి ఆనవాళ్ల పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని రికార్డ్ చేసేందుకు సీబీఐ అధికారులు ఓ ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను వెంట తెచ్చుకున్నారు. కంటైనర్‌ను తెరిచే సమయంలో వీసీటీపీఎల్తోపాటు ప్రైవేటు సంస్థ సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీడియో రికార్డింగ్‌కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున వారిని అక్కడి నుంచి పంపించారు. ఇలా వృథా అయిన సమయాన్ని స్థానిక అధికారులు గుమిగూడటం కారణంగా ప్రొసీడింగ్స్‌లో జాప్యం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వీసీటీపీఎల్, ప్రైవేటు సంస్థ అధికారులు రావడాన్ని సీబీఐ ప్రస్తావిస్తే దాన్ని జిల్లా అధికారులకు ముడిపెట్టడం సరికాదు. ఈ విషయంపై సీబీఐ అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నాం. సీబీఐ అధికారులు వినియోగించిన టెక్నికల్ పదాలను తప్పుగా అర్థం చేసుకొని సంబంధం లేని అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదు.’ అని సీపీ చెప్పారు. స్మగ్లింగ్ ముఠాలపై ఉక్కుపాదం ‘గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశాం. ప్రత్యేక బృందాలతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలను సేకరించి గంజాయి తోటలను ధ్వంసం చేశాం. ప్రసుత్తం విశాఖపట్నంలో గంజాయి లేదా ఇతర డ్రగ్స్ లేవు. ఒడిశా, మల్కన్‌గిరి, జైపూర్, కోరాపుట్ లాంటి ప్రాంతాల నుంచి రవాణా జరుగుతోంది. విశాఖపట్నంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉండడంతో ఇతర రాష్ట్రాల గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు జిల్లాను ట్రాన్సిట్ కేంద్రంగా వినియోగించుకుంటున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టి అంతర్రాష్ట గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం మీదుగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలను అరెస్టు చేస్తుంటే నగరం గంజాయికి కేంద్రంగా మారిందని దు్రష్పచారం చేయడం సరికాదు.’ అని పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. -
చంద్రబాబు సతీమణి పై చర్యలు తీసుకోవాలని కోరాం
-
హైదరాబాద్ లో రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
-
వైజాగ్ డ్రగ్స్ కేసు చంద్రబాబు కథ అడ్డం తిరిగింది
-
విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో వీరభద్రరావు, కోటయ్య చౌదరిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 140 శాంపిల్స్‌ను సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల బృందంతో పాటు డీఐజీ విశాల్ గున్ని మరోసారి పోర్టులో కంటైనర్‌ని పరిశీలించారు. విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇదీ చదవండి: విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్.. 'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలి
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. లోతుగా విచారణ జరపాలని సీఈవోకు ఫిర్యాదు చేశామని.. విచారణ జరిపి వీటిని అరికట్టాలని కోరామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది. 25 వేల కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకుంది. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు. చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు. చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది. దీనిలో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరాం’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘గతంలో ఐదేళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు. ఆ సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు. చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీని కోరాం. దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. చంద్రబాబు ట్వీట్‌పై కూడా ఫిర్యాదు చేసాం. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం. దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఈనాడు పత్రికపై విషంతో వార్తలు రాశారు. ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం’’ అని పేర్ని నాని తెలిపారు. ఇదీ చదవండి: విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల -
నారా, నందమూరి ఫ్యామిలీ వాళ్లే డ్రగ్స్ కేసులో నిందితులు
-
విశాఖ డ్రగ్ కేసు..నిజ నిజాలు..
-
విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు ఇంగితం లేని మాటలు: సజ్జల
సాక్షి, గుంటూరు: విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల.. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. వీధి స్తాయి మనస్తతత్వం చంద్రబాబుది. తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్‌పై తూతు మంత్రంగా దాడుల చేశారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. తప్పు చేసి రివర్స్‌లో మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. .. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కలలు కంటున్నారు. వైఎస్సార్సీపీకి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అది తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తాం. ఎన్నికల మిషన్ కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలని కోరతాం. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది’’ అని సజ్జల మండిపడ్డారు. సజ్జల ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు డ్రగ్స్ కేసులో దొంగే దొంగా దొంగా అన్నట్టుగా టీడీపీ ఆరోపణలు చేస్తోంది ఏ మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా చంద్రబాబూ?: టీడీపీ వారి అరుపులే నిజాలైపోతే..ఆ పార్టీ చెప్పే అబద్ధాలన్నీ కూడా నిజాలైపోతాయి. గాల్లోంచి తీసి కల్పితాలను కూడా నిజాలుగా వారు చిత్రీకరించగలరు. గుమ్మడికాయ దొంగెవరూ భుజాలు తడుముకుంటున్న చందాన దొంగే దొంగ దొంగ అని అరుచుకుంటూ వెళ్తున్నారు. వైజాగ్ డ్రగ్స్ కేసు సినీ ఫక్కీలో పట్టుబడింది. సీబీఐ దాన్ని పట్టికుంది. ఓ వైపు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వారి పైత్యం విపరీతంగా మారిపోతోంది. నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే లోకేశ్‌లు కూడా ట్వీట్లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నాడు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా? జరిగిన విషయంలో వాస్తవాలు ఏంటి? అనేది అంత అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించుకోవాలి కదా? భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. అది దేశంలోకి వచ్చి ఉంటే భయంకరంగా ఉండేది. పట్టుకోవడం ఓ పెద్ద రిలీఫ్. వీళ్లు అరిచే అరుపులు చూస్తుంటే వీళ్లే దాని వెనుక ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోంది. పోనీ ఆ కంపెనీ చరిత్ర తీస్తే అంతా వారి కుటుంబాలకు దగ్గరగా ఉండే బంధువులు. సాక్షాత్తు పురందేశ్వరి కొడుకు కూడా వారి కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆమె వియ్యంకుడు కూడా ఆ కంపెనీలో పార్టనర్‌గా ఉన్నారు. వాళ్లు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి తర్వాత డివైడ్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మేం ఆరోపణ చేస్తే వాళ్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది పోయి ఉల్టా మాపై ఆరోపణలు చేస్తున్నారు. కచ్చితంగా టీడీపీ వారి ప్రమేయం ఉందని మా అనుమానం: ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మాపై బండ వేసి లబ్ధిపొందాలని చూస్తున్నారు. మేం దానికి సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తోంది. ఒక్క ఈ విషయమే కాదు..ప్రతి ఒక్క దాంట్లో ఇలానే అర్ధం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనిలో కచ్చితంగా టీడీపీకి సంబందించిన వారి ప్రమోయం ఉందని మేం బలంగా అనుమానిస్తున్నాం. వాళ్ల ఉలికిపాటు చూస్తుంటే, దాన్ని తెచ్చి ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై నింద వేయాలని చూస్తుంటే వీళ్లు తప్పించుకోడానికే నింద వేస్తున్నారని అనిపిస్తోంది. కచ్చితంగా దీని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన వదిన పురందేశ్వరి, వారి గ్యాంగ్ ఉన్నాయని మేం అనుమానిస్తున్నాం. విచారణలో ఈ కోణం కూడా చూడాలని మేం సీబీఐకి పిటిషన్ పెడుతున్నాం. ఈ దిశలో కూడా విచారణ జరగాలని కోరుతున్నాం. గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్ అంటూ వీళ్లు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గతంలో గంజాయి పండించి..టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించాం. దానిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని మెచ్చుకుంది. ఎస్ఈబీ పెట్టిన తర్వాత 12వేల ఎకరాల్లో సాగును ధ్వసం చేశారు. ఇప్పుడు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ తప్పుడు పనులు చేస్తే చర్యలు తీసుకుంది కూడా జగన్ గారి ప్రభుత్వమే. డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడానికి, సాగు లేకుండా చేయడానికి మేం కన్‌స్ట్రక్టివ్‌గా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేం చేపట్టిన చర్యలను మెచ్చుకోకపోగా..చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో చెప్పుకోడానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన వ్యక్తి లోకేశ్: ఈ డ్రగ్స్ కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలపై కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తున్నాం. థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన స్థాయిలో లోకేశ్ ఉన్నాడు. ఎందుకు ట్వీట్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్ధం కావడం లేదు. మోకాలికి బట్టతలకు సంబంధం కట్టి ఎక్కడో బ్రెజిల్ దేశంతో సంబంధం కడుతున్నాడు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిచాడని విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే దాన్ని పట్టుకొచ్చి ఈ కేసుకు అంటగడుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరెవరూ ఉండే అవకాశం ఉంది అని చూస్తే సహజంగానే దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు. వీళ్లతో కలిసి ఎప్పుడూ తిరిగే వ్యక్తులు, ఆ కంపెనీ వారితో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది సహజంగానే వారిపైనే పడుతుంది. అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబుకు ఉంది కాబట్టి వారిపైనే అనుమానం. అందుకే ఉల్టా మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ జన్మలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలు అవకాశం ఇవ్వరని తెలిసి, ఆ ప్రస్టేషన్లో ఇలాంటి తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ గారు ఎప్పుడూ ఇలాంటి వాస్తవ విరుద్ధ కామెంట్స్ చేయలేదు: మేము పాజిటివ్ ఎజెండాతో వెళ్తున్నారు. జగన్ గారు ఇలాంటి వాస్తవ విరుద్ధ మాటలు మాట్లాడటం ఏనాడైనా చూశారా? ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగానైనా ఇలాంటి ఆధారాలు లేని కామెంట్స్ చేశారా? ఆయనైనా, సాక్షి పత్రికైనా ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేదు. కానీ తండ్రీ కొడుకులు ముందుండి అబద్ధాలను వండి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తారు. ఇలాంటివి వేల కొద్దీ కనిపిస్తాయి. అవే అబద్ధాలను ఆ పత్రికలు వార్తలుగా వండి వారుస్తున్నాయి. అదే కోణంలో గంజాయి, ఇసుక లాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు. వాళ్లకు చెప్పుకోడానికి ఏమీ లేదు. మేం చెప్పుకోడానికి చాలా ఉన్నాయి. సిద్ధం సభలు చూసినా, ఇంకే సభలు చూసినా మేం చేసినవి చెప్పుకుంటున్నాం. రాజకీయ పార్టీగా మేం చేసిన పనులు చెప్పాలి. కానీ థర్డ్ గ్రేడ్‌గా వ్యక్తిత్వ హననం చేసే అవాస్తవాలను ప్రచారం చేయడం రాజకీయం కాదు. అది రాజకీయం కాదని ప్రజలు 2019లో వారిని రిజెక్ట్ చేశారు. ఇచ్చిన హామీలను కూడా రెండో సారి చెప్పుకోవడం లేదు. అలా చెప్తే గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనం అడుగుతారని భయం. ఈ మధ్య పొద్దున లేవగానే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి లేని పోని ఫిర్యాదులు చేయడం రివాజుగా మారింది. ఆ అబద్ధపు ఫిర్యాదులను ఆ పత్రికలు బ్యానర్ స్టోరీలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ కూటమి సింగిల్ డిజిట్‌కు పరిమితం కాబోతోంది: ఈ ఎన్నికలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లు సింగిల్ డిజిట్‌కి పరిమితం కాబోతున్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఓటమి తర్వాత ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చూపి మేం ఓడిపోయాం అని చెప్పుకోడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. డ్రగ్స్ కేసుకు సబంధించి ప్రెస్‌కౌన్సిల్, సీబీఐతో పాటు అన్ని సంస్థలకూ మా పిటిషన్లు వెళ్తాయి. ముందు ఇది తేలాలి. దీని వెనుక బలమైన ఆధారాలతో చంద్రబాబు, ఆయన వదిన కుటుంబం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎన్నికల కమిషన్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరతాం. ఇదే సమయంలో మా పాజిటివ్ ఎజెండాతో మేం ముందుకు వెళ్తాం. వాళ్లలా అడ్డదారుల్లో బయట పడాలని ప్రయత్నం చేయడం మాకు ఏనాడూ అలవాటు లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని చూసే వారి ఆటలు సాగనివ్వం. ఒక సెంట్రల్ ఎజెన్సీ వచ్చిన తర్వాత లోకల్ పోలీసులకు ఇన్ఫాం చేస్తారు. దానికి సంబంధించి ఈ రోజు విశాఖ సీపీ కూడా వివరణ ఇచ్చారు. ఈనాడు రాతలకు తలాతోక ఉందా?: ఈ రోజు ఈనాడు పత్రికలో రాసిన రాతలకు తలా తోక ఉందా? రామోజీరావు ప్రజల సొమ్ముతో మార్గదర్శితో అవినీతి రాజ్యం నడిపి దందా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గంగవెర్రులెత్తిపోయి ఏ రాస్తున్నారో తెలియకుండా రాస్తున్నాడు. చంద్రబాబు స్కిల్ స్కాం కూడా జగన్ గారే చేశారనే అంటాడేమో? వైజాగ్‌లో వైఎస్సార్సీపీ నేత అడ్డుకోవాలని చూశారు అంటాడు. ఎవరో పేరు రాయవచ్చుగా. ఆధారాలు చూపించవచ్చుగా? ఆధారాలు లేకుండా ఎలా నోటికొచ్చినట్లు రాస్తాడు? పోలీసులు అడ్డుపడ్డారని రాశాడు. అది ఎక్కడో రాయవచ్చుగా? ఒక పత్రికగా వార్త రాసేటప్పుడు ఇలాంటి రాతలు రాయడం విడ్డూరం. సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? వ్యవస్థలపైనే గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. తాను ప్రతిపక్షంలో ఉంటే లోకమంతా చండాలంగా ఉందంటాడు. తను రూలింగ్‌లో ఉంటే అంతా బాగుంది అంటాడు. ఇతని మాదిరిగా పంచాయితీలు చేసే లక్షణం జగన్ గారికి లేదు. వీధి స్థాయి మనస్థత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. అదే అందరికీ ఉందన్నట్లు చూపాలని చూస్తాడు. జగన్ గారు అలాంటి వ్యక్తి కాదు. ప్రభుత్వంలో ఉన్నా వ్యవస్థలు వాటి అవి చేసుకుని పోవాలని కోరుకుంటారు. ఒక వేళ ఎవరన్నా ఇలా చేశారని అంటున్నప్పుడు ఆధారాలు చూపాలి. నోరుంది కదా, పేపర్ ఉంది కదా..జనంలోకి అబద్ధాలు పంపితే నమ్మే కాలం కాదిది. మీరు ఏది రాస్తే అది జనం నమ్ముతారనుకుంటే పొరపాటే. ఆ ఇంగితం రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబులకు ఉండాలని కోరుకుంటున్నా -
నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారు..
-
సీబీఐ వాళ్లు పిలిస్తేనే పోర్టుకు వెళ్ళాం
-
విశాఖ డ్రగ్స్ కేసు:‘వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. కాగా, రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్ సిటి. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్ యాక్ట్ సాయంతో డ్రగ్స్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
విశాఖ డ్రగ్స్ రాకెట్ లో టీడీపీ ముద్ర..
-
దొరికిపోయిన వారసులు..డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు
-
నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలతో డ్రగ్స్ లింకులు..
-
విశాఖ డ్రగ్స్: డామిట్ కథ అడ్డం తిరిగింది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌పై పనిగట్టుకుని పచ్చ బ్యాచ్ మళ్లీ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు అండ్ కో టీమ్ రెడీగా ఉంటుంది కదా. అందులో భాగంగా మరో కొత్త నాటకానికి ప్లాన్ చేసింది.కానీ, ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే అసలు విషయం బట్టబయలైంది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికార పార్టీ హస్తం ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి. ::చంద్రబాబు ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చింది. ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి. ::: పవన్ కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ వ్యవహారంలో.. నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లో కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు ఆయా కుటుంబాలకు ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని తేలింది. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు గీతం భరత్ కుటుంబం తోను వీరభద్రరావు కు సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలు తో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయబోయి పచ్చ బ్యాచ్ కంగుతింది. దర్యాప్తులో వేళ్లన్నీ తమవైపే చూపిస్తాయని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు విశాఖ తీరానికి చేరిన సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో బయటపడిన దొంగలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు! ఈ డ్రగ్స్ స్కాంలో @JaiTDP నేతలకు నేరుగా లింకులు! టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు & రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలు. కాగా దామచర్ల సత్య,… pic.twitter.com/bBmfqar1az — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 కూనం వీరభద్రరావు అసలు చరిత్ర.. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కునం వీరభద్రరావుకి ఘనమైన చరిత్రే ఉంది. ప్రకాశం జిల్లాకి చెందిన ఇతను దగ్గుబాటి పురందరేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మరైన్లో పార్ట్నర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠపై బురదజల్లడం, దాని ద్వారా లబ్ధిపొందాలని చూడటం నీకు అలవాటే గా @ncbn! విశాఖలో దొరికిన డ్రగ్స్ విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ సంస్థకు చెందిందని, దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం… https://t.co/Ozx79Yhs7Q pic.twitter.com/EOAzOwdwAy — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో టీడీపీ నేతలకు నేరుగా సంబంధాలున్నట్టు సమాచారం. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయులు, రాయపాటి జీవన్‌లతో నిందితుడు కోటయ్య చౌదరి దగ్గరి సంబంధాలున్నాయి. కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్‌కు కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశముంది. Whats up ‘Telugu Drugs Party’ @JaiTDP!#TeluguDrugsParty pic.twitter.com/XgtpowH6r0 — YSR Congress Party (@YSRCParty) March 21, 2024 డ్రగ్స్ కంటైనర్‌పై సంధ్యా ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ రొయ్యల మేతలో వాడే ఈస్ట్‌ను తొలిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండటంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్లో డబ్బు చెల్లించాం. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయల్దేరి మార్చి 16న విశాఖకు వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ సమక్షంలో కంటైనర్‌లోని డ్రగ్‌ను టెస్ట్ చేశారు. నిషేదిత డ్రగ్‌గా సీబీఐ అనుమానిస్తోంది. మా ప్రమేయం ఏమీ లేదు. విచారణకు సహకరిస్తాం. రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం అని వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం.. విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి' -
విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్...'కేరాఫ్ కోటయ్య చౌదరి'
విశాఖ సిటీ/ సాక్షి, అమరావతి: అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్‌తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిదీ కంటైనర్.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ, వ్యాపార సంబంధాలూ బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన ‘జిన్ లియన్ యన్ గ్యాంగ్’ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్‌లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ గల కంటైనర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి ఒక ఈ–మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్‌కుమార్‌తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్‌తో ఈ నెల 19వ తేదీ ఉదయం 8.15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సీబీఐ డీఎస్పీ సంజయ్‌కుమార్ సమల్‌తో కలిసి విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్‌పోల్ సమాచారమిచ్చిన నంబర్ గల కంటైనర్‌ను స్వా«దీనం చేసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు సదరు కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.వి.ఎల్.ఎన్.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు. కంటైనర్‌లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగ్‌లు మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సులలో వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్స్ నుంచి ఒక్కో బ్యాగ్‌ను కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే బయటకు తీశారు. ఆ బ్యాగుల్లో పచ్చ రంగులో ఉన్న పౌడర్‌ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించారు. 20 బ్యాగుల్లో పౌడర్‌ను పరీక్షించిన సీబీఐ అధికారులు విస్తుపోయారు. ఈ పౌడర్‌లో కొకైన్, మెథాక్వాలోన్, ఓపియం, మారిజోనా, హాషిష్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు రెండు వేర్వేరు పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. తాము తొలిసారిగా వీటిని దిగుమతి చేసుకున్నామని, అందులో ఉన్న పదార్థాల గురించి తమకు తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తిరిగి సీబీఐ బృందం 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకొని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఇతరుల సమక్షంలో మరికొన్ని బ్యాగులను పరీక్షించారు. అన్నింటిలోను మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా.. వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్యా ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్విడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్యా ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కూడా ఉల్లంఘించినట్టు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలను గుర్తించి కేసు నమోదు చేసి సంధ్యా ఆక్వా కంపెనీని సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్ ఏంజెలిస్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం.