బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ | Actress Hema Drug Test Reports Latest Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Hema: డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్.. నటి హేమ వైరల్ వీడియో

Published Tue, Aug 20 2024 3:27 PM | Last Updated on Tue, Aug 20 2024 6:40 PM

Actress Hema Drug Test Reports Video Latest

కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ, పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశమైంది. దాదాపు 86 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. ఇందులో హేమ కూడా ఒకరని చెప్పిన పోలీసులు.. రెండుసార్లు నోటీసులు పంపించారు. ఎంతకీ రాకపోవడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా హేమ మరో వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)

బెంగళూరు రేవ్ పార్టీ విషయమై మాట్లాడుతూ.. తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.

మరి హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే.. పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే.. ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్ట్‌లకైనా రెడీ అయిన వీడియో పెట్టింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందోనని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్..నీకోసమే ఈ వీడియో.. హేమ సంచలన వ్యాఖ్యలు

(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement