Hema
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు రిలీఫ్
బెంగళూరు రేవ్ పార్టీ (Bengaluru Rave Party) కేసులో టాలీవుడ్ నటి హేమకు(Hema) రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.కాగా.. గతంలో రేవ్ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హేమ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే విధించింది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.మా సస్పెన్షన్ ఎత్తివేత..బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
హేమ డ్రగ్స్ కేసుపై కర్ణాటక హైకోర్టు స్టే
-
పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా హేమ, సురేఖవాణి!
-
కలర్ ఫుల్
సరస్సులో నుంచి తీసుకొచ్చిన తెల్లటి కలువను చూసుకుంటున్న యువతులు, ప్రకృతిలో పూసిన పూలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఫ్లవర్‌పాట్, కొండల బారుల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది, విశాలమైన సరస్సుకు ఈ ఒడ్డున రంగురంగుల పూలరెమ్మతోపాటు ఆవలి ఒడ్డున సుదూరంగా కనిపించీ కనిపించకుండా ఉన్న కొబ్బరిచెట్లు, పార్కులో చక్కగా వరుసగా విరగబూసిన చెట్లు, కొండలమీద నుంచి నేలకు దూకుతూ కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తున్న తెల్లటి జలధారలు, కలర్ పాలెట్‌లోని రంగులన్నింటినీ వంతుల వారీగా అద్దుకున్న చెట్లు... ఏ బొమ్మ చూసినా ప్రకృతికి ప్రతిబింబంగానే కనిపిస్తుంది. హేమనళిని చిత్రాలను చూస్తే ప్రకృతిని ఆవిష్కరించడానికే ఆమె కుంచె పట్టుకుందా అనిపిస్తుంది.హైదరాబాద్‌కు చెందిన హేమనళినీ రెడ్డి ఇలస్ట్రేటర్, ఫొటోగ్రాఫర్, రైటర్ కూడా. ఆర్టిస్టుగా బిజీగా ఉన్న హేమనళిని సైన్స్ స్టూడెంట్. ఐఐటీ బాంబేలో కోర్సు పూర్తయిన తరవాత మైక్రో బయాలజీ లెక్చరర్‌గా కెరీర్ మొదలు పెట్టారామె. భర్త ఉద్యోగరీత్యా యూఎస్‌లో అడుగుపెట్టిన హేమ కెరీర్లో ఓ విరామం. ఆ విరామం ఆమెను ప్రకృతి ప్రేమికురాలిని చేసింది. అత్యంత చల్లని వాతావరణంలో చెట్ల ఆకులు కూడా పూలలాగ గులాబీరంగును సంతరించుకోవడం వంటి ఆశ్చర్యకరమైన మార్పులు ఆమెను మళ్లీ కుంచె పట్టుకునేలా చేశాయి.కుంచె కవనంఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా, చింతలపూడి సమీపంలోని పోతునూరు మాది. గోదావరి జిల్లాల్లో నేను చూసిన ప్రకృతి సౌందర్యం ఒక పార్శ్వం అయితే యూఎస్‌లో చూసిన వైవిధ్యత మరో పార్శ్వం. నాకు ఫొటోలు తీయడం కూడా హాబీ. నా మనసుకు నచ్చిన ఒక్కో ప్రకృతి దృశ్యాన్ని ఫొటో తీసుకోవడం, ఆ చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరించడమే నా లైఫ్‌గా మారింది. సైన్స్ స్టూడెంట్‌గా జీవం–జీవితం నాకిష్టమైన అంశాలు. దాంతో నా చిత్రాలు ప్రకృతి–జీవితం ఇతివృత్తాలుగానే సాగుతున్నాయి. నా చిన్నప్పుడు ఎస్సే రైటింగ్‌తోపాటు రంగోలీలో బహుమతులందుకున్నాను. బొమ్మలు వేయడంలో పెద్ద ప్రావీణ్యం లేదు కానీ వేసేదాన్ని. పై చదువుల బిజీలో పడి వదిలేసిన కుంచెను అమెరికాలో పట్టుకున్నాను. పచ్చదనానికి చిరునామా అయిన మనదేశంలో చెట్లు అన్ని షేడ్లలో ఉండవు. అక్కడి ప్రకృతి వైవిధ్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా చెట్లు కొత్త రంగులను సంతరించుకోవడం, మనదేశంలో చూడని అనేక షేడ్లను అక్కడి చెట్లలో చూశాను. విదేశాల్లో ఉన్న ఐదేళ్లలో అనేక ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాను. యూఎస్‌లో షికాగో, మాసాచుసెట్స్, మిషిగన్తోపాటు సింగపూర్, అబుదాబి, దుబాయ్‌లలో చిత్రాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా కుంచెను వదల్లేదు.చిత్రం... అందమైన మాధ్యమంసామాజికాంశాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కళ్లకు కట్టడానికి చిత్రం గొప్ప మాధ్యమం. సమాజాన్ని చైతన్యవంతం చేయగల శక్తి ఆర్టిస్ట్‌కి ఉంటుంది. చిత్రాలతో చారిటీ షోలు నిర్వహించి పేదపిల్లలకు సహాయం చేయవచ్చు. ఆర్టిస్టులు టెక్నాలజీతోపాటు ఎదుగుతూ కళకు సొబగులద్దాలి. తమ కళను విశ్వవ్యాప్తం చేసుకోవాలి. ఈ తరంలో సోషల్‌మీడియా అందుకు సరైన వేదిక. ఆన్లైన్ వేదికగా నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోటీలో వారిచ్చిన సమయంలోనే బొమ్మ పూర్తి చేసి అవార్డు అందుకోగలిగాను. బాంబే ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ‘కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, 75 ఇయర్స్ ఆఫ్ ఆర్ట్’ ఆన్లైన్ ఎగ్జిబిషన్ ద్వారా నా చిత్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక సాహిత్యం పట్ల ఆసక్తి కొద్దీ బాలాంత్రపు వెంకటరమణ గారి రచనలకు వేసిన చిత్రాలు ఆర్టిస్ట్‌గా నాకు పరిపూర్ణతను తెచ్చాయనిపించింది. ఇంటర్నేషనల్ ‘కళారత్నం’ మహిళా ప్రతిభా పురస్కారం, విశిష్ట కళారత్న వంటి గుర్తింపులనెన్నింటినో అందుకున్నాను. అన్నింటినీ మించిన ఆనందం... వడ్డాది పాపయ్య, బాపు వంటి మహోన్నత చిత్రకారుల గురించి వెలువరించిన ‘ఆర్ట్ ఆఫ్ ఏపీ’ పుస్తకంలో నాకు చోటు దక్కడం’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆర్టిస్ట్ హేమ నళిని.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్
బాలీవుడ్లో ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ బిగ్‌బాస్ షూటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ రెండోవారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీక్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హేమ శర్మ ఎలిమినేట్ అయింది.బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన హేమ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఎలాంటి సినిమాకుటుంబ నేపథ్యం లేదని తెలిపింది. నా పర్సనల్ లైఫ్‌లో అన్ని కష్టాలు అనుభవించానని వెల్లడించింది. కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదని..కష్టపడి ఇక్కడి దాకా వచ్చానని హేమ శర్మ పేర్కొంది.నేను చేసిన పెద్ద తప్పు అదే..హేమ శర్మ మాట్లాడుతూ.. ' నా కష్టంతో సొంతంగానే ఎదిగాను. ఎవరైనా నన్ను దూషిస్తే అస్సలు అంగీకరించను. నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశా. నా కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా. అందులో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఉన్నాయి. నేను చేసిన తప్పులను అంగీకరిస్తున్నా. అంతే కాదు.. ఎవరూ కూడా నాలాగా ఆ తప్పులు చేయకూడదని కోరుకుంటున్నా. రెండుసార్లు వివాహం చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే తప్పుడు వ్యక్తులను నా జీవితంలోకి ఆహ్వానించా' అని తెలిపింది.బిగ్ బాస్ -18 కంటెస్టెంట్‌గా ఛాన్స్హేమ శర్మ తన కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఆమె వీడియోలతో నెట్టింట ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. అందువల్లే బిగ్‌బాస్ సీజన్-18లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసింది. కాగా.. ప్రస్తుత సీజన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. -
హేమ కమిటీపై తన్వి రామ్ సంచలన కామెంట్స్..
-
మీ దగ్గరికే వస్తా టెస్టులు చేయించండి.. హేమ కొత్త వీడియో
నటి హేమ మరో వీడియో రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన వైపు ఎలాంటి తప్పు లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి సిద్ధమని మీడియాకి రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదన అంతా బయటపెట్టింది.హేమ కొత్త వీడియోకొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ దొరికింది. కానీ ఆ టైంలో తాను వేరే చోట ఉన్నానని బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే హేమ అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని పోలీసులు తేల్చారు. కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమని అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఈమెపై ఈ మధ్య మరోసారి డ్రగ్స్ పాజిటివ్ వార్తలొచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందిస్తూ హేమ కొత్త వీడియో రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)హేమ ఏం చెప్పింది?'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ని తీసుకొచ్చి మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఛార్జీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి''ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అని హేమ దాదాపు 6 నిమిషాల వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితీ రావ్ హైదరీ) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
ఎవరిని వదిలిపెట్టను వార్నింగ్ ఇచ్చిన హేమ
-
నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్
-
గుడ్‌న్యూస్ అంటూ వీడియో రిలీజ్ చేసిన హేమ
బెంగళూరు రేవ్‌పార్టీ ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. బెంగళూరు పోలీసులు బ్లడ్ షాంపిల్స్ కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. అయితే,ఛార్జీషీట్లో తన పేరు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు.డ్రగ్స్ తీసుకున్న హేమబెంగళూరు పోలీసులు మాత్రం నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారని మరోసారి ఛార్జ్‌షీట్ ద్వారా తెలిపారు. ఈ మేరకు 1086 పేజీలతో ఛార్జ్‌షీట్‌ను రెడీ చేసిన పోలీసులు కోర్టుకు అందించారు. హేమ ఫ్రెండ్ వాసు అనే వ్యక్తి ఆహ్వానించడం వల్లే ఆమె రేవ్ పార్టీకి వెళ్లినట్లు బెంగుళూరు పోలీసులు పేర్కొన్నారు.చార్జిషీట్లోనూ నెగెటివ్తాజాగా హేమ.. గుడ్‌న్యూస్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అఫీషియల్ చార్జిషీట్లోనూ నాకు నెగెటివ్ వచ్చిందని రాశారు. అనవసరంగా నాపై కొందరు నిందలు వేస్తున్నారు. నేను ఎవర్నీ వదిలిపెట్టను. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాను అని వీడియోలో మాట్లాడారు. ఈ వీడియో కింద నెటిజన్లు ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా బాబూ అని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు
బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ వివాదంలో చిక్కుకున్న టాలీవుడ్ నటి హేమకు చిక్కులు తప్పడం లేదు. ఈ రేవు పార్టీపై విచారణ చేపట్టిన బెంగళూరు పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో 88 మందిని నిందితులుగా వారు పేర్కొన్నారు. అయితే నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీలతో వారు ఛార్జ్‌షీట్ రెడీ చేశారు.ఇదీ చదవండి: ధనుష్‌పై రెడ్‌కార్డ్ ఎత్తివేత.. కొత్త ప్రాజెక్ట్‌లకు లైన్ క్లియర్బెంగళూరు రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఛార్జ్‌షీట్‌తో వారు పొందుపరిచారు. హేమతో పాటు 79 మందిని నిందితులుగా చేర్చారు. పార్టీ నిర్వహించిన మరో 9మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్- 27 కింద హేమను నిందితురాలిగా ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే, హేమతో పాటు రేవ్ పార్టీకి హాజరైన మరో నటుడికి డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్ వచ్చింది. బెంగళూరు పోలీసులు తాజాగా అందించిన ఛార్జ్‌షీట్‌తో నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది.హేమకు షాకిచ్చిన పోలీసులుబెంగళూరు రేవు పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పలు మీడియా సంస్ధల ఇంటర్వ్యూలలో నటి హేమ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె డ్రగ్స్ తీసుకున్నారంటూ తాజాగా ఛార్జ్‌షీట్‌లో తన పేరు చేర్చి షాకిచ్చారు. దీంతో ఆమెకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. ఈ వివాదం నుంచి ఆమె ఎలా బయటపడుతారంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.సినీ నటి హేమపై 'మా' నిర్ణయం ఎటు..?'హేమ' చెబుతున్న మాటల వల్ల కొద్దిరోజుల క్రితం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) కూడా ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో డ్రగ్స్ నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై వాటిని 'మా'కు కూడా ఒక కాపీ పంపింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసిందని కూడా తెలిపింది. దీంతో ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను మా ఎత్తివేసింది. ఇప్పుడు ఆమె పేరు ఛార్జ్‌షీట్‌లో ఉండటంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. -
మాలీవుడ్‌లో మీ టూ : ‘మాకు ఆ విషయం చెప్పలేదు’
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.రాజీనామా చేయని ఇద్దరు?అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.అసలేంటి హేమ కమిటీ?ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. -
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని మలయాళ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన హేమ కమిటీ నివేదికపై స్పందించారు. అంతే కాకుండా అలాగే కోల్‌కతా వైద్యవిద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన తనను కలిచివేసిందన్నారు.నాని మాట్లాడుతూ..' ఢిల్లీ నిర్భయ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలు నిరంతరం కలవరపెడుతున్నాయి. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిని సంఘటన నన్ను కలచివేసింది. మొబైల్‌ను స్క్రోలింగ్ చేయాలంటే భయంగా ఉంది. సోషల్ మీడియాలో ఎలాంటి వార్త చూడాల్సి వస్తుందో అన్న భయమేస్తోంది. హేమకమిటీ నివేదిక చూసి నేను షాకయ్యా. మహిళలపై లైంగిక వేధింపులు చూస్తుంటే ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నామో అర్థమవుతోంది. తన సెట్స్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదు. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి మెరుగ్గా ఉండేది. అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పటి పరిస్థితులు తలచుకుంటేనే చాలా దారుణంగా ఉందనిపిస్తోంది' అని అన్నారు. కాగా..నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
హేమ కమిటీ రిపోర్ట్.. ఆశ్చర్యం కలగలేదన్న సలార్ నటుడు!
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
హేమ సస్పెన్షన్ ను ఎత్తివేసిన మా అసోసియేషన్..
-
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
పవన్..నీకోసమే ఈ వీడియో.. హేమ సంచలన వ్యాఖ్యలు
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ
కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమ, పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశమైంది. దాదాపు 86 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. ఇందులో హేమ కూడా ఒకరని చెప్పిన పోలీసులు.. రెండుసార్లు నోటీసులు పంపించారు. ఎంతకీ రాకపోవడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా హేమ మరో వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)బెంగళూరు రేవ్ పార్టీ విషయమై మాట్లాడుతూ.. తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.మరి హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే.. పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే.. ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్ట్‌లకైనా రెడీ అయిన వీడియో పెట్టింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందోనని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని) View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
మాలీవుడ్ ‘తెర’ వెనుక కన్నీటి చార
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇదీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.కమిటీ నివేదికలో సంచలన విషయాలు‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మందికొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేసర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.– ఫణికుమార్ అనంతోజుకమిటీ సిఫార్సులు→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. -
మంచు విష్ణుకు హేమ బహిరంగ లేఖ
-
ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర్లో ఉన్న జీఆర్ ఫాంహౌస్‌లో మే 19న రాత్రి జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. అక్కడ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయిని పరప్పన అగ్రహార జైలుకు ఆమెను తరలించడం ఆపై బెయిల్ ద్వారా విడుదల కావడం జరిగింది. కానీ, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం వల్ల ఆమెను మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా హేమ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి మంచు విష్ణుతో పాటు మా వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి పంపారు.'సుమారు పదేళ్ల పాటు నేను మా సభ్యురాలిగా ఉన్నాను. చిత్రపరిశ్రమలో 'మా' ఒక అమ్మలా నన్ను రక్షిస్తుందని కోరుకుంటున్నాను. దాదాపు నెల రోజుల క్రితం ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నాను. అందులో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో నా కుటుంబసభ్యులకు తీవ్రమైన వేదన మిగిలింది. అనంతరం నన్ను మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ నిర్ణయం నాలో అంతులేని ఆవేదనను కలిగించింది. 'మా' బైలాస్ ప్రకారం నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. నా నుంచి వివరణ తీసుకోవాలి. నేను ఇచ్చిన వివరణలో లోపాలు ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. నాపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కోర్టు కూడా నేను తప్పు చేసినట్లు ప్రకటించలేదు. మీడియా మాత్రమే నన్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని హాననం చేసింది.నాకు సంబంధం లేని విషయాలను నాకు అంటగట్టి నన్ను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. మీడియా ఒత్తిడికి లోబడి నన్ను సస్పెండ్ చేయడం నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న ఈ సమయంలో నాకు మా అండగా ఉండాలి. నా సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేస్తారు అని ఆశిస్తున్నాను.' అని హేమ ఒక లేఖ రాశారు. తనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఆమె జతచేశారు. ఈ లేఖ విషయంలో మా అధ్యక్షడు మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్ నటి హేమ (ఫోటోలు)
-
హేమ బుకాయింపు..
-
‘ఏం జరిగిందో మీకే తెలియాలి'.. తిరుమలలో నటి హేమ వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుంది. అనంతరం ఆలయం బయటకు వచ్చిన హేమ మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దర్శనం బాగానే జరిగింది.. రేవ్ పార్టీపై అనేక కథనాలు రాశారు కదా.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది.దొరికిపోయిన హేమకాగా గత నెలలో బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది. ఈమె పేరు బయటకు రావడంతో.. తనకు ఆ పార్టీతో సంబంధం లేదని హైదరాబాద్‌లో ఉన్నానని, బిర్యానీ వండుతున్నానంటూ వీడియోలు రిలీజ్ చేసి తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ అబద్ధాలేనంటూ పోలీసులు రేవ్ పార్టీలో దొరికిన హేమ ఫోటోను రిలీజ్ చేశారు. అలాగే తనకు వైద్య పరీక్షలు చేయించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఇటీవలే బెయిల్దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరైన సమయంలో ఆమెను అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితమే హేమ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇకపోతే డ్రగ్స్ కేసులో అరెస్టయిన కారణంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!
సినిమాలో హీరోహీరోయిన్‌కి కష్టాలు ఉండటం కామన్. కానీ ఇప్పుడు వాళ్లకు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు వీటిని కోరి తెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇండస్ట్రీలో మూడ్ మారిపోయింది. ఎంతలా అంటే సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లు కాస్త సెలబ్రిటీలని ఊహించని చోట చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?దర్శన్ కేసుకన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ఈ మధ్య కాలంలో దీనంత షాకింగ్ సంఘటన మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు గురించి సింపుల్‌గా చెప్పుకొంటే.. దర్శన్‌కి ఇదివరకే విజయ్ లక్ష్మితో పెళ్లయింది. కానీ పవిత్ర గౌడ అనే నటితో గత కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలతలకు ఈమెనే కారణమని భావించిన ఓ అభిమాని.. పవిత్రకు అసభ్యకర ఫొటోలు, వీడియోలని పంపించాడు. దీంతో పవిత్ర, ఈ విషయాన్ని దర్శన్‌కి చెప్పగా ఇతడు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పవిత్ర-చందు మరణాలుతెలుగు సీరియల్ 'త్రినయని'లో కీలక పాత్ర పోషిస్తున్న నటి పవిత్ర జయరాం.. కొన్నిరోజుల క్రితం సొంతూరి నుంచి హైదరాబాద్‌కి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెని ప్రేమిస్తున్న సహ నటుడు చందు.. ఈమె మరణాన్ని తట్టుకోలేక పవిత్ర చనిపోయిన రెండు మూడు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు అందరికీ షాకయ్యేలా చేశాయి.డ్రగ్స్ కేసులో హేమ టాలీవుడ్లో డ్రగ్స్, రేవ్ పార్టీ లాంటివి అప్పుడప్పుడు వినిపించే మాటలు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉండటం, ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఎన్నడూ లేనిది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు దక్షిణాదిలో పలు షాకింగ్ సంఘటనలు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కొన్ని స్వీయ తప్పిదాలు ఉండగా, మరికొన్ని అనుకోకుండా జరిగినవి. మరి వీటికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడేళ్లుగా కనిపించని దర్శన్ మేనేజర్.. కారణం ఏంటి..?) -
బెంగళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి హేమ విడుదల
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ ఇవాళ విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా.. బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి హేమ బెయిల్ కోసం పిటిషన్ వేయగా స్థానిక కోర్టు మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
నటి హేమకు బెయిలు మంజూరు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు తాజాగా బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఆమెప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. హేమ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసే విషయమై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ΄్యానెల్ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారట. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ‘మా’ కార్యదర్శి రఘుబాబు ఓ లేఖ విడుదల చేశారు.మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల నివేదికలో నిర్ధారణ కావడంతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు ‘మా’ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు, విచారణ తేలేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందన్నట్లు హేమకు ‘మా’ లేఖ పంపినట్లు తెలిసింది. -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
-
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
హేమను ఒక్కరోజు విచారించండి చాలు: కోర్టు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమను విచారించేందుకు బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులకు అనుమతి లభించింది. బెంగళూరు నగర శివార్లలో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షకు పంపించగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది.సీసీబీ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపగా ఎట్టకేలకు హేమ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనేకల్ న్యాయస్థానం ముందు ఆమెను పోలీసులు హాజరుపరిచారు. హేమను విచారించేందుకు మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం మాత్రం 24 గంటల పాటు ఆమెను విచారిస్తే చాలని తెలిపింది. ఆపై గురువారం సాయంత్రం ఐదుగంటలకు మళ్లీ కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు సూచించింది. -
హేమ సభ్యత్వం రద్దు చేసే యోచనలో ‘మా’?
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు ఇప్పటికే సందేశం పంపించారు. ఆమె సభ్యత్వం సస్పెండ్‌కు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందిగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ క్లీన్ చిట్ రాకపోతే మాత్రం శాశ్వతంగా రద్దు చేసే ఆస్కారం లేకపోలేదు. మా నిర్ణయం ఏంటన్నది రేపు మధ్యాహ్నం అధికారికంగా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించనున్నారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.#Tollywood actress #Hema has been arrested by @CCBBangalore wen she came in Burqa to appear today after two notices in related to to Rave party which was held in #anekal, #bengaluru . Including Hema, more than 80+ people tested positive with Drug in 101 samples collected. pic.twitter.com/qxvQAUIFtx— Madhu M (@MadhunaikBunty) June 3, 2024 -
నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్ -
పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
రేవ్ పార్టీ.. నోటీసులను లెక్కచేయని హేమ
-
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. -
వైరల్ ఫీవర్ పేరిట పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
-
తప్పు చేయకపోవడానికి మేమేం దేవుళ్లం కాదు.. హేమ మరో వీడియో
ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నటి హేమ ఇందులో ఉండటంతో అందరూ ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకి హాజరు కావాలని హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. సోమవారమే దీనికి హాజరు కావాల్సి ఉండగా, తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి డుమ్మా కొట్టింది. మరోవైపు ఈమెకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)వీడియోలో ఏముందంటే?'మనమేం దేవుళ్లం కాదు. ఒకవేళ తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం చాలా ఫ్రెష్‌గా ఉంటాం. అలానే అబద్దం చెబితే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్దాలు ఆడాలి. అందుకని 99.9 శాతం అబద్దాలు ఆడకుండా ఉంటే బెటర్. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నానని' హేమ చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇదంతా కూడా డ్రగ్స్ కేసు గురించేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.కేసు సంగతేంటి?మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌసులో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి దాదాపు 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్లలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేయగా, తాను రాలేకపోతున్నానని మరికొంత సమయం కావాలని లేఖ రాసింది. కానీ దీన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా మరోసారి నోటీసులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
డ్రగ్స్ కేసులో ఎంతోమంది దొరికినా సినీ పరిశ్రమ పైనే ఎందుకు టార్గెట్ ?
-
విచారణకు రాలేనంటూ లేఖ రాసిన హేమ
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్‌లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ నేడు మే 27న విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేనని లేఖ ద్వారా తెలిపింది.వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు లేఖ ద్వారా పోలీసులకు హేమ తెలిపింది. అయితే ఆ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని హేమ కోరింది. అయితే, నేడు సాయంత్రం హేమకు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. -
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
నటి హేమ లవ్ స్టోరీ.. ఇంతకీ భర్త ఎవరో తెలుసా?
ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. అయితే ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మొదటి తాను పార్టీలో లేనంటూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత హేమకు పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.ఇదంతా పక్కనపెడితే.. టాలీవుడ్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలకు పైగా సినిమాల్లో నటించింది. విభిన్నమైన పాత్రలతో వెండితెరపై అలరించింది. ఇటీవల రేవ్ పార్టీలో హేమ పేరు రావడంతో ఆమె గురించి నెట్టింట చర్చ మొదలైంది. హేమ ఫ్యామిలీకి సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే హేమ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ అతనెవరో తెలుసా? ఆ వివరాలేంటో చూసేద్దాం.నటి హేమ లవ్ స్టోరీతూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి. తెలుగులో 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే హేమకి ఫేమ్ తీసుకొచ్చిన చిత్రం క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ.. శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేమకి మంచి గుర్తింపు దక్కింది.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమ. ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ కాగా.. గతంలో ఓ ఇంటర్య్వూలో తన లవ్ స్టోరీ గురించి నోరువిప్పింది. తాను దూరదర్శన్‌లో పనిచేసే సమయంలో అతను పరిచయమైనట్లు హేమ తెలిపింది. అక్కడే అతను అసిస్టెంట్ కెమెరా మెన్‌గా పనిచేసేవారని వెల్లడించింది. ఓసారి అతన్ని మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని పేర్కొంది. మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేకపోయానని హేమ వివరించింది. కాగా.. వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో హేమ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. -
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్
-
హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్‌లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024 -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూన పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్‌కు చెందిన సినీ నటి హేమ, ఆశూ రాయ్‌లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్,సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్‌లకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు..? ఇంకా ఎవరెవరితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఐదుగురుని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు
-
రేవ్ పార్టీ.. హేమకు మెసేజ్ చేశా.. తన గొయ్యి తనే తీసుకుంది: కరాటే కల్యాణి
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా ఉందంటూ తొలుత ఆమె పేరు బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన హేమ.. తూచ్, అంతా అబద్ధం, నేను హైదరాబాద్‌లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసింది. అంతలోనే బెంగళూరు పోలీసులు తన ఫోటో మీడియాకు వదిలారు. అయినా ఒప్పుకోలేదు, ఇంట్లో బిర్యానీ వండుతున్నట్లు మరో వీడియో బయటకు వదిలింది. ఎవరినీ క్షమించేది లేదని..నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు శాంపిల్ టెస్ట్‌లో హేమ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయింది. హేమ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో స్పందించింది. 'సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినా.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎవరినీ క్షమించొద్దని మా అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సూచించారు. తమవైపు పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గొడవలు..ఇంతలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీలో తన పేరు వినిపించగానే ఏంటక్కా, ఇది నిజమేనా? అని మెసేజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో శివబాలాజీని కొరకడం.. రాజేంద్రప్రసాద్‌గారిని అడ్డగించడం, నా మీద కూడా కేసు పెట్టి ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటుంది. నేను సరదాగా పేకాట ఆడితే ఎవరో ఇరికించారు. అయినా దీన్ని పెద్ద తప్పన్నట్లుగా హడావుడి చేసిన ఈమెకు దేవుడు వెంటనే శిక్ష వేశాడు.తన గోతి తనే తీసుకుందిఇప్పుడామె చేసిందే తప్పుడు పని.. తప్పుడు ప్లేస్‌లో దొరికి మళ్లీ బుకాయించడం దేనికి? హైదరాబాద్‌లో ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ సెల్ఫీ వీడియో తీసి పోలీసులను, మీడియాను తప్పుదోవ పట్టించావు. ఇది ఇంకో కేసు. నీ పాపులారిటీ ఇంకా తప్పుగా వాడుకుంటున్నావు. నీ గోయి నువ్వే తీసుకున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల -
డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల
బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులెవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు. అయితే, పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్‌ను వారు విడుదల చేశారు. దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లుఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.86 మందికి పాజిటివ్డ్రగ్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్‌గా తేలిందని కర్ణాటక పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త నమూనా పరీక్షలో నిర్ధారణ అయిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుందన్నారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సెలింగ్‌కు పిలిచే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.పేరు మార్చుకున్న హేమబెంగుళూరు డ్రగ్స్ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ట్విస్ట్‌లు ఇచ్చింది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హేమా, చిరంజీవి, ఆశి రాయికి బెంగుళూరు సీసీబి పోలీసులు నోటిసులు ఇవ్వనున్నారు.రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరొ వీడియోను విడుదల చేసింది. అయితే, తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్ కాలేదు. -
కవర్ చేద్దాం అని వీడియో చేసి దొరికిపోయిన హేమ
-
రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు
బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ అని ఈ రేవ్‌పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్‌పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్‌లోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్ సిటీ పీఎస్ నుంచి హెబ్బగోడి పీఎస్‌కు బదిలీ చేశాం. డ్రగ్స్ విసిరేశారు: రేవ్‌పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్‌పూల్, టాయ్‌లెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్‌సిద్దికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్‌బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్ తెలిపారు.నిందితుల అరెస్ట్రేవ్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్ బెట్టింగ్‌లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. -
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
"డ్రగ్స్ పార్టీలో హేమ" నిర్ధారించిన పోలీసులు
-
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్‌హౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్‌పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్‌పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో పార్టీ హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్‌ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్‌హౌస్‌ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్‌హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్‌లో తీసింది కాదని, ఆ ఫార్మ్‌హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. ఓ ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
-
బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధంలేదు: సినీ నటి హేమ
-
బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరలవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేసింది.చదవండి: Payal Rajput: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారుబెంగళూరులో రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖులు! -
సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత
సాక్షి. అమరావతి: రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంతోపాటు అటు రైతులను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేయడం, ఇటు యువతకు ఉపాధి కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. రాష్ట్ర ప్రగతికి తోడ్పడే ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. 35 శాతం సబ్సిడీతోపాటు కేవలం 6 శాతం వడ్డీకే రుణాలు లభించేలా ఏర్పాట్లు చేసింది. ఈ యూనిట్లకు రుణాలిచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. ఈమేరకు మంగళవారం సచివాలయంలో ఎస్బీఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) వి.హేమ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ. 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణాలు ఈ ప్రాజెక్టు కింద రూ.10లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 35 శాతం సబ్సిడీపై ఎస్బీఐ రుణం మంజూరు చేస్తుంది. రూ.10 లక్షల నుంచి రూ.కోటి అంచనా వ్యయంతో పెట్టే యూనిట్లకు మాత్రం పూచీకత్తుతో రుణాలు మంజూరు చేస్తారు. సబ్సిడీ 35 శాతం లేదా గరిష్టంగా రూ.10 లక్షలుగా నిర్ణయించారు. తాజా ఒప్పందం ద్వారా కనీసం 7,500 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఆధునికీకరణ, స్థాపనకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కుల, మత, లింగ భేదాల్లేకుండా 18 ఏళ్లు పైబడిన వారెవరైనా వ్యక్తిగత యూనిట్లు పెట్టుకోవచ్చు. యూనిట్ వ్యయంలో లబ్దిదారులు 10 శాతం వాటాగా భరిస్తే తొలుత 90 శాతం రుణంగా ఎస్బీఐ మంజూరు చేస్తుంది. రుణ ప్రక్రియ పూర్తి కాగానే ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీ జమ చేస్తుంది. 9 శాతం వడ్డీతో మంజూరు చేసే ఈ రుణాలపై అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఎఐఎఫ్) కింద అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే 6 శాతం వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయి. అంతేకాదు యూనిట్ ప్రారంభ దశలో 3 నెలలపాటు మారటోరియం వ్యవధి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద వ్యక్తిగతంగానే కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూడా సూక్ష్మ ఆహార శుద్ధి ప్రాజెక్టుల విస్తరణకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా అనకాపల్లి బెల్లం, గువ్వలచెరువు పాలకోవా, మాడుగుల హల్వా వంటి సంప్రదాయ ఆహార క్లస్టర్లలోని మైక్రో ప్రాసెసింగ్ యూనిట్లను అత్యాధునిక యంత్రాలతో అప్‌గ్రేడ్ చేయవచ్చు. గతేడాది రూ.8 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటైన 500 యూనిట్లకు 55 శాతం సబ్సిడీపై ఎస్బీఐ ఆర్థిక చేయూతనిచ్చి ంది. ఆహారశుద్ధి పరిశ్రమల విస్తరణ మరింత వేగం: చిరంజీవి చౌదరి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చిరంజీవి చౌదరి చెప్పారు. ఇటీవలే సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లకు ఆరి్ధక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పుడు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఎస్బీఐతో కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరం 500 యూనిట్లకు రుణాలిచ్చిన ఎస్బీఐ.. ఇప్పుడు పెద్ద ఎత్తున యూనిట్ల విస్తరణకు ప్రధాన రుణభాగస్వామిగా ఉద్భవించడం శుభపరిణామమన్నారు. పూచీకత్తు లేకుండా రూ.10లక్షల వరకు రుణాలిస్తామని ఎస్బీఐ డీజీఎం హేమ చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో ఏర్పాటయ్యే యూనిట్లకు మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డిప్యూటీ సీఈవో ఈ.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని చెప్పుకోవాలి
‘‘మా నాన్న వ్యవసాయ కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సం పాదన మా చదువులకు సరిపోదని విశాఖ వచ్చి పూర్ణామార్కెట్‌లో కలాసీగా పనిచేస్తున్నారు. నాకు మంచి మార్కులు వస్తున్నాయని, బాగా చదివించమని మా ఉ పాధ్యాయులు చెప్పడంతో నాన్న ఎప్పుడూ నా గురించే ఆలోచించేవారు. చాలీచాలని సం పాదనతో ఎలా చదివించాలన్నదే ఆయన ఆందోళన. అలాంటి సమయంలో నేను 8వ తరగతిలో ఉండగా మొదటిసారి అమ్మ ఒడి అందింది. వరుసగా మూడేళ్లు ఆ పథకం వల్ల లబ్ధి ΄పొందడం వల్ల నా చదువు ఎలాంటి భారం లేకుండా సునాయాసంగా సాగిపోయింది. మా పాఠశాల ఉ పాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధతో నన్ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది’’ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 594 మార్కులు సాధించి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థిని కామిరెడ్డి హేమశ్రీ మనోగతమిది. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి చదువుల సరస్వతిగా నిలిచింది. తల్లిదండ్రులకు, ఉ పాధ్యాయులకు మంచి పేరు తెచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన టెన్త్ టాపర్లు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి పుట్టుకొచ్చారు. అలాంటి టాపర్లలో ఈమె ఒకరు. ఆమెతో ‘సాక్షి’ సంభాషించింది. హేమశ్రీ ఎలా ఈ స్థాయికి చేరుకుందో ఆమె మాటల్లోనే.. నాన్న మాటలే స్ఫూర్తి ‘‘అమ్మ గోవిందమ్మ, మా నాన్న శ్రీనివాసరావు. నాన్న పదో తరగతిలో రెండు సబ్జెక్టులు ఫెయిల్. ప్రస్తుతం విశాఖలోని పూర్ణా మార్కెట్లో కలాసీ. ఓ రకంగా నాన్నే నా విజయానికి స్ఫూర్తి. తను బాగా చదవలేకపోవడం వల్లే టెన్త్ ఫెయిలయ్యారు. కలాసీగా రాత్రీపగలూ కష్టపడుతున్నారు. అదే మాకు పదేపదే చెప్పేవారు. తానెన్ని కష్టాలుపడ్డా.. అదంతా నా కోసం, నా తమ్ముడి కోసమేనని గుర్తు చేసేవారు. మా చదువులకు డబ్బులు అవసరమవుతాయనే ఆరేళ్ల క్రితం దేవరాపల్లి నుంచి విశాఖ వచ్చేశారు. నాన్న కష్టం తెలుసు. అందుకే చదువు తప్ప వేరే ధ్యాసలేకపోయింది. అదే నన్ను పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులతో టాపర్‌గా నిలిపింది. చదువంతా సర్కారీ స్కూల్లోనే.. ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకూ మా స్వగ్రామం దేవరాపల్లి మండలం కొత్తపెంటలోని మండల పరిషత్ ్ర పాథమిక పాఠశాలలో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలో 92 మార్కులు సాధించా. దీంతో అచ్యుతాపురం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ (గరల్స్)లో సీటు వచ్చింది. నా జీవితంలో నేను సాధించిన తొలి విజయమది. ఐదోతరగతి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడే. అమ్మానాన్నల కష్టం తెలియడంతో వారికి ఏ రోజూ నా చదువు భారం కాకూడదనుకున్నాను. ఎంత బాగా చదివితే.. నా చదువుకు అంత తక్కువ ఖర్చవుతుందని తెలుసుకున్నాను. దీనికి నా తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత తెలియడం ఒక కారణమైతే, మా స్కూల్ టీచర్లు మరో కారణం. ఇక్కడ చదువుతున్న వారిలో దాదాపు అంతా దిగువ మధ్యతరగతికి చెందిన వారే. అందుకే మా టీచర్లు చదువు విలువ తెలిసేలా, పరీక్షల భయం పోయేలా నిత్యం మమ్మల్ని ్రపోత్సహించారు. వసతులు పెరిగాయి సాధారణంగా రెసిడెన్షియల్ స్కూళ్లు మిగిలిన ప్రభుత్వ స్కూళ్లతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గానే ఉంటాయి. అయితే నా వ్యక్తిగత అవసరాలకు మొదటి మూడేళ్లు ఇంటి నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చేదాన్ని గత మూడేళ్లుగా పరిస్థితి చాలా మారింది. వసతులు మరింత మెరుగయ్యాయి. పర్యవేక్షణ పెరిగింది. పుస్తకాలు, యూనిఫాం, షూస్.. ఇలాంటి వాటి కోసం అమ్మానాన్నల్ని డబ్బులడిగే అవసరం లేకుండా పోయింది. మూడుసార్లు అమ్మ ఒడి అందుకున్నా. సీఎం జగన్ మామయ్య ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంజినీర్ కావడమే లక్ష్యం ఇంజినీర్ కావాలన్నది నా కల. అందుకు రూ.లక్షల్లో ఖర్చుపెట్టే స్థోమత నా కుటుంబానికి లేదు. బాగా చదవడమే ఖర్చులేని దారని నాకు తెలుసు. అందుకే టీచర్లు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకునేదాన్ని. అర్థంకాని విషయాల్ని ఎప్పుడు అడిగినా, టీచర్లు ఓపిగ్గా విడమరిచి చెప్పేవారు. నా తమ్ముడు సందీప్ ప్రస్తుతం 7వ తరగతి పూర్తి చేసుకున్నాడు. మా అమ్మానాన్నలకు మేం భరోసాగా నిలవాలన్నదే నా కోరిక. దాన్ని నెరవేర్చేందుకు చదువు తప్ప, నాకు వేరే మార్గం తెలియదు. ఇంజినీర్‌గా స్థిరపడి నాలాంటి వారికి ఆసరాగా నిలవగలిగితే చాలు. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని నలుగురూ చెప్పుకుంటే.. మా నాన్న కళ్లలో కనిపించే ఆనందాన్ని చూడాలి.. అంతే..!’’ మిట్టు.. సూపర్ హిట్టు టెన్త్‌లో 594 మార్కులు శ్రీకాకుళం జిల్లా (ఆంధ్రప్రదేశ్) పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన మిట్టు మహా పాత్రో 600కు 594 మార్కులు సాధించాడు. పాతపట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఎదురుగా ప్రధాన రహదారిలో వీరి ఇల్లు. మహా పాత్రో తండ్రి దుర్గాప్రసాద్ మహా పాత్రో ద్విచక్రవాహనాల టైర్లకు పంక్చర్లు వేస్తుంటారు. తల్లి మమత మహా పాత్రో గృహిణి. మిట్టు పాఠశాల సెలవుల్లోను, ఇంటి వద్ద ఉన్నప్పుడు సైకిల్‌కు, బైక్‌లకు పంక్చర్లు వేయడంలో తండ్రికి సహాయం చేస్తుండేవాడు. ఒడియా బ్రహ్మణ కుటుంబానికి చెందిన పేద కుటుంబం వీరిది. మిట్టుకు పదో తరగతిలోఅత్యధిక మార్కులు రావడంతో ఆ కుటుంబంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పాతపట్నంలో 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నా అత్యధిక మార్కులు మాత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన మిట్టు సాధించాడు. తన కుమారుడికి పదో తరగతిలో జిల్లా మొదటి స్థానం రావడంతో ఆనందంగా ఉందని తండ్రి దుర్గా ప్రసాద్ తెలి పారు. మిట్టు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ్ర పాథమిక ఒడియా పాఠశాలలో చదివాడు. – రవి కుమార్, సాక్షి పాతపట్నం ఇంజినీర్ అవుతా... అమ్మ, నాన్న, ఉ పాధ్యాయుల ్రపోత్సాహంతో పదో తరగతిలో మంచి మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీ చదివి, ఇంజినీర్ అవుతా. – మిట్టు మహా పాత్రో – లోవరాజు, సాక్షి, అనకాపల్లి. -
‘నేను నా భర్తతోనే ఉంటున్నాను, వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు’..
హిమాయత్‌నగర్: ప్రస్తుతం.. ‘నేను నా భర్తతోనే ఉంటున్నాను, వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు’. అసలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు నాపై పడి ఏడవాల్సిన అవసరం ఏముందని సినీనటి హేమ కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం మా వివాహ వార్షికోత్సవ వీడియోలను తాజాగా నేను రెండో పెళ్లి చేసుకున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. ఈమేరకు కొన్ని యూట్యూబ్ చానల్స్‌పై హేమ మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పలు కీలకమైన విషయాలను ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఆమె తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డబ్బు సంపాదించేందుకు కొందరు మూర్ఖులు కాపురాల్లో చిచ్చుపెడుతున్నారన్నారు. కోట శ్రీనివాసరావు చచ్చిపోయినట్లుగా, కొణిదల నిహారిక విడిపోయినట్లుగా, నాగచైతన్య నాగార్జునకు మధ్య గొడ వలు ఉన్నట్లుగా, నాకు వేరే వాళ్లతో సంబంధాలు ఉన్నట్లు తంబ్నెయిల్స్ పెడుతున్నారన్నారు. న్యాయపరమైన పోరాటం చేస్తానని, ఎవరినీ ఊపేక్షించనంటూ హెచ్చరించారు. -
సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. పోలీసులను ఆశ్రయించిన నటి
సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని సినీ నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత ఫోటోలు, వీడియోలకు ఫేక్ థంబ్‌నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీంతో పాటు ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు చనిపోయారని దుష్ప్రచారం చేయడంపై కూడా ఆమె ప్రస్తావించారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిపై తప్పుడు వార్తలు రాసి సొమ్ము చేసుకుంటున్నాయని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు) సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్నా.. ఆయనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వేధింపులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!
నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఎక్కువగా కమెడియన్ల సరసన నటించిన ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. భర్తను కనుసన్నల్లో పెట్టి ఆడించే భార్యగా హేమ పరకాయ ప్రవేశం చేసి నటించేది. అలా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య మా ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల నటించేందుకు సమయం లేదని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఇక ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకున్న నేపథ్యంలో తన వారసురాలిగా కూతురిని సినిమా రంగంలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హేమ కుతురి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి చాలా అందంగా ఉందని, ఈమెలో హీరోయిన్ కావాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే హేమ కూతురు పేరు ఇషా. ఆమె మీడియా, సోషల్ మీడియాకు దూరం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇషాకు 22 ఏళ్లు. ఇటీవల ఆమె బీబీఏ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక చదువు పూర్తి చేసుకున్న ఇషా సినిమాల్లో వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ, తన కూతురిని సినీ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని గతంలో హేమ చాలాసార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం విజయ్ సేతుపతితో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్ -
అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై అక్క, వదిన, భార్య వంటి పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎక్కువగా కమెడియన్ల సరసన నటించిన ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. భర్తను కనుసన్నల్లో పెట్టి ఆడించే భార్యగా హేమ పరకాయ ప్రవేశం చేసి నటించేది. అలా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. చదవండి: క్యాన్సర్ బారిన ఆటో రామ్ ప్రసాద్? క్లారిటీ ఇచ్చిన నటుడు గత మా ఎలక్షన్స్‌లో చురుగ్గా కనిపించిన ఆమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె తను సినిమాలు చేయకపోవడానికి కారణం వెల్లడించింది. కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ రెండవ బ్రాంచ్‌ను ఇటీవల మణికొండలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన హేమ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. చదవండి: ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ఈ సందర్భంగా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు ఎందుకు? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టాను. అందులో మంచి లాభాలు వస్తున్నాయి. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటు అయిపోయింది. కష్టపడటానికి ఇష్టపడటం లేదు అంతే’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అయితే అది ఎలాంటి బిజినెస్ అనేది మాత్రం ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ మాట దాటేసింది. -
రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్
-
రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్.. ‘భక్తి కోసం వచ్చా కాంట్రవర్సికి కాదు’
నటి హేమ ఇంద్రకిలాద్రి అమ్మవారిని మంగళవారం దర్శంచుకున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్‌పై ఆమె ఫైర్ అయ్యింది. నటి హేమ అమ్మవారి భక్తురాలు అనే విషయం తెలిసిందే. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆమె ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఆమె అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చదవండి: బిగ్‌బాస్ 6లోకి సుడిగాలి సుధీర్? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా! ఇక దర్శనం అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘అందరికి నమస్కారం. నేను మీ హేమను. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ప్రోటోకాల్ ఇబ్బంది అని, చాలా మంది జనాలు పోటేత్తి వస్తున్నారన్నారు. దీంతో ఈ ఏడాది రాలేనేమో అనుకున్నా. కానీ, అమ్మవారే ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు చాలా పుణ్యం చేసుకున్నారు. మీ అందరికి కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నాను’ అన్నారు. చదవండి: Prabhas Adipurush Teaser: కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్ ఈ క్రమంలో ఓ రిపోర్టర్ టికెట్స్ తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించగా.. సహనం కోల్పోయిన ఆమె అతనిపై సీరియస్ అయ్యారు. ‘మేం ఇద్దరం వచ్చాం. హుండీలో పది వేలు వేశాను. అమ్మవారికి 20 వేలు పెట్టి చీర తెచ్చాను. మీరు టికెట్ గురుంచి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతున్నాం. దీన్ని కాంట్రవర్శి చేయడం సరికాదంటూ’ అతడిపై మండిపడ్డారు. అంతేకాదు తాను భక్తి కోసం వచ్చానని, కాంట్రవర్సికోసం కాదంటూ ఘాటుగా స్పందించారు. -
సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్
నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ నటి సురేఖ వాణి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సురేఖ వాణి తన బెస్ట్‌ఫ్రెండ్ అని, తమలాగే తన కూతురు ఈషా, సురేఖ కూతురు సుప్రీత మంచి ఫ్రెండ్స్ అని తెలిపింది. అయితే వారిద్దరి స్నేహాన్ని చూసి ఓర్వలేక వారిద్దరిని విడగొట్టడానికి సురేఖవాణి ప్రయత్నించినట్లు హేమ పేర్కొంది. అందుకోసం తన కూతురిని స్కూల్ మార్పించిందని అయినా కూడా సుప్రియ కూతురు మళ్ళీ తన కూతురు చదివే స్కూల్‌కే వచ్చిందని, దానికి గల కారణం సుప్రీత బోల్డ్ గా ఉండటమే అంటూ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అంతేకాకుండా తను షూటింగ్లో ఉన్న సమయంలో తన గురించి సురేఖవాణి వేరే వాళ్లతో తప్పుగా మాట్లాడేదని, అందుకే ఆమెకు దూరంగా ఉన్నానంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
పబ్ వ్యవహారం: ‘జాబితా’పై హైడ్రామా!
సాక్షి, హైదరాబాద్: సినీ–వ్యాపార ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు పట్టుబడిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో హైడ్రామా చోటు చేసుకుంది. పబ్‌లో పట్టుబడిన అందరినీ ఆదివారం తెల్లవారుజామునే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక, రాజకీయవేత్తల కుమారులు, కుమార్తెలు అందులో ఉన్నారు. పోలీసులు ఉదయం 8.30–9.00 గంటల మధ్య వీరందరికీ నోటీసులు జారీచేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో రాహుల్ సిప్లిగంజ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇది చూసిన నిహారిక బయటికి రాకుండా మధ్యాహ్నం వరకు లోపలే ఉండిపోయారు. చివరికి 12 గంటల సమయంలో బయటికి వచ్చారు. మీడియా ప్రతినిధులు చుట్టుముట్టినా.. తనఫోన్‌లో మాట్లాడుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. అయితే పోలీసులు పబ్‌లో 142 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మధ్యాహ్నం అనధికారిక లిస్టును విడుదల చేశారు. అందులో నిహారిక పేరు లేకపోవడంతో.. ఆమెను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో సాయంత్రం అనధికారికంగానే మరో ప్రకటన చేసిన పోలీసులు.. నిహారికతోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా జోడించారు. దీనితో మొదట చెప్పిన జాబితా 142 నుంచి 148కి పెరిగింది. పబ్‌లో అదుపులోకి తీసుకున్నవారిలో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె సైతం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ జాబితాలో ఆ పేరు కనిపించలేదు. కాగా.. పబ్ వ్యవహారంలో తనకేం సంబంధం లేకున్నా ఓ చానల్ వాళ్లు తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి హేమ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద హల్చల్ చేశారు. -
డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్ (కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో 145 మందిని పంపివేయగా పోలీసుల అదుపులో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని నటి హేమ మండిపడ్డారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు 'నేను అసలు పబ్‌కు వెళ్లలేదు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చాను.' అని హేమ మీడియాతో తెలిపారు. కాగా పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో పబ్‌లో ఉన్న ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారికతోపాటు పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రముఖ నటి హేమకు వంద కోట్ల ఆస్తులున్నాయా?
Actress Hema Opened Up On Her Properties, Assests: క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించింది. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.ఈ క్రమంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఈ విషయంపై స్పందించింది. కెరీర్ ఆరంభంలో వేలల్లో పారితోషికం తీసుకునే తాను ప్రస్తుతం లక్షల్లో తీసుకోవాల్సి వస్తుందని, అయితే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతానని పేర్కొంది. ఇక తనకు వందల కోట్ల ఆస్తులైతే లేవు గానీ బాగానే ఆస్తులు ఉన్నాయని తెలిపింది. తన కూతుర్ని సెటిల్ చేసేంత డబ్బు సంపాదించానని, ఇప్పటికీ ఇంకా సంపాదిస్తూనే ఉన్నానని వివరించింది. -
భోజనానికి కూర్చుంటే అందరి ముందు అవమానించాడు: నటి హేమ
ప్రముఖ నటి హేమ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందింది. పలు సినిమాల్లో అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. 'సాధారణంగానే ఇండస్ట్రీ వాళ్లంటే జనాలకి లోకువ. కెరీర్లో ఎన్నో కష్టాలు పడి తల్లి సపోర్ట్‌తో ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడంటే కారవాన్స్ వచ్చి అన్ని వసతులు ఉన్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ లొకేషన్స్‌లో బట్టలు మార్చుకోవాలంటే సరైన ప్లేస్ ఉండేది కాదు. కనీసం టాయిలెట్స్ వసతి కూడా ఉండేది కాదు. భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ నన్ను అవమానించాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ సహా యూనిట్ అందరం కలిసి భోజనం చేస్తుండగా నేను అక్కడే వాళ్లతో పాటే తింటున్నాను. ఇంతలో ప్రొడక్షన్ బాయ్ వచ్చి.. ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అని అవమానించాడు. ఆ మాటతో చాలా కోపం వచ్చింది. టేబుల్ ఎత్తి అతనిపై పడేద్దామనుకున్నా. కానీ తింటే వీళ్లందరితోనే కలిసి తినాలని డిసెడ్ అయి మరింత కష్టపడ్డాను. ఆ ప్రొడక్షన్ బాయ్ ఇప్పటికీ ఉన్నాడు. మళ్లీ అతనే ఓ సినిమా షూటింగ్ సమయానికి వచ్చి చాలా మర్యాదగా నాకు భోజనం పెట్టాడు. కానీ కెరీర్లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఇప్పటికీ మర్చిపోలేను' అంటూ చెప్పుకొచ్చింది. -
రాత్రి గెలిచి.. ఉదయమే ఎలా ఓడిపోయామో దుర్గమ్మకే తెలియాలి: హేమ
సాక్షి, విజయవాడ: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై నటి హేమ తాజాగా స్పందించారు. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు(గురువారం) ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా తాను ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు ఈ మేరకు ఆమె ‘మా’ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రాత్రి గెలిచామని చెప్పి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదని, దానికి కారణం దుర్గమ్మకైనా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితాలపై చేసిన వరుస ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికలు జరిగిన రోజు అక్టోబర్ 10న రాత్రి వీరిద్దరూ గెలిచినట్లు ప్రకటించి.. మరుసటి రోజు వారు ఓడిపోయినట్లు తెలిపారు. దీంతో ‘మా’ ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు -
చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. చదవండి: టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది. చదవండి: MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి -
టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ
MAA Elections 2021: నటుడు శివ బాలాజీ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ! అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చదవండి: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ -
అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందన్నారు. తనకు బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని, పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న వ్యక్తిని పట్టుకోబోతున్న క్రమంలో వాగ్వాదం జరిగిన మాట వాస్తవమనేనని శివబాలాజీ చెప్పారు. -
MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. -
అసభ్య వ్యాఖ్యలతో వీడియో.. కరాటే కల్యాణి, నరేశ్‌పై హేమ ఫిర్యాదు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇరు ప్యానల్స్‌కు చెందిన సభ్యుల నుంచి ఎవరోర ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించగా.. ఓడిపోతామనే భయంతో ప్రకాశ్ రాజ్ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విమర్శించారు. (చదవండి: ‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు) ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన హేమ.. బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలతో ఓ వీడియోను విడుదల చేశారని ఆమె లేఖలో తెలిపారు. కళ్యాణి, నరేశ్‌లపై చర్యలు తీసుకోవాలని హేమ విజ్ఞప్తి చేశారు. -
ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం
ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మావతి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఈ నెల 13న ఆమె కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 30) ఉత్తేజ్ తన భార్య పద్మ సంస్మరణ సభను హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రములు హజరై పద్మకు ఘన నివాళి అర్పించారు. చిరును చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి ఆయనను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయనను, కూతురు చేతనను ఓదార్తూ చిరు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ ఇక ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘భార్యా వియోగం అన్నది చాలా దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను. హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్‌కు మనమందరం అండదండగా ఉండాలి. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సంతాప సభకు మెగాస్టార్‌తో పాటు మెగా బ్రదర్ నాగాబాబు, హీరోలు డా. రాజశేఖర్, శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య