![Hema Visits Tirumala Temple After Bangalore Drug Issue](/styles/webp/s3/article_images/2024/06/28/hema.jpg.webp?itok=TzoaSP0T)
టాలీవుడ్ నటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుంది. అనంతరం ఆలయం బయటకు వచ్చిన హేమ మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దర్శనం బాగానే జరిగింది.. రేవ్ పార్టీపై అనేక కథనాలు రాశారు కదా.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది.
దొరికిపోయిన హేమ
కాగా గత నెలలో బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది. ఈమె పేరు బయటకు రావడంతో.. తనకు ఆ పార్టీతో సంబంధం లేదని హైదరాబాద్‌లో ఉన్నానని, బిర్యానీ వండుతున్నానంటూ వీడియోలు రిలీజ్ చేసి తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ అబద్ధాలేనంటూ పోలీసులు రేవ్ పార్టీలో దొరికిన హేమ ఫోటోను రిలీజ్ చేశారు. అలాగే తనకు వైద్య పరీక్షలు చేయించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
ఇటీవలే బెయిల్
దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరైన సమయంలో ఆమెను అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితమే హేమ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇకపోతే డ్రగ్స్ కేసులో అరెస్టయిన కారణంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment