ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Satyabhama, Love Mouli And Bhaje Vaayu Vegam OTT Details Latest | Sakshi
Sakshi News home page

OTT Movies Latest: మూడు ఓటీటీల్లో తెలుగు మూవీస్.. ఏది ఎక్కడంటే?

Published Fri, Jun 28 2024 8:54 AM | Last Updated on Fri, Jun 28 2024 9:04 AM

Satyabhama, Love Mouli And Bhaje Vaayu Vegam OTT Details Latest

చాన్నాళ్ల తర్వాత థియేటర్లు కళకళలాడుతున్నాయి. 'కల్కి' దెబ్బకు చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో చూసినవాళ్లు తెగ ఆనందపడిపోతున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై 'కల్కి' మేజిక్ చూసేద్దామా అనే ఆత్రుతలో ఉన్నారు. దీనికి డబుల్ బొనాంజా అన్నట్లు ఓటీటీలోనూ క్రేజీ తెలుగు సినిమాలు మూడు వచ్చేశాయి. 'కల్కి'తో పాటు వీకెండ్‌లో వీటిని కూడా చూసేసే ప్లాన్ చేసుకోండి.

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ'. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది గానీ రెగ్యులర్ థ్రిల్లర్ టెంప్లేట్ కథ కావడం మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. థ్రిల్లర్ మూవీతో టైమ్ పాస్ చేద్దామనుకునేవాళ్లు దీనిపై లుక్కేయండి.

(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)

'ఆర్ఎక్స్ 100' తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందిపడిన కార్తికేయకు సంతృప్తి ఇచ్చిన మూవీ 'భజే వాయు వేగం'. గత నెల చివర్లో వచ్చి అనుహ్యంగా హిట్ కొట్టిన థ్రిల్లర్ మూవీ ఇది. అన్నదమ్ముల బాండింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.

చాన్నాళ్ల తర్వాత నవదీప్ 'లవ్ మౌళి' అనే బోల్డ్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు బోల్డ్‌నెస్‌లో శృతిమించిపోయారు. అయితే యువతకు మాత్రమే కొంతలో కొంతమేర నచ్చిన ఈ చిత్రం.. 'కల్కి' రిలీజ్ రోజే ఆహా ఓటీటీలో రిలీజైంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటే ఇది మీకు ఛాయిస్ అవ్వొచ్చు.

(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement