Satyabhama
-
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
Diwali 2024: నరకాసుర సంహారం
శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతడే నరకుడు. పుట్టిన వేళ దోషప్రదమైనది కావడంతో అతడు అసుర లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నాడు. అసుర చేష్టలతో జనాలను పీడిస్తూ నరకాసురుడిగా ప్రతీతి పొందాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని, కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగునే ఉన్న శోణితపురం రాజు బాణాసురుడితో నరకుడికి మైత్రి కుదిరింది.బాణాసురుడి ప్రోద్బలంతో నరకుడు మరింత దుండగుడిగా మారాడు. తన కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టేవాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండెత్తి పదహారువేల మంది పడతులను ఎత్తుకొచ్చి, వారందరినీ చెరలో పెట్టాడు. బాణాసురుడి ప్రోద్బలంతో నరకాసురుడు అమాయకులను హింసించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవాడు. అతడి దుండగాలను భూదేవి కూడా సహించలేకపోయింది. నరకాసురుడు తన రాజధాని చుట్టూ నాలుగు దుర్భేద్యమైన దుర్గాలను నిర్మించుకున్నాడు. అవి: గిరి దుర్గం, జల దుర్గం, అగ్ని దుర్గం, వాయు దుర్గం. వాటిని దాటి వెళ్లి, ప్రాగ్జ్యోతిషపురం మీదకు దండయాత్రకు వెళ్లడం దేవతలకు సైతం దుస్సాధ్యంగా ఉండేది. నాలుగు దుర్గాల మధ్య శత్రుదుర్భేద్యంగా ఉన్న నరకుడు ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి, నరకాసురుడు అనేక దివ్యాస్త్రాలను సాధించాడు. వరగర్వం తలకెక్కి, దేవతల మీద తరచు దండెత్తి వాళ్లను నానా హింసలు పెట్టేవాడు. దేవతలపై దండెత్తిన నరకుడు బలవంతంగా వరుణుడి ఛత్రాన్ని, అదితీదేవి కర్ణకుండలాలను చేజిక్కించుకున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నరకుడి ధాటిని అరికట్టడం దేవేంద్రుడికి కూడా సాధ్యంకాలేదు. స్వర్గం మీద దండెత్తిన నరకుడి ధాటికి నిలువలేక దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని, యథేచ్ఛగా తన దాష్టీకాలను కొనసాగించాడు. యజ్ఞ యాగాదుల ఫలితం తనకే దక్కాలని ఆజ్ఞాపించాడు. కాదన్న మహర్షులను చెరసాలలో బంధించి, వారిని చిత్రహింసలు పెట్టాడు. ఒకనాడు వసిష్ఠుడు కామాఖ్యదేవిని పూజించడానికి ప్రాగ్జ్యోతిషపురం చేరుకున్నాడు. ఆయన ఆలయం వద్దకు చేరుకునే వేళకు నరకాసురుడు ఆలయ ద్వారాన్ని మూసివేయించాడు. ఈ దుశ్చర్యకు ఆగ్రహించిన వసిష్ఠుడు, ‘దుర్మదాంధుడా! నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు.నరకాసురుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. ముల్లోకాల్లోనూ జనాలు హాహాకారాలు చేయసాగారు. నరకుడి బాధలు భరించలేక దేవేంద్రుడు దేవతలందరితోనూ కలసి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. ‘శ్రీకృష్ణా! పాహిమాం, పాహిమాం! నరకుడి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మమ్మల్నందరినీ తరిమికొట్టి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తున్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టాడు. నరకుడి దాష్టీకాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే! అతడి బారి నుంచి మమ్మల్ని కాపాడు. ఆలస్యం చేయక అతణ్ణి సంహరించు’ అని ప్రార్థించాడు. నరకుడి పీడ విరగడ చేయమని ముక్కోటి దేవతలూ ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు. దేవత మొరను సావకాశంగా ఆలకించిన నరకుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయత్తమయ్యాడు. ‘నాథా! నేను కూడా యుద్ధానికి వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్లండి’ అంది సత్యభామ.సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు గరుడవాహనంపై నరకుడిపై దండయాత్రకు బయలుదేరాడు. తన మిత్రులైన మురాది రాక్షసులను శ్రీకృష్ణుడు అప్పటికే సంహరించడంతో నరకుడు అతడిపై కోపంగా ఉన్నాడు. సుప్రతీకం అనే ఏనుగునెక్కి నరకుడు భారీ సైన్యంతో రణరంగానికి వచ్చాడు. హోరా హోరీగా యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనక్కు తగ్గకుండా పోరాడాడు. నరకుడి బాణం తాకి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. సత్యభామ ఆగ్రహోదగ్రురాలైంది. విల్లంబులు చేతిలోకి తీసుకుని, నరకుడిపై శరపరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించింది. ఆమె ధాటికి నరకుడి సేనలు చెల్లాచెదురయ్యాయి. ఈలోగా మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు తన చక్రాన్ని సంధించి, నరకుడి తలను తెగ నరికాడు. నరకుడు అపహరించిన కుండలాలను అదితికి, ఛత్రాన్ని వరుణుడికి అప్పగించాడు. నరకుడి చెరలో ఉన్న పదహారువేల మంది పడతులను విడిపించి, వారిని పెళ్లాడాడు. నరకుడి పీడ విరగడ చేసినందుకు దేవతలంతా శ్రీకృష్ణుడిని వేనోళ్ల పొగిడారు. నరకాసుర సంహారం తర్వాత తిరిగి వస్తున్న సత్యభామా శ్రీకృష్ణులకు ద్వారకా పురవాసులు ముంగిళ్లలో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.∙సాంఖ్యాయన -
వరంగల్‌లో 'సత్యభామ' యూనిట్ సందడి
తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను ఆచరిస్తూ నిర్వహించిన ఉత్సాహభరితమైన వేడుకలో భాగంగా ప్రముఖ సీరియల్ ' సత్యభామ' లో నటించిన ముఖ్య తారాగణంతో వరంగల్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది. ' సత్యభామ' తారలు తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ నగర ప్రజలతో కలిసి జరుపుకోవడం వల్ల ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఈ తారల వివాహ రెసెప్షన్ వేడుకలు సైతం వరంగల్‌లో జరుగగా, అప్పుడు ఇక్కడి వారు అపూర్వమైన స్వాగతం పలికారు. వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ' సత్యభామ' సిరీయల్ నటీనటులు అందరూ వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో పూజను కొనసాగించారు. హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు పంపిణీ చేశారు. అభిమానులు తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటూ కళాకారులను బహుమతులతో ముంచెత్తారు. ఈ షో తో తమకున్న లోతైన బంధాన్ని మరింతగా వెల్లడించారు. ఈ సీరియల్ హీరో క్రిష్ ప్రేక్షకులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమంలో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. అసలైన తెలుగు శైలిలో పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఆన్-స్క్రీన్ జంట వేదికపై నృత్యం చేయడంతో ఉత్సాహం మరింతగా పెరిగింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సంపదను జోడిస్తూ, ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన జరిగింది. పురాతన కళను నేటి తరానికి గుర్తుచేస్తూ జరిపిన ఈ తోలుబొమ్మలాట, తెలుగు ప్రజల సంప్రదాయాలకు ఒక అందమైన తీపిగుర్తుగా నిలిచింది. -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చాన్నాళ్ల తర్వాత థియేటర్లు కళకళలాడుతున్నాయి. 'కల్కి' దెబ్బకు చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్ టాక్ రావడంతో చూసినవాళ్లు తెగ ఆనందపడిపోతున్నారు. చూడనివాళ్లు ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై 'కల్కి' మేజిక్ చూసేద్దామా అనే ఆత్రుతలో ఉన్నారు. దీనికి డబుల్ బొనాంజా అన్నట్లు ఓటీటీలోనూ క్రేజీ తెలుగు సినిమాలు మూడు వచ్చేశాయి. 'కల్కి'తో పాటు వీకెండ్లో వీటిని కూడా చూసేసే ప్లాన్ చేసుకోండి.పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ'. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది గానీ రెగ్యులర్ థ్రిల్లర్ టెంప్లేట్ కథ కావడం మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. థ్రిల్లర్ మూవీతో టైమ్ పాస్ చేద్దామనుకునేవాళ్లు దీనిపై లుక్కేయండి.(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)'ఆర్ఎక్స్ 100' తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందిపడిన కార్తికేయకు సంతృప్తి ఇచ్చిన మూవీ 'భజే వాయు వేగం'. గత నెల చివర్లో వచ్చి అనుహ్యంగా హిట్ కొట్టిన థ్రిల్లర్ మూవీ ఇది. అన్నదమ్ముల బాండింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి.చాన్నాళ్ల తర్వాత నవదీప్ 'లవ్ మౌళి' అనే బోల్డ్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు బోల్డ్‌నెస్‌లో శృతిమించిపోయారు. అయితే యువతకు మాత్రమే కొంతలో కొంతమేర నచ్చిన ఈ చిత్రం.. 'కల్కి' రిలీజ్ రోజే ఆహా ఓటీటీలో రిలీజైంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఇది మీకు ఛాయిస్ అవ్వొచ్చు.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?) -
'సత్యభామ' కాజల్ అగర్వాల్ బర్త్‌డే.. ఈ ఫోటోలు చూశారా..?
-
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5 -
అందుకే ‘సత్యభామ’ని నేను డైరెక్ట్ చేయలేదు: శశికిరణ్ తిక్క
‘‘ఇప్పటివరకూ ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా భావోద్వేగాలతో రూపొందిన ‘సత్యభామ’ ప్రత్యేకంగా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో కాజల్ అగర్వాల్గారి ఎనర్జీ మా యూనిట్‌కి ఉత్సాహాన్నిచ్చేది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. ‘సత్యభామ’లో ప్రేక్షకులు కొత్త కాజల్‌ను చూస్తారు’’ అన్నారు శశికిరణ్ తిక్క. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించిన శశికిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన పాయింట్ నచ్చడంతో నేను, దర్శకుడు సుమన్ ‘సత్యభామ’ కథ సిద్ధం చేశాం. దర్శకుడిగా నేను బిజీగా ఉండటంతో ఈ మూవీకి దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్‌పై మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో ‘సత్యభామ’తో తెలిశాయి.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది. ‘సత్యభామ’ సినిమా ప్రీమియర్స్ వేశాం... చూసిన వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గూఢచారి’ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. ‘గూఢచారి 2’కి వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, అడివి శేష్ ముందే అనుకున్నాం. మహేశ్‌బాబుగారు ‘మేజర్’ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఆయనకు ‘సత్యభామ’ చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు. -
‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క
కాజల్ అరవై సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో ఆమె ఎనర్జీ మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేంది.‘సత్యభామ’లో కాజల్ చేసిన యాక్షన్స్ ప్రేక్షలను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. తెరపై కొత్త కాజల్‌ని చూస్తారు’అని అన్నారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు(జూన్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికిరణ్ తిక్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ యూకేలో ఉండే నా స్నేహితులు చెప్పిన కథతో ‘సత్యభామ’ జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి ‘సత్యభామ’ కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.⇢ నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు.అలాగే అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.⇢ మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల(సంగీత దర్శకుడు) మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.⇢ ఈ చిత్రంలొ నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరొస్తుంది.⇢ ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.⇢ దర్శకుడిగా నా తదుపరి సినిమా త్వరలో అనౌన్స్ చేస్తాను. వరుసగా థ్రిల్లర్స్ చిత్రాలే కాకుండా మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను. -
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్ మారాలా?
‘‘నన్ను టాలీవుడ్ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్ఫుల్ నేమ్. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ఫుల్ ΄ోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ సహజంగా ఉంటాయి. రామ్ చరణ్‌లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను. -
ట్రెండ్ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్ బిజీ అయ్యారు: కాజల్
‘పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్‌కి కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు’అన్నారు కాజల్ అగర్వాల్. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్రను పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.⇢ నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.⇢ శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు.⇢ గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.⇢ సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.⇢ యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.⇢ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.⇢ నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.⇢ భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.⇢ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి. -
కాజల్ కొత్త సినిమా రిలీజ్.. ఆడవాళ్లకి ఫ్రీ టికెట్స్!
కొత్త సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కాజల్ అగర్వాల్.. 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ శుక్రవారం అంటే జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చేశారు. తాజాగా మహిళల కోసం బంపరాఫర్ ప్రకటించారు. ఉచితంగా టికెట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?)కాజల్ అగర్వాల్ 'సత్యభామ' మూవీ.. జూన్ 7న థియేటర్లలోకి రానుంది. కానీ అంతకంటే ముందే హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న అంటే బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికి కాజల్ అగర్వాల్ కూడా హాజరు కానుంది. ఈ షో టికెట్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరకు సాయంత్రం 5 గంటలకు వెళ్లి, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లు చూపించే మహిళలకు టికెట్స్ ఉచితంగా ఇస్తారని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని 'గూఢచారి', 'క్షణం' సినిమాల ఫేమ్ శశి కిరణ్ తిక్క నిర్మించారు. సుమన్ చిక్కల దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?) -
‘సత్యభామ’ గుర్తుండిపోతుంది
‘సత్యభామ’ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ కోసం మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ అనుకున్నది కాజల్ నే. ఆమె నో చెబితే నెక్ట్ ఆప్షన్స్ కు వెల్దామని అనుకున్నాం. అయితే కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు. మేము ఫస్ట్ టైమ్ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో కాజల్ కూడా అలాగే ఫీలయ్యారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది’అని అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క బాబీ తిక్క బ్రదర్. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారనే మేము ప్రొడక్షన్ లోకి వచ్చాం. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా "సత్యభామ" సినిమాను నిర్మించాం. మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. దీంతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా అవకాశాలు ఇస్తున్నాం. మా దర్శకుడు సుమన్ కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్ బ్యాండ్స్ లో పాడే సింగర్స్ ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం.⇢ ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకే జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా చేసుకుని "సత్యభామ" సినిమా లైన్ రెడీ చేశాం. అయితే పూర్తిగా మన నేటివిటీకీ మార్పులు చేసిన కథను సిద్ధం చేశాం. "సత్యభామ" సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎందుకు చేస్తున్నారు హీరోతో చేయొచ్చుక దా అని అడిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మనకు విజయశాంతి కర్తవ్యం లాంటి మూవీస్ కొన్నే గుర్తుంటాయి. "సత్యభామ"లో కాజల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.⇢ "సత్యభామ" సినిమా సెన్సార్ బృందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్ యాప్ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్ యాప్ కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్ షోకు ఆహ్వానిస్తున్నాం. శశి తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథలనే మేము అవురమ్ ఆర్ట్స్ లో చూపించబోతున్నాం. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.⇢ కాజల్ మా మూవీ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ ఆమెకు నచ్చింది. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని ఆమె చెప్పడం మాకెంతో హ్యీపీనెస్ ఇచ్చింది. మా మూవీని ముందు తెలుగులో సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత మిగతా భాషల విషయం ఆలోచిస్తాం. మా నెక్ట్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం. -
ఆ ఇమేజ్ ఇబ్బందిగానే ఉంది: సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ఓ పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీయే ఈ చిత్రం.థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘సత్యభామ’ చిత్రం బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. కాజల్, నవీన్‌చంద్రల మధ్య ‘కళ్లారా చూసాలే..’ అనే లవ్‌సాంగ్ ఉంటుంది. అలాగే ‘వెతుకు వెతుకు’ పాట ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ పాటను కీరవాణిగారు పాడారు. గతంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాకు నా మ్యూజిక్‌లో కీరవాణిగారు పాడారు. ‘సత్యభామ‘ పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే ‘నేను పాడిన ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్’ అని అడిగారు. లిరిక్స్ అందించిన చంద్రబోస్‌గారు కూడా పాట పూర్తయ్యేంతవరకు చర్చిస్తూనే ఉన్నారు.‘సత్యభామ’లో ఓ ఇంగ్లిష్ సాంగ్ కూడా ఉంది. ఇతర పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. నేను థ్రిల్లర్ మూవీస్‌కు ఎక్కువగా పని చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మొత్తం థ్రిల్లర్ మూవీస్‌కు నేనే సంగీతం అందించడం లేదు. చెప్పాలంటే.. ‘కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్’ వంటి లవ్ అండ్ కమర్షియల్ చిత్రాలకూ సంగీతం అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకైతే అన్ని జానర్ సినిమాలకూ సంగీతం అందించాలని ఉంది. ప్రస్తుతం ‘గూఢచారి 2’కు పని చేస్తున్నాను. మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
డూప్ లేకుండా కాజల్ ఫైట్ చేశారు: సుమన్ చిక్కాల
‘‘సత్యభామ’ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. భావోద్వేగాలను పండించడంలో కాజల్ అగర్వాల్‌కి మంచి పేరుంది. ఆమె యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుందనిపించింది. ఎమోషన్, యాక్షన్ ఆమె చక్కగా చేశారు. ఈ రెండింటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అన్నారు డైరెక్టర్ సుమన్ చిక్కాల. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’.డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమన్ చిక్కాల మాట్లాడుతూ– ‘‘శశికిరణ్ తిక్క వద్ద స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. నాపై నమ్మకంతో దర్శకత్వం బాధ్యత అప్పగించాడు తను. ‘సత్యభామ’ పూర్తిగా ఫిక్షన్ కథ.ఒక కేసు విషయంలో బాధితురాలికి న్యాయం చేసే పవర్ఫుల్ పోలీస్సాఫీసర్గా కాజల్ పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారామె. ఆంధ్రప్రదేశ్‌లోని దిశ యాప్, తెలంగాణలో షీ సేఫ్ యాప్ గురించి మా మూవీలో చూపించాం. ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని ఆపదలో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక సందేశం చేరినట్లే’’ అన్నారు. -
డూప్ లేకుండా కాజల్ యాక్షన్.. భయపడ్డాం: దర్శకుడు సుమన్
‘సత్యభామ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. ఈ కథ రాసేప్పుడు ఇది హీరోకా హీరోయిన్ కా అనేది ఆలోచించలేదు. ఒక పర్సన్ కోసం అని రాస్తూ వచ్చాం. కథలో అమ్మాయి విక్టిమ్ గా ఉంటుంది కాబట్టి ఫీమేల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎమోషన్, యాక్షన్ రెండూ కాజల్ చేయగలరు అని నమ్మాం. ఎమోషన్ పండించడంలో తనకు మంచి పేరుంది. యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుంది. యాక్షన్ పార్ట్స్ కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మేం చాలా భయపడ్డాం’అని అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల.కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుమన్ చిక్కాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. శశికిరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలకు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించాడు శశి. అలా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నా. దర్శకుడిగా మారేందుకు శశి ఎంతో కష్టపడ్డాడు. తన సక్సెస్ నుంచి యంగ్ టాలెంట్ జర్నీ మొదలుపెట్టాలని అవురమ్ ఆర్ట్స్ స్థాపించాడు. కొందరికైనా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వగలుగుతాం అనేది ఆయన ఆలోచన. శశి వల్లే నేను దర్శకుడిగా మారాను.→ కొందరు పోలీస్ ఆఫీసర్స్ తాము టేకప్ చేసిన కేసుల విషయంలో ఎమోషనల్ గా పనిచేస్తారు. అలా "సత్యభామ" ఒక కేసు విషయంలో పర్సనల్ గా తీసుకుంటుంది, ఎమోషనల్ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు.→ ‘సత్యభామ"లో నవీన్ చంద్ర కీ రోల్ చేస్తున్నారు. కాజల్ పెయిర్ గా ఆయన కనిపిస్తారు. నవీన్ చంద్రది రైటర్ క్యారెక్టర్. కాజల్ కు సపోర్ట్ గా ఉంటారు. కాజల్ ఒక వారం పది రోజుల షూటింగ్ తర్వాత మా టీమ్ మెంబర్ గా మారిపోయారు. తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నటించారు. మాకు కూడా ఒక స్టార్ సెట్ లోకి వస్తున్న ఫీలింగ్ ఏరోజూ కలగలేదు.→ ఏపీలో దిశా యాప్ ఉంటుంది. తెలంగాణలో షీ సేఫ్ యాప్ ఉంది. మహిళలు తమకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ యాప్ లో నెంబర్ టైప్ చేసి సెండ్ చేస్తే వారి లొకేషన్ షీ టీమ్స్ కు వెళ్లిపోతుంది. వాళ్లు కాపాడేందుకు వస్తారు. మేము సెట్ లో ఉన్నప్పుడు యాప్స్ రెస్పాండ్ అవుతాయా లేదా అని చెక్ చేసి చూశాం. మాకు షీ టీమ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "సత్యభామ" చూస్తున్నప్పుడు మహిళలు ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని తమ లైఫ్ లో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక మెసేజ్ చేరినట్లే.→ "సత్యభామ" పూర్తిగా ఫిక్షన్ కథ. నాకు పోలీస్ డైరీస్ గురించి తెలుసుకోవడం, వారి ఇంటర్వ్యూలు వినడం అలవాటు. అలా కొందరు పోలీసుల లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథను డెవలప్ చేశాం. ముందు మా మూవికి ఈ పేరు లేదు. అయితే సత్యభామ అనే పేరు మన పౌరాణికాల్లో పవర్ ఫుల్ నేమ్. అందరికీ త్వరగా రీచ్ అవుతుందని ఆ పేరు పెట్టాం.ప్రస్తుతం కొన్ని కథలు ఉన్నాయి. త్వరలో నా నెక్ట్ మూవీ అనౌన్స్ చేస్తా. -
నా కెరీర్లో ఇదో కొత్త ప్రయత్నం: కాజల్ అగర్వాల్
‘‘సత్యభామ’ కంటే ముందు నాకు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వచ్చింది. కానీ ఈ తరహా సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ‘సత్యభామ’ చేశాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘సత్యభామ’తో నెరవేరింది’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు.‘మేజర్’ చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో భారీ స్టంట్స్ చేసిన సినిమా ఇది. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్స్ గేమింగ్, వర్చ్యువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను.ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్గా విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘ప్రతి పోలీసాఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రకథ’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘సత్యభామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. -
కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కెరీర్లో కొత్త దశలోకి వెళుతున్నాను: కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ వంటి యాక్షన్ సినిమాతో నా కెరీర్లో ఓ కొత్త దశలోకి వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను.కొత్త ఎమోషన్స్‌ను ఎక్స్పీరియన్స్ చేశాను. శశిగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. కథపై నమ్మకం కలిగింది. అయితే ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన తర్వాత ఆ నమ్మకం రెట్టింపు అయ్యింది. శశిగారు లేకపోతే ‘సత్యభామ’ లేదు. కీరవాణి, చంద్రబోస్గార్లకు థ్యాంక్స్. ‘వెతుకు వెతుకు..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అమర్ పాత్రలో నవీన్ చంద్ర బాగా యాక్ట్ చేశారు. టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. నన్ను స్టార్ హీరోయిన్ని చేసిన తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘సత్యభామ’ సినిమాపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘సినిమాల పట్ల కాజల్గారికి ఉన్న ప్యాషన్ మమ్మల్ని ఇన్‌సై్పర్ చేసింది. ‘సత్యభామ’ను థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేయండి’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. నా మొదటి హీరో (సినిమాలో కాజల్ లీడ్ రోల్ చేశారు కాబట్టి హీరో అని సంబోధించారు) కాజల్గారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘కాజల్గారు కథ విన్న వెంటనే షూటింగ్ ఎప్పట్నుంచి ప్లాన్ చేసుకుంటారనడంతో మేం సర్ప్రైజ్ అయ్యాం. ఎమోషనల్ పవర్‌ప్యాక్డ్ ఫిల్మ్ ‘సత్యభామ’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘సత్యభామ’ చాలా మంచి సబ్జెక్ట్. నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. మా చేతిలో ఓ సక్సెస్ఫుల్ సినిమా ఉంది’’ అన్నారు నవీన్‌చంద్ర. పాటల రచయిత రాంబాబు, ఎడిటర్ పవన్ పాల్గొన్నారు. -
సత్యభామ నాకు స్పెషల్: కాజల్ అగర్వాల్
‘‘సత్యభామ పాత్రలో నటించడం సవాల్‌గా అనిపించింది. ఇలాంటి పాత్ర నా కెరీర్లో ఇదే తొలిసారి. ఇది నా కెరీర్లో స్పెషల్ ్రపాజెక్ట్గా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె లీడ్ రోల్లో నటించిన సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ‘సత్యభామ’ మ్యూజికల్ ఈవెనింగ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో ఈ మూవీలోని ‘వెతుకు వెతుకు..’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘నేను ఓ బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత చేసిన సినిమా ‘సత్యభామ’. మన అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే పాయింట్ ఈ కథలో నన్ను ఆకట్టుకుంది’’ అన్నారు. ఈ వేడుకలో శశికిరణ్ తిక్క, శ్రీ చరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు. -
వెతుకు... వెతుకు... అంటూ వచ్చేస్తోన్న సత్యభామ
వెతుకు... వెతుకు.. అంటూ నేరస్తులను వెతుకున్నారు పోలీసాఫీసర్ సత్యభామ. వారిని పట్టుకోవడానికి ఆమె ఎలాంటి సాహసాలు చేశారు? అనే కథతో రూపొందిన చిత్రం ‘సత్యభామ’. పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ చేశారు. నవీన్ చంద్ర అమరేందర్ కీలక పాత్రధారి. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని మూడో పాట ‘వెతుకు వెతుకు..’ని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘‘నేరస్తులను పట్టుకోవడానికి సత్యభామ చేసే అన్వేషణే ఈ పాట నేప థ్యం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరకర్త. -
సత్యభామగా ‘చందమామ’.. రిలీజ్ డేట్ ఫిక్స్
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన ‘సత్యభామ’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. మే 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రక టించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ మూవీ నిర్మించారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సత్యభామ’. ఇందులో కాజల్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆకట్టుకుంటున్న ‘స్టార్ మా’పవర్ అవర్
‘స్టార్ మా’ పవర్ అవర్ విజయవంతంగా ప్రారంభించి టెలివిజన్ హిస్టరీలో ఎంతో ఆకట్టుకునే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "సత్యభామ" మరియు "ఊర్వసి వో రాక్షసి వో" షోలు ఉన్నాయి. డిసెంబర్ 18న ప్రీమియర్, పవర్ అవర్ రాత్రి 9:30 గంటలకు "సత్యభామ"తో ప్రారంభమైంది. ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకు "ఊర్వసి వో రాక్షసి వో" ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. ప్రముఖ టెలివిజన్ జంట యష్, వేద నటించిన ‘సత్యభామ’ డిసెంబర్ 18న రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10:00 గంటలకు ‘ఊర్వసి వో రాక్షసి వో’ శైలిని పునర్నిర్వచించటానికి హామీ ఇచ్చే గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నుండి 10:30 గంటల వరకు పవర్ అవర్ సమయంలో “సత్యభామ” మరియు “ఊర్వసి వో రాక్షసి వో” యొక్క బ్యాక్-టు-బ్యాక్ ఉత్సాహాన్ని అనుభవించడానికి ఆడియన్స్ ను స్టార్ మా ఆహ్వానిస్తోంది. -
వేటాడే సత్యభామ
‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్‌రాజ్).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ (కాజల్ అగర్వాల్)’ అనే డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్. పోలీసాఫీసర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సార్.. ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్ అగర్వాల్)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్ (కాజల్)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సత్యభామ టీజర్ చూశారా?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటిస్తోంది. నవీన్ చంద్ర, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగను ముందే తీసుకువస్తూ “సత్యభామ” సినిమా టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. “సత్యభామ” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే.. హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతూ ఉంటుంది. పై అధికారులు.. సత్య, ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే.. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల కోసం వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాగ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ.. ఆ హంతకులను పట్టుకుందా? వారిని చట్టం ముందు నిలబెట్టిందా? లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా.. -
సమ్మర్లో సత్యభామ
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో, నవీన్ చంద్ర, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభిస్తాం. సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ. -
కాజల్ మాకు ఆ అదృష్టం ఉందా?.. నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే రిప్లై
సినిమాలకు గుడ్ బై చెబుతుందంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై భారీగానే పుకార్లు వచ్చాయి. వాటంన్నిటినీ పక్కకు నెట్టేసి ఇండియన్2, భగవంత్ కేసరి, సత్యభామ వంటి భారీ చిత్రాలతో తను బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడుగుతున్నటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. చాలా రోజుల తర్వాత తన అభిమానులతో సరదాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ముచ్చటించింది. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వారితో ఆమె పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ కారణంతో కీర్తి, కృతి షాకింగ్ డెషిషన్ తీసుకోనున్నారా?) అయితే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాజల్ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇలా ప్రశ్నించాడు 'మీరంటే నాకెంతో ఇష్టం.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడిగేశాడు కాజల్ అగర్వాల్ అతని ప్రశ్నకు సమాధానం చెబుతూ సారీ.. ఇప్పుడా అదృష్టం మీకు లేదు.. రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది. అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు కూడా ఉన్నాడు. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) -
వారికి కాజల్ ఓ ఉదాహరణ
‘‘మగధీర’ సినిమాలో మిత్రవిందగా కాజల్ ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్స్ వారి కెరీర్‌ను కొనసాగించవచ్చనడానికి కాజల్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. ‘సత్యభామ’ సినిమా గ్లింప్స్ బాగుంది.. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం, జూన్ 19) కాజల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘సత్యభామ’ సినిమా గ్లింప్స్‌ని శేఖర్ కమ్ముల విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘తెలుగుచిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటింది. తెలుగు ఆడియన్స్ బెస్ట్. వారి ప్రేమ, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘నా తొలి సినిమాకు హీరోగా నిలిచిన కాజల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు అఖిల్ డేగల. ‘‘మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తాం’’ అన్నారు శ్రీనివాస్, బాబీ. ఈ కార్యక్రమంలో స్క్రీన్‌ప్లే, చిత్ర సమర్పకుడు శశికిరణ్ తిక్క, కథారచయితలు రమేష్, ప్రశాంత్, కెమెరామేన్ మోహిత్ కృష్ణ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాజీవ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
#Kajal60 : కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Jamuna Death: లావైపోయింది..‘సత్యభామ’గా వద్దన్నారు
సీనియర్ నటి జమున(86) ఇక లేరనే వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె నటించిన సినిమాలు.. పోషించిన పాత్రలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఆమె నటించిన సత్యభామ పాత్ర గురించి అందరూ చర్చించుకుంటున్నారు. వినాయ చవితి, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం సినిమాల్లో ఆమె సత్యభామ పాత్రని పోషించి, తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. (చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత) అయితే రెండోసారి సత్యభామ పాత్రలో నటిస్తున్నానంటే.. చాలా మంది ఆమెకు వద్దని చెప్పారట. మరికొంత మంది అయితే ‘లావైపోయింది..సత్యభామగా ఆమె ఏం బాగుంటుంది’ అని అన్నారట. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా ‘సత్యభామ’గా నటించి ఆ పాత్రను నేనే కరెక్ట్ అని అనిపించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జమున అన్నారు. (చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’) సత్యభామ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ..‘వినాయక చవితి’ సినిమాలో అమాయకత్వం నిండిన సత్యభామగా చేశాను. నాకు పెళ్లి అవ్వక ముందు చేసిన సినిమా అది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామగా చేసే అవకాశం వచ్చింది. ‘పెళ్లయింది కదా. లావయ్యుంటుంది. ఏం బాగుంటుంది’ అని కొంతమంది అన్నారు. ‘ఏం పెళ్లయితే లావైపోతామా?’ అనుకున్నాను. చెప్పాలంటే పెళ్లి తర్వాత ఇంకా పరిణతి వచ్చి, నా అందం రెట్టింపు అయింది. అప్పుడు సత్యభామగా నన్ను చూసి, అందరూ భేష్ అన్నారు. మూడోసారి ‘శ్రీకృష్ణ విజయం’లో ఆ పాత్ర చేసినప్పుడు బిడ్డల తల్లిని. అయినా నా అందం, ఆహార్యం చెక్కు చెదరలేదు. అలా సత్యభామగా నేనే కరెక్ట్ అనే పేరు తెచ్చుకోగలిగాను’ అని అన్నారు. -
Jamuna Death: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించినవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే తమదైన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ జమున ఒకరు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. తెలుగింటి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దాదాపు 30 ఏళ్ల పాటు హీరోయిన్గా రాణించిన జమున..వందలాది పాత్రలు పోషించింది. కానీ ‘వినాయకచవితి’ చిత్రంలో పోషించిన సత్యభామ పాత్రే జమునకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘శ్రీకృష్ణ తులాభారం’లో కూడా ఆమె అదే పాత్ర పోషించి మెప్పించింది. ఇప్పటికీ తెలుగు వాళ్లకి సత్యభామ అంటే జమునే. అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున(86)..నేడు(జనవరి 27) ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ► 1937లో కర్నాటక రాష్ట్రంలోని హంపీలో జమున జన్మించింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆమె బాల్యంలోనే ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చింది. జమున బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. కానీ జన్మనక్షత్రం రీత్యా ఏదైనా నదిపేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది. ► జమునకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో చుదువుకునే సమయంలో నాటకాల్లో నటించింది. తెనాలీ సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపతనం అనే నాటిక ప్రదర్శనకోసం నటుడు జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపికచేసి తీసుకెళ్లారు.అలా ఆమె ఓ నాటక ప్రదర్శనలో దర్శకుడు గరికపాటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా ‘పుట్టిల్లు’ సినిమాతో కథానాయికగా జమున సినీరంగ ప్రవేశం చేశారు. ► తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి వందలాది చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెను మరింతగా పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించినవారెవరూ లేరు .. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. ► తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. ఆ చిత్రాలు కూడా ఘనవిజయాలనే అందుకున్నాయి. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి. ► 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దీపావళి స్పెషల్ 2021: కామాఖ్య ఆలయం.. విహార విశేషాలు!
శుభ కామన దీపం అస్సాం రాష్ట్రం, గువాహటి. నీలాచల పర్వత శ్రేణులతో అందమైన ప్రదేశం. ఇక్కడే ఉంది కామాఖ్య ఆలయం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పురాణకాలంలో నరకాసురుడు నిర్మించాడని చెబుతారు. పదహారవ శతాబ్దం నాటి పాలకులు ధ్వంసం చేయడంతో పదిహేడవ శతాబ్దంలో స్థానిక కూచ్‌బేహార్ పాలకుడు మహారాజా బిశ్వసింగ్ పునర్నిర్మించాడు. కామరూప రాజ్యానికి ప్రతీక దేవత కాబట్టి కామాఖ్య అనే పేరు వచ్చినట్లు మరో కథనం. ప్రధాన ఆలయానికి సమీపంలో సౌభాగ్య కుండం ఉంది. దీనిని దేవతల రాజు దేవేంద్రుడు తవ్వించాడని నమ్మకం. మరో ప్రధాన కుండం పేరు భైరవ్ కుండం. ఇందులో మనం ఊహించనంత పెద్ద సైజు తాబేళ్లుంటాయి. కటి బిహు పంటల వేడుక కూడా ఈ సమయంలో జరుగుతుంది. దీపాలు వెలిగించడమే ప్రధానం. తులసి చెట్టు దగ్గర మొదలు పెట్టి ఇంటి ఆవరణ అంతా దీపాలతో వెలుగులు నింపుతారు. ఇంటింటా వెలిగే దీపాలతోపాటు ఊరంతా సామూహికంగా వెలిగించే దీపాన్ని ఆకాశబంటి అంటారు. దీపం వెలిగిస్తూ ఏ కోరిక కోరితే అది తప్పక నెరవేరుతుందని నమ్ముతారు. బ్రహ్మపుత్రలో విహారం మూడు రోజుల కామాఖ్య టూర్ ప్యాకేజ్‌లో గువాహటి విమానాశ్రయంలో టూర్ ఆపరేటర్లు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయిన తరవాత సాయంత్రం బ్రహ్మపుత్ర నదిలో సన్‌సెట్ క్రూయిజ్ విహారం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కామాఖ్య దేవి దర్శనం, ఆ తర్వాత బాగలా ఆలయం, భువనేశ్వరి, ఉమానంద, నబగ్రహ, ఉగ్రతార, సుక్లేశ్వర్, బాలాజీ ఆలయాలు, భీమశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం, వశిష్ట ఆలయం, హస్తకళల ఎంపోరియమ్ సందర్శనం ఉంటాయి. మూడవ రోజు గువాహటి ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడంతో టూర్ ప్యాకేజ్ పూర్తవుతుంది. ఈ సీజన్లో క్రూయిజ్ ప్యాకేజ్‌లో కటి బిహు వేడుకలను కూడా చూసే అవకాశం ఉంటుంది. కన్నడ తీరాన రాయల విడిది మడకశిరలో సత్యభామ సంతాన వేణుగోపాల స్వామితోపాటు దర్శనమిస్తుంది. అదే విగ్రహంలో రుక్మిణి కూడా ఉంటుంది. దీపావళి సందర్భంగా ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు. కర్నాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన రాయలు ఇక్కడ ఆలయాన్ని కట్టించి, తన విహారకేంద్రంగానూ, విడిది కేంద్రంగానూ మలుచుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు వృద్ధాశ్రమం నిర్మించి అభాగ్యులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించడమైంది. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే... తులసీమాత ఆలయం. దేశంలో మరెక్కడా తులసీమాతకు ఆలయం లేదని ఇది మాత్రమే ఏకైక ఆలయం అని ఇస్కాన్ ధృవీకరించింది. దీపావళి పండుగతోపాటు దీపావళి తర్వాత పన్నెండు రోజులకు వచ్చే చిలకద్వాదశి కూడా వేడుకగా నిర్వహిస్తారు. ట్రావెల్ టిప్స్ ►మీరు వెళ్తున్న ప్రదేశంలో కరోనా కేసుల తీవ్రతలేదని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే మీరు నివసిస్తున్న ప్రదేశంలో కూడా కరోనా తీవ్రత లేకపోతేనే ఇతర ప్రదేశాలకు వెళ్లాలి. ►మీ బస శానిటైజ్ అయినదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. అవసరమైతే మరోసారి శానిటైజ్ చేయవలసిందిగా కోరాలి. ►మీరు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇంకా వేసుకోనట్లయితే పర్యటన ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ►పర్యాటక ప్రదేశంలో పరిసరాల పరిశుభ్రత, ఆహార శుభ్రతతోపాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ►మీ ఇంట్లో కోవిడ్ హైరిస్క్ పీపుల్ ఉంటే మీ పర్యటన ఆలోచన మానుకోవడమే మంచిది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
Tourist Spot: సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేకత అదే!
లోకంలో దీపాలకాంతులు వెలగడానికి దుష్టసంహారం రూపంలో చీకట్లు పారదోలే గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ప్రధాన భూమిక సత్యభామదే. అందుకే... దీపావళి పండుగలో ప్రధాన పాత్ర సత్యభామదే. ఈ కథనంలో కృష్ణుది సపోర్టింగ్ పాత్ర మాత్రమే. నరకాసుర వధ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపకాంతులతో ఆనందంగా నిర్వహించుకునే ఈ వేడుక అందరికీ తెలిసిందే. అయితే అంత గొప్ప మహిళకు ఆలయం ఎక్కడైనా ఉందా?... ఉంది. అనంతపురం జిల్లా మడకశిర సమీపాన కృష్ణుని విగ్రహంతోపాటు సత్యభామ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకల కంటే మిన్నగా దీపావళి వేడుకలు జరుగుతాయి. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కృష్ణుడితోపాటు సత్యభామ పూజలందుకుంటోంది. ధీర వనిత సత్యభామను పూజలందుకునే పౌరాణిక పాత్రగా గౌరవించింది మన సంస్కృతి. ఈ పండుగలో సత్యభామది నాయిక పాత్ర అయితే ప్రతినాయక పాత్ర నరకాసురుడిది. నరకాసురుడికి ఆలయం లేదు కానీ, అస్సాంలో నరకాసురుడు కట్టించిన ఆలయం ఉంది. అది గువాహటిలోని కామాఖ్య ఆలయం. చిత్తూరు జిల్లా, కార్వేటి నగరంలో సత్యభామసమేత వేణుగోపాల స్వామి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారితో పూజలందుకొంటున్న రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి మూర్తులను కార్వేటి నగరానికి తెప్పించి వైఖానసులచే ప్రతిష్టించినట్లు పురాణ కథనం. ఆకాశరాజు వంశానికి చెందిన నారాయణరాజుకు సంతానం లేకపోవడంతో తపస్సు చేసినట్లు, అదే వంశానికి చెందిన వెంకట పెరుమాళ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. ఈ ఆలయంలో శిల్పనైపుణ్యం అద్బుతంగా ఉంటుంది. ఆలయంలో మకరతోరణం, గోమాత సహిత రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. గాలి గోపురానికి ఎదురుగా ఉన్న 105 అడుగుల ధ్వజస్తంభం ఏకశిల నిర్మితం. రాణి మహల్ 14 ఎకరాల పుష్కరిణి ఈ ప్రాంతాన్ని 19వ శతాబ్దంలో తీవ్రమైన కరువుపీడించింది. అçప్పుడు ప్రజలను కాపాడేందుకు కార్వేటినగరం సంస్థానధీశుడు వెంకట పెరుమాళ్ రాజు 14 ఎకరాల విస్తీర్ణంలో స్కంధపుష్కరిణిని నిర్మించాడు. ఏ దిక్కు నుంచి చూసినా నీటి మట్టం సమాంతరంగా కనిపించడం దీని నిర్మాణ విశిష్టత. పుష్కరిణి మెట్ల మీద దేవతామూర్తులు, సర్పాలు, శృంగార శిల్పాలు నాటి శిల్పకళకు ప్రతిబింబిస్తున్నాయి. పుష్కరిణి కోసం పని చేసిన వారికి వెంకట పెరుమాళ్ రాజు స్వయంగా దోసిళ్లతో నాణేలను ఇచ్చారని స్థానిక కథనం. ఇక్కడి చెరువుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చెరువు నుంచి ఏడు బావులకు నీరు సరఫరా అవుతుంది. ఏడు బావుల నుంచి స్కంద పుష్కరిణికి చేరుతుంది. స్కంద పుష్కరిణి చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. కార్వేటి నగరంలో చూసి తీరాల్సిన మరో నిర్మాణం రాణి మహల్ (అద్దాల మహల్). ఈ మహల్ నిర్మాణంలో కోడిగుడ్డు సొన ఉపయోగించిన కారణంగా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతోపాటు నీటితో తుడిస్తే గోడలు అద్దంలా మెరుస్తుంటాయి. అందుకే దీనికి అద్దాల మహల్ అనే పేరు వచ్చింది. ఏపీ టూరిజం నిర్వహించే ప్యాకేజ్ టూర్లో తిరుమలతోపాటు చంద్రగిరి, నారాయణవనం, నాగులాపురం, కార్వేటి నగరం ఉంటాయి. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల ఆలయం ఏకశిల ధ్వజస్తంభం చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
సత్య నాయికలు
సత్యభామ అంటే.. నిలువెత్తు అహంకారం, పొగరు, మంకుపట్టు.. గారాల భార్యామణి.. ఇవే గుర్తొస్తాయి. వీరోచిత నారీమణిగా ఆమెను దీపావళి నాడు మాత్రమే తలుచుకుంటాం! నిజానికి సత్యభామ నిలువెత్తు ఆత్మస్థయిర్యం, ఆత్మగౌరవం. సడలని పట్టుదల. భర్తతో సమానంగా హోదా తీసుకున్న సహచరి. కష్టాల్లో భర్తకు కొండంత అండగా నిలిచిన జీవిత భాగస్వామి! మహిళలకు సంబంధించినంత వరకు నరకాసుర వధ కాదు దీపావళి. పిరికితనాన్ని కాల్చేసి.. ఆత్మ స్థయిర్యాన్ని వెలిగించుకున్న రోజు! మహిళలంతా సత్యభామగా గౌరవం అందుకున్న వేడుక!! ఇలాంటి సత్యభామలు స్క్రీన్ మీద కూడా కనిపించి మహిళా ప్రేక్షకుల ఆలోచనా కోణాన్నే మార్చేశారు. ‘మిష్టర్ పెళ్లాం’.. గుర్తుంది కదా? బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త దొంగతనం నిందతో సస్పెండ్ అవుతాడు. అప్పుడు.. అప్పటి దాకా గృహిణిగా ఉన్న భార్య కుటుంబ పోషణ బాధ్యతను తీసుకొని ఉద్యోగానికి వెళ్తుంది. నైపుణ్యంతో తక్కువ సమయంలోనే పదోన్నతిని, మంచి జీతాన్ని అందుకుంటుంది. ఇంకోవైపు భర్త నిర్దోషి అని రుజువుచేయడానికి తనవంతు ప్రయత్నమూ మొదలుపెట్టి ‘మిష్టర్ పెళ్లాం’ అనిపించుకుంటుంది కథానాయిక ఝాన్సీ (ఆమని). రాధాగోపాళం చూసే ఉంటారు. పురుషాహంకారాన్ని మీసానికి అంటించుకున్న గోపాలానికి చిలిపితనం, సమయస్ఫూర్తి, ప్రజ్ఞాపాటవాలుగల జీవన సహచరి రాధ. గోపాళం (శ్రీకాంత్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. రాధ (స్నేహ) కూడా లాయరే. ఇంకా చెప్పాలంటే గోపాలం వాదిస్తున్న ఓ కేసులో డిఫెన్స్ లాయర్. నిజం నిగ్గు తేల్చి భర్తను ఓడిస్తుంది. అహం దెబ్బతిన్న గోపాలం భార్యను వదిలేయాలనుకుంటాడు. అప్పటికి ఆమె గర్భవతి. తను తలదించుకోకుండా.. సాగిల పడకుండా.. భర్త తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది రాధ. తప్పొప్పులను సరిదిద్దుకుంటూ నడిస్తేనే దాంపత్యం.. కలిసి ఉంటేనే ఆలుమగలు లేకపోతే ఒక స్త్రీ, ఒక పురుషుడు అని చెప్తుందీ సినిమా. ‘గోరంత దీపం’ ఇంకో సినిమా. భర్తే తండ్రి, గురువు, దైవం అన్నీనూ అనే సుద్దుల సారెతో అత్తారింట్లోకి అడుగుపెడ్తుంది పద్మ (వాణిశ్రీ). భర్త శేషు (శ్రీధర్) బ్యాడ్మింటన్ ఆటగాడు. అత్తగారి (సూర్యకాంతం) ఆరళ్లు షరామామూలే. భార్య ఆత్మగౌరవాన్ని గుర్తించని భర్త ప్రవర్తనా సహజమే ఆ సంసారంలో. అదనంగా పద్మకున్న సమస్య డాక్టర్ మోహన్ (మోహన్ బాబు). భర్త స్నేహితుడు అతను. ఆమె మీద కన్నేసి కబళించాలని ఎప్పటికప్పుడు ఎత్తులు, పన్నాగాలు పన్నుతూంటాడు. అతని గురించి భర్తకు చెప్పినా వినడు. విన్నా నమ్మడు. నమ్మినా స్పందించడు. అప్పుడు తనే సత్యభామ అయి మోహన్‌ను ఎదుర్కొంటుంది. విజయం సాధిస్తుంది. ఇంటికే కాదు జీవితానికే దీపావళి తెచ్చుకుంటుంది. హిందీలో ‘‘తుమ్హారీ సులూ’’ కూడా ఏం తీసిపోదు ఈ సత్యభామ సీక్వెన్స్‌లో. కథానాయిక సులోచనా దూబే (విద్యా బాలన్) చూపిన తెగువా తక్కువేం కాదు. రేడియోలో పాటలు వింటూ .. వాళ్లు పెట్టే క్విజ్‌లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్న ఆమె ఒకరోజు రేడియో క్విజ్‌లో విజేతవుతుంది. అప్పటికే భర్త తను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని మారి ఇబ్బందులు పడ్తూంటాడు. సులూ తనకు వచ్చిన బహుమతి తీసుకోవడానికి రేడియో స్టేషన్‌కు వెళ్లి అక్కడ లేట్ నైట్ షో అనౌన్సర్‌గా జాబ్ తెచ్చుకుంటుంది. భర్త ఉద్యోగం పోయే స్థితి వస్తుంటే ఆమె ఉద్యోగంలో రాణిస్తూంటుంది. దీంతో తలెత్తిన భర్త ఈగో సమస్యను, కొడుకు క్రమశిక్షణారాహిత్యాన్ని అన్నిటినీ నేర్పుగా చక్కదిద్దుకొని.. చివరకు తను పనిచేసే రేడియోస్టేషన్లోని ఉద్యోగులకు క్యాటరింగ్ సర్వీస్ ఇచ్చేలా భర్తకు కాంట్రాక్టూ ఇప్పిస్తుంది సులోచన దూబే. వర్తమాన ‘సత్య’లు అయితే ఈ సినిమాలకు పురాణ స్త్రీ సత్యభామ స్ఫూర్తి కాదు. వ్యాపారంలో నష్టం వస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుందామని భర్త చతికిలపడితే ఆఖరుసారిగా ఒక్క చాన్స్ తీసుకొని దగ్గరున్న బంగారాన్ని కుదువబెట్టి.. కంపెనీకోసం శ్రమించి రుణంలోంచి బయటపడేసి.. తమను నమ్ముకున్న వాళ్ల జీతాలకు పూచీ ఇచ్చి జీవితాలకు భరోసా కల్పించిన భార్య, ఉన్నది అమ్ముకొని దుబాయ్ వెళ్లి ధిర్హామ్స్లో సంపాదనను ఇంటికి పంపిస్తాననే ధీమా చూపిన మనిషి అనారోగ్యంతో ఇంటికొచ్చి మంచానికి అతుక్కుపోతే ఆయన ఆరోగ్యానికి చికిత్సే కాదు కుటుంబ ఆర్థిక సమస్యల ట్రీట్మెంట్నూ తలకెత్తుకొని ధైర్యంగా జీవనపోరాటం చేస్తున్న ఆ ఇంటి ఇల్లాలు, కష్టాల కడలిలో చిక్కుకున్న ఇంటిని వీడని ధైర్యంతో చక్కబెట్టిన సహధర్మచారిణి.. ఇలాంటి ఇంకెందరో సంసార సమరంలో సొమ్మసిల్లిన భర్తల చేతిలోంచి కుటుంబ రథం పగ్గాలు పట్టి ముందుకు నడిపిస్తున్న వారంతా నిజ జీవితంలోని సత్యభామలే. మహిళాలోకానికి ఎప్పటికీ వారే స్ఫూర్తి.. ప్రేరణ!! -
కృష్ణుడు ఇంత బరువు ఉంటాడా!
‘‘వ్రతం ముగిసింది. ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా’’ అన్నది సత్యభామ. ‘‘అలాగే కానివ్వండి. అయితే దంపతులిద్దరు పారిజాతవృక్షం దగ్గరకు రావాలి. మహర్షి! దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. ‘‘అవశ్యం’’ అని బయలుదేరాడు నారదుడు. ‘‘కొంచెం జలం అక్షతల్లోకి తీసుకొని దారాదత్తం చేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. అలాగే చేసింది సత్యభామ. ‘‘భాగ్యమన్న నాదే భాగ్యం... మహాభాగ్యం’’ సంబరపడిపోయాడు నారదుడు. ‘‘అమ్మా! ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా’’ అడిగాడు బ్రాహ్మణుడు. ‘‘అబ్బా! ఇంకా అదొక ఆలస్యం ఉందా!’’ అన్నది సత్యభామ. ఈలోపు నారదమహర్షి అందుకొని– ‘‘అంత తొందరపడతారేం ఆచార్యా! బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణతులాభారం కన్నుల పండుగగా చూసి మరీ వెళతారు’’ అన్నాడు. ‘‘అవును మహర్షి! ముందు తులాభారం తూచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతే వారిని సత్కరిస్తాను’’ అన్నది సత్యభామ. కృష్ణుడిని త్రాసులో కూర్చోబెట్టారు. ‘‘నళినీ... నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచండి’’ అని చెలికత్తెను ఆదేశించింది సత్యభామ. ‘‘అయ్యయ్యో! ఒక్క వారం నగలే. కృష్ణయ్యబాబు ఇంతేనా!’’ నోరెళ్లబెట్టాడు వసంతయ్య. ‘‘స్వామీ! మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి’’ అంటూ కోపగించుకుంది సత్యభామ. ‘‘విన్నావా వసంతయ్య’’ అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో. ‘‘విన్నాను... వేశాను’’ అని నోటికి తాళం వేసినట్లుగా నటించాడు వసంతయ్య. ఆ బరువుకు కృష్ణుడు తూగలేదు. ‘‘నళినీ... మిగతా ఆరువారాల నగలు కూడా తెచ్చి వేయండి’’ అని చెలికత్తెని ఆదేశించింది సత్యభామ. అలాగే చేసింది నళిని. కానీ ఏంలాభం! ఈ బరువుకూ కృష్ణుడు తూగలేదు. దీంతో సత్యభామకు సహనం నశించింది. అనుమానం వచ్చింది. ‘‘వసంతయ్య! త్రాసులో ఏమీ మోసం లేదుకదా’’ అని అడిగింది. తనిఖీ చేసి– ‘‘త్రాసులో ఏమీ దోషం లేదమ్మా. మరి ఉన్న మోసమంతా ఎక్కడో’’ అన్నాడు నర్మగర్భంగా. ‘‘అవన్నీ నన్నేం చేయవు. శమంతకమణి ప్రసాదించిన బంగారాన్ని వెయ్యి. వసంతయ్యా... వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్లు’’ అని ఆదేశించింది సత్యభామ. ‘‘గోవిందా గోవిందా’’ అనుకుంటూ పనివాళ్లతో పాటు వెళ్లాడు వసంతయ్య. తెచ్చిన బంగారాన్ని త్రాసులో వేశారు. అయినప్పటికీ కృష్ణుడు తూగలేదు. ‘‘ఏమిటి మాయా! నా స్వామి ఇంత బరువు ఉన్నాడా!’’ ఆశ్చర్యపోయింది సత్యభామ. ‘‘ఆయన బరువు నాకేం తెలుసమ్మా’’ అన్నాడు నారదుడు. ‘‘అయ్యో ఇప్పుడేమీ చేయడం’’ ఆలోచనలో పడింది సత్యభామ. ఇద్దరు బ్రాహ్మణులు మెల్లగా ఇలా గొణుక్కుంటున్నారు... ‘‘మన సంభావన కూడా ఏమీ మిగిలేటట్లు లేదే’’ అన్నారు ఒకరు. ‘‘మన చేతులు, చెవులకు ఉన్న బంగారాన్ని తీసి అక్కడ పెట్టమనకపోతే అదే పదివేలు’’ అన్నారు ఇంకొకరు. ‘‘దేవీ! నీ వద్ద ఉన్న ధనం ఇదేనా? నేను ఈయనకు బానిస కావాల్సిందేనా’’ అన్నాడు కృష్ణుడు. ‘‘నీవు లేనిదే నేను జీవించలేను’’ అన్నాడు. ‘‘ఆందోళనపడకండి స్వామీ! మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా! ధైర్యంగా ఉండండి’’ అన్నది సత్యభామ. ‘‘ఏమో ప్రియా! మనకు ఎడబాటు తప్పదేమో’’ అన్నాడు కృష్ణుడు. ‘‘తపస్వీచంద్రమా! ధనేతరాలతో కూడా తూచవచ్చాన్నారు కదా?’’ అడిగింది సత్యభామ. ‘‘సాధ్యమైతే అలాగే ప్రయత్నించండి’’ అన్నాడు నారదుడు. ‘‘నళిని, మల్లిక, వసంతయ్య... మందిరంలో గల విలువైన వస్తువులన్నీ తీసుకురండి’’ అని ఆదేశించింది సత్యభామ. అయినప్పటికీ ఫలితం లేదు!! ‘‘మునీంద్రా! ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథుడు ఇంత బరువు ఉంటాడని నేను నమ్మలేకుండా ఉన్నాను’’ అన్నది సత్యభామ. ‘‘పిచ్చితల్లీ! గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువును ఇంత అని నిర్ణయించగలవారు ఎవరని!’’ అన్నాడు నారదుడు. ‘‘నా నాథుడు ఇంత బరువు ఉంటాడని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి!’’ అలక స్వరంతో అడిగింది సత్యభామ. ‘‘నారాయణ నారాయణ! నా మీద అపనింద వేయడం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడనే భ్రమించావుగాని జగన్నాథుడని గ్రహించలేక పోయావు. అది నా అపరాధమేనంటావా!’’ అన్నాడు నారదుడు. ‘‘మహానుభావా! గతాన్ని తరచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణిని స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి’’ అని నారద మహర్షిని వేడుకుంది సత్యభామ. ‘‘సత్యాదేవి! అహంకారభూయిష్టమైన శమంతకమణికి, ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుణ్ణి వెలబోయమంటావా! అంగడి వీధుల్లో పెట్టి సరిౖయెన వెలకు విక్రయిస్తాను. పిచ్చితలీ!్ల చేతనైతే తుల తూచి తీసుకుపో’’ కరాఖండిగా చెప్పాడు నారదుడు. సమాధానం: శ్రీకృష్ణతులాభారం -
ఆనందోత్సాహాల వెలుగు పూలు
లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం దీపావళి అమావాస్య. రావణవధ అనంతరం శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో బాణాసంచా కాలుస్తారు. ఒకనాడు కృష్ణభగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు దుర్వాసమహర్షి తదితరులందరూ వచ్చి ‘కృష్ణా, నరకాసురుని ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. వాడు దేవతల తల్లి అదితి కుండలాలను తస్కరించాడు. వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహరించే మణిపర్వతాన్ని మరలించి వేశాడు. అమిత బలాఢ్యుడైన నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు. అపుడు కృష్ణుడు ‘నేను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతలనందరిని సాంత్వన పరిచాడు. తరువాత సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ప్రాగ్జోతిషపురానికి వెళ్లాడు. అక్కడ ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. కృష్ణుడు ప్రళయ కాలంలో మేఘం ఉరిమినట్లుగా తన పాంచజన్యం పూరించాడు. ఆ శబ్దానికి నిద్రనుంచి లేచి యుద్ధానికి దూకబోయిన మురాసురుని మట్టుపెట్టాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చారు. ఆ ఏడుగురిని కూడా యమపురికి పంపించాడు కృష్ణుడు. ఈ వార్త నరకాసురుడికి చేరి యుద్ధానికి వచ్చాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది. రాక్షసుల మస్తకాన్ని ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును కృష్ణుడు సత్యభామ చేతికి అందించాడు. వెంటనే యుద్ధాన్ని ప్రారంభించి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణాన్ని తీసి వింటికి తొడుగుతుంటే వీర రసం, శృంగార రసం, భయరసం, రౌద్ర రసాలు ఆమెలో తాండవిస్తున్నాయి. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణాలను ప్రయోగించడం ప్రారంభించారు. భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటికి అత్తుకుపోయిన సత్యభామ వంక చూసిన కృష్ణుడు ‘సత్యా, నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను’ అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. చివరికి ప్రాణాలతో ఉన్న నరకుడి మీదికి తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని.ప్రయోగించగానే నరకాసురుని తల తెగి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడనే సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించారు. వాడు చతుర్దశినాడు చచ్చిపోయాడు. అందుకనే మనం నరకచతుర్దశి అంటాము. ఆ మరునాటిని దీపావళి అమావాస్య అంటాము. దీపావళి నాడు ఆచరించవలసినవి – ఈ రోజున తెల్లవారు జామున్నే పెద్దల చేత తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లకీ‡్ష్మ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో ప్రవేశిస్తుందని శాస్త్రవచనం. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వులనూనె దీపాలనే వెలిగించడం, మట్టిప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. చీకటిపడే సమయంలో దీపదానం చేసి, మండుతున్న కట్టెల్ని తిప్పాలి. ఇలా తిప్పడం చేత పీడ పోతుందని చెప్తారు. నిజానికి దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతసిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీపూజ చేయాలి. దీపావళీ నాటి అర్ధరాత్రి చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతోకొడుతూ, తప్పెట్ల చప్పుళ్లతోనూ దరిద్ర దేవతను సాగనంపాలని శాస్త్రవచనం. బలిపాడ్యమి దీపావళి మరునాటినుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. కార్తీక శుద్ధపాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈరోజు బలిచక్రవర్తిని పూజించి ‘‘బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సు రారాతే పూజేయం ప్రతిగృహ్యతాం అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి. భగినీ హస్త భోజనం కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ పేరిట పండుగను జరుపుకుంటారు. ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ. – కృష్ణకార్తీక -
విద్యార్థిని ఆత్మహత్య: వర్సిటీలో ఆగ్రహ జ్వాలలు
సాక్షి, చెన్నై: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడంతో, తోటి విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. ఈ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోన్న హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక అనే విద్యార్థిని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. వర్సిటీలో రాధా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధుల విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్, తరగతి గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. తమ స్నేహితురాలి మృతికి యాజమాన్యమే కారణమంటూ వారు ఆందోళన చేపట్టారు. వర్సిటీ ప్రాంగణంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. వర్సిటీకి చేరుకున్న పైర్ ఇంజన్లను విద్యార్దులు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని లోనికి వెళ్లనిచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాగా, రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందని మౌనికను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. (చదవండి : 'సత్యభామ'లో హైదరాబాద్ యువతి ఆత్మహత్య) -
విద్యార్థిని సూసైడ్.. వర్సిటీలో ఆగ్రహ జ్వాలలు
-
చెన్నైలో తెలుగు విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్రు చేస్తున్నారు. మౌనిక ఆత్మహత్య చెన్నైలో విద్యాబ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్థుల్లో బయాందోళనకు గురి చేసింది. -
భామనే సత్యభామనే
ఆవేశం పాలు ఎక్కువగా ఉండే తెలుగువారికి సత్యభామ అంటే ఆప్యాయత, ఆదరం. నందితిమ్మన పారిజాతాపహరణం... సత్యభామ అంటే మనలో ఇష్టాన్ని పెంచింది. పోతన భాగవతం... నరకుడి యుద్ధవర్ణనతో... సత్యభామని ఆదర్శ స్త్రీమూర్తిగా నిలబెట్టింది. ‘భామనే, సత్యభామనే’ అంటూ కూచిపూడి భాగవతం... సత్యభామని మనకు మరింత దగ్గర చేసింది. ఎవరీ సత్యభామ? ఆమెలో ప్రత్యేకతలేమిటి? సత్యభామ అనగానే అందరికీ గుర్తొచ్చేది గరుత్మంతుడి మీద కృష్ణుడు మూర్ఛపోయి ఉండగా, వింటిని ఎక్కుపెట్టి పెద్దకళ్లతో తీవ్రంగా చూస్తూ బాణాన్ని సంధిస్తున్న రూపమే. ఆమె పురాణకాలం నాటి స్త్రీకి మాత్రమే కాదు సమర్థవంతురాలైన ఆధునిక స్త్రీకి కూడా ప్రతిబింబం. సత్యభామలో ఉన్న ప్రత్యేక లక్షణాలను పరిశీలిస్తే... సత్యభామను కళ్లారా చూసినట్లే. స్వాభిమానం: అందరిలో ఒకరిగా ఉండిపోవడానికి ఇష్టపడదు. ఏ పని చేసినా మిగిలిన వారికంటే ఘనంగా, సమర్థవంతంగా చేయాలనుకుంటుంది. తనేంటో నిరూపించుకోవాలనే తపన ఉన్న స్త్రీ. పౌరుషం: ఆమె తండ్రి సత్రాజిత్తును శతధన్వుడు సంహరిస్తాడు. తండ్రి మరణానికి తీవ్రంగా బాధపడుతుంది. అంతటితో ఆగిపోలేదు, ఏడుస్తూ ఊరుకోలేదు సత్యభామ. తండ్రి ప్రాణాలు తీసిన వాడికి చావంటే ఏమిటో చూపిస్తానని ప్రతినపూనుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఓదార్చి, శతధన్వుడిని తాను సంహరిస్తానని మాట ఇచ్చే వరకు శాంతించని మహిళ. కళలలో నేర్పరి: నృత్యం, సంగీతం వంటి లలిత కళల్లో ఆరితేరింది. స్త్రీ వీటికే పరిమితం అని గిరి గీసుకోకుండా యుద్ధవిద్యల్లో కూడా ఎనలేని నైపుణ్యాన్ని సాధించింది. స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు, స్త్రీ శక్తికి, తెలివితేటలకు పరిధి విధించడం ఎవరితరమూ కాదని నిరూపించిన మహిళ సత్యభామ. సౌకుమార్యం: సత్యభామ చిలుకలకు పలుకులు నేర్పేది. నెమళ్లకు నాట్యం నేర్పించేది. బొమ్మల పెళ్లిళ్లకు వెళ్లినా అలసి పోయేది. అంతటి సుకుమారి. అయినా ఎప్పుడూ కాలాన్ని నిరుపయోగంగా గడిపేది కాదు. అందం: యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె చేతిలోని విల్లు వంగి చక్రంలాగా అనిపించింది. ఆ చక్రం చంద్రుడి లాంటి సత్యభామ ముఖం చుట్టూ ఏర్పడిన కాంతి వలయం లాగా ఉంది. బాణాలు ఎక్కు పెడుతుంటే నారి దగ్గర ఉన్న చేతి వేళ్ళ గోళ్ళు మిలమిలా మెరుస్తూ ఆ కాంతులు చెక్కిళ్ళ మీద ప్రతిఫలిస్తుండేవి. నుదుటి మీద పట్టిన చెమటకి ముంగురులు అతుక్కు పోయి వింత సోయగం వెలార్చింది. నారి లాగినప్పుడు వచ్చే ధ్వని మేఘగర్జనం లాగా ఉండింది. చేతిలో ఉన్న విల్లు ఇంద్ర ధనుస్సులాగా ఉండింది. మరి, మేఘం ఏది? అంటే, నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడే. మెరుపుతీగె ఉండాలి కదా! అది తనే. సమర్థత: కృష్ణుడు సొమ్మసిల్లినప్పుడు సత్యభామ విల్లు అందుకుని యుద్ధానికి సిద్ధం అయింది. భర్తకి ముందువైపుగా నిలబడింది. అంటే శత్రువు వేసే ఆయుధం ఏదీ తనని దాటి భర్త మీదికి వెళ్లకుండా అడ్డుగా ఉండటానికి. జడని అడ్డురాకుండా గట్టిగా ముడి వేసింది. చీర ముడి గట్టిగా బిగించింది. పమిటని చేతితోలాగి నడుముకు చుట్టి పక్కకి దోపింది. నగలు యథాప్రకారం మెరిసిపోతున్నాయి. ఒక కాలు ముందుకి సాచింది. ఎడమ చేతితో విల్లు పిడి పట్టుకుని కుడి చేతితో నారికి బాణం సంధించింది. శత్రు సైన్యాన్ని బాణాల వర్షంలో ముంచేసింది. సంభాషణ చాతుర్యం: సత్యభామలో సంభాషణ చాతుర్యానికి అద్దం పట్టే సంఘటన యుద్ధానికి వెళ్లేటప్పుడు కృష్ణుడిని ఒప్పించడంలోనే కనిపిస్తుంది. ‘నీవు ఎంత బాగా యుద్ధం చేస్తున్నావో చూసి, ఆ సంగతిని అందరికీ చెపుతాను’ అంటుంది. అలంకారప్రియత్వం: ఆమెకు లలిత కళలంటే ఎంతిష్టమో అలంకరించుకోవడం కూడా అంతే ఇష్టం. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా ఒంటి నిండా నగలను అలంకరించుకుంది. సున్నిత మనస్కురాలు: సత్యభామ అటు నరకుడి మీదకు బాణాలు వేస్తోంది. ఇటు కృష్ణుడు ఎట్లా ఉన్నాడోనని చూస్తోంది. అటు శత్రువు మీద వాడి బాణాలు. ఇటు భర్తవైపు ప్రేమపూర్వక దృక్కులు. అటువైపు చూపులో కోపం. ఇటువైపు చూపులో ప్రేమ, అనురాగం కనిపిస్తాయి. యుద్ధం చేస్తున్నా మనసులో కృష్ణుడికి ఎలా ఉందోననే ఆందోళన కనిపిస్తుంది ఆమె కళ్లలో. సద్గుణాలు: కృష్ణుడు వెళ్తున్నది ఒక క్రూరుడిని సంహరించడానికని తెలుసు. అతడు మరణించకపోతే భూమ్మీద ప్రాణికోటి మనుగడ కష్టమని తెలుసు. అందుకే లోకకల్యాణం కోసం దుష్ట సంహారానికి వెళ్లడానికి కృష్ణుడిని అనుమతిస్తుంది. అలాగే భర్త ఒక్కడే యుద్ధానికి వెళ్తున్నాడంటే మనసు తట్టుకోలేకపోతుంది. పట్టుపట్టి తానూ వెళ్తుంది. ఆమె మూర్తీభవించిన స్త్రీత్వం. సత్యభామ యుద్ధం చేసినంత సేపు విశ్రాంతి తీసుకున్న కృష్ణుడు ఆనక విల్లు తను తీసుకున్నాడు. నరకుణ్ణి సంహరించాడు. గత జన్మలో (భూదేవి)తన కుమారుడు ఈ జన్మలో తన కళ్ల ముందు చనిపోతుంటే, మిగిలిన బిడ్డలు సుఖంగా ఉంటారని మనసుకు సర్ది చెప్పుకున్న మాతృమూర్తి. మూలగ్రంథాల్లో లేని పాదతాడనం శ్రీకృష్ణుణ్ణి పాదతాడనంతో సత్కరించటం, పుణ్యకవ్రతం, రుక్మిణీదేవి తులసిదళంతో కృష్ణుణ్ణి తూచి సత్యభామ అహంకారాన్ని మట్టుబెట్టటం వంటివి శ్రీమద్భాగవతంలో కాని, హరివంశంలో కానీ లేవు. కానీ అవి సత్యభామ మనస్తత్వానికి తగినట్టుగా ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి. కూచిపూడి భాగవతుల కారణంగా సత్యభామలేఖ, నందితిమ్మన పారిజాతాపహరణ కావ్యం పుణ్యమా అని శ్రీకృష్ణుడికి పాదతాడన వంటి బహుమానాలు లోకంలో వ్యాప్తి చెందాయి. నిజానికి సత్యభామ స్వాభిమానం ఉన్న స్త్రీ. ధీరత్వానికి ప్రతీక. – డా. ఎన్.అనంతలక్ష్మి -
బలరామ సత్యభామల గర్వభంగం!
ముక్కోపిగా, ముఖస్తుతికి లోబడే వ్యక్తిగా మహాభారతంలో కనిపించే బలరామునిలో తన శౌర్యపరాక్రమాలపై మితిమీరిన విశ్వాసం. కృష్ణుని ప్రియపత్నిగా పేరొందిన సత్యభామకు తన అందచందాలమీద ఎనలేని నమ్మకం. వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తుండగా తగిన అవకాశం ఆంజనేయుడి రూపంలో రానే వచ్చింది. త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ వెళ్తుండగా ఆ దాపులనే రామనామాంకిత ధ్యానంలో మునిగిపోయి ఉన్న ఆంజనేయుడు కనిపించాడు. నారదుడు కావాలనే శ్రీరామ స్మరణ చేశాడు. రామనామం వినగానే ఆంజనేయుడు పరుగున వచ్చి నారదుని ముందు వాలి, ‘‘ఓ రుషిపుంగవా, నా రామయ తండ్రి నామాన్ని స్మరిస్తున్నావంటే నీకు తప్పకుండా రామునితో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. నా స్వామిని చూసి చాలా కాలం అవుతోంది. ఒక్కసారి ఆయనను దర్శించుకోవాలని నా మనస్సు కొట్టుకులాడుతోంది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’’ అంటూ అర్థించాడు. ‘‘ఓ వానరా! రాముణ్ని నేను చూసి కూడా చాలా కాలమయింది. అయితే రామునికంటే అధిక శౌర్యపరాక్రమాలు కలవాడు, సీతమ్మకన్నా అందమైనదీ అయిన శ్రీకృష్ణ సత్యభామలు సమీపంలోనే ఉన్నారు. చూడాలనుంటే చెప్పు, తీసుకెళతాను’’ అన్నాడు.‘‘ఏమిటీ, నా రామయ్య తండ్రి కన్నా బలమైనవాడు, సీతమ్మ తల్లికన్నా సౌశీల్యమైన స్త్రీ మరొకరున్నారా? నన్నొకసారి అక్కడికి తీసుకెళ్లు. నేను చూసిన తర్వాత వారు అలా లేకపోవాలీ, నీ పని చెబుతాను’’ అంటూ నారదునితో కలసి ద్వారకను చేరాడు. ఆంజనేయుడు బయటేఉండి, ‘‘రామబంటునైన నేను అన్యుల మందిరానికి రాను. నీవే నీ కృష్ణుని ఇక్కడకు రమ్మను’’ అంటూ నారదుని లోనికి పంపించాడు. నారదుడు రాజప్రాసాదానికేగి, సత్యభామాసమేతంగా బలరాముడి చెంత ఆసీనుడైన గోపాలకృష్ణుని చూస్తూ ‘‘కృష్ణా! హనుమంతుడనే ఒక వానరాగ్రగణ్యుడు నీ దర్శనం కోసం ద్వారంలో వేచి ఉన్నాడు. అతడు మిమ్మల్నే తన కడకు రమ్మంటున్నాడు. ఒకవేళ రాకపోతే నీ మందిరాన్ని నాశనం చేసి, ద్వారకను సముద్రంలో ముంచేస్తానంటున్నాడు. నువ్వు త్వరగా పద, ఆ వానరాగ్రేసరుడిని దర్శించుకుందువు’’ అంటూ తొందర చేశాడు నారదుడు. అహకారంలోనూ, మితిమీరిన ఆత్మాభిమానంలోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని సత్యభామ, బలరాములు వెంటనే అమితాగ్రహంతో ‘‘నారదా! ఒక వానరం వస్తే, వానిని చూడటానికి కృష్ణుడే స్వయంగా వెళ్లాలా? అలా రాకపోతే ఆ కోతి ద్వారకనే పెళ్లగించి సముద్రంలో పడేస్తుందా? ఏమిటీ వింత? ముందు నేనెళ్లి, వాడి సంగతి తేలుస్తాను’’ అంటూ తన హలాయుధాన్ని భుజానేసుకుని బయటికొచ్చాడు బలరాముడు. అతణ్ణి అనుసరించబోయింది సత్యభామ. బలరాముడు బయటకు వచ్చి, ఆంజనేయుణ్ణి చూసి, ‘‘ఓయీ, వృద్ధ వానరమా! నా తమ్ముడు కృష్ణుని చూడటానికి వచ్చి అతనినే బయటకు రమ్మంటున్నావా? నీకెంత అహంకారం? నువ్వు ద్వారకనే సముద్రంలో ముంచెయ్యగలిగేంత మొనగాడివా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత బతికుంటే చూద్దువుగాని’’ అంటూ దూసుకురాబోయిన బలరాముణ్ణి హనుమ తన తోకతో చుట్టి విసిరికొట్టబోతుండగా, నారదుడు ‘‘హనుమా! లోపల ఉన్నది రాముడే, ఈయన అతనికి ప్రియ సోదరుడు సుమీ’’ అంటూ హెచ్చరించాడు. హనుమ వెంటనే బలరాముణ్ణి తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని లోపలకు దారితీశాడు. ఈ లోగా కృష్ణుడు సత్యభామతో ‘‘భామా! నువ్వు సీతమ్మలా అలంకరించుకునిరా’’ అంటూ తాను రామునిలా రూపు మార్చుకున్నాడు. ఈలోగా హనుమలోనికి రానే వచ్చాడు. వస్తూనే కృష్ణునికి నమస్కరించి, ‘‘ఎన్ని యుగాలయ్యింది స్వామీ నిన్ను చూసి?’’ అంటూ గాఢాలింగనం చేసుకుని, ‘‘నీ పక్కనే ఉన్న ఈమె ఎవరు స్వామీ ఎంతో వికారంగా ఉన్నా, ఇన్ని నగలు అలంకరించుకుని ఉంది? ఇంతకూ నా తల్లి సీతమ్మ ఎక్కడ’’ అంటూ ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే మందిరంలోనికి అతి సామాన్యమైన చీర, కట్టుబొట్టు... ప్రశాంతమైన ముఖం, పెదవులపై చిరునగవే ఆభరణాలుగా ప్రవేశించిన రుక్మిణిని చూస్తూనే హనుమ ‘‘వచ్చావా సీతమ్మా’’ అంటూ చివాల్న ఆమె పాదాల మీద వాలిపోయాడు. హనుమ తోకతో చుట్టివేయడంతోనే ఒళ్లంతా ఉండచుట్టుకుపోయిన వీరాధివీరుడు, బలాఢ్యుడు అయిన బలరాముడు, అతిలోక సౌందర్యరాశి, ఐశ్వర్యవంతురాలు అయిన సత్యభామలు సిగ్గుతో తలలు వంచుకున్నారు. -
సత్యా సమరసఖి సుందరం
దీపావళికి కారణమైన ఘటన నరకాసుర వధ! ఈ సమరంలో సొమ్మసిల్లిన కృష్ణుడికి వెన్నంటి ఉన్న భాగస్వామి సత్యభామ! ఆ గాథతో భామ ఓ పౌరాణిక పాత్రగానే కాదు.. మన నాట్యకళల్లోనూ తారగా నిలిచింది. అందం, ఆత్మాభిమానం.. అలక, కినుక.. రౌద్రం, ధైర్యం.. సమరం, విజయం.. వంటి లక్షణాలతో నేటి వనితలకూ ప్రేరణనిస్తోంది! దీపావళినిచ్చిన ఈ ధీర భూమికను, కొనియాడిన వివిధ నాట్యరీతుల్లో ఆ భూమికను పోషించిన నర్తకీమణులు సత్య గురించి చెప్పిన సత్యాలు.. సమరం.. విజయం సత్యభామ.. భూదేవి రూపం. నరకాసురుడు ఆమె కొడుకు. ఈ కథ చెప్పే పరమార్థం ఏంటంటే.. చెడు చేసేవాడు కొడుకైనా సరే ఆ తల్లి సహించదు. అందుకే సంహరించి అంతమొందిస్తుంది. సర్వమానవాళికి విజయాన్నిస్తుంది. సత్యభామ పరిపూర్ణమైన స్త్రీకి నిజమైన నిర్వచనం. స్త్రీ, పురుషుడు అన్న భేదం లేకుండా మనుషులంతా తల్లిలాగే ఆలోచించాలి. అప్పుడే చెడు తలంపన్నది ఎవరి మనసుల్లోకి రాదు. స్త్రీల మీద ఈ దాష్టీకాలూ ఉండవ్. - అచ్యుత మానస (కూచిపూడి, కథక్, భరతనాట్య కళాకారిణి) అందం.. ఆత్మాభిమానం ‘కూచిపూడి’లో సత్యభామ ప్రత్యేకం. ఆమెదే భామాకలాపం. చాలా స్ఫూర్తిదాయకమైన పాత్ర. అందం.. లాలిత్యం.. ధైర్యం.. ధీరత్వం ఆమె సొంతం. కృష్ణుడిని ఎంత ప్రేమిస్తుందో అంత సాధిస్తుంది.. చివరకు అంతే అండగా నిలబడుతుంది. ఒక స్త్రీకి ఉండాల్సిన లక్షణాలవి. సరైన సమయంలో తన శక్తియుక్తులతో చెడును సంహరిస్తుంది. భామా కలాపంలో సత్యభామగా వేయడం నా అదృష్టం. ఈ పాత్ర నాకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ లవ్ టు బీ ఎ ఉమన్. ఈ జన్మలోనే కాదు ఏ జన్మకైనా! - అలేఖ్య పుంజల (కూచిపూడి కళాకారిణి) ప్రశాంతం.. ప్రకాశం.. చెడు మీద మంచి విజయమే సత్యభామ రూపం. మైథాలజీలో ఆ పాత్ర స్త్రీ శక్తికి, యుక్తికి ప్రతిరూపం. పౌరాణికాల్లో ఆ ఉనికి ఉందీ అంటే నిజజీవితంలోనూ ఆ పాత్ర అవసరం ఉన్నట్టే. ఎప్పటికైనా చీకటి తొలిగి వెలుగు రావాల్సిందే. స్త్రీ తన సమస్యల చీకటిపై పోరాడి వెలుగు పరిష్కారాల్ని పొందాలి. జీవితమంతా ప్రశాంతం.. ప్రకాశం! ఇదే దీపావళి స్ఫూర్తి! -మంగళాభట్ (కథక్ నాట్య కళాకారిణి) రౌద్రం.. ధైర్యం.. ఒకసారి సిడ్నీలోని తెలుగువాళ్లు ఆ ఏడాది దీపావళికి సత్యభామ, నరకాసురుడు కాన్సెప్ట్‌తో నా నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీపావళి వెనకున్న కథనంతా ముందుగా తెలుసుకొని.. కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకున్నాను. దానికనుగుణంగా కర్ణాటక సంగీత బాణీలనూ సమకూర్చుకున్నాం. అవన్నీ స్టేజ్ మీద నా నాట్యంగా చూసిన అక్కడి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్. సత్యభామ పాత్రను అర్థం చేసుకొనే అవకాశాన్నీ నాకిచ్చిందా పెర్ఫార్మెన్స్. మామూలప్పుడు అంత లాలిత్యంగా కనిపించే ఆమె నరకాసురుడి వధలో ఎంతో రౌద్రం.. అంతకుమించిన ధైర్యం కనబరుస్తుంది. - స్మితామాధవ్ (భరతనాట్య కళాకారిణి) - సరస్వతి రమ -
కోలాహలంగా ఉట్లోత్సవం
తిరుచానూరు : గోకులాష్టమిని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట మంగళవారం సాయంత్రం ఉట్లోత్సవం కోలాహలం గా జరిగింది. రెండు రోజులుగా అమ్మవారి ఆలయం లో రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువైన శ్రీకృష్ణస్వామి వారికి నిర్వహించిన గోకులాష్టమి వేడుకలు ఉట్లోత్సవంతో ముగిశాయి. ఇందులో భాగంగా వేకువజామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామికి శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో కన్నులపండువగా ఊంజల్‌సేవ నిర్వహించా రు. అనంతరం స్వామి వారు ఉభయదేవేరులతో సహా తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తరువాత ఆలయం ఎదుట స్వామిని కొలువుదీర్చి ఉట్లోత్సవం నిర్వహించారు. ఉట్టి కొట్టేందుకు స్థానికులు, భక్తులు ఉత్సాహం చూపారు. కార్యక్రమం లో ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు వరప్రసాద్, కేపీ.వెంకటరత్నం, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, ఏవీఎస్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ పూజ వెరీ వెరీ స్పెషల్!
వీవీయస్ లక్ష్మణ్లాగే ఆయన భార్య శైలజ కూడా వెరీ వెరీ స్పెషల్. లక్ష్మణ్ క్రికెట్ క్రీడను సంప్రదాయంగా ఆడితే... శైలజ పండుగలలోని సంప్రదాయాలను తుచ తప్పకుండా పాటిస్తారు... పుట్టింట్లో... అత్తవారింట్లో... రెండు చోట్లా ఒకే సంప్రదాయం... ఒకే ఆచారం... శ్రావణమాసం వచ్చిందంటే చాలు... శ్రావణగౌరి నోములు... వరల క్ష్మీ వ్రతం... ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది... ఏ పండుగనూ విడిచిపెట్టకుండా... అత్తగారు, తోటికోడళ్లతో కలిసి సంబరంగా చేసుకుంటారు. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు శైలజ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఎలా జరుగుతోంది... ‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... మా వివాహం జరిగి పది సంవత్సరాలయ్యింది. పెళ్లయిన మొదటి సంవత్సరం మేం ఇంగ్లండ్ వెళ్లవలసి వచ్చింది. అందువల్ల అక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ తరవాత నుంచి నేను మా అత్తగారు సత్యభామ ఇద్దరం కలిసే చేసుకుంటున్నాం. అత్తగారు డాక్టర్ కావడంతో ఆవిడకు ఎక్కువ సమయం దొరకదు. అందువల్ల ఉదయం మూడు గంటలకల్లా నిద్ర లేచి తొమ్మిదింటికల్లా పూజ పూర్తి చేసేసేవారు. ఆ తరవాతే హాస్పిటల్‌కి వెళ్లేవారు. మాతో మొదటిసారి పూజ చేయించినప్పుడు పూజారిని పిలిచారు. శ్రావణ పట్టీ కింద అమ్మవారి రూపు, పట్టుచీర... అన్నీ ఇచ్చారు. అసలు మాకు చీరలు మా అత్తగారే కొంటారు. తరువాతి సంవత్సరం నుండి ఆవిడ దగ్గరుండి మాకు చెబుతూ చేయించారు. మాకు అనుభవం రావడం కోసం అలా చేశారు. ఇప్పుడు మా అంతట మేమే చేసుకునే అనుభవం సంపాదించుకున్నాం. ఇద్దరి సంప్రదాయాలు ఒకటే... నేను వచ్చాకనే మా అత్తగారు పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటున్నారని చాలా మంది అనుకుంటారు. కాని ఆవిడకు ముందు నుంచీ పూజలు చేయడం బాగా అలవాటు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండటం వల్ల, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. అంతే! కొన్నిసార్లు పుట్టింటి సంప్రదాయం, అత్తింటి సంప్రదాయం వేర్వేరుగా ఉంటాయి. అయితే మా ఇద్దరి సంప్రదాయాలు ఒకటే కావడం వల్ల ఎవరిది ఎవరు పాటించాలా అనే ఇబ్బందే లేదు మాకు. అంతేకాదు.. మా ఆయన లక్ష్మణ్ గనక ఇంట్లో ఉంటే పూజ చేసేటప్పుడు మాతోటే ఉంటారు. కలశానికి పూజ చేస్తాం... ఈ పూజకు కొందరు బొమ్మకు అలంకరిస్తారు. కాని మేం మాత్రం కొబ్బరికాయకు పసుపు పూసి, కుంకుమతో కల్యాణ తిలకం తీర్చి, పైన రవికెల వస్త్రం ఉంచి, అలంకరించిన నారికేళాన్ని... వెండి కలశం మీద ఉంచుతాం. పుట్టింట్లోను, అత్తవారింట్లోనూ ఇదే ఆనవాయితీ. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ రెండు వ్రతాలూ... పిల్లలు, భర్త బాగుండాలని చేస్తారు. నేను కూడా ఆ నమ్మకంతోనే చేస్తున్నాను. ఆరోజున ప్రత్యేకంగా మొత్తం పన్నెండు రకాల పిండి వంటలు చేస్తాం. బూరెలు, పాయసం, గారెలు, పెరుగు వడలు, బజ్జీలు, ఐదు రకాల చిత్రాన్నాలు, సేమ్యా పాయసం వంటివి చేస్తాం. సాయంత్రం పేరంటానికి అందరినీ పిలిచి వాయనాలు ఇస్తాం. మా అత్తగారికి దగ్గరుండి మరీ అన్నీ సహాయం చేస్తాను. మా తోటికోడలు, అత్తగారు, నేను అందరం కలిసి పూజ చేసుకుంటాం. కన్నకూతురిలా చూస్తారు... మా అత్తగారు నన్నూ, మా తోటికోడలినీ ఏనాడూ కోడలిగా చూడలేదు. మా అత్తమామలకు అమ్మాయిలు లేరు. ‘మాకు అమ్మాయిలు లేరు, మీరిద్దరే మా అమ్మాయిలు’ అని మా మామగారు అంటుంటారు. మా అత్తగారిలో ఉండే సర్దుకుపోయే లక్షణం వల్లే మేం ఈ రోజు హాయిగా ఉన్నాం. మా అమ్మగారు ‘తల్లిదండ్రుల్ని కాదు, అత్తమామలను ప్రేమగా చూడటం గొప్ప’ అని చెప్పేవారు. తల్లిదండ్రులను ఎలాగూ ప్రేమగానే చూస్తార., కాని అత్తమామలను అలా చూడాలంటూ, మా దగ్గర నుంచి ప్రమాణం తీసుకున్నారు. అత్తవారింట్లో రెబెల్లా ఉండద్దన్నారు. కానీ రెబల్ నేచర్ పోదు కదా! చాలా త్వరగానే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. అనుకున్నప్పుడే ప్రారంభించాలి... భక్తి కావచ్చు, పూజలు కావచ్చు... ఏవైనా సరే చిన్నప్పటి నుంచే ఆచరించాలని భావిస్తాను. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే మొదలుపెడతాను. పెద్దవాళ్లమయ్యాక చేయచ్చులే అని వాయిదా వేయకూడదనేది నా అభిప్రాయం. ప్రతిరోజూ పొద్దున్న నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేసేసుకుని, అప్పుడు దినచర్య ప్రారంభిస్తాను. అది కూడా యాంత్రికంగా కాదు, మనస్ఫూర్తిగా చేస్తాను. నాకు ఏదైనా జరిగిపోతుందేమోననే భయంతో కాదు, భగవంతుడి మీద భక్తితో, ప్రేమతో చేస్తాను. మా చిన్నప్పుడు అమ్మ... ఇంట్లో బాగా పూజలు చేసేది. బహుశ నాకు అది వంశపారంపర్యంగా వచ్చిందేమో. ఇక్కడకు వచ్చాక అత్తగారిది కూడా అదే స్వభావం కావడంతో, నేను ఏ ఇబ్బందీ లేకుండా అన్ని పూజలూ చేసుకుంటున్నాను. నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేయమని మా పిల్లలకు నేర్పాను. పెద్దల పట్ల గౌరవంగా ఉండటం మా ఆయన లక్ష్మణ్ దగ్గర నుంచే నేర్చుకున్నారు. - సంభాషణ: పురాణపండ వైజయంతి మాకు ఇద్దరు అబ్బాయిలు. కోడళ్లయినా, కూతుళ్లయినా వాళ్లే. కొత్తలో ఏవేవో ఇబ్బందులు రావడం సహజం. అయితే వాటిని పెద్దవి చేసుకోకూడదు. ముందర ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది జీవితం. ఇప్పుడు నేను మా ఇద్దరు కోడళ్లు కలిసే పూజ చేసుకుంటాం. కోడళ్లు అంతా సిద్ధం చేసి ఉంచుతారు. - డా. సత్యభామ మా అత్తగారు బాగా సర్దుకుపోయేవారు. మా డెలివరీల టైమ్‌లో ఆవిడే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. పెళ్లయి అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు మేం చిన్నవాళ్లం కదా. ఆ టైమ్‌లోనే ఏవైనా చిన్నచిన్న తేడాలు వచ్చేవి. నెమ్మదిగా ఆవిడంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిసిపోయాం. పండుగల లాంటివి వస్తే, ఉప్పాడ, కాంచీవరం పట్టుచీరలు తెస్తారు. - వీవీఎస్ శైలజ -
వైభవంగా గరుడోత్సవం
కార్వేటినగరం, న్యూస్‌లైన్ : కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడసేవ వైభవం గా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం వాహన మండపానికి చేరుకున్న వేణుగోపాలుడు తన ప్రీతి పా త్రుడైన గరుడ వాహనాన్ని అధిరోహించి రాత్రి 8 గంటలకు గ్రామోత్సవానికి బయలుదేరారు. స్వామివారికి మహిళలు కర్పూ ర హారతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కోలాటాల బృందం, కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపు ముందు వృషభ, గజరాజులు నడవగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. 10.45 గంటలకు స్వామికి వేదపండితులు ఏకాంతసేవ చేశారు. జేఈవో భాస్కర్, డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెం డెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సి ద్ధారెడ్డి, జమేదార్ శివకేశవులు, ఓఎస్డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు. మోహినీ అవతారంలో.. ఉదయం వేణుగోపాలుడు మోహినీ అవతారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు స్వా మిని ఉదయం ఐదు గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం తోమాల, శుద్ధి, అర్చన, మొదటి గంట పూజలు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు మోహినీ అవతారంలో పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలను ధరించి పల్లకి వాహనంపై విహరించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామికి 10 నుంచి 11 గంటల వరకు ఉభయ నాంచారుల సమేతంగా పాలు, తేనె, పెరుగు, పసుపు, చందనం, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో వేదపండితులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి తిరుపాదాలను మాడ వీధుల్లో ఊరేగించారు. రమణీయంగా ఊంజల్ సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని అన్నమయ్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ సాగింది. నేడు హనుమంత వాహనం సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఉభయ దేవేరులతో వసంతోత్సవంలో సేద తీరుతారు. రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు. -
శ్రీకృష్ణసత్యన్నారదీయం
దీపావళి సందర్భంగా శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుల సంభాషణ. నారదుడు: స్వామీ! శ్రీకృష్ణపరమాత్మా! అడగ కూడదని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నాను... ఎక్కడకు బయలుదేరారు స్వామీ. సత్యభామ: అయ్యా! నారదమునీంద్రా! ఆచారాలు సంప్రదాయాలు తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం భావ్యమేనా. అయినా ఈ పూట మేం ఎక్కడికి వెళ్తామో ముందుగా నీకే తెలుస్తుంది కదా త్రిలోకసంచారీ! నారదుడు: అయ్యో! తెలియక కాదమ్మా! అన్నీ తెలిసినవాడినే. తెలుసు కనుకనే అడగవలసి వచ్చింది. సత్యభామ: అంతటి అత్యవసరం ఏమొచ్చింది మునివర్యా! నారదుడు: అమ్మా! సత్యాభామా దేవీ! నిన్నటికి నిన్న భూలోకమంతా ఒకసారి పర్యటించి వచ్చాను. అక్కడ కొందరు ప్రజలు మాట్లాడుకున్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ విషయాలు మీకు విన్నవించుకుందామని వచ్చాను తల్లీ! శ్రీకృష్ణుడు: ప్రజలు ఏమనుకుంటారు నారదా! ఈ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, బాణాసంచా కాల్చుకుంటూ సంబరంగా జరుపుకోవాలనుకుంటారు అంతేగా! ఇందులో ప్రత్యేకంగా విన్నవించుకోవలసినదేం ఉంటుంది! నారదుడు: అక్కడే మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారు స్వామీ! నేను కొన్ని ప్రాంతాలు పర్యటించి, దీపావళి పండుగను ఎవరెవరు ఏ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారో తెలుసుకుందామని ఒక సర్వే నిర్వహించాను. వారి మాటలు నన్ను అవాక్కయ్యేలా చేశాయి. సత్యభామ: ఊరికే ఉత్కంఠ కలిగించేలా కాకుండా అసలు విషయం ఏమిటో శలవియ్యవయ్యా బ్రహ్మచారీ! నారదుడు: వస్తున్నా! ఆ విషయానికే వస్తున్నాను! శ్రీకృష్ణుడు: ఊఁ ప్రారంభించు. నారదుడు: ఎలా ప్రారంభించమంటారో అర్థం కావటం లేదు స్వామీ! వారి మాటలు వినలేక నా చెవులు మూసుకున్నాను. సత్యభామ: అంత వినరాని మాటలు ఏమన్నారు కలహభోజనా! నారదుడు: తల్లీ! నన్ను కలహ భోజనా అన్నా సరే! ఏమన్నా సరే! కాని, నేను చెబుతున్నది వాస్తవం. నా చెవులతో విన్న మాటలు నోటితో పలకలేను. విన్నందుకే నా చెవులలో దివ్య మందాకినీ జలం పోసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నోటితో పలికి నోటిని కూడా సంప్రోక్షణ చేసుకోమంటావా తల్లీ! శ్రీకృష్ణుడు: ఏం జరిగింది నారదా! ముందువెనుకలు లేకుండా మాట్లాడుతున్నావు. ఇక ఆ మాటలు కట్టిపెట్టి అసలు విషయానికి రావయ్యా! నారదుడు: ఏముంది స్వామీ! మీరు సత్యా సమేతులై, ద్వాపరయుగంలో నరకాసుకర సంహారం చేసి ప్రజలకు చీకటిని పారద్రోలి వెలుతురును ప్రసాదించారు. ఆ సంతోషంతో నాటి నుంచి భూలోకవాసులంతా నరకచతుర్దశి, దీపావళి జరుపుకుంటున్నారు. ఈ సంగతి తెలిసిందేగా. సత్యభామ: అవును! ఇందులో వినరాని మాటలేం ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే కదా. ముల్లోకాలలోనే కాకుండా కలియుగంలో సైతం కిందటి సంవత్సరం వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది కదా! నారదుడు: ప్రజల అమాయకత్వమనుకోవాలో, వారి అతి తెలివితేటలను కోవాలో అర్థం కావట్లేదు స్వామీ! ప్రజలట బాణసంచా కాల్చకూడదట. అలా కాల్చటం వలన వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం ఏర్పడుతుందట. ఈ విడ్డూరం ఎన్నడైనా విన్నామా కన్నామా స్వామీ! మరీ ఇంత అన్యాయమా! వారంరోజులుగా ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతోంది. పండుగనాడు కేవలం దీపాలు మాత్రమే వెలిగించుకోవాలట, టపాసులు కాల్చకూడదట. ఎక్కడ చూసినా ఈ ప్రచారం జోరుగా, హోరుగా, వడివడిగా సాగుతోంది. కొందరైతే సోషల్ నెట్‌వర్క్‌లలో మెయిల్స్ పంపుతున్నారు. ఏం చెప్పమంటారు స్వామీ! శ్రీకృష్ణుడు: అంతే కదా నారదా! ఒకటి చెప్పనా నా ప్రజలేమీ తెలివితక్కువ వారు కాదు. వారు టపాసులు కాల్చితీరతారు. ఆకాశంలో హరివిల్లులు సృష్టిస్తారు. భూలోకంలోకి వెన్నెల వెలుగులు, సుధామయూఖాలు తీసుకువస్తారు. నువ్వేమీ విచారించకు నారదా! సత్యభామ: ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే ప్రజలు భయపడి, కాల్చటం మానేయరా స్వామీ..! శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! ప్రజలేమీ అవివేకులు కారు. మంచిచెడులు తెలియనివారు అంతకన్నా కాదు. తెల్లవారి లేచింది మొదలు ఎంత కాలుష్యాన్ని చూస్తున్నారు ప్రజలు. ఆటోల నుంచి వచ్చే కిరోసిన్ వాసనకి ఎంతమంది ఆస్త్మా బారినపడుతున్నారో, నిరంతరం బస్సులు, కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు వాయించే హారన్లకి ఎంత శబ్దం కాలుష్యం అవుతోందో, ప్లాస్టిక్ వల్ల ఎంత జల కాలుష్యం అవుతోందో నా ప్రజలకు బాగా తెలుసు. అటువంటిది టపాసుల వలన కాలుష్యం అంటే ఎవ్వరూ విశ్వసించరు. పైగా కాకరపువ్వొత్తుల వల్ల, మతాబుల వల్ల క్రిమికీటకాలు నశిస్తాయని, దోమలు సమూలంగా నాశనమవుతాయని భారతీయులకు తెలుసు. అంతేకాదు, ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభ మవుతుంది. అంటే చీకటి రాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే చలి కూడా మొదలవుతుంది. వీటిని పారద్రోలడానికే ఈ పండుగ అనే విషయం ప్రతి భారతీయ పౌరుడికి తెలుసు. సత్యభామ: ఈ ప్రచారం చేసేది కూడా మీ ప్రజలేగా స్వామీ! అయినా ఇలా ఎందుకు చేస్తున్నట్లో అర్థం కావటం లేదు స్వామీ! శ్రీకృష్ణుడు: ఏముంది? నేటి యువత విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోతోంది. వారికి మన భారతీయ విలువలు తెలియడానికి ఇంకా కొంతకాలం పడుతుంది సత్యా! సత్యభామ: స్వామీ! మన పండుగలలో సైన్స్ కూడా ఉందంటారు కదా! శ్రీకృష్ణుడు: మనవారికి రోగనిరోధకశక్తి ఎక్కువ. అందుకు కారణం ఏ ఋతువుకు తగ్గట్టు ఆయా పండుగలు, ఆహారపు అలవాట్లూనూ... ఇన్ని పండుగలు, ఇంత వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి మనకు ఉన్నంతగా మిగతా దేశాలకు లేవు. అవి తెలియక, ఈ వెర్రిమొర్రి ఆలోచనలు కలుగుతున్నాయి. సత్యభామ: ఇంకా... నరులు ఇంటింటా వాడే దోమల మందులు, రసాయనాలు, ఇంటిని పరిశుభ్రపరచే ద్రవాలు... వీటికి మించిన కాలుష్యం లేదట కదా స్వామీ! ఏడాదికి ఒకసారి జరుపుకునే ఈ పండుగ వలన సత్యాశ్రీకృష్ణులకు పేరు వచ్చేస్తుందేమోననే ఈర్ష్య ఉన్నవారు ఇలా ఈ పండుగ గురించి దుష్ర్పచారం చేస్తున్నారనిపిస్తోంది స్వామీ! శ్రీకృష్ణుడు: ఎంత అమాయకురాలివి సత్యా! మన మీద ఈర్ష్య అసూయలు కాదు, వారు ఇలా కాల్చవద్దని చెప్పడంలోనూ ఒక ఆంతర్యం ఉంది. కొందరు స్వార్థపరులు ఈ సమయంలో పెద్దపెద్ద ధ్వనులు వచ్చే టపాసులు కాల్చుతారు. దానివల్ల పసిపిల్లలు,అమాయక ప్రాణులు ఇబ్బంది పడతాయి. అందువలన చెప్పి ఉంటారనుకోవచ్చు కదా! ఎవరు ఏది చెప్పినా అందులోని మంచిని గ్రహించటానికి ప్రయత్నించాలి సత్యా! నారదుడు: అయ్యా! పరంధామా! మీ మాటలు నాకు తేనెల ఊటలా ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను స్వామీ! ఈ పండుగకు బాణాసంచా కొనకుండా ఆ డబ్బును సత్కార్యాలకు వినియోగించమని ప్రచారం చేస్తున్నారు, మరి అవేవో ఇంగ్లీషువారి దినాలుంటాయి కదా, వాలెంటైన్స్‌డే, మదర్స్ డే... ఇత్యాది దినాలకు ఖర్చు చేయవద్దని ఇటువంటి ప్రచారం ఎందుకు చేయరు స్వామీ! శ్రీకృష్ణుడు: నారదా! మనం వాటి గురించి ఆలోచించటం అనవసరం. ‘శ్రీకృష్ణుడు’ అంటే ‘లోకకల్యాణం కోసం ప్రభవించినవాడు’ అని ప్రపంచమంతా తెలిసిందే. నరకుడిని చంపిన రోజు లోకానికి ఆనందం కనుక ఈ పండుగను జరుపుకోవలసిందే... మరోమాట... దుష్టసంహారం జరిపిన ఇటువంటిరోజులను పండుగగా జరుపుకుంటే... కొందరైనా శిష్టరక్షణ కార్యానికి పూనుకుంటారు. ఈ పండుగలు మానుకుంటే మంచిపనులు చేయాలనే అభిలాష కొరవడుతుంది. అనునిత్యం లోకకల్యాణం కోసం ఎవరో ఒకరు పాటుపడుతూనే ఉండాలి. అందుకే ఈ పండుగలు పబ్బాలూనూ. పిండివంటలు నైవేద్యాలు పెట్టడమూనూ... సత్యభామ: ఎవ్వరు ఎన్ని మాటలన్నా మీ నవ్వురాజిల్లెడు మోములో లవలేశం క్రోధం కూడా కనపడదు కదా స్వామీ.! నీ నుంచి నేను ఆ లక్షణం నేర్చుకోగలిగితే బాగుంటుంది. శ్రీకృష్ణుడు: ఒకటి చెప్పనా సత్యా! నీకు స్వాభిమానం ఎక్కువ. అది ప్రతి స్త్రీకి అలంకారం. నీలో ఆ గుణం చూసి అందరూ సత్యలా ఉండాలనుకుంటున్నారు. అంతకుమించిన ఘనత ఏముంది. నారదుడు: అయ్యా! సత్యాపతీ! మీరిద్దరూ ఒకరినొకరు ప్రశంసలలో ముంచెత్తుకోవడమేనా, భూలోక యాత్ర ప్రారంభించేది లేదా... శ్రీకృష్ణుడు: ఇదిగో బయలుదేరుతున్నాము మహర్షీ! సత్యా... రథాన్ని పోనియ్యి ... భూలోకవాసులు జరుపుకునే ఈ దీపావళిని కన్నుల పండువుగా వీక్షిద్దాం... - డా.పురాణపండ వైజయంతి