‘‘సత్యభామ’ కంటే ముందు నాకు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వచ్చింది. కానీ ఈ తరహా సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ‘సత్యభామ’ చేశాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘సత్యభామ’తో నెరవేరింది’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె టైటిల్ రోల్‌లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు.
‘మేజర్’ చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్‌లో భారీ స్టంట్స్ చేసిన సినిమా ఇది. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్స్ గేమింగ్, వర్చ్యువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను.
ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్‌గా విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘ప్రతి పోలీసాఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రకథ’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘సత్యభామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment