Lady Oriented Movie
-
అరుదైన అవకాశం.. దూసుకెళ్తున్నబాలీవుడ్ భామలు!
సినిమాలో కథను ఎవరు లీడ్ చేస్తే వాళ్లే ఆ కథకు నాయకులవుతారు. అది హీరో కావొచ్చు... హీరోయిన్ కావొచ్చు. హీరోలు లీడ్ చేసే కథలు ఏడాదికి ఓ వంద వస్తే... హీరోయిన్లు లీడ్ చేసే కథలు ఓ ఇరవై ఉంటాయేమో. అంటే... హీరోయిన్లకు అరుదైన అవకాశం అన్నమాట. అందుకే ఇలాంటి అవకాశం రాగానే అందిపుచ్చుకుంటారు. ప్రస్తుతం హిందీలో అలా కథకు హీరోగా మారిన కథా‘నాయక’లు చేస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.సూపర్ ఏజెంట్స్బాలీవుడ్లో స్పై క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకులను మెప్పించిన కథానాయికల్లో ఆలియా భట్ ఒకరు. ‘రాజీ’ (2018) మూవీలో స్పైగా ఆలియా భట్ నటన ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించింది. ఆరేళ్లకు మళ్లీ పూర్తి స్థాయి స్పై క్యారెక్టర్‌కు ఆలియా భట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ‘ఆల్ఫా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ‘రాజీ’ సినిమాలో కాస్త కూల్‌గా ఉండే స్పైగా కనిపించిన ఆలియా ‘ఆల్ఫా’లో మాత్రం అదిరి΄ోయే యాక్షన్ సీక్వెన్స్‌లు చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసే స్పైగా నటిస్తున్నారు. ఆలియా భట్‌కు తోడుగా మరో హీరోయిన్ శార్వరీ ఉంటారు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు ఎంత ప్రాధాన్యం ఉందంటే... దాదాపు రెండు నెలలకు పైగా ఆలియా, శార్వరి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ ఇద్దరు సూపర్ ఏజెంట్స్ చేసే ఫైట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటాయట. ‘ధూమ్ 3’ సినిమాకు దర్శకత్వ విభాగంలో చేసి, ఆ తర్వాత ‘ది రైల్వే మేన్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్న శివ్ రావేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యానివర్స్‌లో భాగంగా ఆదిత్యా చోప్రాా నిర్మిస్తున్న ఈ ‘ఆల్ఫా’ చిత్రం ఏడాది థియేటర్లకు రానుంది.పోలీస్ వర్సెస్ సైకోఓపోలీస్, ఓ సైకో మధ్యపోటాపోటీగా సాగే మైండ్ గేమ్‌తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ జానర్లో కాజోల్, కృతీ సనన్ నటించారు. ‘దో పత్తీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో శశాంక్ చతుర్వేది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ ముగిసింది.ఇటీవల టీజర్‌ను కూడా విడుదల చేశారు. నార్త్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సైకో థ్రిల్లర్ మూవీలోపోలీస్ ఆఫీసర్‌గా కాజోల్, సైకోపాత్రలో కృతీసనన్ కనిపిస్తారు. అంతేకాదు... ఈ సినిమాకు ఓ నిర్మాతగా కూడా ఉన్నారు కృతీ సనన్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే... ‘దిల్వాలే’ (2015)లో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజోల్, కృతి తొమ్మిదేళ్లకు ‘దో పత్తీ’లో కలిసి నటించారు. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.రోడ్ ట్రిప్ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ లీడ్ రోల్స్‌లో నటించాల్సిన చిత్రం ‘జీ లే జర’. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ చిత్రం ఆగి΄ోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ‘జీ లే జర’ చిత్రీకరణ లేట్ అవుతున్న మాట వాస్తవమే అని, అయితే ఆగి΄ోలేదని, రణ్వీర్ సింగ్‌తో ‘డాన్ 3’ తీసిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్తానని ఇటీ వల ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు. ఒకరితో ఒకరికి పరిచయం లేని ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని టాక్.లాహోర్ టు ముంబైప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. మనీషా కోయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీరావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ లీడ్ రోల్స్‌లో నటించారు. 2024 మే 1 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తొలి సీజన్‌కు వీక్షకుల నుంచిపాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్‌ను ప్రకటించారు భన్సాలీ. తొలి సీజన్లో ఉన్న వారితోపాటు రెండో సీజన్లో మరికొంతమంది హీరోయిన్స్ యాడ్ అవుతారట. దేశ విభజన సమయంలో లాహోర్‌లోని మెజారిటీ వేశ్యలు ముంబై, కోల్‌కతా వెళ్లి స్థిరపడతారు. వారు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సినీ ఇండస్ట్రీని ఏ విధంగా ప్రభావితం చేశారు? అనే కోణాల్లో ‘హీరామండి’ సెకండ్ సీజన్ ఉంటుంది.రివెంజ్కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్‌లో ‘అక్క’ అనే రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ రూపొందుతోంది. ధరమ్ రాజ్ శెట్టి ఈ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ఉంటుందని బాలీవుడ్ టాక్. అయితే కీర్తీపై రాధికా రివెంజ్ ΄్లాన్ చేశారా? లేక రాధికా పై కీర్తీ పగ తీర్చుకుంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆదిత్యా చోప్రాపా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. -
స్ఫూర్తిదాయక పోరాటం
రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు.‘సలార్, కేజీఎఫ్’ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మించిన తొలి తమిళ సినిమా ఇది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఈ సినిమా కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది... నవ్విస్తుంది... స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు కీర్తీ సురేష్. ఒక సామాజిక అంశంతో ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ‘రఘు తాత’ ఉంటుందని టాక్. తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందట. -
నా కెరీర్లో ఇదో కొత్త ప్రయత్నం: కాజల్ అగర్వాల్
‘‘సత్యభామ’ కంటే ముందు నాకు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వచ్చింది. కానీ ఈ తరహా సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ‘సత్యభామ’ చేశాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘సత్యభామ’తో నెరవేరింది’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు.‘మేజర్’ చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో భారీ స్టంట్స్ చేసిన సినిమా ఇది. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్స్ గేమింగ్, వర్చ్యువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను.ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్గా విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘ప్రతి పోలీసాఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రకథ’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘సత్యభామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. -
పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా అనుష్క సినిమా
‘అరుంధతి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో తనదైన శైలిని చాటుకుని సక్సెస్ అయ్యారు అనుష్క. తాజాగా ఆమె కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో సినిమా అంగీకరించారు. క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క పాత్ర ఉంటుందట. ఇటీవల ఒడిస్సాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలిసింది. కాగా ఈ సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేస్తున్నారని, ఈ సినిమా ఈ ఏడాదే దక్షిణాది భాషల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
పోరాటం.. పోరాటం..
హన్సిక టైటిల్ రోల్లో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మార్క్ కె. రాబిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పోరాటం పోరాటం..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు. శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంలో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే శృతిగా విభిన్నమైన పాత్ర చేశాను. ఆద్యంతం మలుపులతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది’’ అన్నారు హన్సిక. ఈ చిత్రానికి కెమెరా: కిశోర్ బోయిడపు, సహనిర్మాత: పవన్‌కుమార్ బండి. -
తొలి అడుగు
ఇటు సౌత్.. అటు నార్త్.. కాస్త ఖాళీ దొరికితే డిజిటల్ వరల్డ్... ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. అయితే తొలిసారి ఈ బ్యూటీ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తమిళ దర్శక–నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఇటీవల కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఓ కథ తయారు చేశారని, ఈ కథ విని, ఇందులోని పాత్ర నచ్చడంతో అదితీరావ్ హైదరి పచ్చ జెండా ఊపారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుందట. లేడీ ఓరియంటెడ్ చిత్రాల పరంగా అదితీకి ఇది తొలి అడుగు. మరి.. ఈ తొలి అడుగుతో ఈ తరహా చిత్రాలు ఇంకెన్ని చేస్తారో చూడాలి. ఇక ‘సమ్మెహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి చిత్రాలతో అదితీరావ్ హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
నయనతారకు నచ్చుతే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది
కథ నచ్చితే కొత్త దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు హీరోయిన్ నయనతార. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవణన్ వంటి వారికి తొలి అవకాశం ఇచ్చింది నయనతారనే. కాగా ఈ బ్యూటీ ఎక్కువగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కథ బాగా నచ్చడంతో తాజాగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో విక్కీ డ్యూడ్ అనే ఓ యూ ట్యూబర్ దర్శకుడిగా పరిచయం కానున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ఆరంభించనున్నారట. ఈ చిత్రం కాకుండా మరో నాలుగు చిత్రాలతో నయనతార ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్న హిందీ చిత్రం ‘జవాన్’ ఒకటి. -
ఇలా అవుతానని కలలో కూడా ఊహించలేదు: హీరోయిన్
కట్టా కుస్తీ చిత్రంతో తమిళంలో పాపులర్ అయిన మలయాళీ నటి ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మెరిసిన ఈమె మాతృభాషలో నిర్మాతగానూ కొనసాగుతున్నారన్నది గమనార్హం. అక్కడ గార్గి వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలపై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు. (ఇది చదవండి: ఇండియన్ ఐడల్ 2 విన్నర్ ఆమెనే.. ఐకాన్ స్టార్ ప్రశంసలు) కారణం స్త్రీల జీవితంలో పురుషులకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. కాబట్టి స్త్రీ, పురుషులకు సమానత్వం కలిగిన కథలతో కూడినదే మంచి చిత్రాలన్నది తన భావన అన్నారు. అలా కాని చిత్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సినిమా అనేది మన జీవితాలను, సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కాబట్టి సినిమాల్లోనైనా, మన జీవితాల్లో నైనా సమానత్వం ఉండాలన్నారు. మరో విషయం ఏమిటంటే తాను ఈ రంగంలోకి ప్రవేశిస్తాననే ఊహించలేదన్నారు. వైద్య విద్యను పూర్తి చేసిన తాను సినిమాల్లో రావడం అన్నది దైవ నిర్ణయమే అన్నారు. కారణం తాను నటి నవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. తాను చదువుకు ప్రాముఖ్యత వచ్చే కుటుంబంలో పుట్టానన్నారు. వారికి సంబంధించినంత వరకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయడమే సమాజంలో ఉన్నతస్థాయి అని పేర్కొన్నారు. సినిమా అలాంటి గౌరవాన్ని ఇచ్చేదిగా వారు భావించలేదన్నారు. నిజం చెప్పాలంటే సినిమాలో కొనసాగడం అనేది ప్రతినిత్యం పోరాటమేనని నటి ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు. (ఇది చదవండి: నా అవార్డులను వాష్‌రూమ్ డోర్ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు) -
స్టార్ హీరోయిన్.. అయినా ఒక్క సినిమా సక్సెస్ కాలేదు.. మళ్లీ అదే కథ!
నటి త్రిష సినీ పయనం పడి లేచే కేరటం లాంటిది అని చెప్పవచ్చు. దక్షిణాదిలో అగ్ర కథానాయకి స్థాయికి ఎదిగిన ఈమె తన స్థానాన్ని మరింత పెంచుకోవడానికి లేడీ ఓరియంటెడ్ కథాచిత్రాల్లో నటించడం మొదలెట్టారు. ఇప్పటికే నటి నయనతార ఆ తరహా చిత్రాల్లో రాణిస్తుండటంతో తానేం తక్కువ అన్నట్టుగా త్రిష దూసుకుపోతోంది. అలా నాయకి చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన రాంగీ చిత్రం వరకు కొన్ని లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: Bichagadu 2 Movie: నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఆమెనే: విజయ్ ఆంటోని) అయితే ఈ విషయంలో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెతగా మారింది త్రిష పరిస్థితి. ఆమె నటించిన ఏ ఒక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం సక్సెస్ కాలేదు. అలాంటిది ఈమె మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. త్రిష నటించిన 'ది రోడ్' చిత్రం తమిళం తెలుగు మలయాళం కన్నడం హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఏఏఏ సినిమా ప్రవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్ వశీకరణన్ తెరకెక్కిస్తున్నారు. నటుడు సబీర్, సంతోష్ ప్రతాప్, నటి మియా జార్జ్ ,ఎంఎస్ భాస్కర్, వేల రామ్మూర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేజీ వెంకటేష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వర్కింగ్ వీడియోను త్రిష పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. (ఇది చదవండి: ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి) చిత్రంలో త్రిష యాక్షన్ సన్నివేశాలు నటించినట్లు తెలుస్తోంది ఇది మధురైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని దర్శకుడు తెలిపారు. జూన్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రం అయినా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో సక్సెస్ సాధించాలన్న త్రిష కోరికను నెరవేరుస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే. -
Nayanthara: చరిత్రలో నా పేరు ఉండాలనుకున్నా..
నయనతార.. ఈ పేరే ఒక సంచలనం.. తొలి నుంచి కూడా నయనతారది ఒక ప్రత్యేక శైలి. కోలీవుడ్లోకి అయ్యా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ బ్యూటీ వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. మొదట్లో కొన్ని సినిమాల్లో సో సో గానే కనిపించిన నయనతార ఇప్పుడు హీరోలకు ధీటుగా లేడీ ఓరియంటెడ్ కథాచిత్రాల నాయకిగా ఖ్యాతి గడించారు. ఈమె చాలాకాలం క్రితమే అందులో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననని తెగేసి చెప్పారు. అయితే ఈ మధ్య నిర్మాతగా కూడా మారిన నయనతార ప్రధాన పాత్రలో నటించి రౌడీపిక్చర్స్ పతాకంపై అశ్విని శరవణన్ దర్శకత్వం వహించిన కనెక్ట్ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. చిత్ర ప్రచారాలకు దూరంగా ఉండే నయనతార ఈ చిత్రం కోసం స్పెషల్ ఇంటర్వూ్యలు ఇస్తోంది. ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ సినీ చరిత్రలో తన పేరు ఉండాలని ఆశించానని, అది భగవంతుడు నెరవేర్చారన్నారు. నటిగా పరిచయమైన 10 ఏళ్ల తరువాత తనకు కొన్ని కలలు ఉండేవన్నారు. ముఖ్యంగా హీరోయిన్ ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించాలని కోరుకున్నానని, అప్పట్లో హీరోయిన్లకు ఆటలు, పాటలు మినహా నటనకు పెద్దగా అవకాశం ఉండేది కాదన్నారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా వేదికలపై హీరోయిన్లను ఒక మూలన కూర్చొపెట్టేవారన్నారు. దీంతో ఇకపై చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారని చెప్పారు. ఇదేవిధంగా నటీమణులకు సమానత్వం ఉండాలని, హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉండాలని ఆశించానని, అది ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. అది తనకు గర్వంగా ఉందన్నారు. ఇకపోతే విజయ్ నటించిన శివకాశి, రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ చిత్రాల్లో సింగిల్ సాంగ్స్‌కు నటించడం గురించి ప్రశ్నించే వారన్నారు. ఇలా తొలి నుంచీ తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని, తాను సన్నబడినా, బరువు పెరిగినా ఇలా ఏదో ఒక విషయంపై విమర్శిస్తున్నారని చెప్పారు. -
రిలీజ్‌కు రెడీ అయిన త్రిష లేడీ ఓరియెంటెండ్ సినిమా
తమిళసినిమా: నటి త్రిష నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రాంగీ. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించిన ఈ చిత్రానికి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సి.సత్య సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాంగీ చిత్రం ఈనెల 30వ తేదీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రం గత ఏడాదే తెరపైకి రావాల్సి ఉంది. సెన్సార్ సమస్యల కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. మొత్తం మీద రివైజింగ్ కమిటీకి వెళ్లి సుమారు 30కి పైగా కట్స్‌తో బయటపడి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. చిత్ర వివరాలు దర్శకుడు తెలుపుతూ నటి త్రిషను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది అని చెప్పారు. కథ నచ్చడంతో త్రిష ఇందులో నటించడానికి అంగీకరించారని తెలిపారు. ఇది యాక్షన్‌తో కూడిన విభిన్న కథా చిత్రం అని పేర్కొన్నారు. ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్ యాక్షన్ వంటి అంశాలతో కూడిన మాస్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిపారు. త్రిష యాక్షన్ సన్నివేశాల్లో నటించారని చెప్పారు. ఒక విలేకరి అయిన ఆమె తన అన్నయ్య కూతురికి ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతుందన్నారు. ఆ సమస్య పరిష్కారం అయిన రాంగి చిత్ర కథ విదేశాల వరకు వెళుతుందన్నారు. దీంతో చిత్రం సగభాగం ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరింనట్లు చెప్పారు. చిత్ర విడుదల ఆలస్యం అవుతుండడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు అడిగిన కట్స్‌కు ఓకే చెప్పినట్లు తెలిపారు. చిత్రంలో పార్లర్గా కుటుంబ కథా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటి త్రిష చిత్రాన్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని తెలిపారు. -
పూర్ణ 'సుందరి' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
హీరోయిన్గా చేస్తుండటంతో పాటు కీలక పాత్రలు, ప్రత్యేక పాటల్లో నటిస్తూ, బుల్లితెర షోలకు హోస్ట్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు పూర్ణ. ఆమె కథానాయికగా నటించిన తాజా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ యాన్ ఇన్నోసెంట్ లేడీ’ (ఒక అమాయక స్త్రీ అంతిమ నిర్ణయం) అనేది ట్యాగ్‌లైన్. ఆగస్ట్ 13న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించారు. అర్జున్ అంబాటి కీలక పాత్ర చేసిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: బాల్‌రెడ్డి, కో–ప్రొడ్యూసర్: ఖుషి, కె రామ్‌రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీ వల్లి చైతన్య. -
థియేటర్స్‌లోనే గుడ్‌లక్
కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం. దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. -
లోకం ఎలా ఉంది నాయనా?
మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘సిద్దా.. లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లోకం తీరు ఎలా ఉంది? అనే అంశంపై సెటైర్‌గా ఈ చిత్రకథాంశం ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు శ్రద్ధ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
డ్రైవర్ జమున
కొత్త సినిమా కోసం స్టీరింగ్ తిప్పడానికి రెడీ అయ్యారు ఐశ్వర్యా రాజేశ్. ఆదివారం ఐశ్వర్యా రాజేశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తమిళంలో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. ‘డ్రైవర్ జమున’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కమిట్ అయినట్టు తెలిపారు. ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నారు ఐశ్వర్య. కి న్సిలిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘‘ఇలాంటి స్పెషల్ రోజున ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యా రాజేశ్. తెలుగులో నానితో ‘టక్ జగదీష్’లో కనిపించనున్నారు ఐశ్వర్యా రాజేశ్. -
మేడమ్ చీఫ్ మినిస్టర్
ఇటీవల విడుదలైన ‘షకీలా’ బయోపిక్‌లో గ్లామరస్‌గా కనిపించిన రిచా చద్దా ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఆమె ముఖ్య పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియంటడ్ చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఇందులో టైటిల్ రోల్లో రిచా కనిపిస్తారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రిచా నటించారు. ఇదో సీరియస్ పొలిటికల్ డ్రామా. జనవరి 22న సినిమా రిలీజ్ కానుంది. -
ఏజెంట్ పరిణీతి
అండర్‌కవర్ ఆపరేషన్ కోసం రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. రిబూ దాస్ గుప్తా దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కమిట్ అయ్యారు ఈ బాలీవుడ్ బ్యూటీ. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్‌గా కనిపిస్తారు పరిణీతి. ఓ భారీ ఆపరేషన్ కోసం తన టీమ్‌తో కలసి ఓ మిషన్ మీద పాకిస్తాన్ వెళ్తారట. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన లొకేషన్స్ ఫైనల్ చేస్తున్నారట. పరిణీతీ, దర్శకుడు రిబూ దాస్ గుప్తా కాంబినేషన్లో తెరకెక్కనున్న రెండో చిత్రమిది. ఇటీవలే వీరు ‘ఏ గాళ్ ఆన్ ది ట్రైన్’ సినిమా చేశారు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. -
‘మిస్’ అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది. కథేమిటంటే... విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్). ‘‘అమ్మాయి బిజినెస్ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది. ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ ఇండియన్ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్ ఆలోచన. కానీ, అక్కడి బడా బిజినెస్ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్ శివకుమార్ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’ చేసే హీరోయిన్‌కూ, ‘‘బిజినెస్ ఈజ్ ఎ వార్’’ అని భావించే ఆ విలన్‌కూ మధ్య పోరాటంలో హీరోయిన్ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్ స్టోరీ. ఎలా చేశారంటే... ‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్ ఒప్పుకున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్‌గా విలన్ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్‌గా జరిగిపోతుంటాయి. ఎలా తీశారంటే... ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్ కుమార్). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్ యు ఓన్ట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్‌వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దెయిర్ డ్రీమ్స్’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి. తమన్ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్ సాంగ్ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి. వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్‌ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది. కొసమెరుపు: టార్గెట్ ‘మిస్’ అయింది! బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్ సాంగ్ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్. కీలకమైన సెకండాఫ్‌లో తడబాట్లు ∙అతి సినిమాటిక్ లిబర్టీలు, ఫేక్ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్ ∙తేలిపోయిన క్లైమాక్స్ – రెంటాల జయదేవ -
సొంత గొంతు
పరభాషా హీరోయిన్లకు ఎక్కువ శాతం వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు తమ పాత్రలకు తమ గొంతునే వినిపించాలనుకుంటున్నారు. భాష నేర్చుకొని ఆ పాత్రకు మరింత న్యాయం చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ పాత్ర చేసిన హీరోయిన్లు డబ్ చేస్తేనే బావుంటుందని దర్శకులు భావిస్తే హీరోయిన్లు కూడా రెడీ అంటారు. తాజాగా అదా శర్మ తన గొంతును వినిపించడానికి రెడీ అయ్యారు. ‘?’(క్వొశ్చన్ మార్క్) అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారామె. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు అదా. ఈ చిత్రానికి ఆమె డబ్బింగ్ చెప్పాలనుకోవడం, దర్శక–నిర్మాతలు విప్రా, గౌరీకృష్ణ ఓకే అనడం జరిగిపోయాయి. ‘‘తెలుగు డైలాగులన్నింటినీ అదా హిందీలో రాసుకున్నారు. బాగా ప్రాక్టీస్ చేసి, చెప్పారు. రెండే రెండు రోజుల్లో డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆమె కమిట్మెంట్కి ఆశ్చర్యం అనిపించింది. అదా డబ్బింగ్ ఓ హైలైట్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
మహా పూర్తయింది
హీరోయిన్గా హన్సిక 50వ సినిమా మైలు రాయిని అందుకున్నారు. 50వ సినిమా కోసం ఓ క్రేజీ లేడీ ఓరియంటెడ్ కథను ఎంచుకున్నారామె. ‘మహా’ టైటిల్‌తో ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. అతిథి పాత్రలో శింబు మెరవనున్నారు. సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో శింబు కనిపిస్తారట. కోవిడ్ తర్వాత ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభించి, పూర్తి చేశారు కూడా. ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ – ‘‘నా 50వ సినిమా షూటింగ్ పూర్తిచేశాం. మహా పాత్రకు బైబై. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో భాగం అయిన అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
కోకిలగా జాన్వీ
2018లో నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). తమిళ తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. నయనతార చేసిన పాత్రను జాన్వీ కపూర్ చేయనున్నారని సమాచారం. ఈ హిందీ రీమేక్‌ను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో అనుకోకుండా డ్రగ్స్ రాకెట్లో చిక్కుకొని డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసే అమ్మాయి పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
ఓ అమ్మాయి ప్రయాణం
కమల్‌హాసన్ చిన్న కుమార్తె, శ్రుతీహాసన్ సోదరి అక్షరాహాసన్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ‘అచ్చమ్ మడమ్ నానమ్ పయిర్పు’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ తమిళ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు అక్షర. ఇది ఆమెకు తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇందులో ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ అక్షరాకు బామ్మా పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఓ మధ్యతరగతి అమ్మాయి చేసే ప్రయాణమే ఈ చిత్రకథ. రాజా రమణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రెండ్‌లౌడ్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘ఈ కథ మీ అందరికీ చూపించాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు అక్షరాహాసన్. -
డీ గ్లామరస్‌గా కనిపిస్తా!
శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘రాధాకృష్ణ’. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సోషియల్ డ్రామా ఇది. ఇందులో ‘పైసా వసూల్’ ఫేమ్ ముస్కాన్ సేథీ లీడ్ రోల్లో నటిస్తారు. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించనున్నారామె. ఈ సినిమాలో తన పాత్ర గురించి ముస్కాన్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రకథ నిర్మల్ ప్రాంతంలో జరుగుతుంది. ఆ ఊరి సంప్రదాయాలు, కట్టుబాట్లను మా సినిమాలో చూపించనున్నాం. మా బామ్మ పాత్ర ఆ ఊరి పెద్దలా కనిపిస్తారు. ఇందులో మేకప్ లేకుండా డీ–గ్లామరస్‌గా కనిపిస్తాను. పూర్తి స్థాయి పల్లెటూరి పాత్ర చేయడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం లంగా వోణీలో కనిపిస్తాను. సుమారు 30రోజుల పాటు నిర్మల్‌లో ఆ ఊరి విశేషాలన్నీ తెలుసుకున్నాను. కుండలు తయారు చేయడం, పెయింటింగ్ నేర్చుకున్నాను. నా పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. తెలంగాణ యాస సరిగ్గా పలకడం కోసం ఓ ట్యూటర్‌ను పెట్టుకున్నాను. నా డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి అనుకుంటున్నాను’’ అన్నారు. -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
హిందీ ఆమె
అమలాపాల్ ముఖ్యపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నారు ఆ చిత్రదర్శకుడు రత్నకుమార్. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. హిందీ రీమేక్‌లో కథానాయికగా శ్రద్ధాకపూర్ నటిస్తారని సమాచారం. మరి ఒరిజినల్ వెర్షన్లో అమలా చేసిన బోల్డ్ సీన్ (నగ్నంగా నటించారు) ను రీమేక్‌లో శ్రద్ధాకపూర్ చేస్తారా? అనేది చూడాలి. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
గుడ్ లక్
కీర్తీ సురేశ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్ లక్ సఖీ’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకుడు. ‘దిల్’రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి గ్రామీణ యువతిగా నటిస్తున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు ఎక్కువశాతం మంది మహిళలు పని చేయటం విశేషం. ఓ చిన్న షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రావ్యా వర్మ. -
ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది. సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు. -
జోడీ కుదిరింది
ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రష్మీ: ద రాకెట్’. ఈ చిత్రంలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీ పాత్రలో నటించనున్నారు తాప్సీ. ఇందులో తాప్సీ భర్తగా నటించబోతున్నారు ప్రియాన్షు పైన్యూలి. ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ‘‘మా నాన్నగారు ఆర్మీ కల్నల్‌గా చేసి రిటైర్ అయ్యారు. నటుడు కాకముందు ఓ సమయంలో నేను ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రియాన్షు. ఈ షూటింగ్ ఈపాటికే కచ్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. -
కొత్త సవాల్
అన్నీ కుదిరితే అనుపమా పరమేశ్వరన్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతున్నారని తెలిసింది.. ‘అఆ’, ‘ప్రేమమ్’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసి, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ వంటి హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించారు ఈ మలయాళ కుట్టి. గత ఏడాది హిట్ మూవీ ‘రాక్షసుడు’లో కనిపించిన అనుపమ ప్రస్తుతం ఓ మలయాళ సినిమా, ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. త్వరలో ఓ తెలుగు సినిమా సైన్ చేయనున్నారట. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే అనుపమ చేయబో తున్న తొలి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఇదే అవుతుంది. హనుమాన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని భోగట్టా. ఇప్పటివరకూ చేసినవన్నీ హీరో ఓరియంటెడ్ సినిమాలే అయినా వాటిలో మంచి పాత్రలే చేశారు అనుపమ. తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే సవాల్ అయినా అనుపమ ఈ స్టెప్‌లోనూ సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. పీవీపీ బేనర్లో ఈ సినిమా రూపొందనుందట. -
మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో..
‘జాను’ తర్వాత సమంత ఏ సినిమా చేయబోతున్నారు? అంటే తెలుగు విషయంలో క్లారిటీ లేదు. ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారని టాక్. ఇక తమిళం విషయానికొస్తే.. ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా అంగీకరించారు. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. ‘మాయ’ (2017), ‘గేమ్ఓవర్’ (2019) వంటి చిత్రాలు తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. సమంత చేసిన ‘యు టర్న్’, ‘ఓ బేబి’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు తమిళంలోనూ ఆ మేజిక్‌ని రిపీట్ చేస్తారని ఊహించవచ్చు. -
చీఫ్ మినిస్టర్ చద్దా
బాలీవుడ్ నటి రీచా చద్దా చీఫ్ మినిస్టర్‌గా మారారు. తన లేటెస్ట్ సినిమా ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’లో ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారామె. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి రీచా చద్దా మాట్లాడుతూ – ‘‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ సినిమా మా అందరి కష్టం. నా కెరీర్లోనే ఇదో చాలెంజింగ్ పాత్ర. ఈ అవకాశం ఇచ్చిన సుభాష్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమా జూలై 17న విడుదల కానుంది. -
సూపర్ కాంబినేషన్
లేడీ సూపర్‌స్టార్ నయనతార, సూపర్‌స్టార్ సమంత కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. వీళ్లద్దరూ కలసి లేడీ ఓరియంటెడ్ సినిమా ఏమైనా చేస్తున్నారా? అంటే కాదు. విజయ్ సేతుపతి నటించనున్న తమిళ సినిమాలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తారట. దర్శకుడు, నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘కాదు వాక్కుల రెండు కాదల్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మించనున్నారట. సమంత, నయనతార కలసి నటించే వార్త నిజమైతే కచ్చితంగా ఇది సూపర్ కాంబినేషన్. -
త్రిష పరమపదంకు టైమ్ వచ్చింది
నటి త్రిష పరమపదం విళైయాట్టుకు టైమ్ వచ్చింది. ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం రాంగీ చిత్ర షూటింగ్లో బిజీగా ఉంది. కాగా త్రిష ఇంతకుముందు నటించిన రెండు, మూడు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ఎదురుచూస్తున్నాయి. అందులో ఒకటి పరమపదం విళైయాట్టు. విశేషం ఏమిటంటే ఇది ఈ బ్యూటీకి 60వ చిత్రం కావడం. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. కే.తిరుజ్ఞానం తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిషతో పాటు నటుడు నందా, బేబీ మానసి, రిచర్డ్, ఏఎల్,అళగప్పన్, వేల రామమూర్తి ముఖ్య పాత్రల్లో నటించారు. 24 హెచ్ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేశ్ సంగీతాన్ని అందించారు. ఇది యథార్థ సంఘటన ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అని దర్శకుడు తెలిపారు. నటి త్రిష ఇందులో డాక్టర్‌గా నటించారని, కొందరు ఆమెను కిడ్నాప్ చేయడంతో వారెవరు, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు? వారి నుంచి ఎలా తప్పించుకుందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా పరమపదం విళైయాట్టు చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా త్రిష నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం ఇది. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు ఇప్పటి వరకూ సక్సెస్ కాలేదు. దీంతో పరమపదం విళూయాట్టు చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయని తెలిసింది. కాగా చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. కాగా దీని తరువాత నటి త్రిష నటించిన గర్జన విడుదల కావలసి ఉంది. ఇదీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రమే. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న రాంగీ చిత్రం కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమే కావడం విశేషం. మరో విషయం ఏమిటంటే నటి త్రిష ఈ మధ్య నటించిన 96, పేట చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పరమపదం విళూయాట్టు చిత్రానికి ఆ మ్యాజిక్ పని చేస్తుందనే నమ్మకంతో త్రిష ఉంది. ఈ చిత్రం హిట్ అయితే కొత్త సంవత్సరంలోనూ త్రిష సక్సెస్ పయనం కొనసాగినట్లే అవుతుంది. అన్నట్టు ఈ బ్యూటీ చాలా కాలం తరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో జత కట్టనుంది. -
థ్రిల్ చేస్తారా?
‘ఓ బేబీ’ సూపర్ సక్సెస్ తర్వాత ‘96’ తెలుగు రీమేక్‌లో నటించారు సమంత. శర్వానంద్, సమంత జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఓ బేబీ’ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుందట. నయనతారతో ‘మాయ’, తాప్సీతో ‘గేమ్ ఓవర్’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెరకెక్కించారు అశ్విన్ శరవణన్. ఈ రెండు సినిమాలు థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగాయి. మరి సమంత నటించబోయే సినిమా కూడా థ్రిల్లర్ జానర్లోనే ఉంటుందా? చూడాలి. సమంతకు తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇది ద్విభాషా చిత్రంగానూ రూపొందే అవకాశముంది. సమంత తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘యు టర్న్’ కూడా థ్రిల్లరే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు సమంత. ఈ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారామె. -
మరో థ్రిల్లర్
‘బాహుబలి’ తర్వాత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు అనుష్క. గత ఏడాది ‘భాగమతి’గా థ్రిల్ చేశారామె. ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇది కూడా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమానే. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాను (యాక్షన్ థ్రిల్లర్) సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది అని భోగట్టా. ఇందులో ఫుల్ యాక్షన్ ఉండబోతోందని టాక్. ఫైట్స్ అన్నీ అనుష్కే స్వయంగా చేయబోతున్నారట. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కావచ్చు. -
ఈ ఏడాది చాలా స్పెషల్
‘2019 నాకు స్పెషల్‌గా నిలిచింది. నటిగా నేను గుర్తుంచుకోదగ్గ సంవత్సరం ఇది’ అంటున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్లో కియారాకు ఈ ఏడాది అద్భుతంగా సాగింది. ఈ విషయం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది నేను నటించిన ‘కబీర్ సింగ్’ ఘన విజయాన్ని అందుకుంది. 300 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రేమ మాటల్లో చెప్పలేను. తొలిసారి లేడీ ఓరియంటెడ్ మూవీ (‘ఇందూ కీ జవానీ’) చేస్తున్నాను. ‘కళంక్’లో చేసిన స్పెషల్ సాంగ్ మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే ఈ ఏడాదిని ‘గుడ్‌న్యూస్’ సినిమాతో ముగించబోతున్నాను. ఇందులో అక్షయ్ కుమార్, కరీనాకపూర్‌లతో యాక్ట్ చేసే ఛాన్స్ లభించింది. వచ్చే ఏడాది కూడా ఇలానే కొనసాగాలనుకుంటున్నాను’’ అన్నారామె. -
బాలీవుడ్ లేడీస్
టైటిల్ కార్డ్స్‌లో ఫస్ట్ హీరో పేరే పడుతుంది. ఆ తర్వాతే హీరోయిన్‌ది. కథ హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయినేమో హీరో చుట్టూ తిరుగుతుంది. హీరో విలన్‌తో ఫైట్ చేస్తే, హీరోతో హీరోయిన్ డ్యూయెట్ పాడుతుంది. ఒకప్పుడు కథని లాగాలంటే హీరోనే కావాలి అన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రతీ జనరేషన్లో కొందరు హీరోయిన్లు ఆ విధానాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకొని సోలో సినిమాలు చేశారు. ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ముందు తమకో మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ జనరేషన్లో ఓ నలుగురు హీరోయిన్లు నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆ నలుగురిలో ఒక్క పరిణీతీ చోప్రా మినహా మిగతా ముగ్గురు కెరీర్లో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. అయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సగం రిస్క్ అనుకుంటే మిగతా సగం మారుతున్న ఆడియన్స్ టేస్ట్ అనుకోవచ్చు. బాలీవుడ్లో లీడ్ క్యారెక్టర్స్‌కి సై చెప్పి, లీడింగ్ లేడీస్ అయిన తారల విశేషాలు... సక్సెస్ సక్సేనా... తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. ‘ధడక్’తో కథానాయికగా పరిచయమై, రెండో సినిమాకే లేడీ ఓరియంటెడ్ సినిమా ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు జాన్వీ కపూర్. గుంజన్ సక్సేనాకు, జాన్వీకు ఓ పోలిక పెట్టొచ్చు. గుంజన్ సక్సేనా పైలెట్ అవ్వాలి, గాల్లో విహరించాలి అని కలలు కన్నారు. అవన్నీ ఉత్తి గాలి మాటలు అనుకున్నారు. ‘అమ్మాయిలు పైలెట్ కాలేరు’ అని ఆమెను తేలికగా తీసుకున్నారు. కానీ గుంజన్ తన కలను సీరియస్‌గా తీసుకున్నారు. పట్టుదలతో పైలెట్‌గా మారారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్‌గా చరిత్రలో నిలిచిపోయారు. తను విహరించిన ఫ్లైట్ నుంచి చూస్తే తనని హేళన చేసిన వాళ్లు కనిపించి కూడా ఉండరు. ఇది ఆమె సక్సెస్. జాన్వీకి నటిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ‘సేఫ్ గేమ్ ఆడుకోవచ్చుగా. అప్పుడే సోలో సినిమానా!’ అనే సెటైర్లూ వినిపించాయి. జాన్వీ తన రోల్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. పైలెట్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. తన నిర్ణయం కరెక్టో కాదో వచ్చే ఏడాది మార్చి 13న తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్‌కి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ విధంగా ప్రస్తుతానికి జాన్వీ సక్సెస్ అయ్యారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. టీనా.. కెటీనా అయింది కొందరికి చేతి నిండా ఉంగరాలుంటాయి. ఏంటీ అంటే మా జ్యోతిష్కుడు చెప్పాడంటారు. పేరులో ఒక అక్షరం పెరుగుతుంది. ఎందుకు? అంటే మళ్లీ అదే కారణం. మూఢ నమ్మకాల మీద సెటైరికల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెటీనా’. మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. అందుకే ఈ కథ అంటున్నారు దిశా పటానీ. ఏక్తా కపూర్ నిర్మాణంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. మూఢ నమ్మకలను పాటించే టీనా అనే టీనేజ్ అమ్మాయిగా దిశా కనిపిస్తారు. వాస్తవానికి తన పేరు టీనా. పేరుకి ముందు కె కలిపితే కలిసొస్తుందని జోత్యిష్కుడు చెబుతాడు. దాంతో టీనా కాస్తా కెటీనా అవుతుంది. హాట్ క్యారెక్టర్స్‌లో కనిపించే దిశా పటానీ ఇందులో ఓ మధ్య తరగతి అమ్మా యిలా కనిపిస్తారట. డబుల్ ధమాకా పరిణీతీ చోప్రా హీరోయిన్గా మారి ఎనిమిదేళ్లు కావస్తోంది. డజన్ సినిమాల వరకూ చేశారు. కెరీర్లో తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారామె. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఇందులో సైనా పాత్ర చేస్తున్నారు పరిణీతి. సైనాగా మారడానికి శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్ ఆడుతూ గాయపడ్డారు కూడా. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా చేస్తున్నారు. అదే టైటిల్‌తో వచ్చిన ఇంగ్లీష్ సినిమాకి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలోనూ పరిణీతీ చోప్రానే లీడింగ్ లేడీ. రిబ్బు దాస్ గుప్తా దర్శకుడు. ఇందులో పరిణీతితో పాటు అదితీ రావ్ హైదరీ, కృతీ కుల్హరీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పరిణీతీ చోప్రా. నెట్లో పడతాడా? ‘పదహారూ ప్రాయంలో నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి. నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి...’ అని పాడుతున్నారు ఇందూ. తనకి తగినవాడు, తన బాయ్‌ఫ్రెండ్ దొరికే వరకూ డేటింగ్ యాప్స్ అన్నీ తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ను వడకడుతున్నారు. మరి డేటింగ్ యాప్స్‌లో ఆమె వేసిన నెట్లో ఎవరు పడతారు? ఎలా పడతారు? అనేది సినిమా కీలకాంశం. డేటింగ్ యాప్స్ వల్ల ఇబ్బందులు పడే ఇందూగా కియారా అద్వానీ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఇందూ కీ జవానీ’ టైటిల్. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అబిర్‌సేన్ గుప్త దర్శకుడు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఆ హిట్ సినిమాలో ఉన్న హీరోయిన్ తన భూజాల మీద సినిమాని మోయగలదని నిరూపించుకుంటుంది. మరి.. బలనిరూపణలో ఈ నలుగురు తారలు ఎంత స్కోర్ చేస్తారనేది తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా ఒప్పుకున్నారు కాబట్టి.. కమర్షియల్ సినిమాలకు ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చేంత మార్కెట్ వారికి ఏర్పడాలని ఆశిద్దాం. – గౌతమ్ మల్లాది ∙దిశా పటానీ -
ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం
‘పెంగ్విన్’ చిత్రబృందానికి టాటా చెప్పేశారు కథానాయిక కీర్తీ సురేష్. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో నటించారు Mీ ర్తి.‘‘పెంగ్విన్’ చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని కీర్తీసురేష్ పేర్కొన్నారు. తెలుగులో ‘మిస్ ఇండియా, గుడ్‌లక్ సఖీ’ సినిమాలతో పాటు హిందీలో ‘మైదాన్’ అనే చిత్రంతో కీర్తీ సురేష్ మస్త్ బిజీగా ఉన్నారు. -
ఉంగరాల టీనా
తన దశ తిరిగి అదృష్టం కలిసి రావాలని పేరు మార్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. అలాగే చేతి వేళ్లకు ఐదుకు పైగా ఉంగరాలు ధరించారు. కెరీర్ బాగానే ఉన్నా, కొత్తగా అదృష్టం కోసం దిశా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే ‘కెటీనా’ సినిమా కోసం. దిశా పటానీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్ సినిమాకు ‘కెటీనా’ అనే పేరు ఖరారు చేశారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మే పంజాబీ యువతి టీనా పాత్రలో నటిస్తున్నారు దిశా. ఇది బయోపిక్ అని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఛండీగర్‌లో ప్రారంభమైంది. ‘‘మామూలుగా ఆమె పేరు టీనా. కానీ తన జ్యోతిష్కురాలు చెప్పారని తన పేరు ముందు ‘కె’ చేర్చుకోవడంతో కెటీనాగా మారింది’’ అంటూ ఈ సినిమాలోని దిశా పటానీ లుక్‌ను విడుదల చేశారు చిత్రనిర్మాత ఏక్తా కపూర్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నారు. -
నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి
... అని పాడుతున్నారు కియారా అద్వానీ. బాయ్‌ఫ్రెండ్ కావాలని పాడటమే కాదు ప్రేమలో పడటానికి రెడీగా ఉన్నానంటున్నారు. బాయ్‌ఫ్రెండ్ కోసం డేటింగ్ యాప్స్ అన్నీ కాచి వడపోస్తున్నారు. ఇదంతా కియారా కొత్త సినిమా ‘ఇందూ కీ జవానీ’ కోసమే. కియారా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ–సిరీస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లక్నోలో జరుగుతోంది. ఇందు పాత్ర చేయడం గురించి కియారా మాట్లాడుతూ – ‘‘ఇందు పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రకు ప్రతీ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. హాయిగా నవ్వుకునే ఎంటర్టైనర్ ఇది’’ అని పేర్కొన్నారు. ఇదే కియారా మొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రం. -
నీలగిరి కొండల్లో...
కోలీవుడ్ బిజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ నిర్మానుష్య నీలగిరి కొండల్లో ఎవరి కోసమో వెతుకులాట ప్రారంభించనున్నారు. ఈ వెతుకులాట వెనక ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఈ మిస్టరీ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల ‘కౌసల్య కృష్ణమూర్తి: దిక్రికెటర్ ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఐశ్వర్య. తాజాగా కోలీవుడ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్న్‌ల్ ఇచ్చారు. రతీంద్రన్ ఆర్. ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. మిస్టరీ, హారర్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ నిర్మాత. తమిళంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. నీలగిరి కొండల్లో ఈ చిత్రం మేజర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
విశ్రాంతి లేదు
కీర్తీ సురేశ్ అండ్ టీమ్ యూరప్ నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యారు. అక్కడి షెడ్యూల్ ముగించుకుని వచ్చారు కదా! కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారేమో? అంటే నో రెస్ట్ అట. మరో వారం నుంచి మళ్లీ పనిలో పడిపోతారట. కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మాత. ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో నెలరోజులు చిత్రీకరణ జరిపారు యూనిట్. వారం రోజుల్లో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. రాజేంద్రప్రసాద్, నదియా, నరేశ్, కమల్ కామరాజు కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. -
ఆ సమయంలో దడ పుట్టింది: అమలాపాల్
చెన్నై : విమర్శలతో రాటు తేలిన నటి అమలాపాల్ అని పేర్కొనవచ్చు. అందుకేనేమో అలాంటి విమర్శకులను అస్సలు పట్టించుకోనంటోంది. అంతే కాకుండా ఈ మలయాళీ భామకు కాస్త ధైర్యం ఎక్కువే. విమర్శించే వారిని తనదైన భాణిలో ధీటుగానే బదులిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన ఆడై చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ చిత్రంలో అమలాపాల్ పోషించిన పాత్ర గురించే ఇప్పుడు చర్చంతా. కారణం ఇందులో అమలాపాల్ పూర్తి నగ్నంగా నటించిన సన్నివేశాలు చోటు చేసుకోవడమే. అలా నటించినందుకు కొందరు విమర్శించినా, ఆమె ధైర్యానికి చాలా మంది అభినందిస్తున్నారు. అమలా పాల్ నగ్నంగా నటించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చిత్ర యూనిట్‌కు చెందిన నమ్మకమైన 15 మందిని మాత్రమే సెట్లో ఉండేలా జాగ్రత్త పడ్డారట. వారి నుంచి కూడా సెల్ఫోన్లను తీసుకుని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తరువాతనే తిరిగి ఇచ్చేవారట. దీని గురించి అమలాపాల్ తెలుపుతూ తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చునని నిర్మాత అన్నారని, అయితే ఆ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పానని అంది. అప్పుడలా అన్నా, నగ్న సన్నివేశాల చిత్రీకరణ రోజున షూటింగ్‌కు బయలుదేతున్నప్పుడే కాస్త దడ పుట్టిందని చెప్పింది. సెట్లో ఎం జరుగుతుందో? ఎవరెవరు ఉంటారో, తగిన రక్షణ ఉంటుందా? లాంటి అన్న భయం కలిగిందని చెప్పింది. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులు 15 మంది మాత్రమే ఉండటం చూసి కాస్త మనసు కుదుట పడిందని చెప్పింది. వారిపై ఉన్న నమ్మకంతోనే ధైర్యంగా ఆ సన్నివేశాల్లో నటించినట్లు అమలాపాల్ చెప్పింది. కాగా అమలాపాల్ అలా నగ్నంగా నటించడాన్ని కొందరు తప్పుగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు స్పందించిన ఆమె విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారని, మనం వివరణ ఇచ్చినా సరే వారికి కావలసింది మాత్రమే చెవిన వేసుకుంటారని అంది. అందువల్ల అలాంటి వారిని అస్సలు పట్టించుకోరాదని పేర్కొంది. ఇన్ని విమర్శలను మూట కట్టుకున్న ఆడై చిత్రం ఈ నెల 19వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
ఈ అమ్మాయి
‘బిగ్ బాస్’ ఫేమ్, నటి భానుశ్రీ ప్రధాన పాత్రలో దొంతు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ అమ్మాయి’. అవదూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ సోమవారం ప్రారంభమైంది. దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ – ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రమేష్ తెరకెక్కిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలను ఇండోనేషియాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నాం. పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ నెలలో పాటలు రిలీజ్ చేసి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్ చంద్ర, సత్తిపండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ, గోపాలకృష్ణ, మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.రవి శంకర్. -
స్పెయిన్‌లో సందడి
మరో ఇరవై రోజులు స్పెయిన్‌లోనే గడపనున్నారు కీర్తీ సురేశ్. ఈ నెలాఖరకు గానీ ఇండియా రారని తెలిసింది. స్పెయిన్‌లో ఈ లాంగ్ స్టే తన కొత్త చిత్రం కోసమే. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. జూన్ 11న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను స్పెయిన్‌లో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ జూలై 26 వరకూ సాగనుందని తెలిసింది. ఇటీవలే నదియా, కీర్తీ సురేశ్‌లపై కీలక సన్నివేశాలను షూట్ చేశారట. నదియా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. స్పెయిన్ షెడ్యూల్‌తో ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోనుందని తెలిసింది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. మహేశ్ కోనేరు నిర్మాత. ‘మహానటి’ ఫేమ్ డ్యానీ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
సెక్షన్ 497 నేపథ్యంలో...
సూపర్‌స్టార్ కృష్ణతో ‘శ్రీశ్రీ’, కొత్తవారితో ‘నాటకం’ వంటి సినిమాలు నిర్మించిన సాయిదీప్ చాట్ల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘సెక్షన్ 497 ఇండియన్ పీనల్ కోడ్’. సందీప్ జక్కం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అంగనారాయ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా గుంటూరులో ప్రారంభమైంది. సాయిదీప్ చాట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రమిది. మన దేశంలో వివాహ వ్యవస్థ రానురాను బీటు వారిపోతోంది. పాశ్చాత్య ధోరణులు విపరీతంగా పెరిగిపోయి కుటుంబ వ్యవస్థను శాసిస్తున్నాయి. దాంతో యువతీ యువకులు సహజీవనం పేరుతో జీవనాన్ని సాగిస్తూ ఇష్టం లేనప్పుడు ఈజీగా విడిపోతున్నారు. మన సంప్రదాయాలు మరుగుపడిపోకుండా ‘సెక్షన్ 497’ అనే ఇండియన్ పీనల్ కోడ్ ఒకటి ఏర్పాటైంది. ఆ సెక్షన్ నేపథ్యంలోనే మా సినిమా ఉంటుంది. ఒక ఎస్పీ అల్లుడు డీఎస్పీని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు జరిగే పరిస్థితుల్ని కథగా రూపొందించాం. జూలై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, ఆగస్టులో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్కె. బాజి. -
నగ్నంగా ఇరవై రోజులు!
తమిళసినిమా: ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చ అంతా నటి అమలాపాల్ గురించే. అందుకు కారణం ఈ సంచలన నటి నటించిన ఆడై చిత్రంలో పోషించిన పాత్రనే. కథనాయకి ఇతివృత్తంతో కూడిన చిత్రం ఇది. ఇంతకుముందు మేయాదమాన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం ద్వారా పరిచయం అయిన రతన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఆడై. ఆ మధ్య విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టరే సంచలనం సృష్టించింది. దుస్తులు లేకుండా ఒంటికి టాయిలెట్ పేపర్ చుట్టుకున్న అమలాపాల్ ఫొటోతో కూడిన ఆ పోస్టర్ ఆడై చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదల చేసిన ఆడై చిత్ర టీజర్ మరింత ప్రకంపనలను సృష్టిస్తోంది. అందులో నటి అమలాపాల్ పూర్తి నగ్నంగా కూర్చుని ఏడుస్తున్న దృశ్యం చోటు చేసుకోవడమే కారణం. అలాంటి సన్నివేశంలో అమలాపాల్ ధైర్యంగా నటించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల కోసం నటి అమలాపాల్ 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట. ఇది సాధారణ విషయం కాదు. అందుకు అమలాపాల్ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నటి సమంత వంటి తారలు అమలాపాల్‌ను అభినందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం. ఇలా ఇంతకుముందు ఏ చిత్రానికి రానట్టుగా లైక్స్ రికార్డు స్థాయిలో వచ్చాయట. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఆడై చిత్రం ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నారు. ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించడం వంటి సన్నివేశాలతో పాటు, మోటార్ బైక్ నడపడం, విలన్లతో ఫైట్ చేయడం వంటి సాహసాలు చేసిందట. ఇది కచ్చితంగా ఆమె కేరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని ఆడై చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
గురువుతో నాలుగోసారి
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయాన్ని కొందరు కథానాయికలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాదు.. ఇతర వ్యాపారాలు, ప్రొడక్షన్ వైపు కూడా అడుగులేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. టాలీవుడ్లో తన నట గురువు తేజ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా నిర్మించి, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ సినిమాలో కాజల్ లీడ్ రోల్లో నటించనున్నారట. ఇందుకోసం లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌ను తేజ సిద్ధం చేస్తున్నారని, సమాజానికి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని టాక్. 2007లో వచ్చిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు తేజ. ఈ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకుంది. గత నెలలో వచ్చిన ‘సీత’ చిత్రంతో మూడోసారి కలిసి పనిచేసిన తేజ–కాజల్ ఇప్పుడు నాలుగోసారి కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారట. -
గర్జించే టైమ్ వచ్చింది!
తమిళసినిమా: నటి త్రిష గర్జించే టైమ్ వచ్చింది. ఈ అమ్మడికి ఇప్పుడు సక్సెస్ఫుల్ గాడిలో పడిందన్న విషయం తెలిసిందే. విజయ్‌సేతుపతితో ప్రేమను పండించిన 96 చిత్రం, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల విజయాలు ఈ బ్యూటీకి నూతన ఉత్సాహాన్నిచ్చాయనే చెప్పాలి. ఇంతకుముందు తమిళంలో పాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్‌పైనే పూర్తిగా దృష్టి పెడుతోంది. అదే విధంగా తమిళంలో చేతినిండా చిత్రాలున్నాయి కూడా. ఈ చెన్నై చిన్నది నటించిన పరమపదం విళైయాడు చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ప్రస్తుతం ఎంగేయుం ఎప్పోదుం చిత్రం ఫేమ్ శరవణన్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం రాంగీలో నటిస్తోంది. దీనితో పాటు నటి సిమ్రాన్‌తో కలిసి మరో చిత్రంలోనూ నటిస్తోంది. కాగా ఈ సంచలన నటి నటించిన గర్జన చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇదీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రమే. సుందర్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెంచరీ ఇంటర్నేషనల్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. కాగా ఇది హిందీలో నటి అనుష్కశర్మ హీరోయిన్గా నటించిన ఎన్‌హెచ్ 10 చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇందులో నటి త్రిష యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించిందట. అమిత్‌భార్గవ్, వంశీకృష్ణ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఇప్పుడు మోక్షం కలిగింది. దీని విడుదల హక్కులను ఎస్ఓడీ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. గర్జన చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నటి త్రిష సెంట్రిక్ కథా పాత్రల్లో నటించిన నాయకి, మోహిని వంటి చిత్రాలు నిరాశ పరచాయి. తాజాగా గర్జన చిత్రం అయినా ఈ బ్యూటీని హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా సక్సెస్‌ను అందిస్తుందేమో చూడాలి. -
కలిసిపోయారు
తమిళ నటుడు శింబు, హన్సిక అప్పట్లో ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. తాజాగా మళ్లీ కలిశారు. కలిసిపోయారా? అని ఆశ్చర్యపడకండి. ఈసారి కలిసింది ప్రొఫెషనల్‌గా మాత్రమే. హన్సిక తాజా చిత్రం ‘మహా’లో శింబు ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్లో శింబు జాయిన్ అయ్యారు. హన్సిక చేస్తున్న ఈ తొలి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. యుఆర్ ఉజ్వల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు ఫ్లాష్‌బ్యాక్ భాగంలో మెరుస్తారట. ప్రస్తుతం ఫారిన్లో శింబు, హన్సికలపై ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి శింబూని హన్సికనే ఒప్పించారని దర్శకుడు ఇటీవల పేర్కొన్నారు. -
నో బ్రేక్
ఈ రోజుల్లో సినిమా పూర్తి కావాలంటే 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల వరకూ పడుతుంది. చిన్న సినిమాల షూటింగ్ కూడా చాలా రోజులు పడుతోంది. కానీ తమిళంలో తమన్నా నటించనున్న ఓ హారర్ సినిమా నలభై రోజుల్లోనే పూర్తి కానుందని తెలిసింది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ముఖ్యపాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ రూపొందనుంది. యోగిబాబు, మన్సూర్ అలీ ఖాన్, భగవతీ పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం 42 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎటువంటి బ్రేక్స్ తీసుకోకూడని ఫిక్స్ అయ్యారట. మొదటి పది రోజులు చెన్నైలో మిగతా పోర్షన్ మొత్తం కారైకుడిలో షూట్ చేస్తారట. తమన్నా నటించిన హారర్ చిత్రాలు ‘దేవి 2’, కామోషీ’ సినిమాలు మే 31న రిలీజ్ కానున్నాయి. -
జోడీ లేదు
‘పేట, 96’ సినిమాల విజయాలతో మంచి హుషారు మీద ఉన్న త్రిష వరుసగా సినిమాలు సైన్ చేస్తూ కెరీర్లో జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఆమె నటించనున్న ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ పూజాకార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘రాంగీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘లైకాప్రొడక్షన్స్ నిర్మాణంలో ‘రాంగీ’ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు త్రిష. ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ’) ఫేమ్ ఎమ్. శర్వణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్క్రిప్ట్‌ను అందించారట. స్క్రిప్ట్ పరంగా త్రిష పాత్రకు జోడీ లేదని చెన్నై టాక్. ఈ సినిమా కాకుండా కథానాయిక సిమ్రాన్‌తో కలిసి ఓ సినిమా, తిరుజ్ఞానం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు త్రిష. -
డాక్టర్ త్రిష
ఒకరికి మంచి చేయాలని ప్రయత్నించి తాను చిక్కుల్లో పడ్డారు త్రిష. ఆమెను కిడ్నాప్ చేసి ఓ అజ్ఞాత ప్రదేశంలోని ఓ భవంతిలో దాచారు. అక్కడి నుంచి త్రిష ఎలా బయటపడ్డారు? అందుకు ఎలాంటి సాహసాలు చేశారు అనే అంశాలను ‘పరమపదమ్ విలైయాట్టు’ అనే సినిమాలో చూడొచ్చు. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఒరియంటెడ్ సినిమా ఇది. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తారు త్రిష. మరి.. డాక్టర్‌గా ఆమె చేయబోయిన హెల్ప్ ఏంటి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆల్మోస్ట్ టాకీ పార్ట్ పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి తక్కువ పాటలే ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమాలో త్రిష చేసే యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. అలాగే సిమ్రాన్, త్రిష ముఖ్య తారలుగా సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన హిట్ మూవీ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటించబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. రాధామోహన్ దర్శకత్వం వహిస్తారట. -
కొత్త దారి!
కెరీర్లో తమన్నా కొత్తదారికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా వీలైనప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ కాలు కదిపారు. కానీ ఇప్పుడు ట్రాక్ మార్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టారామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్ బేస్డ్ కావడం విశేషం. తాజాగా తమన్నా మరో హారర్ సినిమాకు సై అన్నారు. ఈ చిత్రానికి రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్ చేశాను. స్క్రిప్ట్ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తారు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే. -
చెడుగుడు... చెడుగుడు!
కబడ్డీ... కబడ్డీ.. అంటూ కూత పెట్టి కోర్టులో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు కథానాయిక పాయల్ రాజ్‌పుత్. కానీ ఆమె కోర్టులోకి అడుగు పెట్టింది సొంత ప్రయోజనాల కోసం కాదు. ఊరి మాట నిలబెట్టడం కోసం. మరి... ఆమె ఎలా చెడుగుడు ఆడారు? అనే విషయం చూడాలంటే ఆట వెండితెరపైకి వచ్చేంతవరకు ఆగాల్సిందే. భాను శంకర్ దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల మెయిల్ లీడ్ యాక్టర్‌గా చేస్తున్నారు. ‘‘ఇందులో కబడ్డీ ఆడే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఈ ఆట కోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాను. ఐదుగురు అబ్బాయిలతో నేను కబడ్డీ ఆడే ఓ సీన్ ఈ సినిమాలో ఒక హైలైట్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు పాయల్. ‘వెంకీమామ, మన్మథుడు 2’ తెలుగులో పాయల్ రాజ్‌పుత్ ఒప్పుకున్న ఇతర చిత్రాలు. తమిళంలో ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘ఏంజెల్’ అనే సినిమా చేస్తున్నారు. మొత్తానికి తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తెచ్చిన ఫేమ్ పాయల్ని బిజీ చేసిందని చెప్పొచ్చు. -
కీర్తి సురేష్ సినిమా షూటింగ్ వాయిదా!
‘మహానటి’ తరువాత తెలుగులో మరే చిత్రానికి అంగీకరించని కీర్తి సురేష్.. ఆ మధ్య ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఆ చిత్రం. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వాయిదాపడ్డట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ప్రారంభించాల్సిన షూటింగ్.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాపడ్డట్లు సమాచారం. మళ్లీ త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మహేష్ కోనేరు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. -
అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మూవీలతో హ్యాట్రిక్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రీసెంట్గా సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచాడు. బడా సినిమాలకు పోటీగా తెచ్చిన ‘ఎఫ్2’ అందరి అంచనాలను తలకిందులు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్లో అనిల్ రావిపూడి హవా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ‘ఎఫ్2’ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఎఫ్2కి సీక్వెల్చేస్తానని ప్రకటించాడు. అప్పట్లో బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం అనిల్.. ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కూడా తన స్టైల్లోనే మంచి కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుందా.. అసలు ఈ ప్రాజెక్ట్ అనిల్ మనసులో ఉందో లేదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
వసూల్ రాణి
బాలీవుడ్ సినిమా జడ బిగువుగా వేసుకుంది. కొంగు దోపింది. కథల రంగంలోకి కాలు మోపింది. సినిమా రాజ్యాన్ని ఏలడానికి రాణి కదిలివచ్చింది. ఇప్పటి దాకా హీరోలకే టిక్కెట్లు తెగుతాయి అనుకునే వాళ్లకు పురుషాహంకారం తెగుద్ది. 2019లో హీరోయినే వసూల్ రాణి. రాబోయేవన్నీ ఆమె ఆట్రాక్షన్సే. స్క్రీన్ మీద మొదట హీరో పేరు పడుతుంది. తర్వాత హీరోయిన్ పేరు. ప్రేక్షకులు హీరో పోస్టర్ని చూసి థియేటర్‌కు వస్తారు. హీరోయిన్ ఎవరైనా పర్లేదు. కథను హీరో నడుపుతాడు. హీరోయిన్ పాటల వరకూ పక్కన ఉంటే చాలు. మనది మగవాళ్ల సమాజం అంటారు కాబట్టి సినిమా కథలు కూడా మగవాళ్ల ఆధారంగానే తిరుగుతుంటాయి. పరిశ్రమలో గాని, ప్రేక్షకుల భావజాలంలోగాని పురుష కేంద్రిత ఇగోనే కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల హీరోయిన్ ముందు వరుసలో నిలబడి కథ చెప్పడం గతంలో అరుదుగా ఉండేది. ‘మదర్ ఇండియా’, ‘సీతా అవుర్ గీతా’, ‘దామిని’ లాంటి సినిమాలు హిందీలో గతంలో వచ్చాయి. కానీ ఆ వరుస కొనసాగలేదు. ప్రాబ్లమ్ ఏమిటంటే హీరోయిన్ లీడ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ని ఆ తర్వాత ఏ హీరో బుక్ చేయడానికి ఇష్టపడడనే అభిప్రాయం ఉంది. సమస్య ఎందుకు అని అలాంటి పాత్రలు వేయడానికి హీరోయిన్లు కూడా కొంచెం వెనకడుగు వేసేవారు. కానీ గత ఇరవై ఏళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు పెరిగాయి. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘ఇంగ్లిష్ వింగ్లిష్’... ఇవన్నీ ఘన విజయం సాధించాయి. కంగనా రనౌత్ వంటి వారు ‘క్వీన్’ వంటి సినిమాని అతి సులువుగా భుజాల మీద మోసి హీరో డేట్ల కోసం పడిగాపులు కాయాల్సిన పని లేదు... మంచి కథ ఉంటే హీరోయిన్లు సినిమాను హిట్ చేయగలరు అని నిరూపించారు. పరిశ్రమ, ప్రేక్షకులు కూడా క్రమంగా ఇలాంటి సినిమాలకు రెడీ అవుతున్నారు. ‘నీర్జా’, ‘మామ్’, ‘పింక్’లాంటి సినిమాలు గత ఒకటి రెండు సంవత్సరాలలో వస్తే 2019లోనూ కొన్ని స్త్రీ ఆధారిత సినిమాలు రానున్నాయి. వాటి వివరాలు. ఝాన్సీ కీ రాణి ఝాన్సీ రాణి అసలు పేరు ఎవరికీ తెలియకపోయినా ఝాన్సీ రాణి అందరికీ తెలుసు. బిడ్డను వీపుకు కట్టుకుని బ్రిటిష్ వారితో పోరాడిన ఈమె కథ పల్లెపల్లెకు సుపరిచితం. ఇలాంటి నాయకుడు చరిత్రలో ఉండి ఉంటే ఈసరికి ఎప్పుడో సినిమా వచ్చి ఉండేది. కానీ స్త్రీ కావడంతో ఇంత కాలం పట్టింది. స్త్రీ ఆధారిత సినిమాలు జనాదరణ పొందుతుండటంతో అందరూ గౌరవించే ఝాన్సీ రాణి కథ తెర మీద రూపుదిద్దుకుంది. ఈ ప్రయత్నంలో ఒక తెలుగువాడు క్రిష్ దర్శకుడిగా పాలుపంచుకోవడం ఆనందించాల్సిన విషయం. ప్రతిభావంతురాలైన నటి కంగనా రనౌత్ ఈ ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకొని కష్టపడటం వల్ల కూడా సినిమా బాగా వచ్చి ఉంటుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. క్రిష్ మొదలెట్టిన ‘మణికర్ణిక’ చిత్రాన్ని చివర్లో కంగనా పూర్తి చేశారు. నటించి, దర్శకత్వం కూడా వహించడం వల్ల ఇది స్త్రీ శక్తి సంపూర్ణంగా పాలుపంచుకున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగులోనూ అనువాదం అయింది. యాసిడ్ బాధితురాలు ‘పద్మావత్’ సినిమాలో నటించినందుకు దీపికా పదు కోన్ ముక్కు, చెవులు కోస్తామని కొందరు ఆవేశపరులు కామెంట్ చేశారు. ఆ సినిమాలో ఆమె నటించిన పాత్ర ఆదరణ ఎలా ఉన్నా ఆమె ఎంచుకున్న తర్వాతి పాత్ర మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమె పోషించనున్నది ఒక యాసిడ్ బాధితురాలి పాత్రను. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తయారు కానుంది. 15 ఏళ్ల వయసులోనే యాసిడ్ అటాక్ ఎదుర్కొన్నారు లక్ష్మి. కానీ ఎంతో ధైర్యంతో జీవితంలో నిలబడ్డారు. యాసిడ్ కాల్చింది నా శరీరాన్నే కానీ ఆత్మవిశ్వాసాన్ని కాదు అంటూ యాసిడ్ బాధితుల కోసం ఎన్జీవో నడుపుతున్న లక్ష్మి జీవితం స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని మరింత మందికి చేరువయ్యేలా ఈ సినిమా చేయనున్నారు దీపిక. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. యాసిడ్ బాధితురాలిగా కనిపించడం కోసం దీపిక ప్రోస్థటిక్ మేకప్‌ను ఉపయోగించనున్నారు. ‘చప్పాక్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకురాలు. ఆలియా భట్ లీడ్ రోల్లో ఇంతకుముందు మేఘనా తీసిన ‘రాజీ’ చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరడంతో ‘చప్పాక్’పై భారీ అంచనాలున్నాయి. తొలి పైలట్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ది ఒక సినిమా వయసు. సాధారణంగా ఈ వయసు హీరోయిన్లు గ్లామర్ వేషాల కోసం పెద్ద హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నించాలి. కాని జాన్వీ కపూర్ తన రెండవ సినిమాగా ఒక బయోపిక్‌ను ఎంచుకుని తాను భిన్నం అని సంకేతం ఇచ్చారు. భారతదేశానికి మొదటి ఫిమేల్ పైలట్ అయిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తయారవుతున్న సినిమాలో ఆమె నటించనున్నారు. గుంజన్ కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ సైనికులను శిబిరాల్లో చేర్చడంలో కీలక పాత్ర పోషించారట. జాన్వీ ఈ పాత్ర కోసం పైలట్ క్లాసులకు హాజరవుతూ, గుంజన్ని కలసి మాట్లాడుతున్నారట. కరణ్ జోహార్ ఈ చిత్రనిర్మాత. బ్యాడ్మింటన్ స్టార్ బ్యాట్‌ని కూడా కత్తిలా ఝళిపించవచ్చు అని నిరూపించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. మన హైదరాబాద్ స్టార్ సైనా ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తి. సక్సెస్ శిఖరానికి చేరాలంటే ఘనమైన కుటుంబాల్లో పుట్టాల్సిన అవసరం లేదనీ శ్రీమంతులే దానిని సాధించగలరని అనుకునేవారికి సైనా విజయం ఓ కనువిప్పు. అందుకే సైనా కథ బాలీవుడ్‌ని ఆకర్షించింది. ఈ చిత్రంలో సైనాగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం శ్రద్ధా శ్రద్ధగా రోజుకు నాలుగైదు గంటల పాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాదే ఈ చిత్రం రిలీజ్ ప్రకటించినప్పటికీ అనివార్య కారణల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు చిత్రదర్శకుడు అమోల్ గుప్తా. పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజి అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ‘మర్దానీ’ చిత్రంలో కనిపించారు రాణీ ముఖర్జీ. చైల్డ్ ట్రాఫికింగ్ (అక్రమంగా చిన్నపిల్లలను రవాణా చేయడం) అనే కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. రాణీ ముఖర్జీయే కథానాయిక. సెకండ్ పార్ట్‌లో ఏ అంశాన్ని డీల్ చేస్తారో వేచి చూడాలి. ‘మర్దానీ 2’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. మోటివేషనల్ స్పీకర్ బాలీవుడ్లో చాలా గ్యాప్ తర్వాత ప్రియాంకా చోప్రా చేస్తున్న చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’. మోటివేషనల్ స్పీకర్ ఐషా చౌదరి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఐషా చౌదరిగా ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ కనిపించనున్నారు. జైరా తల్లిగా ప్రియాంక నటిస్తారు. సోనాలీ బోస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. వివాహం తర్వాత ప్రియాంక ఫస్ట్ రిలీజ్ ఇదే అవుతుంది. అలాగే ఆమె తల్లి పాత్ర చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. పోర్న్ స్టార్ నటి షకీలా జీవితం అంతా ఎత్తుపల్లాల మయం. తెలుగు ప్రాంతంలో పుట్టి కేరళలో సంచలనం సృష్టించారు. అంత సక్సెస్ తర్వాత కూడా సాధారణ జీవితం గడుపుతున్న ఈ నటి జీవితం వెండితెరకు ఎక్కుతోంది. షకీలా పాత్రలో రీచా చద్దా కనిపిస్తారు. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం రీచా బరువు కూడా పెరిగారు. ‘‘బయోపిక్ అంటే అన్నీ నిజాలే చెప్పాలి. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయి’’ అని ఆ మధ్య షకీలా పేర్కొన్నారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇద్దరు.. ముగ్గురు... అందరూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే దాదాపు సోలో హీరోయిన్ నటిస్తారు. అయితే ఇద్దరు ముగ్గురు కథానాయికలు ముఖ్యపాత్రల్లో వస్తున్న సినిమాలు కూడా ప్రస్తుతం ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ సినిమాలో కొంకణా సేన్ శర్మ, భూమి ఫడ్నేకర్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. బాలాజీ టెలి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలంక్రితా శ్రీవత్సవ్ దర్శకుడు. అలాగే ‘మణికర్ణిక’ తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లోనూ కనిపిస్తారు కంగనా రనౌత్. ‘పంగా’ అనే టైటిల్‌తో కబడ్డీ ఆట బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా చేస్తున్నారు కంగనా. అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. నటి తాప్సీ. నటి భూమీ ఫడ్నేకర్‌లు ప్రొఫెషనల్ షూటర్స్ చంద్రూ తోమర్, ప్రకాషీ తోమర్ కథను సినిమాగా చెప్పడానికి సిద్ధమయ్యారు. గన్ షూటింగ్ మాత్రమే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ యాసను కూడా నేర్చుకుంటున్నారట ఈ కథానాయికలు. వచ్చే నెల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మార్స్ మిషన్ విజయవంతంగా జరపడానికి కారణమైన లేడీ ఇంజనీర్స్ కథను ‘మిషన్ మంగళ్’ ద్వారా చెప్పనున్నారు. విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యామీనన్ ముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో అక్షయ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
మహానటి తర్వాత...
‘మహానటి’ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమాలేవీ సైన్ చేయలేదు కీర్తీ సురేశ్. తాజాగా కొత్త దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల మూడో వారం నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఇందులో కీర్తీ సురేశ్ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఆమెతో పాటు మరో మూడు ముఖ్యమైన పాత్రలు ఉంటా యట. ‘మహా నటి’కి కెమెరామేన్‌గా వర్క్ చేసిన డ్యానీ ఈ సినిమాకి కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తీ అంగీకరించిన సినిమా ఇదే కావడం, ఆ సినిమా తర్వాత డ్యానీ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని మహేశ్ యస్.కోనేరు నిర్మిస్తున్నారు. కల్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
ఇది అమల వేదాంతం
ఎప్పుడూ ఎలా వార్తల్లో ఉండాలో తెలిసిన నటి అమలాపాల్. అయితే వివాదం లేకపోతే వేదాంతం వ్యాఖ్యలతో ఈ కేరళా కుట్టి సంచలనం కలిగిస్తోంది. నటిగా ఎంత స్పీడ్‌గా పేరు తెచ్చుకుందో ప్రేమ, పెళ్లి విషయాల్లోనూ అంతే దూకుడును ప్రదర్శించింది. అంతకంటే వేగంగా విడాకుల విషయంలోనూ తొందర పడింది. ఆ తరువాత వేధింపుల ఆరోపణలు, కారు వివాదం, గ్లామరస్ దుస్తులతో ఫొటోలను ఇంటర్నెట్లకు విడుదల చేయడం, ఇవన్నీ అమలాపాల్ జీవితంలో సంచలనాలే అని చెప్పక తప్పదు. వైవాహిక జీవితం నుంచి బయట పడిన తరువాత నటిగా వేగం పెంచినా, ప్రస్తుతం కెరీర్ కాస్త నత్త నడక నడుస్తోందనే చెప్పాలి. ఈ అమ్మడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేసిన రాక్షసన్ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నా, కొత్తగా అవకాశాలేమీ అమలాపాల్‌కు రాలేదు. అయితే ఆ చిత్ర హీరో రెండో పెళ్లికి సిద్ధం అవుతుందనే వదంతికి మాత్రం కారణమైంది. ఇకపోతే అంతకుముందు అంగీకరించిన ఆడై, అదో అంద పరవై పోల రెండు చిత్రాలే ప్రస్తుతం చేతిలో ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఈ రెండూ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలే కావడం. వీటిలోనూ గ్లామర్ విషయంలో విజృంభిస్తోందనే ప్రచారం హోరెత్తుతోంది. వీటితో పాటు చాలా కాలం తరువాత మాతృభాషలో ఒక చిత్రం చేస్తోంది. మొత్తం మీద అమలాపాల్ హడావుడి తగ్గింది. ఆ కొరత పూర్తి చేయడానికే అన్నట్టుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య అటవీ ప్రాంతానికి వెళ్లి, లుంగీ పైకి బిగించి, మద్యం సీసాను చేత పట్టి తీసుకున్న ఫొటోను సోషల్‌మీడియాలకు విడుదల చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా వేదాల్ని వల్లించేలా సొంత కాళ్లపై నిలబడాలి. అది కూడా లోకం నిన్ను కిందకు తోసినప్పుడు లేచి తలెత్తుకుని నిలబడాలి అనే వ్యాఖ్యలను తన ట్విట్టర్లో పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక కథేంటనే విషయం గురించి ఆరా తీసే పనిలో సినీ వర్గాలు పడ్డాయి. అలా సంబంధం లేని వేదాంత వ్యాఖ్యలతో అమలాపాల్ వారికి పని చెప్పడంతో పాటు మరోసారి వార్తల్లో నానుతోంది. Stand tall, always. Especially, when the world beats you down! 🌟#onyourowntwofeet pic.twitter.com/Q9kaG0utID — Amala Paul ⭐️ (@Amala_ams) 20 December 2018 -
మహా వివాదం!
సౌత్‌లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న హన్సిక చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్న లేడీ ఒరియంటెడ్ మూవీ ‘మహా’ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రం హన్సిక కెరీర్లో 50వది కావడం విశేషం. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. అందులో ఒక పోస్టర్లో కాషాయ వస్త్రాలు ధరించి హన్సిక ధూమపానం చేస్తున్న లుక్ ఒకటి. ఈ లుక్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని తమిళనాడు కోర్టులో కేసు నమోదైంది. కోర్టు కూడా కేసును స్వీకరించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ వివాదంపై ‘మహా’ చిత్రబృందం ఏ విధంగా స్పందించనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. యూఆర్ జమీల్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. కరుణాకరన్, తంబి రామయ్య కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ స్వరకర్త. జిబ్రాన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే..« ధూమపానం చేస్తున్న విజయ్ ‘సర్కార్’ చిత్ర పోస్టర్ కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
మహా సస్పెన్స్
కథానాయిక హన్సిక ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదకొండేళ్లు అవుతోంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ 11ఏళ్ల కాలంలో ఆమె ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేశారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘విలన్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేశారామె. ఇప్పుడు హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మహా’. హాన్సిక నటిస్తున్న 50వ చిత్రం ఇది. యూఆర్. జెమిల్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఒక పోస్టర్లో మాస్క్‌లను చేతిలో పట్టుకుని, మరో పోస్టర్లో కుర్చీలో కూర్చొని ధూమపానం చేస్తున్న పోజుతో హన్సిక రెండు రకాలుగా కనిపించారు. ఈ సినిమా కాకుండా ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది. -
సరికొత్త సవాల్!
‘‘చాలా ఆసక్తికరమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నాను. ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడుతున్నానని నా మనసుకి అర్థమవుతోంది. చాలా చాలా నెర్వస్‌గా కూడా అనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఏ సవాల్‌నూ నేను స్వీకరించకుండా ఉండలేదు. చాలాసార్లు మీ గురించి మీరు ఆలోచించినదాని కంటే మీరు బలవంతులు. కొత్త ప్రయాణం మొదలైంది’’ అని తానెంత స్ట్రాంగ్ హింట్ ఇస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు సమంత. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె కథానాయికగా రూపొందనున్న ఓ లేడీ ఒరియేంటెడ్ సినిమా కోసమే పై మాటలను సమంత చెప్పారని తెలుస్తోంది. ఇది కొరియన్ మూవీ మిస్.గ్రానీకి రీమేక్. ఈ చిత్రం కోసం సమంత కరాటే నేర్చుకుంటున్నారట. ఇంతకుముందు తమిళ చిత్రం ‘సీమరాజా’ కోసం ఆమె కర్ర సాము నేర్చుకున్నారు. -
పవర్ఫుల్ జర్నలిస్ట్
పెళ్లి తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తున్నారు నమిత. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కు సైన్ చేశారు. శ్రీమగేశ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘అగమ్పావమ్’ చిత్రంలో పవర్ఫుల్ జర్నలిస్ట్‌గా కనిపిస్తారట నమిత. ఈ సినిమా గురించి నమిత మాట్లాడుతూ– ‘‘పొలిటీషియన్‌కు, జర్నలిస్ట్‌కు మధ్య జరిగే కథ ఇది. నేను పవర్ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఈ సినిమాలో అసలు గ్లామర్ ఉండదు. కొన్ని రోజులుగా నా బాడీ లాంగ్వేజ్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఇందులో డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో 30 పేజీల డైలాగ్స్ ఉండే భారీ సన్నివేశం ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలతోనే షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం’’ అని పేర్కొన్నారు నమిత. -
మగవారంటే మంట!
చెన్నై, పెరంబూరు: మగవారంటే మంట అంటోంది నటి జ్యోతిక. వివాహనంతరం నటిగా రీఎంట్రీ అయిన ఈమె 36 వయదినిలే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి సక్సెస్ అవ్వడంతో వరుసగా చిత్రాలు చేయడం మొదలెట్టారు. తాజాగా కాట్రిన్ మొళి చిత్రంలో నటించారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 16న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నటి జ్యోతిక ఒక భేటీలో మాట్లాడుతూ అన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనే నటిస్తున్నారేంటి అని చాలా మంది అడుగుతున్నారన్నారు. అయితే తనకు అలాంటి అవకాశాలే వస్తున్నాయని అన్నారు. అలాంటి చిత్రాలన్నీ మగవారే దర్శకత్వం వహిస్తున్నారన్నది గ్రహించాలన్నారు. వారే అలాంటి కథలను, పాత్రలను తయారు చేస్తున్నారని పేర్కొంది. నిజానికి ఫలాన కథ కావాలని తానెప్పుడూ, ఏ దర్శకుడిని కోరలేదన్నారు. వారు చెప్పిన కథా పాత్ర తనకు నప్పుతుందని భావిస్తే అందులో నటించడానికి అంగీకరిస్తానన్నారు. నిజానికి ఇప్పుడు మహిళలకు సపోర్టు చేసే కథా చిత్రాల అవసరం ఏర్పడిందన్నారు. ఇప్పుడు అందరూ మీటూ గురించి మాట్లాడుతున్నారు.. ఈ సామాజిక మాధ్యమం 10 ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్నారు. అదే విధంగా తన చిత్రాల్లో పురుషులను చెడ్డ వారిగానే చిత్రీకరిస్తున్నారని అంటున్నారన్నారు. నిజం చెప్పాలంటే తనకు మగవారంటే కోపం అని చెప్పింది. ఇతర చిత్రాలలో మహిళలను తప్పుగా చూపడం లేదా? అని ప్రశ్నించారు. ఆ చిత్రాల్లో నటీమణులకు ఒక్క సెన్సిబుల్ డైలాగ్ కూడా ఉండదనీ.. ఇదంతా మారితేనే సరి అడుతుందన్నారు. ఇకపోతే ఖుషీ–2 చిత్రం రూపొందిస్తే అందులో నటిస్తారా? అని అడుగుతున్నారన్నారు. ఆ చిత్రం రూపొందితే అందులో కచ్చితంగా నటిస్తానని చెప్పారు. ఆ చిత్రం మొదటి భాగంలా ఉండకూడదని, ఒక మెచ్యూర్డ్ జెనిఫర్‌ను ఖషీ–2లో చూపించాలని జ్యోతిక పేర్కొన్నారు. భర్త సూర్య తనకు పక్కాబలంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. -
అక్కడ కూడా హీరో రావాల్సిందేనా?
ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్నారు శ్రియ. ఈ ప్రయాణంలో నటిగా చాలెంజింగ్, ఇంట్రస్టింగ్ పాత్రలు ఎంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాను అన్నారామె. పాత్రల ఎంపిక విషయం గురించి శ్రియ మాట్లాడుతూ – ‘‘ఓ ఆర్టిస్ట్‌కి అతి కష్టమైన పని పాత్రల ఎంపిక విషయంలో బ్యాలెన్డ్స్‌గా ఉండటం. అటు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల్లో కనిపిస్తూనే ఉండాలి. నిర్మాత ఖర్చు పెట్టింది తిరిగిరావడంతో పాటు కొంత లాభం తీసుకొచ్చినప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు. అలాగే మన పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా? నటిగా మనకేమైనా ఆ పాత్ర కొత్త చాలెంజ్ ఇస్తుందా? అన్నది కూడా ముఖ్యం. పాత్ర ఎంపికలో ఈ రెండూ అవసరమే. స్క్రిప్ట్ సరిగ్గా కుదిరితే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసుకుంటే అందులోనూ ఆ హీరోయిన్ని కాపాడటానికి చివరికి ఎవరో ఒక మగాడు (హీరో) వస్తాడు. ఆ సినిమాల్లో కూడా హీరో రావాల్సిందేనా? సో.. నాకు ఏ సినిమా అయినా ఒకటే. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న స్క్రిప్ట్‌కి ఎప్పుడూ రెడీ’’ అని అన్నారు. -
మధ్యతరగతి గృహిణి
కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సీరీస్‌తో సౌత్ ఆడియన్స్‌కు బాగా పరిచయమైన నటి పూజా కుమార్. ఆ తర్వాత ‘పీయస్వీ గరుడ వేగ’ సినిమాలో రాజశేఖర్‌కి జోడీగా నటించారీ బ్యూటీ. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సిద్ధం అయ్యారు పూజా. కానీ, ఇది పూర్తిస్థాయి సినిమా కాదు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే ‘ఇన్విసిబుల్ మాస్క్’ అనే ఆంతాలజీలో (నాలుగు షార్ట్ ఫిల్మ్స్ కలిపి ఒక సినిమాలా) ఓ చిన్న భాగాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రియదర్శన్ తెరకెక్కించబోయే పార్ట్‌లో పూజా కుమార్ మెయిన్ లీడ్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆమె ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపించనున్నారట. -
వీళ్లు హీరోల్రా బుజ్జీ
సినిమా అనగానే హీరో ఎవరు అని అడుగుతారు.వాల్‌పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్.టైటిల్స్‌లో ఫస్ట్ కార్డ్ హీరోదే.అవన్నీ వదిలేయండి అంటున్నారు హీరోయిన్లు. వియ్ కెన్ అని నిరూపిస్తున్నారు.పూర్వం కెరీర్ దాదాపు ముగిసే దశలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు.ఇప్పుడు పీక్ కెరీర్లో కూడా హీరో క్యాన్సిల్ అంటున్నారు.తెర మీద హీరో రహిత కథను భుజాన వేసుకుని పండిస్తున్నారు.హీరోల్రా బుజ్జీ అనిపిస్తున్నారు.నవ రాత్రుల వేళ షేర్ చేసుకోవాల్సిన స్త్రీ శక్తి ఇది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్పుడు కథల తీరు మారింది. హీరోలకు మాత్రమే కథలు రాసే స్థితి నుంచి హీరోయిన్ల కోసమే కథలు రాసే పరిస్థితికి సినీ పరిశ్రమ ఎదిగింది. హీరోయిన్లు కూడా నాలుగు డ్యాన్సులు వేసి క్లయిమాక్స్‌లో తాళ్లతో చేతులను కట్టివేస్తే హీరో కోసం వెయిట్ చేస్తూ చూసే పాత్రల కంటే సొంత ప్రతిభను ప్రదర్శించగలిగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2018లో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ప్రేక్షకులు కూడా హీరో లేకపోయినా పర్లేదు అనుకుని సినిమాలు చూస్తున్నారు. హీరోయిన్లనే హీరోలుగా భావిస్తున్నారు. హిట్ హిట్ హుర్రే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో ఈ సంవత్సరం ‘భాగమతి’ బోణి కొట్టింది. ఆ పాత్రను పోషించిన అనుష్క తన ఖాతాలో మరో హిట్ వేసుకుని కథల ఎంపికలో తన మతిని క్షితిని నిరూపించుకున్నారు. ఆ తర్వాత కాజల్ ‘అ!’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్త్రీ పాత్రల ప్రాముఖ్యంతో వచ్చిన ఈ సినిమా మారిన తెలుగు సినీ ధోరణులకు ఒక ఉదాహరణ. ఇక ఆంధ్రుల అభిమాన తార సావిత్రి బయోపిక్ ఎలా ఉంటుందో అని ఆందోళన చెందిన అభిమానులను తన పెర్ఫార్మెన్స్తో చతికులను చేసి హీరోయిన్ కేంద్రంగా చేయగలిగే సినిమా ఏ రేంజ్‌కు వెళ్లగలదో చూపించారు కీర్తీ సురేశ్. మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ చేశారు. మరో వైపు హిందీలో దీపికా పదుకోన్ ‘పద్మావత్’గా, అనుష్కా శర్మ ‘పరీ’గా, రాణి ముఖర్జీ ‘హిచ్కీ’తో బాక్సాఫీస్ దగ్గర చప్పట్లు కొట్టించారు. ‘వీరే ది వెడ్డింగ్’తో న్యూ ఏజ్‌కు వెల్కమ్ చెప్పారు కరీనాకపూర్, సోనమ్ కపూర్లు. తమిళంలో నయనతార ‘ఆరమ్’, ‘కోకోకోకిల’ సినిమాలు చేశారు. ఇక సమంత ‘యూ టర్న్’ సినిమా చేసి మూస సినిమాలను యూ టర్న్ కొట్టేలా చేయగలిగారు. ఇవి ఇప్పటి దాకా రిలీజ్ అయిన సినిమాలు. రాబోతున్న సినిమాల విషయానికి వస్తే... రేడియో జాకీ విజయలక్ష్మి జ్యోతిక కేవలం గృహిణిగా, నటుడు సూర్య భార్యగా ఉండిపోదలచుకోలేదు. నటిగా తన ప్రతిభను, మార్కెట్‌ను కొనసాగించదలిచారు. ఈ సంవతర్సం ‘నాచ్చియార్’లో ఆమె పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఇప్పుడు హిందీలో హిట్ అయిన ‘తుమ్హారీ సులూ’ సినిమా తమిళ వెర్షన్లో నటిస్తున్నారు. దర్శకుడు రాధా మోహన్ సౌత్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా కథను మార్చి తెరకెక్కించారట. తమిళంలో ‘కాట్రిన్ మొళి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం నవంబర్‌లో రిలీజ్ కానుంది. అదిగో ఆ పక్షిలా... హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఫైట్లు చేయగలరు అని యాక్షన్ సినిమా చేస్తున్నారు అమలా పాల్. స్క్రిప్ట్‌కి కట్టుబడి యాక్షన్ సీక్వెన్స్‌లో రిస్కులు చేసి, కొన్ని కట్లు కూడా కట్టించుకున్నారు. ఆమె ముఖ్య పాత్రలో రూపొందుతోన్న యాక్షన్ మూవీ ‘అదో అంద పరవై పోల’ (అదిగో ఆ పక్షిలా). కథ అంతా అడువుల్లో జరగనుందట. వినోథ్ కేఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమలాపాల్. ‘మేయాద మాన్’ వంటి కామెడీ జానర్ మూవీతో బ్లాక్‌బస్టర్ సాధించిన దర్శకుడు రత్నకుమార్ అమలాపాల్‌తో ‘ఆడై’ అనే సినిమాను తీయనున్నాడు. ‘ఆడై’ అంటే దుస్తులు అని అర్థం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని చూసి ‘బోల్డ్’గా ఉందని చాలామంది అన్నారు. గ్రామీణ యువతి కనా క్రికెట్ మగవాళ్ల క్రీడ. ఆడవాళ్ల క్రికెట్‌కు పెద్ద గిరాకీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా క్రికెట్ నేపథ్యంగా సినిమా రావడం విశేషం. తెలుగు మూలాలున్న తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో ప్రపంచ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఆడాలని తాపత్రయపడే గ్రామీణ యువతి కలలు కథాంశం. సినిమా పేరు ‘కనా’. అంటే కల అని అర్థం. ఈ సినిమాను తమిళ నటుడు శివకార్తికేయ నిర్మించి, ఓ చిన్న గెస్ట్ రోల్ కూడా చేయడం విశేషం. ‘కనా’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. సౌత్‌లో క్వీన్స్ మూడు భాషల్లో ముగ్గురు కథానాయికలతో ఏక కాలంలో హిందీ ‘క్వీన్’ సినిమా సౌత్‌లో రీమేక్ అవుతోంది. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మీ’ అంటూ తమన్నా, ‘ప్యారిస్ ప్యారిస్’ అంటూ తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో ‘జామ్ జామ్’ అంటూ మంజిమా మోహన్ నటిస్తున్నారు. పెళ్లి ఆగిపోవడంతో తన గురించి తాను తెలుసుకోవడం కోసం ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన అమ్మాయి కథే ఈ క్వీన్.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. తెలుగు వెర్షన్‌ను దర్శకుడు నీలకంఠ మధ్యలో తప్పుకోవడంతో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ మిగతా పనిని పూర్తి చేశారు. ఒకే పాత్రతో ఒక్కటంటే ఒకే పాత్ర తో నాలుగు భాషల్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వికే ప్రకాశ్. ఈ సాహసానికి రెడీ అయ్యారు నిత్యా మీనన్. తెలుగు, తమిళం. కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. పాత్ర తీరు తెన్నులు నచ్చకపోతే మేకప్ కిట్ కూడా ముట్టుకోని నిత్యా ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉండబోతోంది అంటున్నారు. ఇందులో రచయిత్రి పాత్ర పోషించారామె. రిలీజ్‌కి రెడీ అయింది. మళ్లీ భయపెడతాం! ‘గీతాంజలి’తో ఆడియన్స్‌ను ఏకకాలంలో భయపెట్టి, నవ్వించారు అంజలి. హారర్ కామెడీ సినిమాల్లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ‘గీతాంజలి’. ఆ మ్యాజిక్‌ని మళ్లీ రిపీట్ చేయాలనుకుంటున్నారు. అందుకే సీక్వెల్ ప్లాన్ చేశారు. అమెరికా, ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ కొత్త చిత్రం ఉండబోతోందట. కోన వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. రాకెట్ స్టోరీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ కథ యువతకు స్ఫూర్తినిచ్చే కథావస్తువు. అది గ్రహించిన బాలీవుడ్ దర్శకుడు అమోల్ గుప్తే ఆమె బయోపిక్ రూపొందించే పనిలోపడ్డారు. సైనాగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. సైనాలా రాకెట్ తిప్పడం కోసం శ్రద్ధా కపూర్ రోజూ 4,5 గంటలు శ్రద్ధగా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేశారట. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాప్సీ ‘గేమ్ ఓవర్’ 2018 తాప్సీకి బ్లాక్‌బస్టర్ సంవత్సరం. అటు బాలీవుడ్, ఇటు సౌత్ ఇండస్ట్రీల్లో సక్సెస్ టేస్ట్ చేశారు. ఇప్పుడు ‘గేమ్ ఓవర్’ అంటూ సింగిల్ స్టార్‌గా వస్తున్నారు. సినిమా ఇటీవలే స్టార్ట్ అయింది. వీల్ చైర్లో ఉన్న తాప్సీ ఫొటోను ఫస్ట్ లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. అశ్విన్ శర్వానణ్ దర్శకుడు. సో.. హీరోయిన్లందరూ ‘హీరో’లవుతున్నారు. అంతేకదా.. సినిమాని నడిపించేవాళ్లను ‘హీరో’ అనే అంటారు కదా. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
మరో చాలెంజింగ్ రోల్లో త్రిష
అమ్మ అయిన త్రిష అనగానే ఆశ్చర్యపోతున్నారా? త్రిష రియల్ లైఫ్‌లో అమ్మ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది గానీ, అంతకు ముందే రీల్ లైఫ్‌లో అమ్మతనాన్ని చవి చూసేస్తోంది. ఈ అమ్మడు కమర్శియల్ హీరోయిన్ల పాత్రలతో పాటు హీరోయిన్ సెంట్రిక్ పాత్రల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండవ తరహా కథా పాత్రల్లో సరైన హిట్‌ను అందుకోలేదు. కాగా నటి నయనతార మాయ చిత్రంలో పిల్లకు తల్లిగా నటించి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో తొలివిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ తరహా కథా చిత్రం కాకపోయినా పరమపదం విళైయాట్టు చిత్రంలో త్రిష కూడా ఒక చిన్నారికి తల్లిగా నటిస్తోంది. అంతే కాదు అది వైద్యురాలి పాత్ర కావడం విశేషం. తిరుజ్ఞానం దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ పరమపదం విళైయాట్టు చిత్రంలో త్రిష ఇంతకు ముందెప్పుడూ చేయనటువంటి పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. తాను చెప్పడం కాదు గానీ, ఇదే నిజం అన్నారు. త్రిష నటించిన చిత్రాలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. అంతే కాదు ఆమె కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. 24 హవర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుందని చెప్పారు. చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ఏర్కాడ్‌లోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన రాబర్ట్ క్లైవ్ మేన్షన్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది వైకుంఠపాళి గేమ్‌లా చాలా ట్విస్ట్‌లతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. త్రిషకు కథ నచ్చడంతో చాలా ఇష్టపడి నటిస్తున్నారని చెప్పారు. చాలా రిస్కీ షాట్స్‌ను సింగిల్ టేక్‌లో చేసేస్తున్నారని అన్నారు. ఆమెతోపాటు, నందా, రిచర్డ్, వేల్రామమూర్తి నటిస్తున్నారని తెలిపారు. దీనికి ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారని తలిపారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు తిరుజ్ఞానం చెప్పారు. చూద్దాం ఈ చిత్రం అయినా త్రిషకు విజయాన్ని అందిస్తుందేమో. -
కేరాఫ్ కాంట్రవర్సీ
కె ఫర్ కంగనా. కె ఫర్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీల్లోకి కంగనా వెళ్తారో లేక కాంట్రవర్సీలు ఆమె చుట్టూ చేరతాయో అర్థం కాదు. ఆఫ్ స్క్రీన్.. ఆన్ స్క్రీన్.. ఏదైనా ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనో లేదా వాటిని క్లియర్ చేస్తూనో వార్తల్లో ఉంటారామె. తాజాగా ‘మణికర్ణిక’ సినిమా. ఝాన్సీగా స్క్రీన్‌పై కంగనా చేసిన పోరాటాలకంటే బయటే ఎక్కువ పోరాటాలు చేస్తున్నట్టున్నారు. దర్శకుడు క్రిష్ ‘యన్టీఆర్’ బయోపిక్‌లో బిజీగా ఉండటంతో ప్యాచ్వర్క్కి ఆల్రెడీ తనే దర్శకత్వ బాధ్యతలను చేపడుతోంది. సోనూసూద్–కంగనా మధ్య డిఫరెన్సెస్ రావడంతో ‘మణికర్ణిక’ నుంచి ఆయన తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రను మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ మరో 15కోట్లు పెరగనుందట. లేడీ ఓరియంటెడ్ íసినిమాల్లోనే భారీ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం రీషూట్ వల్ల బడ్జెట్ ఇంకా పెరగడం సినిమా రిజల్ట్‌పై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి. ముందు అనుకున్నట్లుగా జనవరిలో ఈ సినిమా రిలీజ్ కాదని బాలీవుడ్ టాక్. -
మోస్ట్ పవర్ఫుల్
పోలీస్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అందాల భామ సుష్మితాసేన్. ముఖ్యంగా ఐపీసీ సెక్షన్స్‌పై దృష్టిసారించారు. ఆమె ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అని కంగారు పడకండి. నిజానికి ఆమె కేసులను సాల్వ్ చేస్తానంటున్నారు. లాయర్‌గా కాదు. పోలీసాఫీసర్‌గా. సుష్మితాసేన్ ప్రధాన పాత్రలో హిందీలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో సుష్మితాసేన్ మోస్ట్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఈ సినిమా కథనం మధ్యప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. కథ విని సుష్మిత ఇంప్రెస్ అయ్యారట కానీ, కొన్ని మార్పులు చెప్పారట. ప్రస్తుతం టీమ్ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది. అంతా సాఫీగా జరిగితే ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... దాదాపు ఎనిమిదేళ్ల కిత్రం వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ సినిమా తర్వాత హిందీలో మరో సినిమా చేయలేదు సుష్మితాసేన్. ఇప్పుడు లాఠీపట్టి, ఖాకీ తొడిగి పోలీసాఫీసర్‌గా సిల్వర్‌స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ బ్యూటీ. -
కోకిల సాహసం
మాయ, డోర, ఆరమ్, అనామిక.. వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో ‘లేడీ సూపర్ స్టార్’ అనిపించుకున్నారు నయనతార. ఆమె తమిళంలో టైటిల్ రోల్ చేసిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘కోలమావు కోకిల’. ఈ చిత్రం తెలుగులో ‘కో.. కో.. కోకిల’ పేరుతో విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. నెల్సన్ దర్శకుడు. ఈ చిత్రం గురించి లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఇటీవల విడుదలైన ‘కోలమావు కోకిల’ సెన్సేషనల్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఓ సాధారణమైన అమ్మాయి అనుకోకుండా ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుపోతుంది. వాళ్ల నుంచి బయటపడటానికి కోకిల చేసిన సాహసం ఏంటి? అనే పాయింట్‌ను డైరెక్టర్ నెల్సన్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. నయనతార అద్భుతమైన నటి. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాలు అందుకు నిదర్శనం. ఈ చిత్రంలో కోకిల పాత్రలో విజృంభించారామె. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, నెల్సన్ టేకింగ్ పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. ఈ నెల 31న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
మిస్ మహా
దాదాపు పదేళ్ల క్రితం ‘దేశముదురు’ సినిమాతో కథనాయికగా జర్నీని స్టార్ట్ చేశారు హన్సిక. తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లి అక్కడ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హాఫ్ సెంచరీని టచ్ చేశారు. హన్సిక 50వ సినిమాకి ‘మహా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను దర్శక–నిర్మాత, నటుడు ధనుష్ అనౌన్స్ చేశారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు ‘రోమియో జూలియట్, బోగన్’ సినిమాలను డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ వద్ద జమీల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ హన్సికనే కావడం విశేషం. ‘‘హన్సిక ల్యాండ్ మార్క్ సినిమాను డైరెక్ట్ చేయనుండటం ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయింది. సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జమీల్. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిచనున్నారు. -
ఫుల్ థ్రిల్
‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజకిరణ్ తాజాగా ‘విశ్వామిత్ర’ పేరుతో మరో లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందిత లీడ్ రోల్ చేస్తున్నారు. మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలు. దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్ మెయింటైన్ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తున్నారు. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. నందిత ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌స్టేషన్ సీన్లను నటుడు ప్రసన్నపై చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి. -
అప్పుడే ఆ ఆలోచన లేదు
రీసెంట్గా తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొచీవ్‌ని పెళ్లాడిన శ్రియ.. ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. పెళ్లి చేసుకున్నారు.. మరి అమ్మ ఎప్పుడు అవుతారు? అనే ప్రశ్న శ్రియ ముందుంచితే ‘‘ఇప్పుడే ఆ ఆలోచన లేదు. యాక్చువల్లీ పెళ్లనేది యాక్టింగ్‌కి అడ్డంకిగా మారుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ నా విషయంలో అలా కాదు. మరో 20 సినిమాలు చేసిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తా’’ అని చెప్పారు శ్రియ. పెళ్లికి ముందు శ్రియ కమిట్ అయిన తెలుగు, తమిళ బైలింగువల్ ‘నరగాసురన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే లేడీ డైరెక్టర్ సుజన దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. -
మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో...
లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించడం చెన్నై సుందరి త్రిషకు కొత్తేమీ కాదు. తమిళంలో ‘నాయకి’, ‘1818’ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించారు. కానీ టాలీవుడ్ దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఇది న్యూ జానర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో రూపొంది, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ‘శతమానం భవతి’, ప్రజెంట్ నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలు హీరో ఓరియంటెడ్. ఇప్పుడు సతీష్, త్రిష గురించిన ప్రస్తావన ఎందుకంటే.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో త్రిష ముఖ్య తారగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తెరకెక్కనుందన్న వార్తలు ఇండస్ట్రీలో ప్రచారం అవుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే. -
వైవిధ్యమైన పాత్రలో..
కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో యమా బిజీగా ఉన్నారు నయనతార. ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెండ్ చిత్రాలతోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘కొలమావు కోకిల’ (కో కో ) సినిమాలో ఇప్పటి వరకూ చేయని పాత్ర చేస్తున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన్ డ్రగ్స్ అమ్మే యువతిగా కనిపిస్తారట. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఓ యువతి స్మగ్లింగ్ వైపు ఎలా వెళ్లింది? ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. నెల్సన్ దిలీప్ కుమార్ కథ చెప్పగానే మరోమాట మాట్లాడకుండా నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట నయనతార. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. -
పల్లెటూరి అమ్మాయి.. దేశం గర్వపడేస్థాయి!
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డి’. రీసెంట్గా విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూడు పాటలకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాత ముత్యాల రాందాస్ మాట్లాడుతూ –‘‘రామకృష్ణగౌడ్గారు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో చాలాకాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. మహిళలు ఎందులో తక్కువకాదనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఒక పల్లెటూరి అమ్మాయి దేశం గర్వపడేస్థాయి కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగింది అన్నదే కథాంశం. మధుప్రియ, మంగ్లీ, గీతామాధురి పాడిన పాటలకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. మరో రెండు పాటలను మధుప్రియ, గీతా మాధురితో పాడించి త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సినిమాతో రాజ్‌కిరణ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి బ్రేక్ వస్తుంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది’’ అన్నారు రామకృష్ణగౌడ్ . ఈ సినిమాకు కెమెరా: రాజు. -
ఆ ముగ్గురి బాటలో...
సాక్షి, చెన్నై : హన్సిక కూడా రెడీ అయిపోతోంది అనగానే ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు వెళ్లిపోతున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ ముంబై బ్యూటీ నోట ఇంకా పెళ్లి మాట రానే లేదులెండి. మరి దేనికి రెడీ అవుతోందనేగా మీ ఆసక్తి. థ్రిల్లర్ కథా చిత్రానికండి. నయనతార, అనుష్క, త్రిష బాటలో పయనించడానికి సిద్ధం అవుతోంది హన్సిక. అవును హన్సిక కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోంది. ఈ అందగత్తె ఇప్పుటి వరకూ అభినయంతో కూడిన గ్లామరస్ పాత్రలోనే నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అరణ్మణై–2 చిత్రంతో హర్రర్ పాత్రను కూడా రక్తి కట్టించారు. అయితే థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించలేదు. అదేవిధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది ఇప్పుడా అవకాశం హన్సికను వరించింది. మసాలా పడం, భోగన్, రోమిమో జూలియట్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన యూఆర్.జమీల్ మెగాఫోన్ పడుతున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా సెంట్రిక్ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి సమయంలో కథనంతా తన భుజస్కంధాలపై మోసుకెళ్లే చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషమే. ఈ చిత్రం వివరాలను దర్శకుడు జమీల్ తెలుపుతూ హన్సికను దగ్గరుండి చూసిన తనకు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కథానాయకి పాత్రకు తనే కరెక్ట్‌గా నప్పుతుందనిపించిందన్నారు. కథ చెప్పగానే హన్సిక వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుటి వరకూ పోషించనటువంటి వైవిధ్యభరిత పాత్రలో హన్సికను ప్రేక్షకులు చూస్తారన్నారు. మహిళలు తమ కష్టాల నుంచి బయట పడడానికి ఏం చేస్తారన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రంలో హన్సిక పాత్ర గురించి ప్రస్తుతానికి చెప్పలేనని, అయితే ఇందులో హన్సిక భారీ ఫైట్స్‌ను కూడా చేస్తారని, అవి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అన్నారు. ప్రేమ, హాస్యం అంటూ జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయని, జాయ్స్టార్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం జూలైలో సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జమీల్ చెప్పారు. -
రఫ్పాడిస్తానంటున్న వరలక్ష్మి
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలు నటి వరలక్ష్మీని వెతుక్కుంటూ వస్తున్నాయి. తారైతప్పట్టై చిత్రంలో డాన్స్‌లో దుమ్మురేపిన ఈ బ్యూటీ తాజాగా ఫైట్స్‌లో అదరగొడుతున్నారట. వరలక్ష్మీశరత్‌కుమార్ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రాల్లో వెల్వెట్ నగరం ఒకటి. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఈ తరహా కథా చిత్రంలో వరలక్ష్మి నటించడం ఇదే ప్రథమం. ఇందులో తను డైనమిక్ రిపోర్టర్‌గా నటిస్తున్నారట. దీనికి మనోజ్ కమార్నటరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది కథానాయికకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అని చెప్పారు. కొంత కాలం క్రితం కోడైకెనాల్, చెన్నైలో జరిగిన వేర్వేరు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం వెల్వెట్ నగరం అని తెలిపారు. భారీ ఫైట్స్ సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ «థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. 48గంటల్లో జరిగే కథాంశంతో కూడిన ఈ చిత్రం జెట్ వేగంతో సాగుతుందన్నారు. ఇందులో మదురైకి చెందిన క్రైమ్ రిపోర్టర్‌గా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారని చెప్పారు. కోడైకెనాల్‌లో నివశించే గిరిజన సామాజిక వర్గ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఆధారాలు సేకరించడానికి మదురై నుంచి చెన్నైకి వచ్చిన వరలక్ష్మి ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా వెల్వెట్ నగరం ఉంటుందన్నారు. చెన్నై, మదురై, కోడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించినట్లు తెలిపారు. చివరి ఘట్ట షెడ్యూల్ చెన్నైలో జరపనున్నట్లు తెలిపారు.