
కబడ్డీ... కబడ్డీ.. అంటూ కూత పెట్టి కోర్టులో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు కథానాయిక పాయల్ రాజ్‌పుత్. కానీ ఆమె కోర్టులోకి అడుగు పెట్టింది సొంత ప్రయోజనాల కోసం కాదు. ఊరి మాట నిలబెట్టడం కోసం. మరి... ఆమె ఎలా చెడుగుడు ఆడారు? అనే విషయం చూడాలంటే ఆట వెండితెరపైకి వచ్చేంతవరకు ఆగాల్సిందే. భాను శంకర్ దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాలో ‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల మెయిల్ లీడ్ యాక్టర్‌గా చేస్తున్నారు. ‘‘ఇందులో కబడ్డీ ఆడే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఈ ఆట కోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాను. ఐదుగురు అబ్బాయిలతో నేను కబడ్డీ ఆడే ఓ సీన్ ఈ సినిమాలో ఒక హైలైట్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు పాయల్. ‘వెంకీమామ, మన్మథుడు 2’ తెలుగులో పాయల్ రాజ్‌పుత్ ఒప్పుకున్న ఇతర చిత్రాలు. తమిళంలో ఆమె ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ‘ఏంజెల్’ అనే సినిమా చేస్తున్నారు. మొత్తానికి తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’ తెచ్చిన ఫేమ్ పాయల్‌ని బిజీ చేసిందని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment