
‘బాహుబలి’ తర్వాత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు అనుష్క. గత ఏడాది ‘భాగమతి’గా థ్రిల్ చేశారామె. ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇది కూడా థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమానే. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాను (యాక్షన్ థ్రిల్లర్) సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది అని భోగట్టా. ఇందులో ఫుల్ యాక్షన్ ఉండబోతోందని టాక్. ఫైట్స్ అన్నీ అనుష్కే స్వయంగా చేయబోతున్నారట. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment