Goutham Menon
-
సచిన్, వినోద్ కాంబ్లేల స్నేహం.. సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్
వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రాలతో పాటు యాక్షన్‌తో కూడిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ దిట్ట. కోలివుడ్లో మిన్నలే చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన వెందు తనిందదు కాడు చిత్రం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధ్రువనక్షత్రం చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని సుదీర్ఘకాలం తర్వాత ఈనెల 24వ తేదీన తెరపైకి రానుంది. అయినప్పటికీ ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఇందులో రాధికా శరత్‌కుమార్, సిమ్రాన్, నటుడు పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా బుధవారం ఇండియా, న్యూజిలాండ్ మధ్య సాగిన ప్రపంచ క్రికెట్ కప్ సెమీఫైనల్స్ పోటీని విశ్లేషించే విధంగా ఒక టీవీ చానల్ కార్యక్రమంలో గౌతమ్ మీనన్ పాల్గొన్నారు. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ అడిగిన పలు ప్రశ్నలకు గౌతమ్‌మీనన్ బదులిచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్ నేపథ్యంలో చిత్రం చేస్తారా..? అన్న ఆర్జే బాలాజీ ప్రశ్నకు గౌతమ్ మీనన్ బదులిస్తూ ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నానని, అందుకు కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లేల మధ్య స్నేహం ఇతివృత్తంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. వారు క్రికెట్ క్రీడాకారులుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎలా చేరుకున్నారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్ర కథ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో నటించే హీరోలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై
సమంత-నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జెస్సీగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గానూ క్రేజ్ సంపాదించుకుంది. నాగ చైతన్య అంతకుముందే జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఏమాయ చేశావే సినిమాతోనే తొలి హిట్ అందుకున్నాడు. తెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ చై-సామ్‌ల జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత అతనితో దిగిన ఫోటోలన్నింటిని సామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అటు చై కూడా విడాకుల తర్వాత సామ్‌కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయలేదు. అయితే తాజాగా ఏమాయ చేశావే సినిమా వచ్చి నేటితో 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సెలబ్రేటింగ్ 13ఇయర్స్ అంటూ పోస్ట్ చేశాడు. సమంత కూడా ఏమాయ చేశావేకు పదమూడేళ్లు అంటూ పలు ఫోటోలను షేర్ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి ఇన్‌స్టా పోస్టులు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ❤️🫠#Yemaayachesave pic.twitter.com/9UL9j1528c — Movie Muthyam (@MovieMuthyam) July 22, 2022 -
సందీప్ కిషన్ 'మైఖేల్' ఫస్ట్‌లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా శనివారం(మే7)న సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సిక్స్‌ప్యాక్ బాడీతో చేతిలో గన్ పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిస్తున్నాడు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Happy to share the Fiery 1st Look of my Dear most director @jeranjit ‘s #Michael 👊🏽@Dir_Lokesh presents 🌟#HBDSundeepKishan ❤️@sundeepkishan @menongautham @varusarath5 @itsdivyanshak @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic @sivacherry9 @proyuvraaj pic.twitter.com/N6qZc498Jz — VijaySethupathi (@VijaySethuOffl) May 7, 2022 -
'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha Emotional Post On Her 12 Years Career: 'ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. 'చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు. చదవండి: 'ప్రాణహాని ఉంది.. నా ప్రైవసీని అతిక్రమించారు' సమంత పోస్ట్ వైరల్ లైట్స్, కెమెరా, యాక్షన్.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ సమంత పేర్కొంది. కాగా ఈ సినిమాతోనే సమంత-నాగ చైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా గురించి సమంత పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సందీప్ కిషన్ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్
యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం మైకేల్. ఈ మూవీలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించనున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రతినాయకుడిగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నారాయణ దాస్ కె నరంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, కరన్.సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్బి సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడించారు. సోమవారం చిత్ర పోస్టర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణ వచ్చిందన్నారు. -
స్పెషల్ డే ఫర్ సమంత; జీవితాన్నే మార్చేసింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. తన జీవితంలో ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఈరోజే. ఆమె నటించిన తొలి సినిమా విడుదలై నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఏమాయా చేసావే సినిమాతో ఇండస్ట్రీలో కాలుమోపి విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుందనపు బొమ్మ కుర్రకారుని తన మాయలో పడేసింది. ఈ సినిమా సమంత జీవితాన్నే మలుపుతిప్పిందని చెప్పవచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మంజుల ఘట్టమనేని నిర్మించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇందులో నాగచైతన్య సరసన నటించిన సమంత తరువాత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ఇండస్ట్రీలోకి వచ్చి పదకొండేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సమంత స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశారు. ‘సినిమా.. ఫస్ట్ లవ్ కదా. అంత ఈజీగా తగ్గదు. హ్యపీ యానివర్సరీ టూ మీ. 11 ఏళ్లు పూర్తయ్యాయి. అండ్ హ్యపీ యానివర్సరీ టూ యూ. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు లేకుండా ఇదంతా సాధించలేను. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి. ఇది చాలా చాలా ప్రత్యేకం’ అని భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా తన మీద నమ్మకంతో సినిమా అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యకు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: శాకుంతల సిద్ధమవుతున్నారు ఇక ఈ పదకొండేళ్ల ప్రయాణంలో సమంత ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. అట్టర్ ఫ్లాప్‌ల నుంచి అద్భుత విజయాల వరకు అన్నీ ఆమె ఖాతాలో భాగమే. కేవలం నటిగానే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూ మంచి వ్యక్తిగా కూడా పేరొందారు. కాగా ఏమాయ చేసావేతో ప్రేమలో పడిన చైతూ, సమంత కొన్నేళ్లు ప్రేమించుకొని 17 ఆక్టోబర్ 2017లో పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. పెళ్లి అనంతరం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, పలు బిజినెస్‌లతో తమిళ పొన్ను బిజీగా గడుపుతున్నారు. చదవండి: ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్ నుంచి ఆ ఒక్కటే ఇక అది అలా ఉంటే ఆమె ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసింది. ఈ సినిమా షూటింగ్ మార్చి 20 నుండి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో ఓ మలయాళ నటుడు కనిపిస్తారని టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
ఐదు చిన్న కథలతో సరికొత్త ఉదయం
ప్రతి ఉదయం కొత్త రోజుకి ప్రారంభం. కొత్త ఆలోచనలకు, ప్రయాణాలకు, కథలకు కూడా ప్రారంభమే. ఇప్పుడు సరికొత్త ఉదయంలో అంటూ కథలు చెప్పడానికి సిద్ధమయ్యారు పలువురు దర్శకులు. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, సుహాసిని, సుధా కొంగర, కార్తీక్ సుబ్బరాజ్ కలసి అమేజాన్ ప్రైమ్ కోసం ఓ యాంథాలజీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘పుత్తమ్ పుదు కాలై’ (సరికొత్త ఉదయం) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు చిన్న కథలు ఉంటాయి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న భాగంలో మలయాళ నటి కళ్యాణీ ప్రియదర్శన్, కాళిదాస్ జయరామ్ నటిస్తారు. సుహాసిని కథలో అనూహాసన్, శ్రుతీహాసన్ కనిపించనున్నారు. గౌతమ్ మీనన్ కథలో రీతూ వర్మ, రాజీవ్ మీనన్ కథలో ఆండ్రియా, కార్తీక్ సుబ్బరాజ్ కథలో బాబీ సింహా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 16 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది. -
రాఘవన్‌కి జోడీగా...
లోక నాయకుడు కమల్‌హాసన్‌కు జోడీగా కీర్తీ సురేష్ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వేట్టయాడు విలైయాడు’ (తెలుగులో ‘రాఘవన్’ గా విడుదలైంది). 2006లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు గౌతమ్ మీనన్. ఇటీవల కమల్‌హాసన్‌కు స్క్రిప్ట్‌ను కూడా వినిపించారట. కమల్ కూడా ఓకే అన్నారని సమాచారం. అలాగే కీర్తీ సురేష్‌కు కూడా కథ వినిపించారట. ఈ సీక్వెల్లో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. -
ఇన్ రాఘవన్
తమిళంలో టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోస్ వరకు అందరితో యాక్ట్ చేశారు నయనతార. ఒక్క కమల్ హాసన్‌తో తప్ప. ఇప్పుడు ఈ కాంబినేషన్ కలవబోతోందని కోలీవుడ్ టాక్. దర్శకుడు గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్లో 2006లో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో ‘రాఘవన్’గా విడుదలయింది) సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు గౌతమ్ మీనన్. ఇందులో హీరోయిన్గా అనుష్క నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నయన ఇన్ రాఘవన్ వార్త నిజమేనా? ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. -
స్ట్రయిట్ తెలుగు సినిమాలు నిర్మిస్తా
‘‘గౌతమ్ మీన¯Œl గారి సినిమాల్లో మొదట్లో రొమాన్స్ ఉంటే క్లైమాక్స్‌లో యాక్ష¯Œ ఉంటుంది. కానీ ‘తూటా’లో 70 శాతం యాక్ష¯Œ ఉంటుంది’’ అని తాతారెడ్డి అన్నారు. ధనుష్ హీరోగా గౌతమ్ మీన¯Œ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎన్నై నోకి పాయమ్ తోట’. మేఘా ఆకాష్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ‘తూటా’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి పతాకంపై జి.తాతారెడ్డి, జి.సత్యానారాయణ రెడ్డి జనవరి 1న ‘తూటా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తాతారెడ్డి మాట్లాడుతూ –‘‘ఎమ్మెస్ బయో టెక్నాలజీ చదివి సైంటిస్ట్‌గా రెండేళ్లు పని చేశాను. సినిమాలపై నాకున్న ఆసక్తితో ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘లవర్స్ డే’ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ‘తూటా’ సినిమాతో నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీ. ‘తూటా’లో కథనం ప్రకారం కుటుంబకథకు అండర్ వరల్డ్ టచ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ‘తూటా’లో మార్పులు చేశాం.. స్క్రీ¯Œ ప్లే స్పీడ్‌గా సాగుతుంది. ప్రేక్షకులకు ఇది స్ట్రయిట్ తెలుగు చిత్రంలానే అనిపిస్తుంది. స్ట్రయిట్ తెలుగు సినిమాలను నిర్మిస్తాను. ‘మీతో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది.. ఓ సినిమా చేస్తా’ అని గౌతమ్ మీన¯Œ గారు ఓ సందర్భంలో నాతో అన్నారు. మంచి కథ కుదిరితే కొత్త దర్శకులతోనూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. -
మరో థ్రిల్లర్
‘బాహుబలి’ తర్వాత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు అనుష్క. గత ఏడాది ‘భాగమతి’గా థ్రిల్ చేశారామె. ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇది కూడా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమానే. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాను (యాక్షన్ థ్రిల్లర్) సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది అని భోగట్టా. ఇందులో ఫుల్ యాక్షన్ ఉండబోతోందని టాక్. ఫైట్స్ అన్నీ అనుష్కే స్వయంగా చేయబోతున్నారట. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కావచ్చు. -
రజనీ 169 ఫిక్స్?
ఈ మధ్య కాలంలో రజనీ సినిమాలు చేస్తున్న స్పీడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం, అది పూర్తయ్యేలోపే నెక్ట్స్ సినిమాకు ముహూర్తం పెట్టడం చేస్తున్నారాయన. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేసిన ‘దర్బార్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఈలోపు దర్శకుడు శివతో ఓ సినిమా కమిట్ అయ్యారు రజనీ. అది ఆయన కెరీర్లో 168వ సినిమా. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇక రజనీ 169వ సినిమాను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్ మీనన్ చెప్పిన కథకు రజనీ ఇంప్రెస్ అయ్యారట. వేల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గణేశ్ ఈ సినిమాను నిర్మిస్తారట. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా వీౖలైనన్ని సినిమాలు చేస్తాను అని ఓ సందర్భంలో చెప్పారు రజనీ. అందుకే ఈ స్పీడ్ అయ్యుండాలి. -
నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్ కథలు
బాలీవుడ్ అగ్ర దర్శకులు జోయా అక్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్‌లతో ‘లస్ట్ స్టోరీస్’ అనే యాంథాలజీ (ఇద్దరు ముగ్గురు దర్శకులు కలసి ఒక్కో భాగానికి దర్శకత్వం వహించడం) రూపొందించింది నెట్ఫ్లిక్. తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకు రాబోతోంది. సందీప్‌రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పుడు తమిళంలోనూ నెట్ఫ్లిక్ ఓ యాంథాలజీ ప్లాన్ చేసిందని సమాచారం. దర్శకులు గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్‌లు ఈ యాంథాలజీను డైరెక్ట్ చేయనున్నారట. ఇది తమిళ వెర్షన్ ‘లస్ట్ స్టోరీస్’ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
యస్ 25
ఇండియన్ స్క్రీన్‌పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్ సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్ బాలన్, పా. రంజిత్ పాల్గొన్నారు. అందరూ ‘యస్ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్స్‌ను ధరించారు. స్పెషల్‌గా డిజైన్ చేయించిన కేక్‌ను శంకర్ కట్ చేశారు. ∙మణిరత్నం, మిస్కిన్, శంకర్ -
జోడీ కడుతున్నారు
‘కాక్క కాక్క’.. హీరో సూర్య కెరీర్ టర్నింగ్ మూవీ. తమిళ ఇండస్ట్రీలో తనకో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా తన ప్రేమను సంపాదించుకున్నారు ఈ సినిమా ద్వారా. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సూర్య–జ్యోతిక ప్రేమలో పడ్డారని అప్పట్లో కోలీవుడ్‌లో చెప్పుకునేవారు. అలా సూర్య–జ్యోతికల లైఫ్‌లో స్వీట్ మెమరీగా నిలిచిపోయే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్లాన్ ఇప్పుడు జరుగుతోందట. ఈ సీక్వెల్‌తోనే సూర్య– జ్యోతిక మళ్లీ కలసి నటించ బోతున్నారట. పెళ్లికి ముందు ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రంలో ఇద్దరూ కలసి నటించారు సూర్య, జ్యోతిక. పెళ్లయిన పన్నెండేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసుకోనుండటం విశేషం. నిర్మాత కలైపులి యస్. థాను ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించమని దర్శకుడు గౌతమ్ మీనన్‌ను సంప్రదించినట్టు సమాచారం. ‘ధృవనక్షత్రం, ఎనై నోక్కి పాయుమ్ తోట్టా’ సినిమాలతో బిజీగా ఉన్న గౌతమ్ వీటిని పూర్తి చేసిన వెంటనే ఈ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడతారట. మొదటి భాగానికి సంగీతం అందించిన హ్యారిస్ జయరాజ్నే సంగీత దర్శకుడిగా తీసుకోనున్నారట. ఈ చిత్రం ‘ఘర్షణ’ పేరుతో వెంకటేశ్, అసిన్లతో తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. -
రాజమాత టు రాష్ట్రమాత
పాత్ర ఎంత క్లిష్టంగా ఉన్నా కూడా తాను అలవోకగా చేయగలనని నిరూపిస్తూ వస్తూనే ఉన్నారు రమ్యకృష్ణ. ‘నరసింహ’లోని నీలాంబరి, ‘బాహుబలి’లో శివగామి వంటి పాత్రలు అందుకు ఉదాహరణలు. ఇప్పుడు అలాంటిదే మరో చాలెంజింగ్ పాత్రకు రెడీ అయ్యారట రమ్యకృష్ణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రను పోషించనున్నారట. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో మూడు సినిమాలు రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది మరో సినిమానా అంటే కాదు.. ఇది వెబ్ సిరీస్ అట. ‘ఘర్షణ, ఏ మాయ చేసావె’ ఫేమ్ గౌతమ్ మీనన్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారట. 30 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత జీవితానికి సంబంధించిన అన్ని ఘట్టాలను కవర్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్ (బాబీ) నిర్మించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ నిర్మాణంలో ఆయన భాగం కారని వెంకటేశ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. -
శింబు, అనుష్కలతో మల్టీస్టారర్ చిత్రం?
తమిళ సినిమా: దర్శకుడు గౌతమ్‌మీనన్ మల్టీస్టారర్ చిత్రం గురించి మరోసారి వార్తల్లో నానుతోంది. ఈ దర్శకుడు ప్రస్తుతం విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్ కథానాయకుడిగా ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు చాలా కాలం నిర్మాణంలో ఉన్నాయన్నది గమనార్హం. అదే విధంగా గోలీసోడా–2 చిత్రంలో గౌతమ్‌మీనన్ ఒక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. గౌతమ్‌మీనన్ ఇది వరకే ఒక మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖ నటులు హీరోలుగా నటిస్తారని, హీరోయిన్గా అనుష్క నటిస్తారని వెల్లడించారు. నటి అనుష్క కూడా భాగమతి చిత్ర ప్రచారం కార్యక్రమంలో తాను దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆ క్రేజీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మల్టీస్టారర్ చిత్రంలో తమిళ వెర్షన్లో హీరోగా నటుడు మాధవన్ నటించనున్నట్లు దర్శకుడు గౌతమ్‌మీనన్ ఇంతకు ముందు తెలిపారు. అయితే ఇప్పుడా పాత్రలో నటుడు శింబును నటింపజేయడానికి చర్చలు జరిపిన్నట్లు ప్రచారం. ఇక మలయాళ వెర్షన్లో టోవినో థామస్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోలుగా నటించనున్నారు. అదే విధంగా తెలుగులో ఒక ప్రముఖ నటుడి నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇకపోతే ఇందులో అనుష్క హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శింబు,గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్లో ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, అచ్చం యంబదు మడమయడా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చాయన్నది తెలిసిందే. ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
ముగ్గురు దర్శకుల గోలీసోడా– 2
తమిళసినిమా: ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు కలిస్తే అది గోలీసోడా– 2 అవుతుంది. గోలీసోడా బాలలు ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం 2015లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. దీని సృష్టికర్త విజయ్ మిల్టన్. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన మోగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఆ తరువాత విక్రమ్ హీరోగా ‘10 ఎన్డ్రత్తుకుల్’చిత్రం చేశారు. ఆ చిత్రం నిరాశపరిచినా దర్శకుడు రాజ్‌కుమార్, భరత్‌తో తెరకెక్కించిన ‘కడుగు’ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా విజయ్‌మిల్టన్ తనను దర్శకుడిని చేసిన గోలీసోడా చిత్రానికి సీక్వెల్‌గా ‘గోలీసోడా– 2’పేరుతో మరో ప్రయోగం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో దర్శకుడు సముద్రకని, గౌతమ్‌మీనన్‌లు ప్రధాన పాత్రలను పోషించడం. దర్శకుడు విజయ్మిల్టన్నే ఛాయాగ్రహణ బాధ్యతను నిర్వహించిన ఈ చిత్రాన్ని రఫ్‌నోట్ సంస్థ సమర్పణలో భరత్ సీనీ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత డ్రామాతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ‘పొండాటి’అనే పాట ఇప్పటికే విడుదలై సినీ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని చిత్ర దర్శకుడు తెలిపారు. కాగా చిత్రంలోని ఇతర పాటలను కూడా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి అచ్చురాజమణి సంగీతాన్ని అందించారు. గోలీసోడాకు సీక్వెల్ అయిన గోలీసోడా– 2 ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే ఆశాభావాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
ఈసారి బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్తా
అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’). ఈ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ రూపొందిస్తానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు గౌతమ్ మీనన్. ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్ ఆల్రెడీ 30% కంప్లీట్ చేశాను. ఫుల్‌గా కంప్లీట్ అయ్యేవరకూ అజిత్‌ని కలవకూడదనుకుంటున్నాను. ఎందుకంటే ‘ఎన్నై అరిందాల్’ షూటింగ్‌ని ఫుల్ స్క్రిప్ట్‌తో స్టార్ట్ చేయలేదు. ఈసారి మాత్రం బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే అజిత్‌ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ ‘ధృవ నచ్చత్రం, ధనుష్‌తో ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోటా’ సినిమాలు రూపొందిస్తున్నారు. -
మొదట్లో అలానే ఉండేదాన్ని
తమిళసినిమా: ముందు అనుసరించినా, తరువాత మారానని అన్నారు నటి అనుష్క. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఆమెకు ఆమే సాటి. రుద్రమదేవి, బాహుబలి, నమో వేంకటేశాయ చిత్రాలే ఇందుకు సాక్షి. ఇక అరుంధతి, భాగమతిలోనూ విశ్వరూపం చూపించారు. అలాంటిది భాగమతి తరువాత ఆమె తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించానని ఇంతకు ముందొకసారి చెప్పారు. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదుగాని, తాజాగా ఒక చిత్రంలో నటించే విషయమై కథను వింటున్నారట. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ స్వీటీ దాన్ని తగ్గించుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వపు అందాలను తెచ్చుకునే ప్రయత్నంలో కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించేది సినిమాల్లోనేననీ, నిజ జీవితంలో తనకు నచ్చినట్లు నడుచుకుంటానని చెప్పారు. సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకటిగా చూడనని చెప్పారు. నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో ఇకపై బహిరంగ కార్యక్రమాలకు కూడా మేకప్ వేసుకుని మంచి మోడరన్ దుస్తులు ధరించి వెళ్లాలని సలహాలిచ్చారన్నారు. వారి సూచనలను కొంత కాలం అనుసరించినా, ఆ తరువాత మారిపోయానని చెప్పారు. తనకు నచ్చినట్టు ఉండడం సౌకర్యంగా ఉంటుందన్నారు. చిత్రం సక్సెస్ అయితే ప్రతిభావంతులు, ఫ్లాప్ అయితే ప్రతిభ లేదని అనడం కరెక్ట్ కాదని అనుష్క పేర్కొన్నారు. -
అనుష్క తాజా చిత్రం ఖరారు
తమిళసినిమా: నటి అనుష్క తాజా చిత్రం ఎట్టకేలకు ఖరారైందన్నది తాజా సమాచారం. బాహుబలి సిరీస్, భాగమతి వంటి భారీ చిత్రాల నాయకి అనుష్క చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఆమె చివరి చిత్రం భాగమతి విడుదలై రెండు నెలలు దాటినా తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో ఒక్క చిత్రం కూడా లేకపోవడంతో అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నారని, అందుకే కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మధ్య భాగమతి చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చిన అనుష్క తాను దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రం మాత్రమే అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ దర్శకుడి చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. గౌతమ్‌మీనన్ ఇంతకు ముందు మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు అనుష్కతో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇదీ భాగమతి తరహాలో వైవిధ్య కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్ హీరోగా ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించే చిత్రం పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అనుష్క ఇంతకు ముందు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్‌కు జంటగా ఎన్నై అరిందాల్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
స్వీటీకో చాన్స్!
తమిళసినిమా: అందాల అపరంజి బొమ్మ నటి అనుష్క. అందుకే నచ్చిన వాళ్లు ముద్దుగా ఆమెను స్వీటీ అని పిలుస్తుంటారు. అలాంటి బ్యూటీ తెరపై కనిపించి చాలా నెలలే అయ్యింది. బాహుబలి–2 వంటి సంచలన చిత్రం తరువాత ఇంత కాలం అయినా అనుష్కను స్క్రీన్‌పై చూడకపోతే ఆమె అభిమానులు నిరుత్సాహపడడం సహజమే. అలాంటి వారందరికీ తీపి కబురేమిటంటే అనుష్క తాజా చిత్రానికి కమిట్ అయ్యిందన్నది. ఎస్.కోలీవుడ్‌లో ఈ వార్త వైరల్ అవుతోంది. అనుష్క ప్రస్తుతం భాగమతి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ద్విభాషా (తెలుగు,తమిళం) చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో భాగమతిని తెరపై చూడవచ్చు. అనుష్క తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చేసే చిత్రం అని వస్తోంది. దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్‌తో ఎన్నై నోకి పాయుం తోట్టా చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. వీటిలో ధ్రువనక్షత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ఆయన తాజా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు, అందులో అనుష్క కథానాయకిగా నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రెండు ప్రేమ సీన్స్, నాలుగు డ్యూయెట్ల పాత్రలో నటించేది లేదని కరాఖండీగా చెప్పేస్తున్న అనుష్క గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించనుందట. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్‌తో కలిసి ఎన్నై అరిందాల్ చిత్రంలో నటిం చిందన్నది గమనార్హం. తాజా చిత్రంతో రెండోసారి నటించడానికి రెడీ అవుతోందన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
మరోసారి జెస్సీ తరహా పాత్రలో త్రిష
నటి త్రిష సినీ జీవితంలో జెస్సీ పాత్ర మరువలేనిది.షిపుడు మళ్లీ అదే తరహా పాత్రలో మళయాళంలో మెరవనున్నారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శింబుకు జంటగా విన్నైతాండి వరువాయా చిత్రంలో త్రిష నటించిన పాత్ర పేరు జెస్సీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకుంటే ఆ చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా త్రిష కెరీర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటివరకూ కమర్షియల్ నాయకిగా గ్లామర్ పాత్రలకు పరిమితమైన త్రిష జెస్సీ పాత్రలో తన అభినయంతో మంచి బలమైన పాత్రలను చేయగలనని నిరూపించుకున్నారు. మంచి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కిన విన్నైతాండి వరువాయా చిత్రం విడుదల తరువాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జెస్సీ అని పేరు పెట్టుకున్నారంటే ఆ పాత్ర ప్రభావం వారిపై ఎంతగా చూపిందో అర్ధం చేసుకోవచ్చు. చాలాకాలం తరువాత త్రిష మళ్లీ జెస్సీగా మారుతున్నారట. అయితే ఈ సారి తను మలయాళ చిత్రం ద్వారా అలాంటి పాత్రలో కనిపించనున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు తొలిసారిగా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో నవీన్ పౌలీకి జంటగా నటిస్తున్నారు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేజూడే అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో త్రిష జెస్సీ తరహా పాత్రలో మరోసారి క్రిస్టియన్ అమ్మాయిగా నటిస్తున్నారట. ఈ చిత్రం తన కేరీర్‌ను మరో మలుపు తిప్పుతుందనే ఆశాభావంతో ఉన్నారామె. కాగా, ప్రస్తుతం త్రిష తమిళంలో నటించిన చతురంగవేట్టై-2 చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా గర్జన, మోహిని, 96 అంటూ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. -
చైతూ సినిమాకు రిలీజ్ కష్టాలు
చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న అక్కినేని నాగచైతన్య మూవీ సాహసం శ్వాసగా సాగిపో. చైతూకి ఏం మాయ చేశావే లాంటి బిగ్ హిట్ అందించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. అయితే తమిళంలో హీరోగా నటిస్తున్న శింబు కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ అక్కినేని హీరోకి కష్టాలు తీరేలా లేవు. అదే నెలలో రెండు భారీ చిత్రాల రిలీజ్ ఉండటంతో రిలీజ్‌కు సరైన డేట్ కోసం ఆలోచనలో పడ్డారు. ముందుగా సినిమాను జూలై మొదటివారంలో రిలీజ్ చేయాలని భావించినా, అదే సమయంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ అవుతుండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. రజనీ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులో, ఓవర్సీస్లో కూడా భారీ ఎఫెక్ట్ ఉంటుందని సాహసం శ్వాసగా సాగిపో సినిమాను జూలై నెలాఖరున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కాని అదే సమయంలో చైతూ మామయ్య వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో మరోసారి నాగచైతన్య సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
నాగచైతన్య సాహసం...
శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా చెన్నైలో షూటింగ్ జరుపుకొన్న గౌతమ్ మీనన్, నాగ చైతన్య బృందం నిద్రయినా పోలేదు. శనివారం ఉదయాన్నే ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చేసింది. దానికి చాలా కారణాలున్నాయి. శనివారం నాగార్జున పుట్టినరోజు... ఆ అకేషన్‌కి గౌతమ్- నాగ చైతన్యల కొత్త సినిమా టైటిల్ ప్రకటించాలి. అలాగే, ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయాలి. నిద్ర లేకుండా ప్రయాణం చేసి వచ్చినా, గౌతమ్ యూనిట్లో ఉత్సాహం తగ్గలేదు. శనివారం సాయంత్రం... హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో పత్రికలవారి ముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ టైటిల్ ప్రకటిస్తున్న సమయంలో వాళ్ళ ముఖంలో అలసట కన్నా ఆనందం కనిపించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో, ‘ద్వారకా క్రియేషన్స్’ పతాకంపై నిర్మాత ఎం. రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. హీరో నాగచైతన్య, మంజిమ హీరో హీరోయిన్లయిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు విడుదల చేశారు. ఒక సినిమా... రెండు షేడ్స్... హిట్ కాంబినేషన్! హీరో నాగచైతన్య స్పందిస్తూ, ‘‘స్కూల్, కాలేజీల్లో చదువుతున్న టైమ్‌లో గౌతమ్ సినిమాలు చూసి పెరిగా. ఆయన దర్శకత్వంలో 2009లో ‘ఏం మాయ చేశావె’ చేయడంతో నా కల ఫలించినట్లయింది. ఇప్పుడు మళ్ళీ ఆయనతో మంచి లవ్‌స్టోరీ విత్ యాక్షన్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘లవ్స్టోరీల ద్వారా గౌతమ్ నాకు ఒక దిశ చూపించారు. ఇప్పుడీ ‘సాహసం శ్వాసగా సాగిపో’లో ఫస్టాఫ్ ‘ఏం మాయ చేశావె’ ఫీల్‌లో ఉంటుంది. సెకండాఫ్ యాక్షన్ ఫక్కీలో నడుస్తుంది. నటుడిగా ఒకే సినిమాలో రెండు కోణాలూ దొరకడం నా అదృష్టం. ఈ సినిమాతో నాకు మళ్ళీ కొత్త దోవ దొరుకుతుంది’’ అని నాగచైతన్య అన్నారు. హీరోయిన్ను చూపించని... టీజర్ ఇదే కథను ఏకకాలంలో తమిళంలో శింబు హీరోగా రూపొందిస్తున్న గౌతమ్ మీనన్ మాట్లాడుతూ, ‘‘ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయింది’’ అని చెప్పారు. ఏ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే 4 పాటల చిత్రీకరణ పూర్తయింది. ‘‘హీరోయిన్ మంజిమ పోషిస్తున్న లీల పాత్ర బాగుంటుంది. కావాలనే ఈ టీజర్లో ఆమె లుక్స్ చూపించడం లేదు’’ అని గౌతమ్ వివరించారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ, ‘‘ఒక కొత్త యాంగిల్ ట్రై చేశాం. రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా, ఫార్ములా సినిమాలంటూ మా మీద విమర్శలొస్తుంటాయి. ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుంది’’ అని నమ్మకంగా చెప్పారు. అన్నట్లు, ఈ సినిమాలో చాలా సీన్లు గౌతమ్ నిజజీవితంలో జరిగిన వేనట! కోన వెంకటే ఆ మాట చెప్పారు. నిర్మాత ఎం.రవీందర్ రెడ్డి, సహ నిర్మాతలు రేష్మా ఘటాల, వెంకీ, సినిమాటోగ్రాఫర్ డాన్ మెక్ ఆర్థర్, సునీత తాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణ కొనసాగించడం కోసం కార్యక్రమం అవుతూనే రాత్రి ఫ్లైట్‌కు యూనిట్ సభ్యులు చెన్నై తిరుగుముఖం పట్టారు. ‘‘టీజర్ తర్వాత, నేననుకున్న కథ మొత్తం తెరపై ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకూ అనిపిస్తోంది’’ అని ప్రెస్‌మీట్ నుంచి ఉత్సాహంగా చెన్నైకి బయలుదేరుతూ గౌతమ్ నవ్వేశారు.