తమిళసినిమా: అందాల అపరంజి బొమ్మ నటి అనుష్క. అందుకే నచ్చిన వాళ్లు ముద్దుగా ఆమెను స్వీటీ అని పిలుస్తుంటారు. అలాంటి బ్యూటీ తెరపై కనిపించి చాలా నెలలే అయ్యింది. బాహుబలి–2 వంటి సంచలన చిత్రం తరువాత ఇంత కాలం అయినా అనుష్కను స్క్రీన్‌పై చూడకపోతే ఆమె అభిమానులు నిరుత్సాహపడడం సహజమే. అలాంటి వారందరికీ తీపి కబురేమిటంటే అనుష్క తాజా చిత్రానికి కమిట్ అయ్యిందన్నది. ఎస్.కోలీవుడ్‌లో ఈ వార్త వైరల్ అవుతోంది. అనుష్క ప్రస్తుతం భాగమతి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ద్విభాషా (తెలుగు,తమిళం) చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో భాగమతిని తెరపై చూడవచ్చు. అనుష్క తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చేసే చిత్రం అని వస్తోంది.
దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్‌తో ఎన్నై నోకి పాయుం తోట్టా చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. వీటిలో ధ్రువనక్షత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ఆయన తాజా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు, అందులో అనుష్క కథానాయకిగా నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రెండు ప్రేమ సీన్స్, నాలుగు డ్యూయెట్ల పాత్రలో నటించేది లేదని కరాఖండీగా చెప్పేస్తున్న అనుష్క గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించనుందట. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్‌తో కలిసి ఎన్నై అరిందాల్ చిత్రంలో నటిం చిందన్నది గమనార్హం. తాజా చిత్రంతో రెండోసారి నటించడానికి రెడీ అవుతోందన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment