అనుష్క 'ఘాటి' ఊచకోత.. రిలీజ్‌పై క్రిష్‌ ప్రకటన | Anushka Shetty Ghaati Movie Release Date Announcement | Sakshi
Sakshi News home page

అనుష్క 'ఘాటి' ఊచకోత.. రిలీజ్‌పై క్రిష్‌ ప్రకటన

Published Sun, Dec 15 2024 1:00 PM | Last Updated on Sun, Dec 15 2024 1:21 PM

Anushka Shetty Ghaati Movie Release Date Announcement

టాలీవుడ్‌ క్వీన్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  సినిమా ‘ఘాటి’. ఇప్పటికే షూటింగ్‌ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్‌ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు.

'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' తర్వాత అనుష్క నటిస్తున్న ఈ 'ఘాటి' చిత్రానికి చింతకింది శ్రీనివాస్‌రావు, క్రిష్‌, బుర్రా సాయిమాధవ్‌ రచన చేశారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీకారం ప్రధానంగా సాగుతుంది. ఏప్రిల్‌ 18న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా మేకర్స్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement