Krrish
-
అనుష్క 'ఘాటి' ఊచకోత.. రిలీజ్‌పై క్రిష్ ప్రకటన
టాలీవుడ్ క్వీన్ హీరోయిన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఘాటి’. ఇప్పటికే షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తర్వాత అనుష్క నటిస్తున్న ఈ 'ఘాటి' చిత్రానికి చింతకింది శ్రీనివాస్‌రావు, క్రిష్, బుర్రా సాయిమాధవ్ రచన చేశారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీకారం ప్రధానంగా సాగుతుంది. ఏప్రిల్ 18న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. -
ప్రతీకారం!
హీరోయిన్ అనుష్కా శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమాకు ‘ఘాటి’ అనే టైటిల్ ఖరారైంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. వ్యాపార రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని ఎలా నష్టపరిచారు? ఆ తర్వాత ఆమె ఏ విధంగా వారిపై ప్రతీకారం తీర్చుకుంది? అనే కోణంలో ‘ఘాటి’ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. -
స్వీటీ అనుష్క.. మళ్లీ అలాంటి సినిమాలోనే?
‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి ఉమెన్ సెంట్రిక్ హిట్స్‌తో ఈ జానర్ చిత్రాలకు ఓ స్పెషలిస్ట్‌గా మారిపోయారు అనుష్కా శెట్టి. తాజాగా ఆమె మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దర్శకుడు క్రిష్ ఇటీవల ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ స్టోరీని డెవలప్ చేశారని, ఈ కథలో అనుష్క అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారనీ టాక్. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ (2010) సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. పద్నాలుగేళ్లకు క్రిష్–అనుష్క కాంబో కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే. -
ఈ కథలో...
హోమానంద్, రేవంత్ హీరోలుగా, సిమ్రాన్ పరింజా హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈ కథలో నేను’. ఎమ్మెస్ ఫణిరాజ్ దర్శకత్వంలో ఎం. అచ్చిబాబు సమర్పణలో టి. కేశవ తీర్థ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నేటి ట్రెండ్‌కి, ఇప్పటి యూత్‌కి సరిపోయేలా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ఎమ్మెస్ ఫణిరాజ్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ లస్ట్ నేపథ్యంలో రూ΄పొందిన చిత్రమిది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునే అదృష్టం మా సినిమాకి, నాకు దక్కింది. ఆయన తనయుడు యోగి శ్రీ మంచి సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఫణిగారు ఓ మంచి చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అచ్చిబాబు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్ భట్ జోషి. -
రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ బ్రేకప్ సాంగ్ విన్నారా?
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సాథియా’. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్ కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం బృందం పేర్కొంది. -
ఆక్షన్ హీరో
స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్.. వీళ్లంతా సూపర్ హీరోలు. కానీ హాలీవుడ్ సూపర్ హీరోలు. మన ఇండియన్ సూపర్ హీరో అంటే మనకు గుర్తొచ్చేది ‘క్రిష్’. హృతిక్ రోషన్ బ్లాక్ జాకెట్, బ్లాక్ మాస్క్ వేసుకొని చేసిన సాహసాలు, యాక్షన్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేశారు. సూపర్ హీరో ‘క్రిష్’ సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘క్రిష్’ సిరీస్‌లో మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. నాలుగో సినిమా కూడా త్వరలో రానుంది. ఇప్పుడీ యాక్షన్ హీరోను.. ఆక్షన్ హీరో చేశారు. ‘క్రిష్’ సినిమాలో హృతిక్ ధరించిన బ్లాక్ జాకెట్‌ను ఇప్పుడు ఆక్షన్ (వేలానికి) పెట్టారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ‘సాల్ట్ స్కౌట్’ అనే సంస్థ ద్వారా సెలబ్రిటీలు సినిమాల్లో వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను వేలం వేసి వచ్చిన డబ్బును చారిటీకి ఉపయోగించనున్నారు. అందులో భాగంగా ‘క్రిష్’ సినిమాలో హృతిక్ ధరించిన బ్లాక్ కోట్‌ను వేలంలో ఉంచారు. -
క్రిష్ 4@ 2020 క్రిస్మస్
క్రిష్ అనగానే అందరూ టకీమని చెప్పే పేరు హృతిక్ రోషన్. క్రిష్ పాత్రలో అంతగా ఆయన ఒదిగిపోయారు. బుధవారం ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ ఫ్రాంచైజీ అభిమానులందరికీ ఓ తీపి కబురు అందించారు. అదేంటో తెలుసా? ‘క్రిష్ 4’ రిలీజ్ అప్డేట్. ఇప్పటివరకు వచ్చిన క్రిష్ సినిమాలన్నింటికీ రాకేష్ రోషన్‌నే దర్శకుడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘‘క్రిష్ 4 రిలీజ్‌ను ఎనౌన్స్ చేయడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదేమో. 2020 క్రిస్మస్కు ‘క్రిష్ 4’ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. హృతిక్ ఫ్యాన్స్ అందరికీ నా గిఫ్ట్ ఇది. హ్యాపీ బర్త్‌డే హృతిక్’’ అని పేర్కొన్నారు రాకేష్ రోషన్. -
ఈ కథ చెప్పడం నా ధర్మం
‘‘మహాకవి దాశరథి ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కనరాని భాస్కరులెందరో’ అన్నారు. అలాగే, ప్రపంచపటంలో మన దేశానికి ఓ గౌరవాన్ని ఇచ్చిన, పురిటినొప్పుల ఈ పుడమిగర్భంలో కానరాని ఒక భాస్కరుని వీరగాధ ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఓ తెలుగు బిడ్డగా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జెండాని ఎగురవేసిన నందమూరి తారకరామారావు వారసుడిగా ఈ కథను చెప్పడం నా ధర్మంగా భావించాను’’ అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత, ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘వందో సినిమా ఏది చేయాలా? అని చాలా కథలు విన్నా. కొన్ని నచ్చలేదు. మరికొన్ని నేను అనుకున్న స్థాయికి రాలేదని సతమతమవుతున్న సమయంలో క్రిష్ ఈ కథ చెప్పారు. ప్రతి రెండు సినిమాల మధ్య వ్యత్యాసం చూపించాలని, కొత్తదనం అందించాలని ఉవ్విళ్లూరే వ్యక్తి క్రిష్. అంతకు ముందు మాకు పరిచయం లేదు. యాదృచ్ఛికమో... కాకతాళీయమో... ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. దురదృష్టం ఏంటంటే... శాతకర్ణి చరిత్ర మన దగ్గర తక్కువ ఉంది. వాళ్ల అమ్మగారు గౌతమి శాసనాలపై చెక్కించారు. అవి కాశీలో ఉన్నాయి. ఈ పాత్ర లభించడం నా పూర్వజన్మ సుకృతం. నేనూ ట్రైలర్‌ను చూడడం ఇదే మొదటిసారి. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగేది కాదు. ఇంతకాలం నా నుంచి ఏమీ ఆశించకుండా మీరు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష. అటువంటి అభిమానుల మధ్యలో ట్రైలర్ చూడాలనుకున్నా’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ – ‘‘వందో చిత్రాన్ని మా యూనిట్ చేతిలో బాలకృష్ణగారు ఎందుకు పెట్టారో ఈ ట్రైలర్ మీకు (ప్రేక్షకులకు) చూపించిందని ఆశిస్తున్నా’’ అన్నారు. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘నేను మాటలు రాస్తున్నది ఓ సినిమాకి కాదు, ఒకేసారి వంద సినిమాలకు... అని ప్రతిక్షణం మనసులో అనుకునేవాణ్ణి. నేను ఎన్టీఆర్ భక్తుణ్ణి. ఆయనకు రాసే అవకాశం రాదు. నేను రాసిన డైలాగులు బాలకృష్ణగారు చెప్తుంటే నాకు రామారావుగారు గుర్తొచ్చారు’’ అన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
స్వప్న లేటెస్ట్ స్టిల్స్
క్రిష్, స్వప్న నూతననటీనటులుగా పరిచయం చేస్తూ.. ఎస్. నాగరాజన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం " ఇదే చారుతో డేటింగ్". ఈ చిత్రానికి డేటింగ్ ఈజ్ ఎ కల్చరల్ వైరస్ అనేది ఉపశీర్షిక. నిర్మాతగా జి. చెల్లదురై వ్యవహరిస్తున్నారు. -
సీక్వెల్స్ లో హృతిక్ టాప్