‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి ఉమెన్ సెంట్రిక్ హిట్స్‌తో ఈ జానర్ చిత్రాలకు ఓ స్పెషలిస్ట్‌గా మారిపోయారు అనుష్కా శెట్టి. తాజాగా ఆమె మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
దర్శకుడు క్రిష్ ఇటీవల ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ స్టోరీని డెవలప్ చేశారని, ఈ కథలో అనుష్క అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారనీ టాక్. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ (2010) సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. పద్నాలుగేళ్లకు క్రిష్–అనుష్క కాంబో కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment