ఈ కథలో... | ee kathalo nenu movie trailer launch by director krish | Sakshi
Sakshi News home page

ఈ కథలో...

Published Mon, Dec 11 2023 4:16 AM | Last Updated on Mon, Dec 11 2023 4:16 AM

ee kathalo nenu movie trailer launch by director krish - Sakshi

హోమానంద్, రేవంత్‌ హీరోలుగా, సిమ్రాన్‌ పరింజా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఈ కథలో నేను’. ఎమ్మెస్‌ ఫణిరాజ్‌ దర్శకత్వంలో ఎం. అచ్చిబాబు సమర్పణలో టి. కేశవ తీర్థ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్‌ క్రిష్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నేటి ట్రెండ్‌కి, ఇప్పటి యూత్‌కి సరిపోయేలా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

ఎమ్మెస్‌ ఫణిరాజ్‌ మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ లస్ట్‌ నేపథ్యంలో రూ΄పొందిన చిత్రమిది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునే అదృష్టం మా సినిమాకి, నాకు దక్కింది. ఆయన తనయుడు యోగి శ్రీ మంచి సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఫణిగారు ఓ మంచి చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అచ్చిబాబు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌ భట్‌ జోషి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement