సంక్రాంతికి ముందే బుల్లెట్ల పండుగ.. ట్రైలర్‌ వచ్చేసింది! | Ravi Teja Latest Movie EAGLE Trailer Released Today, Watch Video Inside - Sakshi
Sakshi News home page

EAGLE Movie Trailer: 'ఈ దేవుడు మంచోడు కాదు..' మాస్ ట్రైలర్ వచ్చేసింది!

Published Wed, Dec 20 2023 4:40 PM | Last Updated on Thu, Dec 21 2023 12:13 PM

Raviteja latest Movie EAGLE Trailer Released Today - Sakshi

మాస్ మహరాజా రవితేజ  హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్‌'. భారీ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  తాజాగా ఈగల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

ఇప్పటికే ఈగల్ టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో 'విశ్వం తిరుగుతాను.. ఊపిరి అవుతాను..కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను' అనే రవితేజ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ట్రైలర్ ‍చూస్తే మాఫియా నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సంక్రాంతికి బుల్లెట్ల పండుగ రావడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు' అనే మాస్ మాహారాజా డైలాగ్‌ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల  కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement