trailer lanch
-
Bachhala Malli trailer: అల్లరి నరేశ్ ఊరమాస్ ‘బచ్చల మల్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'హరి కథ: సంభవామి యుగే యుగే' ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
ఊరు పేరు భైరవకోన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మీడియాతో ప్రశ్నోత్తరాలు
-
కొత్త ప్రపంచాన్ని సృష్టించారు
‘‘సర్కారు నౌకరి’ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ మూవీ ద్వారా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భావన హీరోయి¯Œ . ఆర్కే టెలీషోపై కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లను హీరోలుగా పరిచయం చేశాను.. వారంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ‘సర్కారు నౌకరి’ తో పరిచయమవుతున్న ఆకాష్ కూడా వారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఆకాష్ ΄ాడగలిగినా నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో హీరోగా పరిచయవుతున్నాడు’’ అన్నారు సునీత. ‘‘నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు గంగనమోని శేఖర్. ‘‘నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాష్. -
సంక్రాంతికి ముందే బుల్లెట్ల పండుగ.. ట్రైలర్ వచ్చేసింది!
మాస్ మహరాజా రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈగల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈగల్ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ట్రైలర్లో 'విశ్వం తిరుగుతాను.. ఊపిరి అవుతాను..కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను' అనే రవితేజ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. ట్రైలర్ చూస్తే మాఫియా నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సంక్రాంతికి బుల్లెట్ల పండుగ రావడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు' అనే మాస్ మాహారాజా డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. Breaking the myths this Sankranthi!#EAGLETrailer out now :) - https://t.co/ZSe6qyHxon See you all at the cinemas on JAN 13th with #EAGLE 🔥#EAGLEonJan13th pic.twitter.com/3mnQjG7nwl — Ravi Teja (@RaviTeja_offl) December 20, 2023 -
పక్కా మాస్
‘‘ఆదికేశవ’ సినిమా ట్రైలర్‌కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్లానే సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని హీరో వైష్ణవ్ తేజ్ అన్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఆదికేశవ’ పక్కా మాస్ చిత్రం. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్.. ఇలా అన్నీ బాగుంటాయి. గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్ మాస్ మూవీ ‘ఆదికేశవ’’ అన్నారు. -
అన్వేషి విజువల్స్ బాగున్నాయి
‘‘అన్వేషి’ ట్రైలర్, విజువల్స్ చాలా బాగున్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అని నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్వేషి’. టి.గణపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు రెండో వారంలో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. గణపతి రెడ్డి పుట్టినరోజు(సోమవారం) సందర్భంగా ‘అన్వేషి’ మూవీ ట్రైలర్‌ను వరలక్ష్మి విడుదల చేశారు. టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా ‘అన్వేషి’ నా తొలి చిత్రం. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వీజే ఖన్నా, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, సహ నిర్మాతలు హరీష్ రాజు, శివన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ మాట్లాడారు. -
ఫ్యామిలీ డ్రామా
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రఘుపతి రెడ్డి గుండా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోదర సోదరీమణులారా...’. 9 ఈఎమ్ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ పతాకాలపై విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ‘కాలకేయ’ ప్రభాకర్, పృథ్వీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నేపథ్య సంగీతం: వర్ధన్, కెమెరా: మోహన్ చారి. -
కన్నడ హిట్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
ప్రజ్వల్ బీపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21న రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్‌ను ‘బేబీ’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘కన్నడంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఫన్ అండ్ ఎనర్జిటిక్‌గా అనిపించి, తెలుగులో విడుదల చేయాలని భావించాం’’ అన్నారు సుప్రియ. ‘‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫిల్మ్’’ అన్నారు నిర్మాతలు శరత్, అనురాగ్. -
Krishna Gadu Ante Oka Range: ‘కృష్ణగాడు’ ప్రేమను గెలిచాడా?
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, సినిమా పెద్ద హిట్టవ్వాలన్నారు. ట్రైలర్ చూస్తుంటే ఓ వైపు యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. ‘‘కృష్ణ అనే కుర్రాడి లైఫ్‌లోకి ఓ అమ్మాయి వచ్చాక, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కేజీఎఫ్‌లో బానిసల్లా చూస్తాడు!
‘‘బాక్సాఫీస్ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘సామజ వరగమన’ సినిమా ట్రైలర్. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహభోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే.. కేజీఎఫ్‌లో బానిసల్లా చూస్తాడు’ (వీకే నరేశ్), ‘ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చే పని చేశావా.. చెత్త నుంచి కూడా కరెంట్ తీస్తున్నారు’ (శ్రీ విష్ణు) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్ లైఫ్‌స్టైల్ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ’’ అనిచిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 1920
‘‘నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయం. కానీ ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమా చూడాలనిపిస్తోంది. చూడాలని పించేలా ఈ సినిమాను చేశారు’’ అన్నారు నాగార్జున. అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’. దర్శక–నిర్మాత మహేశ్‌భట్ రచన, సమర్పణలో కృష్ణాభట్ దర్శకత్వంలో రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్ డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘మహేశ్భట్గారు చాలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ‘తెలుసా మనసా’ (‘క్రిమినల్’) పాటను ఆయన చేయించుకున్న విధానం నాకిప్పటికీ గుర్తు ఉంది. ఇక ‘1920’ ట్రైలర్ బాగుంది. ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అవికా కెరీర్లో ఈ సినిమా పెద్దహిట్‌గా నిలవాలి. అలాగే ఇవాళ ఒక పెద్ద సినిమా ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అందరినీ మళ్లీ థియేటర్లోకి తీసుకు రావాలి.. జై శ్రీరామ్’’ అన్నారు నాగార్జున. ‘‘నాగార్జునగారి వల్లే ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ను తెలుగులో విడుదల చేస్తున్నాం. వాళ్ల నాన్నగారి విలువలు, సంస్కారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు నాగార్జున. విలువలు, సంస్కారం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘1920’ సినిమా కథ ఈ అంశాల గురించే’’ అన్నారు మహేశ్‌భట్. ‘‘నా తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ నుంచి నాగార్జునగారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలో నా తొలి చిత్రం ‘1920’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. ‘1920’ నా కెరీర్లో స్పెషల్ మూవీ’’ అన్నారు అవికా గోర్. ‘‘ఇదొక ఎమోషనల్ లవ్‌స్టోరీ. హారర్‌లో ఎమోషన్ ను ప్రయత్నించడం ఇదే తొలిసారి’’ అన్నారు కృష్ణాభట్. -
Malli Pelli : ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సార్ మూవీ ట్రైలర్ అవుట్.. కేక పెట్టించేలా ధనుష్ డైలాగ్స్
తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘వాతి’. తెలుగులో సార్ అనే పేరును నిర్ణయించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్ ఐకాన్’ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా సార్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ను కేక పెట్టించేలా ఉన్నాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ‘చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు.. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ల కోసం ఉంటారన్న నమ్మకం వాళ్లకి కుదరడం లేదు..’ అంటూ ధనుష్ చెప్పే డైలాగ్ అందరిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. డబ్బు, చదువు ఇంపార్టెన్స్ చెప్పే కోణంలోనే ఈ సార్ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్ఎస్లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని క్లిమ్ చెబుతున్నారు! -
యువతరం ఆలోచనలతో...
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మది’. రామ్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు సుమన్, నటి ఆమని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ ధనుష్ మాటాడుతూ– ‘‘యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా వినూత్నరీతిలో ఈ కథ సాగుతుంది’’ అన్నారు. ‘‘నటుడు కావాలని వచ్చిన నేను.. నా ఫ్రెండ్ బాధ చూడలేక ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’ అన్నారు రామ్ కిషన్. ‘‘ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది’’ అన్నారు శ్రీరామ్. కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, దర్శకుడు జై శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ ఠాగూర్, సంగీతం: పీవీఆర్.రాజా. -
స్టైలిష్ లుక్స్ లో ప్రభాస్
-
'నీతో' థియేట్రికల్ ట్రైలర్.. విడుదల చేసిన సీతారామం డైరెక్టర్
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నీతో'. ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృథ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇటీవల సక్సెస్ అయిన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తు రాదు" లాంటి డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా.. సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 30వ థియేటర్లలో సందడి చేయనుంది. -
పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’
‘‘ఫలానా స్క్రిప్ట్‌ను ఎంచుకుంటే అది జరుగుతుందేమో! ఫలానా స్క్రిప్ట్‌ను ఎంచుకోకపోతే మరొకటి జరుగుతుందేమో అని హైరానా పడను. జరిగేదే జరుగుతుందనుకుని నా గట్ ఫీలింగ్‌తో స్క్రిప్ట్స్ ఎంచుకుంటాను’’ అన్నారు రష్మికా మందన్నా. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటింన హిందీ చిత్రం ‘గుడ్ బై’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివ అక్టోబరు 7న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. హిందీలో రష్మికా మందన్నాకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న రష్మికా మందన్నాను ‘మీరు ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘‘నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ నేను చాలా పాజిటివ్ పర్సన్‌ని. మనందరం నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలని, ప్రపంచం అంతా పాజిటివ్‌నెస్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకువర్ దర్శకత్వంలో రపొందిన ‘పుష్ప: ది రైజ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినివ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నెక్ట్స్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా రెండో భాగం చిత్రీకరణ ఆరంభం కాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్లో మరో రెండు రోజుల్లో జాయిన్ అవుతున్నట్లుగా రష్మిక అప్డేట్ ఇచ్చారు. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ -
లావణ్యా త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
Nenjuku Needhi: ఈ చిత్రానికి టైటిల్ మా తాత ఇచ్చారు:ఉదయనిధి స్టాలిన్
తమిళసినిమా: నెంజుక్కు నీతి చిత్ర టైటిల్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశామని నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. నటి శివాని రాజశేఖర్, తాన్య రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రొజెక్ట్స్ సంస్థలతో కలిసి రెమో పిక్చర్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌రాజ్ కామ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. దీపునీనన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సోమవారం సాయంత్రం నిర్వహించిన చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన తాత కరుణానిధికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రం టైటిల్ ఆయన ఇచ్చిందేనని పేర్కొన్నారు. నిర్మాత బోనీ కపూర్ ఫోన్ చేసి ఆర్టికల్ 15 హిందీ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేద్దామని చెప్పగా దర్శకత్వం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. అలాంటి సమయంలో ‘కణా’ చిత్రాన్ని చూసి అరుణ్‌రాజ్ కామరాజును పిలిపించగా ఆయన వెంటనే చేద్దామని చెప్పారన్నారు. నెంజుక్కు నీతి టైటిల్ గురించి తన తండ్రి స్టాలిన్‌కు చెప్పగా జాగ్రత్తగా చేయండని అన్నారన్నారు. -
‘కెజిఎఫ్-2’ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఆర్జే కాజల్‌కి అదిరిపోయే పంచ్ వేసిన వరుణ్ సందేశ్
Varun Sandesh Hilarious Punch to RJ Kajal: తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా చేసిన సినిమా సకలగుణాభిరామ. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కి శ్రీరామచంద్ర, వరుణ్‌తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్ హోస్ట్‌గా నిర్వహించింది. కాగా సన్నీతో అనుబంధం గురించి హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతతూ.. సన్నీ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని, బిగ్‌బాస్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడని అభినందించాడు. సకలగుణాభిరామ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన స్పీచ్‌ని ముగించాడు. అయితే వరుణ్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న కాజల్.. నీ ఇందువదన సినిమాకి ఆల్ ది బెస్ట్ అని పేర్కొనగా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంటూ వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడుకున్న వారంతా కౌజల్ తప్పులో కాలేసిందంటూ తెగ నవ్వుకున్నారు. -
‘రౌడీ బాయ్స్’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలు థియేటర్ల బాట పడుతున్నాయి. అలాంటి సినిమాల్లో 'రౌడీ బాయ్స్' ఒకటి. ఈ సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. దిల్ రాజు - శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి హర్ష కానుగంటి దర్శకత్వం వహించాడు. కొంతకాలం క్రితమే పూర్తయిన ఈ సినిమా సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తోంది. చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక ఈ నేపథ్యంలో సంక్రాంతి బరి నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో, చిన్న సినిమాలకి అవకాశం దొరికింది. అలా 'రౌడీ బాయ్స్' కూడా బరిలోకి దిగాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హజరై ట్రైలర్ రిలీజ్ చేయించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆశిష్ జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ -
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమా
దేవరాజ్, సోనాక్షీ వర్మ జంటగా మదుగోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్ సత్యం’. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దేవరాజ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ–‘‘దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘మా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు’’ అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్. ‘‘ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ’’ అన్నారు మధు గోపు. -
శీల రక్షణ కోసం రంగంలోకి సంపూ.. ఇప్పుడంతా క్యాలీఫ్లవర్ గురించే చర్చ
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్యాలీఫ్లవర్’ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించే చర్చ. ‘అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్’ వీడెవడే ఒక్కరోజులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు’అనే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇక సంపూ చెప్పే డైలాగ్స్ అయితే నవ్వులు పూయిస్తున్నాయి. ‘ఈ ఊర్లో పుట్టిన మనిషితో పాటు జంతువుకు అందరికీ ఒక్కటే భర్త, ఒక్కటే భార్య ఇదే ఈ క్యాలీఫ్లవర్ రూల్’అని సంపూ అంటుండగా.. అక్కడే ఉన్న ఓ గేదె ‘ఏం కర్మరా బాబు.. నాక్కుడా ఒక్కడే మొగుడు అట’అని చెప్పడం ఫన్నీగా ఉంది. మొత్తంగా ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా.. క్యాలీఫ్లవర్ అంటూ సంపూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. -
డేగల బాబ్జీ: ట్రైలర్ మొత్తం బండ్ల గణేష్ ఒక్కడే
Bandla Ganeshs Degala Babji Trailer Out: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటించిన సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్‌ను పరిచయం చేశారు. సినిమాలో బండ్ల గణేష్ పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉండటం గమనార్హం.'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను' అంటూ బండ్ల చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ
Allu Arjun And Vijay Devarakonda About Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సంతాపం వ్యక్తం చేశారు. పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన మా ఇంటికి వచ్చేవారు. కలిసి భోజనం చేసేవాళ్లం. నేను బెంగళూరుకు వెళ్లినప్పుడు కలిసేవాళ్లం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం. ఓ డ్యాన్స్ కార్యక్రమానికి ఇద్దరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన లేరనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యాను. పునీత్ గొప్ప వ్యక్తి అని, ఆయన చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..కొన్నాళ్ల క్రితం ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లి తనతో రెండు, మూడు గంటలు మాట్లాడాను. ఆయన అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కలిచివేసింది. ఏదో ఒకరోజు ఈ లోకం నుంచి మనం వెళ్లిపోతాం. ఉన్నంతకాలం కలిసి పనిచేద్దాం. సంతోషంగా ఉందాం. ప్రేమిద్దాం..ఇతరకులకు మద్ధతుగా నిలుద్దాం అని విజయ్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి -
‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల
‘రఘువరన్ బి.టెక్’తో సినీ రంగ ప్రవేశం చేసిన మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ తమ్ముడు రిషికేశ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మల కొలువు’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్‌గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో రుద్ర అనే పాత్రను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెషల్ థాంక్స్. సినిమాలంటే ఉండే ప్యాషన్‌తో సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. -
Aakasha Veedhullo:‘ ట్రైలర్ చాలా ఇంటెన్సింగ్‌గా అనిపించింది’
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. కొత్త దర్శకుడైనా గౌతమ్ కృష్ణ ఈ మూవీని అద్భుతంగా తీశాడని కొనియాడాడు. దర్శకత్వమే కాదు, హీరోగా కూడా చాలా ఇంటెన్స్‌తో నటించారని మెచ్చుకున్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించిందన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత మనోజ్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి .. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి. తప్పకుండా మా సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. హీరో , దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా హీరో, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ఎదో డబ్బులున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరు అంటారు. కానీ అది కాదు .. ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం .. ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. తప్పకుండా మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు. -
భయపెట్టిస్తున్న ‘జ’ ట్రైలర్
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్ఫామెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారికి, దర్శకుడు సైదిరెడ్డి గారికి కృతజ్ఞతలు" అన్నారు. దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ..‘జ’అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది’ అన్నారు. -
Kudi Yedamaithe: కలలో ఏం జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరిగితే!
అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’. ‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. జూలై 16న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈరోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటూ అమలాపాల్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా అనిపించింది. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన అమ్మాయికి, వీళ్లిద్దరికీ సంబంధం ఏమిటి ? వాళ్ళు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు ? అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ ట్రైలర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి. -
ఒక చిన్న కథ
‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్, కావ్యా తప్పర్ జంటగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. హీరో ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘శోభన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ చిత్రం నా కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలాంటి విజయాన్ని అందించిన శోభన్గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శోభన్ తనయుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ విడుదలవుతున్న సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేష¯Œ ్స నిర్మాతలకు, ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ ఈ నెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రవర్గాలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. మా సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్లో కమెడియన్ సుదర్శన్ పంచ్ డైలాగ్‌లు, సంతోష్ శోభన్ పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారు. -
ఆ పిల్ల అంటే నాకు ప్రాణం.. ఆసక్తి రేపుతున్న ‘శతఘ్ని’ ట్రైలర్
అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శతఘ్ని’. 2010 లో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎల్వీ శివ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వాతి మండల్ హీరోయిన్గా నటిస్తోంది. కేరాఫ్ కంచరలపాలేం ఫేమ్ సుబ్బరావు, కిషోర్, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.. హైదరాబాదీ మూవీస్ ఫేమ్ గుల్లు దాదా ఇందులో చాలా కీలకమైన పాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.‘ఆ పేరంటే నాకు ఇష్టం, ఆ పిల్లంటే నాకు ప్రాణం’అనే డైలాగ్‌తో మొదలయ్యే ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఉత్కంఠను పెంచే విధంగా ట్రైలర్‌ని కట్ చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర నిర్మాత, హీరో దాసరి అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రూపొందించాం.. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.. కరోనా సమయంలో ఇబ్బంది పడే వారికి సహాయం చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. త్వరలో నే ఈ సినిమా కి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం.. ట్రైలర్ ఎంతో బాగుంది.. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు.. ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా నటించారు’ అని తెలిపారు. దర్శకుడు ఎల్.వి.శివ మాట్లాడుతూ.. చాలా కష్టపడి సినిమా ను తెరకెక్కించాము.. ఈ సినిమా కి నిర్మాతగా, హీరోగా అభిరాం గారు అందించిన సహాయం మర్చిపోలేనిది.. మధుర ఆడియో ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల కొంత ఆలస్యమవుతుంది అన్నారు. యాక్షన్-సస్పెన్స్-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోగా, రాం సుంకర ఫైట్స్ సత్య మాస్టర్ కోరియోగ్రఫీ ని అందించారు.. హర్ష ప్రవీణ్ సంగీతం సమకూరుస్తుండగా ఎం.డి. రఫీ సినిమాటోగ్రఫర్ గా , క్రాంతి (ఆర్. కె) ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. -
'మా ఊరి ప్రేమ కథ' వచ్చేది అప్పుడే
‘‘ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి. అన్ని ప్రేమకథలు ఒక్కటే.. కానీ కొత్తగా చూపిస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మా ఊరి ప్రేమకథ’ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత కేయల్ దామోదర ప్రసాద్ అన్నారు. మంజునాథ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్ హీరోయిన్. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. రియలిస్టిక్ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా విషయంలో నాకు సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. సహనిర్మాత మహేంద్రనాథ్, సంగీత దర్శకుడు జయసూర్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవితేజ, ‘కీ’ మ్యూజిక్ అధినేత రవి కనగాల, ‘తొలిముద్దు’ సినిమా నిర్మాత ఆర్కే రెడ్డి పాల్గొన్నారు. -
పంచ్ డైలాగ్స్‌తో దుమ్ము రేపుతున్న ‘యువరత్న’ టీజర్
సాక్షి, హైదరాబాద్ : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 'యువరత్న' సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. సాయేషా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యాసంస్థలోని అవకతవకలను వేలెత్తి చూపడంతో పాటు కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతోన్న తీరును చూపించడం గమనార్హం. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఇట్స్ఏ సర్వీస్.. అంటూ విద్య ప్రయివేటీకరణ మీద ప్రకాశ్ రాజ్ పవర్ఫుల్ డైలాగులు, పునీత్ పంచ్ డైలాగులు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇందులో పోలీసు అధికారి సజ్జనార్ ప్రస్తావన కూడా ఉండటం విశేషం. పోలీస్ ఆఫీసర్‌గా, మరోవైపు గడ్డంతో మరో లుక్‌తోనూ ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాడు పునీత్. అలాగే ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. సంతోష్ అనంద్రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సోను గౌడ, ధనంజయ్ ప్రకాశ్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే 2 లక్షల, 42 వేలకు పైగా వ్యూస్, 3277లకు పైగా కమెంట్లతో దూసుకుపోతోంది. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా బాగానే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఆమె వల్లే పెద్ద వెధవనయ్యానంటున్న నితిన్
హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రంగ్‌దే’. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘రంగ్‌దే’ ట్రైలర్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్లను ప్రేక్షకుల అంచనాలు పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఇందులో ‘మనం ప్రేమించిన వాళ్ల విలువ మనం వద్దనుకున్నప్పుడు కాదు.. వారు మనల్ని అక్కర్లేదు అనుకున్నపుడు తెలుస్తుంది’ అంటూ నితిన్ ఎమోషనల్‌గా చెప్పె డైలాగ్ ప్రేమికులను టచ్ చేస్తోంది. ‘తొలిప్రేమ’,‘మజ్ను’ వంటి వైవిధ్యమైన ప్రేమ కథాచిత్రాలను ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ‘నేను అర్జున్. నాకొక గర్ల్ ఫ్రెండ్‌ని ప్రసాదించమని దేవుణ్ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకండ్కే ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని’ అంటూ నితిన్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ‘మీకు చేసిన దానికి వాడిపై కోపం రావడం లేదా’ అని కీర్తిని ప్రశ్నిస్తాడు. దీనికి కీర్తి ‘చంపేస్తే ఒక్కసారే పోతాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా’ అంటూ చెప్పె డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. మొత్తానికి ఈ టైలర్ చూస్తుంటే మూవీలో నితిన్, కీర్తి సురేశ్‌లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారని అర్థం అవుతోంది. ఇక నితిన్ కీర్తికి భయపడుతూ చెప్పె కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. -
సినిమాల శాంపిల్ రెడీ.. చూసేందుకు మీరు సిద్ధమా
కంప్యూటర్ వదలి నాగలి పట్టి, వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. చావు కబురు చల్లగా చెబుతాడు మరో యువకుడు. గ్రామంలో జరిగే ఊహించని పరిణామాలకు భయపడతారు గ్రామప్రజలు. ఒక గ్యాంగ్‌స్టర్ అండర్‌వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ నాలుగు కథలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈలోపు నాలుగు సినిమాలకు సంబంధించిన చిన్న శాంపిల్‌ని ట్రైలర్, టీజర్ రూపంలో చూపించాయి ఆయా నిర్మాణసంస్థలు. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, కార్తికేయ చేసిన ‘చావు కబురు చల్లగా..’, సముద్రఖని ‘ఆకాశవాణి’, రామ్‌గోపాల్‌వర్మ ‘డి కంపెనీ’ సినిమాలకు సంబంధించి కొత్త విశేషాలు బయటకొచ్చాయి. జోడీ కుదిరింది ‘‘రామ్‌తో కలిసి సినిమా చేయబోతున్నందుకు సూపర్ డూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే ఎంపిక చేసినట్లు శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మట్టికి.. మనిషికి మధ్య ప్రేమకథ ఉద్యోగం చేస్తున్న కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్ కావాల్సిన యువకుడు వ్యవసాయం కోసం పొలంలో కాలు పెట్టాడు. నాగలి పట్టాడు. మట్టికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథను మరోసారి గుర్తు చేయడానికి శ్రీకారం చూట్టాడు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన¯Œ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కిశోర్ దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. బస్తీ ప్రేమకథ అబ్బాయి శవాలబండి డ్రైవర్. అమ్మాయి నర్స్. అబ్బాయికి అమ్మాయిపై లవ్వు. కానీ అమ్మాయికి అబ్బాయంటే కోపం. మరి.. ప్రేమకథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నకు ‘చావు కబురు చల్లగా..’లో సమాధానం దొరుకుతుంది. కార్తికేయ, లావాణ్యా త్రిపాఠీ జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. కౌశిక్ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో బస్తీ బాలరాజుగా కార్తికేయ, మల్లిక పాత్రలో లావణ్యా త్రిపాఠీ నటించారు. గ్రామంలో అలజడి అడవికి దగ్గరగా ప్రశాంతంగా ఉన్న ఓ గ్రామంలో ఊహించని అలజడి రేగుతుంది. భయంతో గ్రామస్తులు రాత్రివేళ దేనికోసమో అన్వేషిస్తుంటారు. ఆ గ్రామంలో ఏం జరిగింది? అనే మిస్టరీ వీడాలంటే ‘ఆకాశవాణి’ చూడాల్సిందే. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో అశ్వి¯Œ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆకాశవాణి’. దీని టీజర్‌ను దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘డి– కంపెనీ’. అక్షత్ కాంత్, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్ర కాంత్ ప్రధాన పాత్రల్లో స్పార్క్ సాగర్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘‘గ్యాంగ్‌స్టర్ స్థాయి నుంచి అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడు? 1993లో ముంబయ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సూత్రధారి ఎవరు? అనే అంశాలను ప్రస్తావించాం. ఈ 26న తెలుగు, హిందీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అందుకే నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టాను
‘‘నా కెరీర్లో పెద్ద బడ్జెట్ సినిమా ‘మోసగాళ్ళు’. నా మార్కెట్ అంత లేదు. కానీ సినిమాపై నమ్మకంతో నా మార్కెట్‌ని మించి ఖర్చు పెట్టా. ఏ సినిమా అయినా నిర్మాతకి రిస్కే. కాకపోతే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు రిస్క్ తీసుకుంటామని ముందుకెళ్లా’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. హీరోయిన్ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందిన ‘మోసగాళ్ళు’ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘అడిగిన వెంటనే ట్రైలర్‌ని రిలీజ్ చేసిన చిరంజీవిగారికి, వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్‌గారికి ధన్యవాదాలు. 2015 నుంచి 2017 వరకూ ఓ అక్క, తమ్ముడు కలసి ముంబయ్, గుజరాత్‌లలో ఉండి ఒక సింపుల్ ఐడియాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్ చేశారు. అమెరికాలో జరిగిన ఈ స్కామ్‌ని ఎందుకు సినిమాగా చేయకూడదనిపించింది? ‘మోసగాళ్ళు’ కథని అమెరికాలో ఉండి మూడేళ్లు డెవలప్ చేశాం. హాలీవుడ్‌కి ధీటుగా జెఫ్రీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నా అక్క పాత్ర చేయమని ప్రీతీ జింతాని అడిగితే, ఈ పాత్ర చేస్తే బయట తనకు ఇబ్బందులు వస్తాయని చేయనన్నారు. ఆ తర్వాత కాజల్‌కి కథ చెప్పగానే ఎంతో స్పోర్టివ్‌గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో నేను కాదు.. కాజల్. సునీల్ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు. సునీల్ శెట్టిగారి పాత్రని నేను చేయాల్సింది, కానీ కుదరలేదు. ‘మోసగాళ్ళు’ చూసిన నాన్నగారు (మోహన్ బాబు), డైరెక్టర్ శ్రీను వైట్లగారు ‘నువ్వేంటి విలన్ గా చేశావ్?’ అన్నారు. మా అమ్మ (నిర్మల) మాత్రం బాగా చేశావన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేరోజు, వేర్వేరు టైటిల్స్‌లో మా సినిమా విడుదలవుతుంది.. ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది మరో వారంలో ప్రకటిస్తాం. ‘భక్త కన్నప్ప’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది స్టార్ట్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుంది’’ అన్నారు. -
మోసగాళ్లు ట్రైలర్.. ఇంత డబ్బు ఎక్కడ దాచిపెట్టాలి!
హీరో మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 25(గురువారం) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్లో మోసగాళ్లు చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇక ట్రైటర్ విషయానికొస్తే ‘డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. కాజల్, విష్ణుల డైలాగులు బాగున్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ తారాస్థాయికి తీసుకొని వెళుతోందని చెప్పవచ్చు. ఇక ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు ఈ సినిమాతో అనుకున్న స్థాయి హిట్ అందుకుంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. జాఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌తో మంచు విష్ణు లంచ్ ఆచార్య షూటింగ్: వీడియో తీసిన ఫ్యాన్స్! Here is the trailer of #Mosagallu ,Based on a true story, one of the biggest IT scams that shook the USA. All the best Dear @iVishnuManchu & Best wishes to the entire team 💐#Mosagallu Trailer ▶️ (link)https://t.co/7ylGl02i7p — Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2021 -
ప్రయోగాలు చేయాలంటే ధైర్యం కావాలి
‘‘ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ‘చావు కబురు చల్లగా’ చేస్తున్నప్పుడు అది ఎక్స్‌పీరియ¯Œ ్స చేశాను. ‘క్షణక్షణం’తో అలాంటి ధైర్యం చేసిన వర్లుగారిని, మౌళిగారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగుండటంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూష¯Œ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, జియా శర్మ జంటగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షణ క్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ‘బన్నీ’ వాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి సినిమా వరకే అడ్వాంటేజ్.. ఆ తర్వాత వాళ్లు నిరూపించుకోవాల్సిందే’’ అన్నారు. ‘‘క్షణక్షణం’ ట్రైలర్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘క్షణక్షణం’లో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు కార్తీక్ మేడి కొండ. ‘‘హాలీవుడ్ నిర్మాత వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. అదే ప్యాష¯Œ ను ఉదయ్‌లో చూశా’’ అన్నారు డాక్టర్ వర్లు. జియా శర్మ, సంగీత దర్శకులు రోష¯Œ సాలూరి, రఘు కుంచె మాట్లాడారు. -
డాన్స్ రాజా
ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య పాత్రల్లో వెంకీ ఎ.ఎల్. దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’గా తెలుగులో విడుదల కానుంది. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రచయిత చిన్నికృష్ణ విడుదల చేసి, ‘‘నృత్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తమిళ ప్రేక్షకులను డాన్సులతో ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. భారతీబాబు మాటలు–పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. చిన్నికృష్ణ చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ట్రైలర్ విడుదలలో ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు. -
నేనూ విజయ్ మరో సర్ప్రైజ్ ఇస్తాం
‘‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి ఎంటర్టైనర్ తర్వాత మా టీమ్ అంతా కలిసి సరికొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ ‘పవర్ ప్లే’. విజయ్‌గారు, నంద్యాల రవిగారు, మధునందన్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. నేను, విజయ్‌గారు త్వరలో మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం’’ అన్నారు రాజ్ తరుణ్. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం ‘పవర్ ప్లే’. హేమల్ ఇంగ్లే కథానాయిక. పూర్ణ, మధు నందన్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. పద్మ సమర్పణలో మహిధర్, దేవేష్ నిర్మించిన ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘పవర్ ప్లే’ ట్రైలర్‌ను మీడియా తరఫున సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత బి.ఎ.రాజు విడుదలచేశారు. విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ– ‘‘రాజ్ తరుణ్ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్లో ఈ సినిమా చేశాడు. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు దేవేష్. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలపర్తి అనంత్ సాయి. ‘‘ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హేమల్. ‘‘ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో చేశాను’’ అన్నారు పూర్ణ. ‘‘ఈ సినిమాకి కథ, మాటలు రాశాను’’ అన్నారు నంద్యాల రవి. -
ఆ రోజు ఏం జరిగింది
రంజిత్, షెర్లీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. ఈ చిత్రం ద్వారా వీరాస్వామి దర్శక–నిర్మాతగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను నారా రోహిత్ విడుదల చేయగా, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీవిష్ణు వీడియో ద్వారా టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ రచయితల సంఘంలో మొట్టమొదటి వ్యక్తి ఏల్చూరి వెంకట్రావు. ఆయన కుమారుడు రంజిత్ వాళ్ల నాన్నలానే ఆయుర్వేద డాక్టర్ అవుతాడనుకున్నాను. కానీ యాక్టర్ అయ్యాడు. ఈ సినిమా ట్రైలర్ చూశాను. రంజిత్ అద్భుతంగా నటించాడనిపించింది’’ అన్నారు పరుచూరి గోపాలకష్ణ. ‘‘రంజిత్ నాకు పదేళ్లుగా తెలుసు. థ్రిల్లర్ జానర్‌తో తీసిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అన్నారు వీరాస్వామి. రంజిత్ మాట్లాడుతూ– ‘‘వీరాస్వామి చెప్పిన లైన్ నచ్చటంతో స్క్రిప్ట్ డెవలప్ చేసి 25 రోజుల్లో షూటింగ్ దాదాపుగా పూర్తి చేశాం. కరోనా వల్ల షూట్ ఆగిపోవటంతో పాటు మా వీరాస్వామిగారి మదర్, మా సినిమాకి పని చేసిన కిశోర్‌గారు రీసెంట్గా కరోనాతో చనిపోయారు. ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగినా ధ్వజస్తంభంలా నిలిచి సినిమాను పూర్తి చేసిన వీరాస్వామిగారికి హ్యాట్సాఫ్’’ అన్నారు. -
‘క్రాక్’ ట్రైలర్: ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది
మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నూతన సంవత్సరం పురస్కరించుకొని ‘క్రాక్’ ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘శంకర్... పోతరాజు వీరశంకర్, ఒంగోలు నడి సెంటర్లో నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా.., శంకర్.. ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్ ఆడియన్స్‌ని ఈలలు వేయించేలా ఉన్నాయి. మరోవైపు ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్.. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే ఒక పోలీసోడూ..’ అంటూ ట్రైలర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు. ‘క్రాక్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు విక్టరీ వెంకటేశ్. ఇలా వేరే హీరోల సినిమాలకు ఆయన మాట ఇవ్వడం ఇది మొదటిసారేం కాదు. నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే ఇంగ్లిష్ సినిమా ‘అల్లావుద్దీన్’ తెలుగు వెర్షన్లో జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. తాజా ‘క్రాక్’కి కూడా చెప్పారు. ఇక సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా విడుదల తేదిని మార్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని వెల్లడించారు. -
ప్రేమిస్తే విలువ తెలుస్తుంది
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియోను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, ‘‘ఈ సినిమా మంచి హిట్ అయి చిత్రనిర్మాతకు పేరుతో పాటు డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు మోహన్ రెడ్డి. ‘‘ఇష్టమైనవి దక్కాలంటే ముందు మనం దాన్ని ప్రేమించాలి. అది దక్కిందా? లేదా? అనేది తర్వాత విషయం. కానీ ప్రేమిస్తే వాళ్ల విలువ మనకు తెలుస్తుందని చెప్పే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ కానుమోలు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ ఎస్కే. -
యమ డ్రామా హిట్ అవ్వాలి
‘‘రెండు జంటల మధ్య లవ్, ఎమోషన్‌తో పాటు యముడి రాసే తల రాతలు ఎలా ఉంటాయనేది ఈ ‘యమ డ్రామా’ ట్రైలర్లో దర్శకుడు హర్ష అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు, డబ్బు తీసు కురావాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. సాయికుమార్ లీడ్ రోల్లో టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ డ్రామా’. సుకన్య సమర్పణలో ఫిల్మీ మెజీషియన్స్ పతాకంపై టి. రామకృష్ణ రావు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడిగారు తన సినిమా పనిలో బిజీగా ఉన్నా మా మీద అభిమానంతో మా యూనిట్‌కి సలహాలు ఇస్తూ, ట్రైలర్ లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉంది. నేటి యువత చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం సరికాదు.. చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి సందేశంతో యువతని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, జెన్నీ, గౌతమ్ రాజు, సుదర్శన్ రెడ్డి, నవీన్, వేణు వండర్స్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: సునీల్ కశ్యప్. -
నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ
సాక్షి, హైదరాబాద్ : కుర్ర హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరో చైతన్య అక్కినేని దీన్ని లాంచ్ చేశారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగుతో విడుదలైన ఈ ట్రైలర్ ఈ సినిమా మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో జోరుమీదున్న రాజ్‌తరుణ్ ఖాతాలో మరో విజయం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఇంకా నరేష్, పోసాని కృష్ణమురళి లాంటి సీనియర్లతోపాటు, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్ ఘోష్, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ లాంటి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. కాగా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న విడుదల కానుంది.విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో, కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనుప్ రుబెన్స్ అందించారు. -
మంచికి మంచి
దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వన్ నైట్ 999’. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్లో బాలరాజు ఎస్. స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన బాలరాజు, ఇతర చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘నేను గతంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. వాటిలో ‘ఓ నిమిషం’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. తాజాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ‘వన్ నైట్ 999’ అనే సినిమా తీశాను’’ అన్నారు బాలరాజు ఎస్. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్. -
వలయం ట్రైలర్ బాగుంది
‘‘స్నేహం, బంధుత్వం కన్నా నేను ప్యాషన్నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్ ఉంటేనే ఇండస్ట్రీలో మనందరం ఉంటాం అని నమ్ముతాను’’ అన్నారు అడవి శేష్. లక్ష్, దిగంగనా సూర్యవంశీ జంటగా రమేష్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వలయం’. చదలవాడ శ్రీనివాసరావు సమర్పణలో పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేసిన అడవి శేష్ మాట్లాడుతూ– ‘‘లక్ష్లో ప్యాషన్ ఉంది. అది ట్రైలర్లో కనిపిస్తోంది.. ‘వలయం’ ట్రైలర్ నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వలయం’ అనేది సమిష్టి కృషి. మా నాన్న నాకు ఓ చాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే మళ్లీ వచ్చేవాణ్ని కాదు. నా మిత్రుడు శేష్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను’’ అని లక్ష్ అన్నారు. ‘‘లక్ష్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటే సంతోషం.. మంచి కొడుకుగా ఉంటే ఇంకా సంతోషం’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ‘‘అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, లక్ష్‌కు థ్యాంక్స్’’ అన్నారు రమేష్ కుడుముల. దర్శకులు కేయస్ నాగేశ్వరరావు, నాగు గవర, చంద్ర మహేశ్, నిర్మాత శోభారాణి, నటుడు రవి ప్రకాశ్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడారు. -
ఇదే నా చివరి ప్రేమ కథా చిత్రం: విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. తరువాత వచ్చిన గీత గోవిందం కూడా విజయాన్ని అందుకోవడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తరువాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ నిరాశపరచిన హిందీలో సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. (ట్రైలర్ రెడీ) ఈ చిత్రంలో రాశీఖన్నా, కేథరిన్,ఐశ్వర్య రాజేష్, ఈషాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ లాంటి అద్భుతమైన ప్రేమకథ చిత్రాన్ని అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఆకట్టుకోగా, చిత్ర యూనిట్ గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. చదవండి : ప్రేమికుడు వచ్చేశాడు ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పూర్తి ప్రేమను నింపి ఈ సినిమాలో పని చేశానని తెలిపాడు. ఇదే తన చివరి లవ్ చిత్రం కావొచ్చని, ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 9న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫిబ్రవరి 14 సినిమా రిలీజ్ రోజు మరోసారి తన రౌడీ అభిమానుల్ని కలుస్తానని విజయ్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ సినిమా నాకు డబుల్ స్పెషల్
‘‘మత్తు వదలరా’ కథ మూడేళ్ల క్రితం విన్నాను. చాలా బాగుంది. యంగ్ టీమ్ ఎంతో ప్యాషన్‌తో చేసిన చిత్రమిది. చిన్న బడ్జెట్లో పెద్ద హిట్ కంటెంట్ మూవీ చేయడం ఇంట్రెస్టింగ్గా, ఎగై్జటింగ్‌గా ఉంది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా చాలా బాగుందంటారు’’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకునిగా, చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేశారు. కాలభైరవ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు డబుల్ స్పెషల్. నేను సంగీత దర్శకునిగా, నా తమ్ముడు శ్రీసింహా హీరోగా ఒకే సినిమాతో పరిచయం కావడం హ్యాపీగా ఉంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ‘‘కొత్తవారితో సినిమా రిస్క్ అని అందరూ అనుకుంటారు. కానీ, మా నిర్మాతలు మమ్మల్ని నమ్మి ఈ సినిమా తీసినందుకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీసింహా. ‘‘వినోదంతో కూడిన థ్రిల్లర్ చిత్రమిది.. కొత్తగా ఉంటుంది’’ అన్నారు రితేష్ రానా. -
మిస్ మ్యాచ్ పెద్ద విజయం సాధించాలి
ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వి నిర్మల్ కుమార్ దర్శకత్వంలో శ్రీరామ్ రాజు, భరత్‌రామ్ నిర్మించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ–‘‘మిస్ మ్యాచ్’ టైటిల్ అద్భుతంగా ఉంది. భూపతిరాజాగారు కథ అందిస్తే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తమిళంలో ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమా తీసిన నిర్మల్ కుమార్‌కు ఇది తెలుగులో తొలి సినిమా. ఉదయ్ బాగా నటించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలిని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. భూపతిరాజాగారు ఇచ్చిన కథను నిర్మల్ కుమార్‌గారు చక్కగా తెరకెక్కించారు.‘తొలి ప్రేమ’ (1998) చిత్రంలోని ‘ఈ మనసే’ సాంగ్‌ను సింగిల్ షాట్లో పూర్తి చేశాం. ఐశ్యర్యా మంచి కోస్టార్’’ అని అన్నారు. ‘‘తెలుగులో ఇది నా తొలి సినిమా. ఉదయ్, ఐశ్వర్యల కెమిస్ట్రి బాగా కుదిరింది’’ అన్నారు నిర్మల్ కుమార్. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నిర్మల్ కుమార్ మా బ్యానర్లో తొలి సినిమా చేయడం çహ్యాపీ. తన క్రమశిక్షణతో యూనిట్ గౌరవాన్ని సంపాదించుకున్నారు ఉదయ్’’ అన్నారు శ్రీరామ్‌రాజు. ‘‘రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు రచయిత భూపతి రాజా. డైలాగ్ రైటర్స్ రాజేంద్రకుమార్, మధుసూదన్, సంగీత దర్శకుడు గిఫ్టన్ మాట్లాడారు. -
విద్యార్థి నేత జీవితం
‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్‌తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. జీవన్ రెడ్డి ఈ సినిమాను రియలిస్టిక్‌గా తీశాడు. బయోపిక్ అయినా అన్ని వాణిజ్య అంశాలు ఇందులో ఉంటాయి. వ్యాపార పరంగా కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. మా చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. సినిమా విజ యంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. -
‘చాణక్య’ ట్రైలర్ ఆవిష్కరణ
-
సైకిల్ షాప్ కుర్రాడి కథ
‘రంగస్థలం, మహానటి, గుణ 369’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ ఆచంట హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నేను నా నాగార్జున’. ఆర్.బి. గోపాల్ని దర్శకునిగా పరిచయం చేస్తూ జియన్ఆర్ క్రియేషన్స్ పతాకంపై గుండపు నాగేశ్వరరావు నిర్మించారు. ఆగస్టు 29న హీరో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు. ఈశ్వర్ పెరావళి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత మళ్ల విజయప్రసాద్, ట్రైలర్‌ని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ విడుదల చేశారు. మహేష్ ఆచంట మాట్లాడుతూ– ‘‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ ఆపేసి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నేను ఏ అవకాశం వస్తే ఆ సినిమా చేశాను. ‘రంగస్థలం’కి ముందే ఈ చిత్రం చేశాను. ఒక సైకిల్ షాప్ కుర్రాడి కథ ‘నేను నా నాగార్జున’. కథ విన్నప్పుడు మా ఊరిలో రాంబాబు అనే సైకిల్ షాప్ కుర్రాణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశా. చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అష్టకష్టాలు పడి ఈ సినిమా పూర్తి చేశాం. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్. మంచి తేదీ చూసుకొని త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గుండపు నాగేశ్వర రావు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు మళ్ల విజయప్రసాద్, రామ సత్యనారాయణ, సాయివెంకట్, బసిరెడ్డి, టి.ప్రసన్నకుమార్, బాలాజీ నాగలింగం, దర్శక–నిర్మాత బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సినిమాకి మంచి కాలం
‘‘ప్రస్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్. కాన్సెప్ట్ మూవీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అక్కినేని సమంత. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఎవరు’. ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించారు. నవీన్ చంద్ర కీలక పాత్రధారి. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసిన సమంత మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగా నచ్చింది. సినిమా మీద ఆసక్తి పెరిగింది. కొత్త కంటెంట్ సినిమాలతో ఇండస్ట్రీని అడివి శేష్ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారు వెంకట్. రెజీనా మంచి నటి. నవీన్‌చంద్రతో సహా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు సమంత. ‘‘సమంతలోని పాజిటివ్ వైబ్స్ లక్‌గా మారతాయి. ‘గూఢచారి’ సమయంలో ఆమె సపోర్ట్ చేశారు. ‘క్షణం’ ముందు వరకు అందరూ నన్ను విలన్‌గా చూశారే తప్ప... మెయిన్ లీడ్‌గా ఎవరూ చూడలేదు. ఆ సమయంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పీవీపీగారు. ఆయనకు థ్యాంక్స్. నేను ఎప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఎందుకంటే మనం ఉండొచ్చు. లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉంటుంది. ఈ నమ్మకంతోనే ఈ సినిమా తీశాం. వెంకట్‌ను ఈ సినిమాను మనసు పెట్టి చేయమన్నాను’’ అన్నారు అడివి శేష్. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నవీన్‌చంద్ర. -
ధృవ కష్టం తెలుస్తోంది
ధృవ కరుణాకర్ హీరోగా నటించిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ దర్శకత్వంలో ప్రియా నాయర్, వందనా యాదవ్, ఐశ్వర్యా యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో పి. కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సంజయ్ వల్లనే ఈ కార్యక్రమానికి వచ్చాను. నన్ను నిర్మాణం వైపు నడిపించిన వ్యక్తి కూడా తనే. ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. ధృవ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం హాంకాంగ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డూప్ లేకుండా నటించాను. నన్ను నమ్మి నా కోసం కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు. నేను, దర్శకుడు నితిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాం’’ అన్నారు «ధృవ. ‘‘స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఆగస్టులో విడుదల ప్లాన్ చేశాం’’ అన్నారు నితిన్. ‘‘ధృవ చేసిన సాహసాలకు షాకయ్యా. అనుకున్న డేట్ కంటే ముందుగానే సినిమాను పూర్తి చేసే నితిన్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం. ఈ చిత్రంలో నేను చేసిన మాంత్రికుడి పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు సుమన్. -
కొత్త ఐడియాతో తీశారు
‘‘సత్యనారాయణ చాలా కొత్త ఐడియాతో ‘స్టూవర్టుపురం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా ఎడిటింగ్, కెమెరా.. ఇలా ఆల్ రౌండర్‌గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేశాడు. ట్రైలర్ చాలా ఆసక్తి కలిగిస్తో్తంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ‘గూఢచారి’ ఫేమ్ ప్రీతీ సింగ్ ప్రధాన పాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘స్టూవర్టుపురం’. రంజిత్ కోడిప్యాక సమర్పణలో అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుకుమార్ విడుదల చేశారు. సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ– ‘‘నరరూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు. వాళ్లను ఆమె ఎలా ఎదుర్కొంది అనే పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మించాం. రీ రికార్డింగ్‌కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి నవనీత్ చారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేపథ్య సంగీతం అందించారు. మా సినిమా ట్రైలర్‌ని మెచ్చుకున్న సుకుమార్‌గారికి థ్యాంక్స్. ఆయన చెప్పిన సలహాలను పాటిస్తాం’’ అన్నారు. ‘‘గతంలో మా బ్యానర్లో నిర్మించిన ‘నందికొండ వాగుల్లోనా, మోని’ చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి ‘స్టూవర్టుపురం’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని రంజిత్ అన్నారు. ‘‘పవర్ఫుల్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు ప్రీతిసింగ్. -
ఆస్తి పర్మినెంట్.. పెళ్లి టెంపరరీ!
ఆమె పేరు సీత. డబ్బుకు చాలా విలువ ఇస్తుంది. అందుకే పర్మినెంట్ ఆస్తి కోసం ఓ టెంపరరీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో అనుకోని మలుపు ఎదురవుతుంది? అది ఏంటన్నది తెలియాలంటే ఈ నెల 24 వరకూ వేచి చూడాల్సిందే. బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్‌సాంగ్ చేశారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి. -
ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!
హీరో రాజశేఖర్‌గారి మేనరిజమ్స్‌ని ఇప్పటివరకూ చాలామంది ఇమిటేట్ చేశారు. అయితే తన మేనరిజమ్స్‌ని రాజశేఖర్‌గారే ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? ‘ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!’ డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటుంది? ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాని ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కమర్షియల్ ట్రైలర్‌ని హీరో నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని ‘మహర్షి’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్ చాలా బావుందని, చాలా ఎంజాయ్ చేశామంటూ చాలా మంది ఫోన్లు చేశారు.. మెసేజ్‌లు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘కల్కి’ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్‌గారు నేను అడిగినది కాదనకుండా చేశారు. ఆయన మేనరిజమ్స్ ఆయనే ఇమిటేట్ చేయడంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. సి. కళ్యాణ్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘రాజశేఖర్ డెడికేషన్, ప్రశాంత్ వర్మ హార్డ్ వర్క్‌తో సినిమా బాగా వచ్చింది’’ అని సి. కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
కాపాడేవారెవరు రా?
‘‘బ్రోచేవారెవరురా... అంటూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ టైటిల్ చెప్పగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాని అర్థం‘కాపాడేవారు ఎవరురా?’ అని చెప్పారు. కథ విన్నాక టైటిల్ ఈ సినిమాకు సూట్ అవుతుందనిపించింది’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘శ్రీవిష్ణు చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు నేను క్లాప్ కొట్టాను. ఆ సినిమా బాగా ఆడింది. ‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్ చాలా ఫన్నీగా, హాంటింగ్‌గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఆల్రెడీ వివేక్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వివేక్ ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. అద్భుతమైన క్వాలిటీతో మన్యం విజయ్‌గారు నిర్మించారు. ఆయన మన్యం పులిలా విజృంభించి మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇది టీమ్ వర్క్. ఇందులో ‘మంత్ర’ అనే పాత్ర చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘మెంటల్ మదిలో’ చూసి వివేక్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్ట్ సెట్టయింది. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ తమ సపోర్ట్ అందించారు. జూన్‌లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్‌కుమార్. -
ఎవరికీ చెప్పొద్దు!
రాకేశ్ వర్రే హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. గార్గేయి యల్లాప్రగడ కథానాయికగా నటించారు. బసవ శంకర్ దర్శకత్వంలో క్రేజీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఈనెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. రాకేశ్ వర్రే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత తరంలో ఉన్న సమస్యను బసవ శంకర్‌గారు వినోదాత్మకంగా హ్యాండిల్ చేశారు. సినిమా ఆద్యంతం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ట్రైలర్‌ను విడుదల చేసిన శర్వానంద్‌గారికి థ్యాంక్స్. టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మేం చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితంగా చెప్పాం. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాం’’ అన్నారు బసవ శంకర్. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ శర్మ, కెమెరా: విజయ్ జె.ఆనంద్. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి స్ఫూర్తి బాలకృష్ణ
‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం. అలాగే ప్రతి సినిమా వెనకాల ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఓ మనిషి ఎప్పుడైనా ఉంటాడు. అది స్టోరీ కాదు.. స్టోరీ ఐడియా కాదు.. స్క్రీన్‌ప్లే కూడా కాదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్‌గా ఒక సినిమా అవుతుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనకాల నాకు ఆ స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అగస్త్య మంజు, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కథపై నాకు అంత అవగాహన లేదు. ‘వైశ్రాయ్ హాటల్’ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది అన్నది వాస్తవంగా నాకు తెలియదు. కానీ, బయోపిక్‌లు స్టార్ట్ అయ్యాక నేను కొంతమందిని కలిశాను. వాస్తవాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి కాబట్టి వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు పరిశోధించా. బయోపిక్ తీయడానికి ముఖ్యంగా కావాల్సింది నిజాయతీ. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక వారి బంధం నాలుగైదేళ్లు ఉంటే దాన్ని 2:30 గంటల సినిమాలో అన్ని విషయాలు చెప్పడం సినిమాటిక్‌గా సాధ్యం కాదు. అందుకే ఆ సోల్ అనేది మిస్ అవకుండా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. అప్పటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించాం. అందుకే ఈ సినిమా నా కెరీర్లో చాలా చాలా ప్రత్యేకం’’ అన్నారు. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీగారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. 23 సంవత్సరాలుగా ఒక స్త్రీ నిరంతర వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకుని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ, కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో.. ఇక అలిసిపోయి ఇంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదు అనుకున్న సమయంలో.. ఆర్జీవీగారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైంది. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలీదు. ఇంతకుముందు ఆర్జీవీగారి ‘క్షణం క్షణం’ సినిమా చూశాను. ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. తమదైన మార్గంలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వెళ్లే ఇలాంటివాళ్లు సమాజాన్నే శాసించగలరు అనిపిస్తుంది. ఈ రోజు ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా.. ఏ పాత్ర అయితే పనికిరాదు అని వాళ్లు అన్నారో.. ఏ పేజీలైతే చింపేయాలని కుటుంబం అంతా భావించిందో .. ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్‌గారికి లేదు అని చెప్పి ఒక ముద్రవేయడానికి వాళ్ల మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో... ఆ పేజీలను తీసుకుని, ఆ చరిత్రను తీసుకుని నేను న్యాయం చేస్తానని ముందుకువచ్చిన ఆర్జీవీగారికి థ్యాంక్స్. ఈ రోజు ఎన్ఆర్ఐ రేడియో ఇంటర్వ్యూకి వెళ్లాను. ఫారిన్ నుంచి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఆర్జీవీగారిలో ఓ హీరోను చూస్తున్నాం అన్నారు వారందరూ. ఈ సమాజంలో ఏ ఒక్కరూ చేయలేని న్యాయం ఆయన చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీపార్వతికే కాదు.. మహిళలందరికీ న్యాయం జరిగినట్లే అని వారు మాట్లాడుతుంటే ...æ గ్రేట్ ఆర్జీవీగారు. థ్యాంక్‌ఫుల్ టు యు’’ అన్నారు. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూడగానే నేను మాట్లాడాను. అతను వైసీపీ మనిషి అందుకే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అలా మాట్లాడే వెధవలకు నేను ఒకటే చెబుతున్నాను. తప్పు జరిగింది కాబట్టే దర్శకుడు ఈ సినిమా తీశారు. దానికీ వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధం ఏంటి? ఏదడిగినా ‘నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెళ్లాను.. ఇక్కడికి వెళ్లాను’ అంటారు. 36 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్‌ను ఓడించిన ఘనత ఎన్టీఆర్‌గారిది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మడం తిప్పని నైజం, సంస్కృతికి చిహ్నం అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డిగారు. ఈ ఫేస్‌ను ఎవరు చూస్తారండి? ఎప్పుడు మాట్లాడినా మీరు నిజాలు మాట్లాడరు. రాజశేఖరరెడ్డిగారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు. ‘అయ్యా చంద్రబాబు.. నువ్వు ఏ రోజూ నిజం మాట్లాడవు. ఒక మునీశ్వరుడి శాపం ఉంది నీ తలపై. నిజం మాట్లాడితే వెయ్యి ముక్కలు అవుతుందని’. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం అసలు కథ. ‘వైశ్రాయ్ సంఘటనకు’ నేనే సాక్ష్యం. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత నిబద్ధతగా డైరెక్టర్‌గారు చూపించిన వాస్తవాలు గొప్పా? మీరు మాట్లాడే అబద్ధాలు గొప్పా? అప్పట్లో సీడీలు లేవు. వీహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒరిజినల్ సీడీలు తీసుకొచ్చి చూపిస్తాను’’ అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన, కమాండ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని బయటికి రానివ్వరు, ఫలానా పార్టీవాళ్లు ఆపేస్తారు.. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని చాలామంది అంటున్నారు. ఇలాంటి వెధవ వేషాలు ఎందుకు. నువ్వు నిజాయతీగా ఉండొచ్చు కదా? నిజాయతీగా ఉండని, నీతిమంతమైన రాజకీయాలు చేయనివాడికి ఇలాంటి సమస్యలొస్తాయి. వాజ్‌పాయి, అద్వానీ, పుచ్చలపల్లి సుందరయ్య... ఇలా చాలామంది నిజాయతీపరులకు సమస్యలు రాలేదు కదా? బాధలు, కన్నీళ్లు అన్నవి అవినీతి పనులు చేసినవాడికి, వెధవ వేషాలు వేసినవాడికి, వెన్నుపోటు పొడిచినవాడికి వస్తాయి.. వాడే బాధపడుతుంటాడు. నవ్వు ఆ పనులు ఆ రోజు చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా? ఏ రామాయణమో, మహాభారతమో తీసుకుంటాడు కదా? నవ్వు వెధవ వేషాలు వేస్తే సినిమా తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా తనపై తానే సెటైర్ వేసుకుంటాడు. తప్పు చేసినప్పుడు అంగీకరిస్తాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండి తప్పుడు పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలి పెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చి సన్నాసి పనులు చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను పౌరుడు. ఓటరు.. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు 100 శాతం ఉంటుంది. ఈ సినిమా జరిగిన కథ. సెన్సార్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా బయటికొస్తే ప్రజలు రియలైజ్ అవుతారు’’ అన్నారు.‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతే విజయవంతం చేయాలి’’ అన్నారు నిర్మాత రాకేష్ రెడ్డి. ఈ వేడుకలో ‘‘ఆర్టీవీ గన్‌షాట్ ఫిల్మ్స్’ లోగోని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వర్మ బదులిస్తూ... ► ఎన్టీఆర్‌గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. లక్ష్మీపార్వతిగారి ఎపిసోడ్ లేకుంటే నేను చేయనన్నాను. ఆ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉండాలన్న విషయంలో మా మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి కానీ, కథ విషయంలో కాదు. ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. ► నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. రాజకీయాలను పట్టించుకోను. అయితే ఈ స్టోరీలో రాజకీయాలున్నాయి కాబట్టి ఎవరికి నచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చేయొద్దని కొందరు బెదిరించారు. అలాంటి వారికి భయపడితే సినిమా తీయలేం. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొద్దని నన్ను బెదిరిస్తే మాత్రం నేను కూడా వాళ్లను బెదిరిస్తా. ► ఈ కథలోని విషయాలు అందరికీ తెలుసు. తెలియని విషయాలు నేను చెప్పడం లేదు. జనాలకు నిజం చెప్పడమే నా లక్ష్యంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీశా. నేను ఎన్టీఆర్‌గారికి వీరాభిమానిని. ఆయన జీవితంలో ‘వైశ్రాయ్’ సంఘటన ఎగై్జట్‌మెంట్ ఇచ్చింది కాబట్టే ఈ చిత్రం చేశా. ఇందులో ఎన్టీఆర్‌గారి ఔన్నత్యాన్ని ఎక్కడా తగ్గించలేదు. కొత్తవారికి ఏ ఇమేజ్ ఉండదు కాబట్టి పాత్రలు ఎలివేట్ అవుతాయి. అందుకే కొత్తవారిని తీసుకున్నాం. -
‘గల్లీ బాయ్’ ట్రైలర్ : అప్నా టైమ్ ఆయేగా
సింబా సినిమా హిట్‌తో పుల్ జోష్‌లో ఉన్న బాలీవుడ్యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఈ సారి ‘గల్లీ బాయ్’గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఈ ట్రైలర్లో రణ్వీర్, ఆలియా తమదైన స్టైల్లో అదరగొట్టారు. (నీ ఆశీర్వాదం వల్లే సినిమా హిట్టయ్యింది’) ఇందులో రణ్వీర్ మంచి సింగర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ అతను గల్లీలో తిరిగే సామాన్య వ్యక్తి కావడంతో అందరూ తక్కువగా చూస్తుంటారు. అతన్ని హేళన చేస్తూ మాట్లాడుతారు. చదువుకొమ్మని కాలేజ్‌కి పంపిస్తే పాటలు అంటూ రోడ్లపై తిరుగుతున్నాడని రణ్వీర్ తండ్రి కూడా కోప్పడతాడు. చివరకూ ఆ యువకుడు ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించనున్నారు. ‘మనకూ టైం వస్తుంది’(అప్నా టైమ్ ఆయేగా) అనే క్యాప్షన్‌ను చూస్తేనే మూవీ ఉద్దేశమేంటో అర్థమవుతుంది. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న విడుదల కానుంది. -
‘ఇదం జగత్’ ట్రైలర్ రిలీజ్
-
‘మణికర్ణిక’ ట్రైలర్ విడుదల
-
రహస్యంగా...
భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాతగా వంద చిత్రాలకు చేరువలో ఉన్న తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ చిత్రం ‘రహస్యం’. సాగర్ శైలేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు. ఆయన చేతుల మీదుగా ఈ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.‘‘రామ సత్యనారాయణ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందనలు’’అని వర్మ అన్నారు. ‘‘రామ సత్యనారాయణ నాకు 14 ఏళ్లుగా తెలుసు. చిన్న సినిమాలు తీసి, విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి’’ అన్నారు పూరి. ‘‘వర్మగారిని కలవటం నా జీవితాశయం. ఈ రోజు అది నెరవేరింది. రామ సత్యనారాయణగారు ప్యాషన్ ఉన్న నిర్మాత. నన్ను నమ్మి ఏ రోజూ ఆయన షూటిం గ్‌కు రాలేదు’’ అని శైలేష్ అన్నారు. -
శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు
-
కన్నుల్లో నీరూపమే ట్రైలర్ రిలీజ్ చేసిన సుకుమార్
-
‘డైనమైట్’ చిత్రబృందం సందడి