
Varun Sandesh Hilarious Punch to RJ Kajal: తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా చేసిన సినిమా సకలగుణాభిరామ. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కి శ్రీరామచంద్ర, వరుణ్‌తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆర్జే కాజల్ హోస్ట్‌గా నిర్వహించింది.
కాగా సన్నీతో అనుబంధం గురించి హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతతూ.. సన్నీ తనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసని, బిగ్‌బాస్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడని అభినందించాడు. సకలగుణాభిరామ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటూ తన స్పీచ్‌ని ముగించాడు.
అయితే వరుణ్ మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న కాజల్.. నీ ఇందువదన సినిమాకి ఆల్ ది బెస్ట్ అని పేర్కొనగా సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంటూ వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడుకున్న వారంతా కౌజల్ తప్పులో కాలేసిందంటూ తెగ నవ్వుకున్నారు.