varun sandesh
-
'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్‌కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్‌ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ హారర్ థ్రిల్లర్..టాప్‌లో ట్రెండింగ్!
వరుణ్ సందేశ్ లీడ్ రోల్లో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ విరాజి. ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 22 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో అంతగా మెప్పించలేని హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికే 56 లక్షల వాచ్ మినిట్స్‌తో ఆహాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -' విరాజి సినిమా ఓటీటీలో 56 లక్షల వాచ్ మినిట్స్‌తో ట్రెండ్ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ పుట్టినరోజు. ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. ఈ మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్‌తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహాలో చూస్తూ ఎంజాయ్ చూస్తున్నారు" అని అన్నారు. -
ఓటీటీలో వరుణ్ సందేశ్ 'విరాజి' సినిమా
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'విరాజి' ఓటీటీలోకి వచ్చేస్తుంది. హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 2న విడుదలైంది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్లలో మెప్పించారు. ఇప్పుడు ఓటీటీలో విరాజి విడుదల కానుందని ఆహా ప్రకటించింది. ఆగష్టు 22న స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు. ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ వెంటనే ‘విరాజి’తో మెప్పించాడు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
‘విరాజి’ మూవీ రివ్యూ
టైటిల్: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్లదర్శకత్వం: ఆద్యంత్ హర్షసంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: రామ్ తూమువిడుదల తేది: ఆగస్ట్ 2, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆండి(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. చిన్న పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంటర్వెల్‌కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్, థ్రిల్లర్ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఎవరెలా చేశారంటే..ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. -
మేకోవర్ సవాల్‌గా అనిపించింది: వరుణ్ సందేశ్
‘‘నేను ఫలానా తరహా పాత్రలే చేయాలని పరిమితులేవీ పెట్టుకోలేదు. కథ, అందులోని నా క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘మైఖేల్’ సినిమాలో విలన్‌గా చేశాను. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో వరుణ్ సందేశ్ పంచుకున్న విశేషాలు.∙‘విరాజి’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్న కొంతమంది దగ్గరకు ఆండీ (వరుణ్ సందేశ్ పాత్ర పేరు) వచ్చాక అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకు? అనేది సినిమాలో చూడాలి. ఓ సందేశం కూడా ఉంది. ఇలాంటి కథను సినిమాల పట్ల ΄్యాషన్ ఉన్న మహేంద్రగారిలాంటి వారే నిర్మించగలరు. మా సినిమాను మైత్రీవారు డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. ∙‘విరాజి’లోని నా పాత్ర లుక్, మేకోవర్‌ను కొత్తగా డిజైన్ చేశారు హర్ష.రెండు డిఫరెంట్ కలర్స్‌లో హెయిర్ స్టైల్, ముక్కు పుడక, ఓ స్నేక్ టాటూ... ఇలా ఆండీ కొత్తగా కనిపిస్తాడు. ఈ మేకోవర్ నాకు కాస్త చాలెంజింగ్‌గా అనిపించింది. హెయిర్ కలరింగ్ కోసం ఏడు గంటలు, ట్యాటూస్ కోసం దాదాపు గంట పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ ట్యాటూ వేసుకోవాల్సి వచ్చేది. ‘విరాజి’ సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. మంచి సినిమా చేశామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. ∙నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ‘హ్యాపీ డేస్’ సినిమా చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఓ నటుడిగా నా ప్రయాణంలో విమర్శలు సహజమని నాకు తెలుసు. కానీ నా భార్య వితిక కాస్త ఫైర్ బ్రాండ్. అందుకే నా లుక్ గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్‌పై ఆమె అలా స్పందించారు. వితికలాంటి భార్య దొరకడం నా లక్‌గా భావిస్తున్నాను. ప్రస్తుతం ‘కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్నాను. ‘రాచరికం’ సినిమాలో పెద్ద మీసాలతో చిత్తూరు యాస మాట్లాడే వ్యక్తిగా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తాను. -
వరుణ్ సందేశ్‌తో ర్యాపిడ్ ఫైర్
-
ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చి చూసే రోజులు కాదు అందుకే డిఫరెంట్ గా తీశాం
-
నా హెయిర్ స్టైల్ కలర్ చూసి నా భార్య రియాక్షన్ ఏంటంటే..
-
నా సినిమాలు జనాలు చూడటం లేదు అందుకే ఇంత గ్యాప్..
-
'విరాజి' థ్రిల్లింగ్‌తో పాటు మెసేజ్ ఇస్తాడు: దర్శకుడు ఆద్యంత్ హర్ష
మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'విరాజి'. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న విరాజి సినిమా గురించి దర్శకుడు ఆద్యంత్ హర్ష పలు విషయాలు పంచుకున్నాడు.ఫారిన్లో చదువుకున్న డైరెక్టర్ ఆద్యంత్ హర్ష సినిమాల పట్ల ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ నేర్చకున్నాడు. సుమారు పది కథలు రాసుకున్న ఆయన విరాజి చిత్రాన్ని ఫైనల్‌గా తెరకెక్కిస్తున్నారు. గతేడాది 'విరాజి' కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు చెప్పడంతో ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. కథ మహేంద్రనాథ్‌కు నచ్చడం ఆపై వరుణ్ సందేశ్‌ను హీరోగా ఫైనల్ చేశామని ఆయన అన్నారు. 'విరాజి' సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీలాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించిందని ఆద్యంత్ తెలిపారు.'విరాజి' అనే టైటిల్‌కు అర్థం.. చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడని ఆయన అన్నారు. 'విరాజి' అంటే శివుడు అని కూడా కొందరు అంటారని తెలిపారు. 'విరాజి' సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారని ఆద్యంత్ తెలిపారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుందని ఆయన అన్నారు. -
అందుకే వరుణ్ సందేశ్‌ని హీరోగా తీసుకున్నాం : ‘విరాజి’ నిర్మాత
ప్రతివారం సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే బరిలో పలు సినిమాలు ఉన్నా..ఆగస్ట్ 2న ‘విరాజి’ని విడుదల చేస్తున్నాం’అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా సంస్థలో నిర్మించిన రెండో చిత్రం విరాజి. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా చేశాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాం. ఇప్పుడు వరుణ్ సందేశ్ హీరోగా విరాజి నిర్మించాం. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు ఆద్యంత్ హర్ష కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఆకట్టుకునేలా చెప్పాడు. చెప్పడమే కాదు సెట్ లో కూడా అంతే బాగా తెరకెక్కించాడు.⇢ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ముందు ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. అయితే నాకు హీరోగా నటించి వెళ్లిపోయే వారు మాత్రమే కాకుండా నాకు సినిమా మొత్తం సపోర్ట్ చేసే హీరో కావాలని అనుకున్నాను.ఎందుకంటే నేను కొత్త నిర్మాతను. నాకు అలా సపోర్ట్ చేసే హీరో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. వరుణ్ సందేశ్ యూఎస్ నేపథ్యం ఉన్న పర్సన్. అతని డైలాగ్ డెలివరీ విధానం విరాజికి కలిసొచ్చిందని చెప్పొచ్చు.⇢ మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి.⇢ మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. -
ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ట్రైలర్‌తోనే భయపెట్టేశాడు!
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విరాజి'. ఇటీవలే నింద సినిమాతో అలరించారు. ఈ మూవీని హారర్ జోనర్లో ఆద్యాంత్ హర్ష డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఎం3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.విరాజి మూవీ కోసం వరుణ్ సందేశ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఆత్మలే ప్రధాన కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్ ఒక డ్రగ్ అడిక్ట్‌గా కనిపించనున్నారు. 1970లో నిర్మించిన ఓ మెంటల్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను భయపెడుతోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్‌లుక్, టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.విరాజి టీజర్‌ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్‌ను దర్శకుడు సాయి రాజేష్ అభినందించారు. టీజర్ చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు. -
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్‌తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్‌ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
నా 17 ఏళ్ల కెరీర్లో ‘విరాజి’లాంటి సినిమా చేయలేదు: వరుణ్ సందేశ్
డైరెక్టర్ హర్ష విరాజి కథ చెప్పినప్పుడు.. ఫస్టాఫ్ పది నిమిషాల విన్న కథ ఇలా ఉంటుందని రెండు మూడు చోట్ల గెస్ చేశా. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను’ అన్నారు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ‘నింద’తో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్..త్వరలోనే ‘విరాజి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారుతాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. ఈ నెల 10 ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. అది చూడగానే సర్ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. ఆగస్ట్ 2న విడుదల కాబోతున్న ఈచిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.వరుణ్‌ను తెరపై కొత్తగా చూస్తారని అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల . ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆద్యంత్ హర్ష, నటులు రఘు కారుమంచి, ప్రమోదిని, ఫని, మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్.. బాక్సాఫీస్ వద్ద జోరు!
వరుణ్ సందేశ్, అన్నీ, శ్రేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం నింద. ఈ సినిమాను రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా వరుణ్‌కు మంచి కమ్‌బ్యాక్ అవుతుందని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. వరుణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ముఖ్య పాత్రలు పోషించారు. -
'నింద' సినిమా రివ్యూ
అప్పుడెప్పుడు 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఓ దశలో పూర్తిగా యాక్టింగ్‌కే దూరమైపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'నింద' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్‌కి కమ్ బ్యాక్‌గా నిలిచిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)కథేంటి?కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్ల పాటు శిక్ష అనుభవించడం, పుణ్య కాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం.. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్, న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమానే 'నింద'.ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్‌తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్సై, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ ఆరుగురి నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తుంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాలి. కానీ సాగదీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సెకండాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకు సెకండాఫ్ మొదలైన కాసేపటికే హత్య చేసిందెవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్‌లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంది.తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దాన్ని ఇంట్రెస్టింగ్గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో రెండు గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడ లేకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పడం మాత్రం రిలీఫ్.ఎవరెలా చేశారు?లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు బాగా చేశారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో ఉన్నది తక్కువ లొకేషన్స్. ఉన్నంతలో వాటిని బాగానే క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దీని వల్ల డైలాగ్స్ సరిగా వినపడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'నింద' ఓ డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంతే. మరీ అంత సూపర్ అయితే కాదు!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
థ్రిల్లింగ్ కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతున్న ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ‘బలగం’ జగదీష్ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘కానిస్టేబుల్ పాత్రలో నటించడం కొత్తగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. వరుణ్ సందేశ్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. ‘‘కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు. పోస్ట్‌ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు ‘బలగం’ జగదీష్. -
ఇక డైరెక్షన్పైనే ఫోకస్
‘‘మలయాళ సినిమాలు చూసి ఇలాంటి చిత్రాలు మన వద్దకు ఎందుకు రావడం లేదని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మా ‘నింద’ చూశాక ‘బాగా తీశారు.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి’ అనుకుంటారు. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘నింద’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చిత్ర దర్శక–నిర్మాత రాజేశ్ జగన్నాథం అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేశ్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘మాది నర్సాపురం. నెల్లూరు, చెన్నై, యూఎస్‌లో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండి΄ోయాను. ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సులు చేసి, అక్కడే షార్ట్ ఫిలింస్ చేశాను. వాస్తవ ఘటనలు, కల్పిత సన్నివేశాలతో ‘నింద’ స్క్రిప్ట్ రాశాను. ఈ కథ వరుణ్ సందేశ్‌కి మంచి కమ్ బ్యాక్‌లా ఉంటుందని భావించి ముందుకెళ్లాం. కథపై ఉన్న నమ్మకంతోనే నేనే నిర్మించాను. ఈ మూవీలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ‘నింద’ తర్వాత ఎక్కువగా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను’’ అన్నారు. -
‘నింద’ చూశాక ఆ ఫీలింగ్ కలుగుతుంది: రాజేష్ జగన్నాథం
మలయాళ సినిమాలు చూసి..మన దగ్గర(టాలీవుడ) ఇలాంటి సినిమాలు ఎందుకు రావాని అంతా అనుకుంటారు. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి. ‘నింద’ కూడా అలాంటి చిత్రమే. సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడు ‘ఇదేదో బాగానే ఉందే..బాగా తీశారు’ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’అన్నారు దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం . ఆయన తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా తాజాగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో యూఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాను. నింద కథ వరుణ్‌కు చెప్పడంతో నచ్చి.. వెంటనే ఓకే చేశాడు. నిర్మాత కోసం ప్రయత్నించాం. కానీ దొరకలేదు. కథపై ఉన్న నమ్మకంతో చివరకు నేనే నిర్మించాను. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంటుంది. పీఎస్ వినోద్ గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు.సినిమాలోని ప్రతీ ఒక్క కారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ మూవీ అప్డేట్స్ ఇస్తాను.ఇకపై ఎక్కువగా దర్శకత్వం మీదనే ఫోకస్ చేస్తాను’ అన్నారు. -
తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్ సందేశ్
‘‘నింద’ చిత్రంలోని నా పాత్రకి, నిజ జీవితంలోని నాకు అస్సలు పోలిక ఉండదు. నేను సరదాగా ఉంటాను. సీరి యస్‌గా ఉండను. ‘నింద’లో నా మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం వరుణ్ సందేశ్ మీడియాతో పంచుకున్న విశేషాలు.⇒ నా కెరీర్లో ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని యూఎస్ వెళ్లాను. అక్కడ రాజేశ్‌గారు ‘నింద’ కథ చెప్పారు. నచ్చడంతో ఈ సినిమా చేశాను. ‘కానిస్టేబుల్’ సినిమా షూటింగ్లో నా కాలికి గాయమైంది. అయితే రాజేశ్‌గారి డెడికేషన్ చూసి రిస్క్ చేసి ఆ గాయంతోనే ‘నింద’ షూటింగ్లో పాల్గొన్నాను. ⇒సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటీనటుల్లో ఎవరికీ ఈ మూవీ పూర్తి కథను చెప్పలేదు రాజేశ్‌గారు. దీంతో ఆర్టిస్టుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ పెరిగింది. కథ పరంగా అసలు నేరస్థుడు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పలేకపోయాను. ⇒మా దర్శక–నిర్మాత రాజేశ్‌గారి ఫ్రెండ్ అమెరికాలో ‘నింద’ని రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీస్ నవీన్‌గారికి తెలుసు. అలా మైత్రీ శశిగారు మా సినిమా చూడటం, నచ్చడంతో నైజాంలో విడుదల చేస్తున్నారు. ‘నింద’ తర్వాత ఓ క్రేజీ ్రపాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అలాగే ‘కానిస్టేబుల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. -
‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్ సందేశ్
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద కూడా అలాంటి కథే. కానీ స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు’అని అన్నారు హీరో వరుణ్ సందేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లాను. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.→ నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.→ ‘నింద’ లాంటి చిత్రాలకు ఆర్ఆర్, కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. మాకు మంచి టెక్నీషియన్లు దొరికారు. సాంతు ఓంకార్ తన ఆర్ఆర్, మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. రమీజ్ కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది.→ మా దర్శక నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రీ నవీన్ గారికి తెలుసు. అలా మైత్రీ శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తామని శశిగారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.→ నింద తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. నిందలోని కారెక్టర్‌కు ఆ సినిమాలోని పాత్రకు అస్సలు పోలిక ఉండదు. అది జూలైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అది కాకుండా కానిస్టేబుల్ అనే ఓ సినిమాను కూడా చేస్తున్నాను. -
నా జీవితంలో ఆ 105 రోజులు మర్చిపోలేను: వరుణ్ సందేశ్
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. వరుస హిట్లు పడడంతో స్టార్ హీరో అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ ఆ రెండు తప్ప వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఒకనొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ 2019లో బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా వరుణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ బుల్లితెర బిగ్ రియాల్టీ షోలో భార్య వితికాతో కలిసి పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు 105 రోజుల వరకు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉన్నాడు. తాజాగా తన బిగ్‌బాస్ జర్నీ గురించి చెబుతూ వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.‘బిగ్‌బాస్ షో నా కెరీర్ పరంగా ఎంత హెల్ప్ అయిందని చెప్పలేను కానీ.. పర్సనల్‌గా, ఫైనాల్షియల్గా చాలా ఉపయోగపడింది. ఈ షోలో పాల్గొనకంటే ముందు జనాలకు నాపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. నాకు యాటిట్యూడ్ ఎక్కువైనని, ప్లే బాయ్ అని ఏవోవో అనుకునేవాళ్లు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత నేను ఎలాంటివాడినో జనాలకు అర్థమైంది. ఆ షో నుంచి బయటకు వచ్చాకా చాలా మెసేజ్‌లు వచ్చాయి. వాళ్లు చూపించిన ప్రేమ మరచిపోలేనిది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత కూడా అంత ప్రేమను నేను చూడలేదు. ప్రజలకు నేను పర్సనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది బిగ్‌బాస్ షోనే. నా లైఫ్‌లో ఆ 105 రోజుల ఎక్స్పీరియస్ మర్చిపోలేను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం ‘నింద’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్ సిద్ధార్థ్
‘‘నింద’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి కథతో పాటు చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నా కెరీర్లో ‘స్వామి రారా, కార్తికేయ’ సినిమాల్లా వరుణ్ సందేశ్ కెరీర్లో ‘నింద’ ఓ మైలురాయిగా నిలవాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. రాజేశ్‌గారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు. మా చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ’ చిత్రాల తర్వాత ‘నింద’ నిలుస్తుందని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ‘‘నింద’ మూవీ అవుట్‌పుట్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మా సినిమాతో వరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడు’’ అన్నారు రాజేశ్ జగన్నాథం. -
వరుణ్ సందేశ్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్: నిఖిల్ సిద్దార్థ్
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. తాజాగా 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. మీడియా, ఆడియెన్స్ ఈ సినిమాను సపోర్ట్ చేయాలి. నా కెరీర్లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్‌కు హిట్ రాబోతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూడండి. అందరూ సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ ఈ సినిమాను నాకు చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. వరుణ్ సందేశ్ గారికి కమ్ బ్యాక్ అవుతుంది. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూన్ 21న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడండి. అందరూ సర్ప్రైజ్ అవుతారు’ అని అన్నారు.