ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్‌.. ట్రైలర్‌తోనే భయపెట్టేశాడు! | Varun Sandesh VIRAAJI Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

VIRAAJI Movie Trailer: 'ఫ్రెష్ ఆత్మ బ్రో.. అందుకే పిలుస్తున్నా'.. భయపెడుతోన్న ట్రైలర్!

Published Thu, Jul 18 2024 8:59 PM | Last Updated on Thu, Jul 18 2024 9:02 PM

Varun Sandesh VIRAAJI Movie Trailer Out Now

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విరాజి'. ఇటీవలే నింద సినిమాతో అలరించారు. ఈ మూవీని హారర్‌ జోనర్‌లో ఆద్యాంత్‌ హర్ష డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఎం3 మీడియా బ్యానర్‌లో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.

విరాజి మూవీ కోసం వరుణ్ సందేశ్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.  తాజాగా రిలీజైన ట్రైలర్‌ చూస్తే ఆత్మలే ప్రధాన కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్‌ ఒక డ్రగ్ అడిక్ట్‌గా కనిపించనున్నారు.  1970లో నిర్మించిన ఓ మెంటల్‌ ఆస్పత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను భయపెడుతోన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement