-
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్‌తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్‌ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
నా 17 ఏళ్ల కెరీర్లో ‘విరాజి’లాంటి సినిమా చేయలేదు: వరుణ్ సందేశ్
డైరెక్టర్ హర్ష విరాజి కథ చెప్పినప్పుడు.. ఫస్టాఫ్ పది నిమిషాల విన్న కథ ఇలా ఉంటుందని రెండు మూడు చోట్ల గెస్ చేశా. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను’ అన్నారు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ‘నింద’తో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్..త్వరలోనే ‘విరాజి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారుతాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. ఈ నెల 10 ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. అది చూడగానే సర్ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. ఆగస్ట్ 2న విడుదల కాబోతున్న ఈచిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.వరుణ్‌ను తెరపై కొత్తగా చూస్తారని అన్నారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల . ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆద్యంత్ హర్ష, నటులు రఘు కారుమంచి, ప్రమోదిని, ఫని, మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ తదితరులు పాల్గొన్నారు.