
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 2న విడుదలైంది. అయితే, కేవలం 20 రోజుల్లోనే ఆహా తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆద్యాంత్ హర్ష డైరెక్షన్‌లో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు డిఫరెంట్ లుక్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ విరాజితో కాస్త పర్వాలేదనిపించాడు.
విరాజి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఒక పోస్టర్‌తో ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహా తెలుగు ఓటీటీలో ఉచితంగా చూసే సౌలభ్యం ఉండగా మళ్లీ అదనంగా రెంట్ చెల్లించి చూడటం ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా అనుకొని విరాజి రైట్స్‌ను అమెజాన్ ఏమైనా కొనుగోలు చేసిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పాత సినిమాకు రూ. 99 రెంట్ బాదుడు ఎందుకు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అనుకోకుండా కొందరు యువకులు ఆ హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ఓ మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆండీ పాత్రలో వరుణ్ సందేశ్ సరికొత్తగా థియేటర్‌లలో మెప్పించారు. ఇప్పుడు ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని చూసేయండి. విరాజి సినిమాలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment