ఓటీటీలో ధనుష్‌ ఫస్ట్‌ హాలీవుడ్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Dhanush First Hollywood Movie The Extraordinary Journey of the Fakir OTT Streaming | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ధనుష్‌ ఫస్ట్‌ హాలీవుడ్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published Sat, Mar 22 2025 10:52 AM | Last Updated on Sat, Mar 22 2025 11:22 AM

Dhanush First Hollywood Movie The Extraordinary Journey of the Fakir OTT Streaming

కోలీవుడ్ టాప్‌‌ హీరో ధనుష్‌ (Dhanush) నటించిన తొలి హాలీవుడ్‌ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. 2019లో ఆయన నటించిన ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ (The Extraordinary Journey of the Fakir) ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఇప్పటికే ఈ చిత్రం ‘యాపిల్‌ టీవీ+’లో ఇంగ్లీష్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, ప్రస్తుతం తెలుగులో అందుబాటులో రానుందన ఆహా ప్రకటించింది.

ధనుష్‌ నటించిన ఈ చిత్రం ఆరేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ చిత్రాన్ని మార్చి 26న తమ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. అయితే,  ‘ఆహా గోల్డ్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే ఈ నెల 25 నుంచే ఈ మూవీని చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఈ మూవీని 24 గంటలు ముందుగానే చూడొచ్చు.

కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని కెన్ స్కాట్ డైరెక్ట్ చేశాడు. రూ. 175 కోట్ల బడ్జెట్‌ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద డిజ్టార్‌గా మిగిలిపోయింది. కేవలం రూ. 30 కోట్ల వరకు మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. ఈ చిత్రంలో అజాతశత్రు లవష్ పటేల్ అనే ఓ మెజీషియన్‌గా తన నటనతో ధనుష్ మెప్పించినప్పటికీ.. కథలో సరైన బలం లేకపోవడంతో ఫలితం దక్కలేదు.

ముంబయికి చెందిన అజాతశత్రు అలియాస్‌ లవశ్‌ పటేల్‌గా ధనుష్‌ ఒక స్ట్రీట్‌ మెజీషియన్‌గా ఇందులో నటించారు. తనకు మ్యాజికల్‌ పవర్స్‌ ఉన్నాయని చెబుతూ అందరినీ నమ్మిస్తుంటాడు. ఈ క్రమంలో తన తల్లి మరణించడంతో తన తండ్రి కోసం పారిస్‌ వెళ్తాడు. అక్కడ ఒక యువతితో ప్రేమలో పడిన అజాతశత్రుకు ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు..? ఇష్టపడిన అమ్మాయితో ప్రేమ ఫలిస్తుందా..? తన తండ్రిని కలుస్తాడా..? అనేది సినిమాలో చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement