తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది థియేటర్లలో మూడు తెలుగు సినిమాలను సినీ ప్రియులను అలరించాయి. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో వెంకీమామ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అయితే చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో ఈ వారంలో ఏయే సినిమాలు వస్తున్నాయని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల సందడి ముగియడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారంలో చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. వాటిలో ముఖ్యంగా రజాకార్, బరోజ్ 3డీ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారంలోనే సినీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఓ ఓటీటీలో రానుందో మీరు ఓ లుక్కేయండి.
ఈ వారం ఓటీటీ సినిమాలు..
నెట్‌ఫ్లిక్స్..
ది నైట్ ఏజెంట్- సీజన్ 2(వెబ్ సిరీస్) -జనవరి 23
షాఫ్డెట్( కామెడీ సిరీస్)- జనవరి 24
ది శాండ్ క్యాస్టిల్(హాలీవుడ్ మూవీ)- జనవరి 24
ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్(కొరియన్ సినిమా)- జనవరి 24
అమెజాన్ ప్రైమ్ వీడియో..
హర్లీమ్- సీజన్ 3 (వెబ్ సిరీస్)- జనవరి 23
జీ5..
హిసాబ్ బరాబర్-(హిందీ మూవీ)- జనవరి 24
ఆహా..
రజాకార్(టాలీవుడ్ సినిమా)- జనవరి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్...
బరోజ్ 3డీ(మలయాళ మూవీ)- జనవరి 22
స్వీట్ డ్రీమ్స్- జనవరి 24
జియో సినిమా..
దిది-(హాలీవుడ్ సినిమా)- జనవరి 26
యాపిల్ టీవీ ప్లస్..
ప్రైమ్ టార్గెట్..(హాలీవుడ్ మూవీ) జనవరి 22
Comments
Please login to add a commentAdd a comment