
కోర్టు- నెట్‌ఫ్లిక్స్
హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈరోజు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. బక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన కోర్టు చిత్రం నేడు ఏప్రిల్ 11న 'నెట్‌ఫ్లిక్స్'(Netflix)లోకి వచ్చేసింది.
ఛావా- నెట్‌ఫ్లిక్స్ (హిందీ)
బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీలోకి వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల తర్వాత నేడు ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసి చివర్లో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. మరో వారంలోపు తెలుగులో కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు.

షణ్ముఖ- ఆహా
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్‌గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. నేడు ఏప్రిల్ 11న ఆహా(Aha) తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
మనమే- ఆహా
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie) మరో ఓటీటీలోకి వచ్చేసింది. రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్ రన్ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, నేడు ఏప్రిల్11న 'ఆహా'(Aha)లో కూడా విడుదలైంది.