ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్‌ మూవీ | Actress Ashu Reddy Movie PadmaVyuham Lo Chakradhari OTT Streaming now | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్‌ మూవీ

Apr 8 2025 12:47 PM | Updated on Apr 8 2025 2:13 PM

Actress Ashu Reddy Movie PadmaVyuham Lo Chakradhari OTT Streaming now

యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ ,‘బిగ్‌బాస్‌’ ఫేం అషు రెడ్డి(Ashu Reddy) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పద్మ వ్యూహంలో చక్రధారి’(PadmaVyuham Lo Chakradhari). విడుదలైన ఏడాది తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహించిన ఈ వ్యూర్‌ లవ్‌ ఎమోషనల్‌ డ్రామా చిత్రానికి  కె.ఓ.రామరాజు నిర్మాతగా వ్యవహరించారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాలో  శ‌శికా టిక్కూ మ‌ధునంద‌న్‌, మ‌హేష్ విట్టా, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు నటించారు.

'ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి' సినిమా గతేడాది జూన్‌లో థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అషు రెడ్డి వల్ల సినిమాకు బాగా ప్రమోషన్స్‌ దొరికినప్పటికీ  ఆశించినంతగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగానే ఉన్నప్పటికీ కథ మొత్తం పాత చింతకాయ పచ్చడిలానే చూపించారు. అషురెడ్డి తను గ్లామర్‌తో కట్టిపడేసిందని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించింది.

అసలు కథేంటంటే..
రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధారి. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళ్తాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. అతని సాయంతో సత్యను కలవాలని ప్లాన్ చేస్తాడు. 

అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా గతంలో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతుగా మారతాడు. అసలు తన ప్రేమ కోసం వచ్చిన చక్రీ.. సత్యను దక్కించుకున్నాడా ? పద్మ (అషురెడ్డి)తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement