
హోలి పండగ (మార్చి 14) రోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అదే కోర్ట్ (Court: State Vs a Nobody), దిల్‌రూబా (Dilruba Movie). కోర్ట్ చిత్రంలో రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాతగా వ్యవహరించారు.
కోర్ట్ ఓటీటీ పార్ట్‌నర్
ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ కోర్ట్ మూవీపై బలమైన నమ్మకం వ్యక్తపరిచాడు నాని. అతడి నమ్మకమే నిజమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
(కోర్ట్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
దిల్‌రూబా ఓటీటీ పార్ట్‌నర్
క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దిల్‌రూబా. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ రన్‌ను బట్టి నెల రోజుల్లోనే దిల్‌రూబా ఆహాలోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment