Dilruba Movie
-
కోర్ట్, దిల్రూబా సినిమాలు వచ్చేవి ఆ ఓటీటీలోనే!
హోలి పండగ (మార్చి 14) రోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అదే కోర్ట్ (Court: State Vs a Nobody), దిల్రూబా (Dilruba Movie). కోర్ట్ చిత్రంలో రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ ఓటీటీ పార్ట్నర్ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ కోర్ట్ మూవీపై బలమైన నమ్మకం వ్యక్తపరిచాడు నాని. అతడి నమ్మకమే నిజమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.(కోర్ట్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)దిల్రూబా ఓటీటీ పార్ట్నర్క బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దిల్రూబా. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ రన్‌ను బట్టి నెల రోజుల్లోనే దిల్రూబా ఆహాలోకి వచ్చే అవకాశం ఉంది.(దిల్రూబా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘దిల్ రూబా’ మూవీ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ (ఫొటోలు)
-
‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
‘క’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) నుంచి వస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. వాస్తవానికి ‘క’ కంటే ముందే ఈ చిత్రం రావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆసల్యంగా థియేటర్స్‌కి వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయనే విషయం కిరణ్‌కి కూడా తెలుసు. అందుకే ‘దిల్ రూబా’ (Dilruba Review) విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేసినట్లు సమచారం. పబ్లిసిటీ విషయంలోనూ కిరణ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే..చితక్కొట్టండి’ అని నిర్మాత సవాల్ విసరడం, అది నెట్టింట బాగా వైరల్ కావడంతో ‘దిల్ రూబా’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా? కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సిద్ధార్థ్‌రెడ్డి అలియాస్ సిద్దు(కిరణ్ అబ్బవరం) , మ్యాగీ(ఖ్యాతి డేవిసన్) కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనంతరం మ్యాగీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతుంది. బ్రేకప్‌తో బాధ పడుతున్న సిద్ధుని చూసి తట్టుకోలేకపోయిన ఆయన తల్లి..ఇక్కడే ఉంటే ఆ బాధ ఎక్కువతుందని, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన క్లాస్మేట్ అంజలి(రుక్సార్ థిల్లాన్) (rukshar dhillon)తో ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. ప్రేమించమని వెంటపడిన అంజలి..ప్రేమలో పడిన తర్వాత సిద్ధుని ఎందుకు దూరం పెట్టింది? వీళ్ల బ్రేకప్‌కి కారణం ఎవరు? అమెరికాలో ఉన్న మ్యాగీ తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చింది? విక్కీతో సిద్ధుకి ఉన్న గొడవేంటి? డ్రగ్స్ మాఫియా డాన్ జోకర్(జాన్ విజయ్) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు? సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు ఎందుకు దూరంగా ఉంటాడు? చివరకు అంజలి, సిద్ధుల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. కొత్తదనంతో వస్తున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో హీరో క్యారెక్టర్ని కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఓ ఢిఫరెంట్ పాయింట్‌ని పట్టుకొని కథలు అల్లుకుంటున్నారు. అయితే కథ కొత్తగా ఉంటే సరిపోదు..తెరపై చూస్తున్నప్పుడు కూడా ఆ కొత్తదనం కనిపించాలి. దిల్ రూబా విషయంలో అది మిస్ అయింది. వాస్తవానికి ఈ స్టోరీలో రెండు కొత్త పాయింట్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి మాజీ ప్రేయసీ అండగా నిలవడం.. హీరో ఎవరీకీ సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడం. ఈ రెండు ఎలిమెంట్స్ ఆసక్తికరమైనవే కానీ..తెరపై అంతే ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కాలేజీ ఎపిసోడ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. అంజలీ పాత్రను ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే కాలేజీలో వచ్చే యాక్షన్ సీన్లు తెరపై చూడడానికి బాగున్నా..కథకి ఇరికించినట్లుగా అనిపిస్తాయి. విరామానికి ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. మాజీ లవర్ రంగంలోకి దిగడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అంజలి, సిద్ధుల ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుందనుకుంటున్న సమయంలో జోకర్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. దీంతో అసలు వీళ్ల లవ్‌స్టోరీకి జోకర్ ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుందీ. దానికి దర్శకుడు సరైన జెస్టిఫికేషనే ఇచ్చాడు. కానీ ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సహజత్వం లోపిస్తుంది. కడప నేపథ్యంతో తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పర్వాలేదు. అయితే కథను ముగించిన తీరు నిరుత్సాహపరుస్తుంది.ఎవరెలా చేశారంటే.. కిరణ్ అబ్బవరం టాలెంటెడ్ నటుడు. పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడతాడు . డిఫరెంట్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తాడు. ‘క’తో పోలిస్తే దిల్ రూబాలో కిరణ్ది డిఫరెంట్ పాత్రే.దానికి న్యాయం చేశాడు. తెరపై అందంగా కనిపించాడు. యాక్షన్స్ సీన్లలో ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. రుక్సార్ థిల్లాన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఖ్యాతి డేవిసన్ తన పాత్ర పరిధిమేర నటించింది. జాన్ విజయ్ రెగ్యులర్ విలన్ పాత్రను పోషించాడు. సత్య పండించిన కామెడీ బాగున్నప్పటికీ..అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించారు. తులసి, 'ఆడుకాలం' నరేన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్లకు ఆయన ఇచ్చిన బీజీఎం అదిరిపోతుంది. కేసీపీడీ థీమ్‌ని ఫైట్ సీన్‌కి వాడడం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కొన్ని డైగాల్స్ పూరీ జగన్నాథ్ మాటలను గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. టైటిల్: దిల్ రూబానటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, నజియా, ఖ్యాతి డేవిసన్, సత్య తదితరులునిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్రచన, దర్శకత్వం: విశ్వ కరుణ్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్ఎడిటర్: ప్రవీణ్. కేఎల్విడుదల తేది: మార్చి 14, 2025 -
నాని కాన్ఫిడెన్స్.. పేరు మార్చుకుంటానన్న రాజేంద్రప్రసాద్.. అదే కారణమన్న కిరణ్
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.సీన్ 2: దిల్రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.కిరణ్ రియాక్షన్ ఇదే!అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్ -
సినిమా చూడొద్దన్న నాని.. నేడే రిజల్ట్!
ఈ మధ్య సినిమా వాళ్లు రాజకీయ నాయకుల్లా సవాళ్లు విసురుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తమ కథపై వారికి ఉన్న నమ్మకమే అలా మాట్లాడిస్తుంది. అయితే అన్ని సందర్భాలో వారి నమ్మకం ఫలించదు. కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి.మరికొన్ని సార్లు అంచనా వేయలేని విజయాన్ని అందిస్తాయి. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం మేకర్స్ అంతా తమది గొప్ప కళాఖండమే అని చెప్పుకోవడంలో తప్పులేదు. చివరికి ఆ సినిమా హిట్టా? ఫట్టా అనేది డిసైడ్ చేసేది ఆడియన్ మాత్రమే. ఈ విషయం మేకర్స్‌కి కూడా తెలుసు కానీ ఆడియన్‌ని థియేటర్‌కి రప్పించేందుకు ఇలాంటి ‘సవాళ్ల’ని ఎదుర్కొవాల్సిందే. తాజాగా హీరో నాని(Nani) ప్రేక్షకులకు విసిరిన సవాల్ నెట్టింట బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘కోర్ట్’(Court ) సినిమా నచ్చకపోతే ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాని చూడకండి అని ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. ఇక కోర్ట్ సినిమాని రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడయాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ ని బయట పెట్టుకున్నాడు. నాని ఊహించినట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనేది నేటి సాయంత్రంతో తేలిపోతుంది. ఈ రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నారు.(చదవండి: నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ ఎలా ఉందంటే?)ఇక నాని ‘కోర్ట్’కి పోటీగా బరిలోకి దిగాడు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ‘దిల్రూబా’(Dilruba ) మూవీ కూడా మార్చి 14నే విడుదల కానుంది. ఈ సినిమాపై కిరణ్ కంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ రవినే నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని సవాల్ విసిరాడు. ఈయన కామెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కోర్ట్‌తో పాటు దిల్రూబాకి కూడా పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమే ఈ మూవీ రిజల్ట్ వచ్చేస్తుంది. సవాళ్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా? లేదా? చూడాలి. -
తిరుపతి స్వామి సన్నిధిలో కిరణ్ అబ్బవరం 'దిల్రూబా' టీమ్ (ఫోటోలు)
-
కొత్త కిరణ్‌ని చూస్తారు
‘‘సినిమా ఇండస్ట్రీపై ఓ నమ్మకంతో ఇక్కడికి వచ్చి... కష్టాలు పడలేక ఎంతో మంది తిరిగి వెళ్లిపోవడం చూశాను. మీరు ధైర్యంగా ఉండండి... తప్పకుండా నాలా మీరు కూడా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. సినిమా మీద ప్యాషన్‌తో పల్లెల నుంచి హైదరాబాద్‌కి వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా సాయం చేస్తాను... అది వసతి అయినా సరే లేకుంటే భోజనం కానీ, అవకాశాలు కానీ... నా చేతనైన సాయం వారికి చేస్తాను’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్తవాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాను. ఇకపైనా చాన్స్ ఇస్తాను’’ అన్నారు. విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దిల్ రుబా’లో కొత్త కిరణ్‌ని చూస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఎంతోమంది మా ‘దిల్ రూబా’ని రిలీజ్ చేస్తామని అడిగినా మూవీపై నమ్మకంతో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం’’ అని రవి తెలిపారు. ‘‘ఈ మూవీతో కిరణ్‌గారికి, మా టీమ్‌కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు రాకేశ్ రెడ్డి. -
కోపం తగ్గలే.. హీరోయిన్ ని మళ్లీ పక్కనబెట్టేశారు!
సినిమా సెలబ్రిటీలు పెద్దగా గొడవలు పడటానికి ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు నోరుజారి లేదంటే పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురవుతుంటారు. గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటోంది. తాజాగా 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ తరహా సంఘటనే జరిగింది.(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: 'దిల్ రుబా' నిర్మాత)తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రుక్సార్ లేటెస్ట్ మూవీ 'దిల్ రుబా'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం.. మార్చిన 14న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫొటోగ్రాఫర్లతో ఈమెకు చిన్నపాటి వివాదం జరిగింది. తనకు అసౌకర్యమని చెప్పినా సరే ఫొటోలు తీస్తున్నారని చెప్పింది. దీంతో అప్పటినుంచి మూవీ ఈవెంట్స్ కవర్ చేసే ఫొటోగ్రాఫర్స్ ఈమెని సైడ్ చేస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో మంగళవారం రాత్రి 'దిల్ రుబా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. చివర్లో టీమ్ అంతా ఫొటోలకు పోజులిచ్చారు. కానీ రుక్సార్ ని మాత్రం సైడ్ అయిపోమని ఫొటోగ్రాఫర్స్ చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకొంది. మరి ఈ వివాదం ఎన్నిరోజులు నడుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత
ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివైనోళ్లు. ఏ సినిమాని థియేటర్లలో చూడాలి, ఏ మూవీని ఓటీటీలో చూడాలనేది వాళ్లకు తెలుసు. దీంతో తక్కువ బడ్జెట్ తో చిత్రాల్ని తీసిన దర్శకులు, నిర్మాతలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వైరల్ అవుతున్నారు. మొన్నీమధ్యే 'కోర్ట్' మూవీ కోసం నిర్మాత నాని.. ఇది నచ్చకపోతే త్వరలో రాబోయే తన 'హిట్ 3' చూడొద్దని అన్నాడు. ఇప్పుడైతే కిరణ్ అబ్బవరంతో 'దిల్ రుబా' అనే మూవీ తీసిన నిర్మాత రవి.. సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)'ఫైట్స్ చూసి థియేటర్ తెరని చింపి అవతల పడేయకపోతే.. మధ్యాహ్నం నేను పెట్టే ప్రెస్ మీట్ లో అక్కడే నన్ను చితక్కొట్టేయండి. తర్వాత నన్ను బయటకు విసిరేయొచ్చు. సినిమాలో ఫైట్స్ చూసి మెస్మరైజ్ కాకపోతే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను' అని నిర్మాత రవి చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ యూట్యూబ్ లో వైరల్ అవ్వడానికి, సినిమాపై కొందరి దృష్టి పడటానికి పనికొస్తాయేమో గానీ మూవీ హిట్ అవ్వాలంటే అంతిమంగా ఉండాల్సింది కంటెంట్ మాత్రమే. మరి ఈ శుక్రవారం రిలీజయ్యే 'దిల్ రుబా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్) -
ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి విలువ తీయొద్దు : కిరణ్ అబ్బవరం
‘ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ "దిల్ రూబా"లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్‌ని చెప్పాం’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram). ‘క’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→"దిల్ రూబా"( Dilruba Movie)లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్ లో కథ రివీల్ చేశాం. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఈ సినిమా చేసేప్పుడు నేను కూడా కొంత మారాను. ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువ తీయొద్దు అనుకున్నాను→ ఈ సినిమా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ "దిల్ రూబా"ను బాగా ఇష్టపడతారు. 2గంటల 20నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే భావిస్తారు. "క" కంటే ముందు చేసిన సినిమా కదా ఇందులో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 టు 20 పర్సెంట్ సీన్స్ ఎక్కడైనా చూసినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది.→ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. నేను చేసిన సిద్ధు క్యారెక్టరైజేషన్ మీకు కంప్లీట్ గా నచ్చుతుంది. నేను ఇలాంటి హై క్యారెక్టర్ చేయలేదు. గతంలో నేను చేసిన చిత్రాల్లో సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ చూశారు. ఈ చిత్రంలో నేను కొత్తగా కనిపిస్తా. ఎక్కువ రివీల్ చేయొద్దని ట్రైలర్ లో కొన్ని సీన్స్ కట్ చేయలేదు. థియేటర్ లో మూవీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది.→ మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం. అప్పటికి డ్రాగన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్ లో మా మూవీ వెళ్తుంటుంది. తమిళ సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు.→ సినిమా నా పేరు మీద థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి నేను మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడివరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా. ఈ ఇయర్ నావి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ ఇయర్ నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తా. దిల్ రూబా తర్వాత వెంటనే కె ర్యాంప్ మూవీ ఉంటుంది.→ గతంలో కొన్ని మూవీస్ మొహమాటానికి చేసినవి ఉన్నాయి. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ఇకపై మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. క సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమా చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ జర్నీ చేస్తా. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. 3 పార్ట్ మూవీగా తీస్తున్నాం. -
హేయ్ మాగా..! 'దిల్ రూబా' కేసీపీడీ సాంగ్ వచ్చేసింది
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశామని దర్శకుడు విశ్వ కరుణ్ చెప్పారు. ఈ కథ గురించి ఆయన రెండు మాటల్లో ఇలా చెప్పారు 'ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.' అంటూ హింట్ ఇచ్చారు.అలాగే ఊరికే ఎవరికీ కోపం రాకూడదని,... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడని ఆయన అన్నారు. ఈ అంశం కూడా సినిమాలో ఉందని తెలిపారు. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందుకే కథలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. -
దిల్ రూబా సాంగ్ రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం!
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్టైనర్ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025 -
ప్రేమకథను కొత్తగా చెప్పాను: దర్శకుడు విశ్వ కరుణ్
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రుబా’(Dil Ruba). ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, నజియా డేవిసన్ హీరోయిన్లు. విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డిలతో కలిసి సారెగమ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కరుణ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకిది తొలి సినిమా. ‘దిల్ రుబా’ అనే ప్రేమకథను రెడీ చేసి, కిరణ్ అబ్బవరంగారికి వినిపించాను. ఆయన ఓకే అన్నారు.ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.అలాగే ఊరికే కోపం రాకూడదు... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడు. ఈ అంశం కూడా సినిమాలో ఉంది. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని మార్పులు చేశాం. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను’’ అని అన్నారు. -
అలా జరుగుంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని: కిరణ్ అబ్బవరం
తెలుగు ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కొన్నాళ్ల వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డ ఇతడు.. గతేడాది రిలీజైన 'క' మూవీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు 'దిల్ రుబా'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కిరణ్ అబ్బవరం ఒకవేళ నటుడు కాకపోయుంటే ఏమయ్యేవాడు అని యాంకర్ అడగ్గా.. 'రాజకీయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోయుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడ్ని. ప్రజలతో మమేకం కావడం నాకు నచ్చుతుంది. నాది రాయలసీమ కావడంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలని దగ్గరి నుంచి చూశాను. బహుశా అందువల్లే నాకు వాటిపై ఆసక్తి పెరిగింది అనుకుంటా.'(ఇదీ చదవండి: 'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!)'నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడి ఏడ్చేశాను' అని కిరణ్ చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని అన్నాడు.ఇకపోతే భవిష్యత్తులో వ్యాపార చేయాలనుకుంటున్నాను. ఫుడ్ బిజినెస్‌లో రాణించాలనేది నా ఇంట్రెస్ట్. మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాను' అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.'దిల్ రుబా' సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది. ప్రేమకథతో తీసిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సాన్ థిల్లాన్ హీరోయిన్.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
ప్రేమలో ఉన్నవాళ్లకు నచ్చేలా 'దిల్రూబా' ట్రైలర్
విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అంజలి, సిద్ధు ప్రేమ చుట్టూ సాగే కథతో ‘దిల్ రూబా’ రూపొందిందని ట్రైలర్‌తో తెలుస్తోంది. ప్రేమలో ఉన్నవాళ్లు కలిసి చూడాల్సిన చిత్రమిది అంటూ ట్రైలర్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం తెలిపాడు. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు. -
వద్దని చెప్పినా వినకుండా ఫోటోలు తీశారు: హీరోయిన్ అసహనం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన చిత్రం దిల్రూబా (Dilruba Movie). విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది. గురువారం (మార్చి 6న) దిల్రూబా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రుక్సార్ (Rukshar Dhillon) తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది. దిల్రూబా సినిమాలో నేను పోషించిన అంజలి పాత్రకు కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం ఉంది. రుక్సార్ సీరియస్మీకు కచ్చితంగా నచ్చుతుందని నేను బలంగా చెప్పగలను అని చెప్పుకొచ్చింది. చివర్లో మాత్రం ఓ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటినుంచి దీని గురించి మాట్లాడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. కాస్త భయపడుతూనే ఉన్నాను. కానీ ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. మీరు ఎప్పుడుపడితే అప్పుడు ఫోటోలు తీస్తూనే ఉంటారు. నాకు కాస్త అసౌకర్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. అసౌకర్యంగా ఉందని చెప్పినా..మీరు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పుడు ఎదుటివాళ్లు వచ్చి మిమ్మల్ని ఫోటో తీస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా! కాస్త ఇబ్బందిగా ఉంది.. దయచేసి నా ఫోటోలు తీయకండి అని ఎంతో ప్రేమగా, గౌరవంగా చెప్పాను. కానీ కొందరు అస్సలు వినిపించుకోలేదు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. ఈ మెసేజ్ వారికి చేరుతుందని ఆశిస్తున్నాను అని సీరియస్ అయింది.చదవండి: నటుడి నాలుగో పెళ్లి.. ఎవరి దిష్టి తగలకూడదని గుండు గీయించుకున్న అత్త -
మొదటిసారి అరుణాచలం వెళ్లా.. చాలా పాజిటివ్‌గా అనిపించింది: కిరణ్ అబ్బవరం
గతేడాది క మూవీతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కొత్త ఏడాదిలోనూ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం దిల్ రుబా. లవర్స్ డే కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. ఇటీవల దిల్ రుబా మూవీ కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. దీంతో కిరణ్ అబ్బవరం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణాచలం ఆలయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'అరుణాచలం మొదటిసారి వెళ్లా. చాగంటి వారి మాటలు వినేవాడిని. ఇటీవల అనుకోకుండా కుదిరింది. అక్కడ నాకు చాలా పాజిటిల్ ఫీలింగ్ కలిగింది. అక్కడ గిరి ప్రదక్షణ 14 కిలోమీటర్లు నడిచాం. కానీ గిరి ప్రదక్షణ ఎప్పుడు చేయాలనేది తెలియదు. మార్నింగ్ 6కు మొదలు పెడదాం అనుకున్నాం. దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. టిఫిన్ చేసిన ఎనిమిది గంటలకు బయలుదేరాం. 14 కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి నాలుగు గంటలు పట్టింది. ఎండలో వెళ్లడంతో చుక్కలు కనిపించాయి. ఎవరైనా అరుణాచలం వెళ్లకపోతే ఇప్పుడైనా వెళ్లండి. చాలా అద్భుతంగా ఉంటుంది'అని అన్నారు.అయితే కిరణ్ అబ్బవరం ఇటీవలే అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన మూవీ దిల్ రుబా కథేంటో చెబితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు. బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని వెల్లడించారు. ఈ సినిమా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. గతేడాది 'క' మూవీతో అద్బుతమైన హిట్ కొట్టాడు. అదే ఊపులో ఈసారి 'దిల్ రుబా' అనే ప్రేమకథ మార్చి 14న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు.(ఇదీ చదవండి: 'స్పిరిట్' టార్గెట్ రూ.2000 కోట్లు.. సందీప్ సమాధానమిదే)సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్ నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని, వాటి ఆధారంగా 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఇప్పటితరం హీరోల్లో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. అలా ఇప్పుడు కిరణ్.. బైక్ ని బహుమతిగా ఇస్తానని చెప్పుకొచ్చాడు. కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లన్ హీరోహీరోయిన్లుగా నటించారు. విశ్వకరుణ్ దర్శకుడు. మార్చి 14న ఈ మూవీతో పాటు నాని నిర్మించిన 'కోర్ట్' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!
మార్చి అంటేనే పరీక్షల సీజన్. నెల చివర్లో తప్పితే మిగతా రోజుల్లో సినిమాలు సరిగా రిలీజ్ కావు. కానీ ఈ సారి మాత్రం స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు 10 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా పలు రీ రిలీజులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏంటవి? వాటి సంగతేంటి?మార్చి తొలివారంలో కింగ్ స్టన్, ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు నారి అనే తెలుగు మూవీ రాబోతుంది. వీటిలో 'ఛావా'పైనే అంచనాలు ఉన్నారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)రెండో వారంలో నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా', హిందీ మూవీ 'డిప్లమాట్' విడుదలవుతాయి. వీటిలో దేనిపైన పెద్దగా అంచనాల్లేవు.మూడో వారంలో ఇప్పటివరకైతే ఏ సినిమాలు లేవు. నాలుగో వారంలో మాత్రం లూసిఫర్ సీక్వెల్ 'ఎల్ 2: ఎంపురన్' మార్చి 27న, నితిన్ రాబిన్ హుడ్ 28న, మ్యాడ్ స్క్వేర్ 29న థియేటర్లలోకి వస్తాయి. వీటిలో మ్యాడ్ 2పైనే కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')మార్చి 28న పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అయ్యే అవకాశాలు అస్సలు లేవని చెప్పొచ్చు. అలానే మార్చిలోని సినిమాలకు హిట్ టాక్ వస్తే లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే!వీటితో పాటు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ లాంటి సినిమాలు కూడా ఇదే నెలలో రీ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం) -
లవ్... ఎమోషన్
‘‘దిల్ రూబా’ టీజర్, ట్రైలర్లో ఏ కంటెంట్ చూపించామో సినిమాలోనూ అదే ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్ ఉండదు. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చెప్పారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘హే జింగిలి..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని సామ్ సీఎస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘సారెగమ వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్లోకి వస్తున్నారు. రవిగారు, విశ్వ కరుణ్ మూడేళ్లుగా ఈప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. వాళ్ల కోసమైనా ‘దిల్ రూబా’ సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా ‘దిల్ రూబా’ పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియాప్రొడక్షన్ సారెగమతో కలిసి సినిమా చేశాం’’ అని రవి చెప్పారు. ‘‘హే జింగిలి... పాటకి మంచి పేరొస్తుంది’’ అన్నారు విశ్వ కరుణ్. ‘‘దిల్ రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్ థిల్లాన్ పేర్కొన్నారు. లిరిక్ రైటర్ భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడారు. -
ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్
'క' మూవీతో భారీ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం దిల్రూబా మూవీ చేస్తున్నాడు. ఇందులో రుక్సర్ ధిల్లాన్ (Rukshar Dhillon) కథానాయికగా నటిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. మొన్నటి వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మార్చి 14వ తేదీకి వాయిదా పడింది.జింగిలి బాగుంటదిలే..ఇకపోతే దిల్రూబా సినిమా (Dilruba Movie) నుంచి హే జింగిలి పాటను ఫిబ్రవరి 18న సాయంత్రం 5.01 గంటకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై రుక్సర్ స్పందిస్తూ.. ఓయ్ కిరణ్ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు, బుజ్జి, బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటి? అని ప్రశ్నించింది. అందుకు కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య జనాలు పిల్చుకునే కూకీ, వైఫుల కన్నా జింగిలి చాలా బాగుంటది లే అన్నాడు. అదంతా కాదు, ఈ జింగిలి అంటే ఏంటి? ముందు అది చెప్పు అని హీరోయిన్ ప్రశ్నించింది. రేపటిదాకా ఆగాల్సిందేఅందుకు హీరో.. జింగిలి (Jingili) అంటే J అంటే జాన్, I అంటే ఇర్రెస్టిబుల్, N అంటే నెక్స్ట్ లెవల్, G అంటే గార్జియస్, I అంటే ఇర్రీప్లేసబుల్, L అంటే లైఫ్‌లైన్.. అంటూనే చివర్లో I అంటే ఇవ్వేవీ కాదన్నాడు. రేపు రిలీజయ్యే హేయ్ జింగిలి పాట వింటే నీకే తెలుస్తుందన్నాడు. అయితే మరీ అంతగా వెయిట్ చేయించకుండా హేయ్ జింగిలి ప్రోమోను రిలీజ్ చేశాడు. ప్రోమోలో అయితే పాట మరీ స్లోగా ఉంది. మరి ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. Ee madhya janaalu pilchukunne pookie, cookie, Waifu lu kanna JINGILI chaala baguntaadhi le.#HeyJingili https://t.co/9FEXgMjd27— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Jingili ante!J - JaanI - Irresistible N - Next LevelG - Gorgeous I - Irreplaceable L - LifelineI - Ivvevi kaadhuRepu #HeyJingili song vachaka vinnu.Feb 18th 5:01 ki. https://t.co/JA25iVHaQt— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025Tomorrow 5:01pm ❤️#HeyJingili #Dilruba pic.twitter.com/kNSlBWmLTv— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025 చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే! -
'లవర్స్ డే రోజున దిల్ రూబా'.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం
'క' మూవీ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్రూబా (Dil Ruba). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా సినీ ప్రియులను అలరించనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దిల్రూబా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 14న సినిమాను రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కిరణ్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్లో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున విడుదవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.విశ్వక్ సేన్ లైలా రిలీజ్..అయితే ఈ లవర్స్ డే కానుకగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. Koncham late ga vastunam :) #dilruba pic.twitter.com/H6UMPDLuwr— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 12, 2025 -
రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. లుక్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.దిల్ రూబా పండగ పోస్టర్యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.చదవండి: టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత