
తెలుగు ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కొన్నాళ్ల వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డ ఇతడు.. గతేడాది రిలీజైన 'క' మూవీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు 'దిల్ రుబా'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కిరణ్ అబ్బవరం ఒకవేళ నటుడు కాకపోయుంటే ఏమయ్యేవాడు అని యాంకర్ అడగ్గా.. 'రాజకీయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోయుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడ్ని. ప్రజలతో మమేకం కావడం నాకు నచ్చుతుంది. నాది రాయలసీమ కావడంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలని దగ్గరి నుంచి చూశాను. బహుశా అందువల్లే నాకు వాటిపై ఆసక్తి పెరిగింది అనుకుంటా.'
(ఇదీ చదవండి: 'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!)
'నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడి ఏడ్చేశాను' అని కిరణ్ చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని అన్నాడు.
ఇకపోతే భవిష్యత్తులో వ్యాపార చేయాలనుకుంటున్నాను. ఫుడ్ బిజినెస్‌లో రాణించాలనేది నా ఇంట్రెస్ట్. మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాను' అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.
'దిల్ రుబా' సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది. ప్రేమకథతో తీసిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సాన్ థిల్లాన్ హీరోయిన్.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment