
ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివైనోళ్లు. ఏ సినిమాని థియేటర్లలో చూడాలి, ఏ మూవీని ఓటీటీలో చూడాలనేది వాళ్లకు తెలుసు. దీంతో తక్కువ బడ్జెట్ తో చిత్రాల్ని తీసిన దర్శకులు, నిర్మాతలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వైరల్ అవుతున్నారు.
మొన్నీమధ్యే 'కోర్ట్' మూవీ కోసం నిర్మాత నాని.. ఇది నచ్చకపోతే త్వరలో రాబోయే తన 'హిట్ 3' చూడొద్దని అన్నాడు. ఇప్పుడైతే కిరణ్ అబ్బవరంతో 'దిల్ రుబా' అనే మూవీ తీసిన నిర్మాత రవి.. సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే తనని చితక్కొట్టి బయటకు విసిరేయండని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
'ఫైట్స్ చూసి థియేటర్ తెరని చింపి అవతల పడేయకపోతే.. మధ్యాహ్నం నేను పెట్టే ప్రెస్ మీట్ లో అక్కడే నన్ను చితక్కొట్టేయండి. తర్వాత నన్ను బయటకు విసిరేయొచ్చు. సినిమాలో ఫైట్స్ చూసి మెస్మరైజ్ కాకపోతే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను' అని నిర్మాత రవి చెప్పుకొచ్చారు.
అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ యూట్యూబ్ లో వైరల్ అవ్వడానికి, సినిమాపై కొందరి దృష్టి పడటానికి పనికొస్తాయేమో గానీ మూవీ హిట్ అవ్వాలంటే అంతిమంగా ఉండాల్సింది కంటెంట్ మాత్రమే. మరి ఈ శుక్రవారం రిలీజయ్యే 'దిల్ రుబా' ఏం చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్)
Comments
Please login to add a commentAdd a comment